• మనము, ది ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్, ది రష్యన్ ఫెడరేషన్, ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ది రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నేతలం, 2016 అక్టోబర్ 15వ, 16వ తేదీలలో భారతదేశంలోని గోవా లో నిర్వహించిన బ్రిక్స్ 8వ శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నాము. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ‘ప్రతిస్పందనపూర్వక, సమ్మిళిత, సమష్టి పరిష్కారాలను సిద్ధం చేయడం’ అనే ఇతివృత్తంతో నిర్వహించడమైంది.
• మన పూర్వపు ప్రకటనలను అన్నింటినీ గుర్తుకు తెచ్చుకొంటూ, మనం ఉమ్మడి ఆసక్తులు, కీలక ప్రాధామ్యాలను దృష్టిలో పెట్టుకుని బ్రిక్స్ ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాము. నిష్కపటత్వం, సంఘీభావం, సమానత్వం, పరస్పర అంగీకారం, సమైక్యత, సంయుక్తంగా లాభదాయక సహకారాల ఆధారంగా.. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిశ్చయించాము. ప్రపంచ శాంతికి, భద్రతకు ఎదురవుతున్న పెనుసవాళ్లను అర్థం చేసుకొంటూ.. స్థిరమైన అభివృద్ధి కోసం సంయుక్త ప్రయత్నాలను మరింత ముందుకుతీసుకువెళ్దాము.
• బ్రిక్స్ దేశాలు ప్రపంచ వేదికపై స్పష్టమైన సహకారంతో ప్రభావవంతమైన వాణిని వినిపిస్తున్నాయని అంగీకరిస్తున్నాము. వీటి ద్వారా మన ప్రజలకు ప్రత్యక్షంగా మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి), కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సిఆర్ఎ) ల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. ఈ సంస్థల ద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థితికి మేలు జరగటంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక స్వరూపం బలోపేతం కాగలదు. ఎన్‌డిబి ఒకటో సంవత్సర పనితీరుపైన బ్యాంకు అధ్యక్షుడు ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నాము. ఎన్‌డిబి లోని ఆఫ్రికా రీజినల్ సెంటర్ (ఎఆర్ సి) పనితీరుపై సంతోషంగా ఉన్నాము. ఈ విషయంలో మా మద్దతు కొనసాగుతూనే ఉంటుందని హమీ ఇస్తున్నాము. రానున్న సంవత్సరాలలో కొత్త బ్రిక్స్ అభివృద్ధి కార్యక్రమాలను వేరువేరు రంగాలలోకి విస్తరిస్తాము.
• న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్ డిబి) ద్వారా ఆమోదించబడిన తొలి విడత రుణాలపై మరీ ముఖ్యంగా బ్రిక్స్ దేశాలలో పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇచ్చిన రుణాలను అభినందిస్తున్నాము. ఆర్‌ఎమ్ బి లో తొలి విడత గ్రీన్ బాండ్లను విడుదల చేయడంపై సంతృప్తిగా ఉన్నాము. బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్స్ (సిఆర్ ఎ) ద్వారా అంతర్జాతీయ ఆర్థిక భద్రత వలయం పటిష్ఠానికి జరిగిన పనుల పైనా హర్షం వ్యక్తం చేస్తున్నాము.
• మాతో పాటుగా అభివృద్ధి చెందుతున్న వర్దమాన ఆర్థిక వ్యవస్థలతో కలసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో బ్రిక్స్ నేతలతో కలసి బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల (బంగాళాఖాతంలోని దేశాల భిన్న రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థ)తో సమావేశమయ్యాము. ఈ బిమ్స్ టెక్ లో బంగ్లాదేశ్, భుటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీ లంక, థాయ్‌లాండ్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాలతో మా మైత్రిని మరింతగా పెంపొందించుకొనేందుకు ఇది ఒక అవకాశం. దీంతో పాటు రెండు కూటముల సభ్యత్వ దేశాల మధ్య సంయుక్తంగా వాణిజ్య, వ్యాపార బంధాలను, పెట్టుబడుల సహకారాన్ని పెంచుకోవడం ద్వారా ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, శ్రేయస్సు లను వృద్ధి చేసుకొనేందుకు కృషి చేయనున్నాము.
• ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రజాస్వామిక, ఐక్యరాజ్యసమితి (ఐ.రా.స.) కేంద్రీయ పాత్ర ఆధారంగా భిన్న ధ్రువాల అంతర్జాతీయ వ్యవస్థ, అంతర్జాతీయ చట్టాలకు గౌరవంపై వస్తున్నమార్పులపై మా ఉమ్మడి దృష్టిని పునరుద్ఘాటిస్తున్నాము. సంఘీభావం, పరస్పర అవగాహన, నమ్మకం ప్రేరణతో అంతర్జాతీయ వివాదాలలో ఆచరణాత్మక సహకారం ఇచ్చి పుచ్చుకోవాలని నిర్ణయించాం. రాజకీయ, దౌత్యపరమైన పద్ధతులలో అంతర్జాతీయ సమస్యలు, శాంతియుత పరిష్కారం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించాం. ఐ.రా.స. నిబంధనలకు అనుగుణంగానే మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తున్నాము.
• అంతర్జాతీయ సమాజానికి, భద్రతకు సవాళ్లు విసరుతున్న అంతర్జాతీయ సమస్యను అర్థం చేసుకున్నాము. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, స్థిరమైన శాంతిని ఏర్పాటు చేసేందుకు, మార్పును తీసుకురావడం, సమానమైన, ప్రజాస్వామిక భిన్న ధ్రువాల అంతర్జాతీయ వ్యవస్థపై మా ఆలోచనలను పునరుద్ఘాటించాము. దీని కోసం సమగ్రమైన, గొప్ప ఆలోచన, అంతర్జాతీయ చట్టాల అమలులో బలమైన చిత్తశుద్ధిని, సంఘీభావాన్ని, అంతర్జాతీయ ప్రయత్నాలను పునరుద్ఘాటిస్తున్నాము.
• అంతర్జాతీయ సముదాయానికి ఎదురవుతున్న ప్రస్తుత భద్రతాసంబంధి సవాళ్లు, బెదరింపుల యొక్క తీవ్రతను మనము గుర్తించాము. ఈ సవాళ్లను పరిష్కరించడం కోసం అంతర్జాతీయ ప్రయాసలు, నిలకడ కలిగిన శాంతిని నెలకొల్పడంతో పాటు మరింత సమంజసమైన, న్యాయమైన, ఇంకా ప్రజాస్వామికమైన బహుళ ధ్రువ ప్రపంచం వైపు ప్రయాణించడం కోసం ఒక సమగ్రమైన, కలిసికట్టయిన, ఇంకా దృఢ నిశ్చయం గల వైఖరి అవసరమవుతుందన్న మా ఉద్దేశాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. ఇటువంటి వైఖరి సంఘీభావ స్ఫూర్తి, పరస్పర విశ్వాసం మరియు ప్రయోజనాలు, సమ న్యాయం, సహకారం, అంతర్జాతీయ చట్టాల అమలు పట్ల గట్టి వచనబద్ధత, ప్రపంచంలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన ఫర్మానాను కలిగిన విశ్వవ్యాప్త బహుళపాక్షిక సంస్థగా ఐక్యరాజ్యసమితి పోషించవలసి ఉన్న కేంద్రీయ భూమిక తో పాటు, ప్రపంచపు పురోగమనశీల అభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణ, ప్రచారాలపై ఆధారపడి ఉన్నది. ఈ సందర్భంలో మనం మన ప్రయత్నాలను మరింత సమన్వయంతో కొనసాగించడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని మేము నొక్కిచెబుతున్నాము.
• ఐక్యరాజ్యసమితి నిబంధనలు, ఉద్దేశాలకు అనుగుణంగా.. న్యాయమైన, సమానమైన అంతర్జాతీయ నిబంధనలను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం, స్థిరమైన విశ్వవ్యాప్త గౌరవం, అంతర్ సంబంధిత, సమగ్రత ఆధారంగా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండడం, అంతర్జాతీయ న్యాయ బాధ్యతలకు లోబడి.. చిత్తశుద్ధితో ఉంటామని మళ్లీ మళ్లీ చెబుతున్నాము. రెండో ప్రపంచ యుద్ధం ఫలితాలను తప్పుగా చూపించే ప్రయత్నాలను తిరస్కరించేందుకు కూడా చిత్తశుద్ధితో ఉన్నాము. అభివృద్ధి, భద్రత రెండూ ఒకదానితో మరొకటి అంతర్‌సంబంధం కలిగి ఉండడంతో పాటు దేనికవే పటిష్టమైనవి కూడా. ఇవే స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు దోహదపడతాయి.
• అంతర్జాతీయ సమస్యలు శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు రాజకీయపరమైన, దౌత్యపరమైన పద్ధతులలో సంయుక్తంగా ప్రయత్నించాలని మనం నమ్మకంతో ఉన్నాము. విశ్వాసం, దేశాల సార్వభౌమ నాణ్యత సంబంధ, దేశీయ అంశాలలో తలదూర్చకపోవడం, అంతర్జాతీయ చట్టాలకు లోబడని ఏకపక్ష బలవంతపు చర్యలను మినహాయించి మిగిలిన వాటిలో సహకారం ద్వారానే వీటికి పరిష్కారం లభించగలదని భావిస్తున్నాము. ఏకపక్ష సైనిక చొరబాటులు, అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ సంబంధాల నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థికపరమైన ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని పరిగణనలోకి తీసుకొని భద్రతను పెంచుకోవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించాము. ఏ దేశం కూడా ఇతర దేశాల భద్రతకు అనుగుణంగా తన ఖర్చును పెంచుకోకూడదని నిర్ణయించాము.
• 2005 ప్రపంచ శిఖరాగ్ర సమావేశ పరిణామ పత్రాన్ని మనము గుర్తుకు తెచ్చుకొంటున్నాము. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తో సహా ఐక్యరాజ్యసమితి బాధ్యతాయుతంగాను, సమర్థంగాను పనిచేసేటట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెరిగి, అంతర్జాతీయ సమస్యలకు సరైన స్పందన వచ్చేటట్లు చేసేందుకు అవసరమైన మార్పులను తీసుకురావలసిన అవసరం ఉందని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాము. అంతర్జాతీయ సంబంధాలలో పెరుగుతున్న బ్రెజిల్, భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల పాత్రను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో మరింత ప్రభావశీలమైన పాత్రను పోషించేలా ఈ దేశాలకు మద్దతు ఇవ్వాలని చైనా, రష్యా లు నొక్కి వక్కాణిస్తున్నాయి.
• ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా సమగ్రంగా ఉండే విధంగా ఐరాస సభ్యత్వ దేశాలు తీసుకు న్న చొరవలను స్వాగతిస్తున్నాము.
• గత పది సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా తన పాత్రను సమర్థంగా పోషించిన శ్రీ బాన్ కీ మూన్ కు ధన్యవాదాలు. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శ్రీ ఏంటోనియో గుతెరస్ కు శుభాకాంక్షలు. ఆయనతో కలిసి పనిచేసేందుకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాము.
• ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో బ్రిక్స్ దేశాల క్రియాశీల పాత్రను గుర్తు చేసుకొంటూ.. ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణలో ఈ శాంతి పరిరక్షక దళాల అవసరాన్ని గుర్తిస్తూ.. శాంతిని కాపాడడంలో వీటి పాత్రను మరింత బలోపేతం చేయడం, సామర్థ్యం, ప్రభావం, జవాబుదారుతనానికి కట్టుబడి ఉండేందుకు ఈ దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకున్నాము. ఈ దళాలు ఆతిథ్య దేశం ప్రాథమిక బాధ్యతకు అనుగుణంగా శాంతి పరిరక్షక కార్యక్రమాల ద్వారా తమకు ఉన్న ఆదేశాలతో పౌరులను కాపాడడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలని నొక్కి చెబుతున్నాము.
• ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా లలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాము. అంతర్జాతీయ చట్టాలు, స్వాతంత్ర్య నిబంధనలు, ఆ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వం, సమగ్రత లకు అనుగుణంగా ఈ సమస్య పరిష్కారమయ్యేందుకు మద్దతు తెలుపుతున్నాము. సిరియాలో నెలకొన్న పరిస్థితులపై.. సిరియా రాజకీయ ప్రక్రియపై ఐ.రా.స. భద్రత మండలి తీర్మానం (2254, 2268 ల) ఆధారంగా రూపొందించిన జెనీవా ప్రకటన (30 జూన్ 2012 నాటిది) ద్వారా జాతీయ సమగ్రమైన చర్చ, శాంతియుతమైన పరిష్కారం లభించేందుకు అందరూ కలిసిరావాలని కోరుకుంటున్నాము. భద్రత మండలి గుర్తించిన ఐఎస్ఐఎల్, జబాత్ అల్ నుస్రా, ఇతర ఉగ్రవాద సంస్థలపై నిరంతర పోరాటం కొనసాగుతుంది.
• పాలస్తీనా- ఇజ్రాయెల్ ఘర్షణకు.. ఐ.రా.స. భద్రత మండలి తీర్మానాలు, మాడ్రిడ్ నిబంధనలు, అరబ్ శాంతి ఒప్పందాలతోపాటు గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా.. చర్చలు జరపాలి. వీటి ద్వారానే ఇరుగు పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, పాలస్తీనా లు భద్రత విషయంలో1967లో సంయుక్తంగా అంగీకరించిన అంతర్జాతీయ సరిహద్దుల (ఐ.రా.స. తీర్మానాలలో పేర్కొన్నట్లుగా.. తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా) నిబంధనలకు అనుగుణంగా సంయుక్తంగా స్వాతంత్ర్యం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాము.
• అఫ్గానిస్తాన్‌లో భద్రతపరమైన సవాళ్లు, ఉగ్రవాద కార్యక్రమాలపై ఆందోళన చెందుతున్నాము. అఫ్గాన్ ప్రభుత్వం, తన నేతృత్వంలో జాతీయ సయోధ్యతో పాటు, ఉగ్రవాదంపై పోరాటం చేయడంలో మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అక్కడ భద్రతసంబంధమైన వాతావరణం నెలకొనేందుకు, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నుండి బయటడేందుకు, స్వతంత్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవటానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాము. అఫ్గానిస్తాన్‌లో స్థిరత్వం ఏర్పాటు చేసుకొనేందుకు అఫ్గాన్ జాతీయ భద్రత దళాల (ఎఎన్‌ఎస్‌ఎఫ్) పాత్ర చాలా కీలకం. ఈ విషయంలో ఈ ప్రాంతంలోని దేశాలు, విస్తృత అంతర్జాతీయ సమాజం, నాటో నేతృత్వంలోని రిజల్యూట్ సపోర్ట్ మిషన్ ద్వారా (ఏఎన్‌ఎస్‌ఎఫ్ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం) మద్దతు తెలపాలని బ్రిక్స్ నేతలు చెప్పారు. అఫ్గాన్ సమస్య పరిష్కారానికి బహుళపాక్షిక సంస్థల నేతృత్వంలో ఉన్న షాంఘయ్ సహకార సంస్థ, కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, హార్ట్ ఆఫ్ ఆసియా వంటి సంస్థలు చొరవ తీసుకోవాలి.
