బ్యాంకాక్‌లో ఇవాళ థాయ్‌లాంట్ రాజు మహా వజిరలోంగ్కోర్న్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. “ థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ను కలిశాను. భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య బలమైన స్నేహం గురించి, దానిని మరింత బలోపేతం చేయడం గురించి చర్చించాం.”
Prime Minister Modi was accorded a ceremonial welcome by Prime Minister Shinawatra at the Government House in Bangkok.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ఫ్రా వజిరక్లావోయుహువా, రాణి సుతిదా బజ్రసుధాబి మలలక్షణతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్యాంకాక్‌లోని దుసిట్ రాజసౌధంలో సగౌవర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-థాయిలాండ్ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపై తమ మనోభావాలను పంచుకున్నారు. అలాగే భారత్ నుంచి థాయిలాండ్‌కు బుద్ధ భగవానుని అవశేషాలు చేరడంతోపాటు రెండు దేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంలో ఈ కార్యక్రమం ...
బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, నేపాల్‌ల మధ్య ఉన్న విశిష్ట, సన్నిహిత సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. ...
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2 (వివిపి-2) ను కేంద్ర పథకంగా (100% కేంద్ర నిధులు) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది, తద్వారా వికసిత భారత్ - 2047 లక్ష్యానికి అనుగుణంగా సురక్షితమైన, భద్రమైన, పటిష్ఠమైన సరిహద్దులను సాధించే దిశగా ప్రభుత్వం తన నిబద్ధతను మరింతగా చాటుకుంది. ఇప్పటికే వీవీపీ-1 పరిధిలోకి ఉన్న ...
థాయిలాండ్ ప్రధాని పైతోంగ్‌తార్న్ శినావాత్రా వెంట రాగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాట్ ఫ్రా చేతుఫోన్ విమోన్ మంగ్‌ఖాలారామ్ రాజ్‌వారామాహావిహాన్‌ను (‘వాట్ ఫో’గా ఇది ప్రసిద్ధికెక్కింది) సందర్శించారు. విశ్రమించిన భంగిమలో దర్శనమిస్తున్న భగవాన్ బుద్ధుని ప్రతిమకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి ...
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి ...
బ్యాంకాక్ లో ఏర్పాటైన బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యబద్ధమైన, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రెండు దేశాల సంబంధాల విషయమై భారతదేశం ...
బ్యాంకాక్‌లో ఈ రోజు బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ ప్రధాని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మయన్మార్‌లో విధ్వంసకర భూకంపం తరువాతి స్థితినీ, మయన్మార్‌కు మానవతాపూర్వక సహాయంతోపాటు వైద్యసహాయం అందించడానికీ, ఉపశమన చర్యలు ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఏప్రిల్ 6న తమిళనాడులో పర్యటిస్తారు. రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారత్‌లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రైలు, నౌక ప్రయాణిస్తున్న విధానాన్నీ, వంతెన పని చేస్తున్న విధానాన్నీ గమనిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ...