Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ప్రధాని పర్యటన


ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా జ‌న‌వ‌రి 8తేదీల్లో ఆంధ్రప్రదేశ్ఒడిశాలో పర్యటించనున్నారుసుస్థిరాభివృద్ధిపారిశ్రామిక వృద్ధిమౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారుఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను కూడా ఆయన ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి

విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారుహరిత ఇంధనంసుస్థిర భవిష్యత్తు దిశగా అంకితభావంతో ఆయన వేసిన మరో ముందడుగిదిజాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ1,85,000 కోట్లు. 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల్లో పెట్టుబడి ఇందులో భాగంతద్వారారోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా మారిందిదానితోపాటు హరిత మిథనాల్హరిత యూరియాపర్యావరణ హిత వైమానిక ఇంధనం సహా రోజుకు 7500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను అందించగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఎగుమతి మార్కెట్ ను లక్ష్యంగా పని చేస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ కు ఈ ప్రాజెక్టు విశేషంగా సహాయపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో రూ. 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వేరోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపనప్రారంభోత్సవాల్లో పాల్గొంటారుఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతోపాటు విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించిఅనుసంధానాన్ని పెంచుతాయిదానితోపాటు ఈ ప్రాంత సామాజికఆర్థిక వృద్ధినీ మెరుగుపరుస్తాయి.

ఆరోగ్య రక్షణ సదుపాయాల కల్పనతోపాటు చౌక ధరల్లో వైద్యాన్ని అందించాలన్న ప్రధాని దార్శనికతలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారుదీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయిఅంతేకాకుండావిశాఖపట్నంచెన్నై పారిశ్రామిక కారిడార్విశాఖపట్నంకాకినాడ పెట్రోలియంరసాయనపెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహదపడుతుంది.

చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి (కేఆర్ఐఎస్ సిటీకూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారుఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపర్యావరణ హిత అధునాతన పారిశ్రామిక నగరంగా ఇది రూపొందనుందితయారీ రంగంలో దాదాపు రూ. 10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉందిఇది ప్రత్యక్షంగాపరోక్షంగా లక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనాజీవనోపాధిని గణనీయంగా పెంపొందించడంతోపాటు ప్రాంతీయ పురోగతికి ఈ ప్రాజెక్టు చోదకంగా నిలుస్తుంది.

ఒడిశాలో ప్రధానమంత్రి

ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుకేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందిప్రవాస భారతీయులతో అనుసంధానానికీవారితో భాగస్వామ్యానికీవారి మధ్య పరస్పర మైత్రిని పెంపొందించడానికీ ప్రవాసీ భారతీయ దివస్ వేదికవుతుందిఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ నెల నుంచి 10 వరకు భువనేశ్వర్ లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారుఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘వికసిత భారతానికి భారతీయ ప్రవాసుల తోడ్పాటు’’. 50కిపైగా దేశాల నుంచి భారత సంతతికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనడం కోసం నమోదు చేసుకున్నారు.

భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యాటక రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ తొలి ప్రయాణాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మూడు వారాల పాటు దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలనూఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలనూ చుట్టివస్తుందిప్రవాసీ తీర్థ దర్శన యోజన కింద ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ ను నిర్వహిస్తారు.  

 

***