• ఆఫ్రికా ప్రాంత అభివృద్ధి కోసం ఆఫ్రికా యూనియన్ (ఎయు) అజెండా 2063లో పొందుపరచిన దృష్టి, ఆకాంక్షలు, లక్ష్యాలు, ప్రాథమ్యాలు, స్థిరమైన అభివృద్ధి కోసం రూపొందించిన 2030 అజెండాను స్వాగతిస్తున్నాం. ఆఫ్రికాలో శాంతి నెలకొల్పడంతో పాటు, ఆర్థికాభివృద్ధి కోసం ఆఫ్రికా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆఫ్రికా సంఘీభావం, ఐకమత్యం, బలోపేతం కావడంతో పాటు స్థిరమైన పురోగతి సాధించే దిశలో మా సహకారం కొనసాగుతుంది. ఇటీవల ఆఫ్రికా ఖండంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడాన్ని స్వాగతిస్తున్నాము.
• ఆఫ్రికాలో నెలకొన్న సంఘర్షణలను శాంతి, భద్రత పరమైన కార్యక్రమాలతో పరిష్కరించుకొని ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయ సంస్థల సహకారంతో స్థిరమైన శాంతి భద్రతలు నెలకొనేలా మా మద్దతు ఉంటుంది.
• ఆఫ్రికా దేశాలలో శాంతి, భధ్రత ఆపరేషన్లు నిర్వహించేందుకు ‘శాంతి నిధి’ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆఫ్రికన్ యూనియన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఆఫ్రికన్ స్టాండ్‌బై ఫోర్స్ (ఎఎస్‌ఎఫ్) అమలు కోసం జరిగే కార్యక్రమాలకు, ఈ దిశగా జరిగే పురోగతి, ఆఫ్రికన్ కెపాసిటీ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్ టు క్రైసిస్ (ఎసిఐఆర్ సి) చేసే సహకారానికీ మా మద్దతు ఉంటుంది.
• వివిధ దేశాలలో ఉగ్రవాదం, తీవ్రవాదం కారణంగా అనిశ్చితి, రాజకీయ, భద్రతపరమైన అస్థిరతలు నెలకొనడంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నాము. ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు.. పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగే దిశగా, అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములు సహాయం చేయాలి.
• 2015 సెప్టెంబర్ 25న ఐక్యరాజ్యసమితి సదస్సులో తీసుకున్న స్థిరమైన అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకొనేందుకు 2030.. అభివృద్ధికి ఆర్థిక సహకారంపై మూడో అంతర్జాతీయ సదస్సు తీసుకున్న అదిస్ అబాబా యాక్షన్ అజెండాలను మేం స్వాగతిస్తున్నాం. 2030 అజెండా.. ప్రజలకు సమానత్వం, న్యాయం, అందరికీ నాణ్యమైన జీవితం అందించేలా ప్రజలే కేంద్రంగా ఈ అజెండాలో చేర్చిన అంశాలను స్వాగతిస్తున్నాము. 2030 అజెండా అమలు కోసం రూపొందించుకొన్న మార్గదర్శకాలు, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ (సిబిడిఆర్) నిబంధనలను కూడా స్వాగతిస్తున్నాము.
• 2030 అజెండా స్థిరమైన అభివృద్ధికి పేదరిక నిర్మూలన, సమాన, సమతుల్య ఆర్థిక, సాంఘిక, పర్యావరణ అంశాలపై దృష్టి సారించింది. ఈ దేశాలు అధికారిక అభివృద్ధి తోడ్పాటు హామీలను చేరుకునేలా.. 0.7 శాతం స్థూల జాతీయ ఆదాయ లక్ష్యాలను చేరుకొని వృద్ధిని సాధించేలా.. సాయం చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు హామీలు ఇవ్వాలి. ఈ హామీలు ఎస్‌డిజి లను అమలు చేయడంలో చాలా కీలకంగా మారతాయి. ఎస్‌డిజిల అమలుకు సాంకేతికత కోసం ఐక్యరాజ్యసమితి టెక్నాలజీ ఫెసిలిటేషన్ మెకానిజంను ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయం.
• జాతీయ విధానాలను గౌరవిస్తూ పరిస్థితులు, పురోగతి సందర్భంలో 2030 అజెండాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ అమలుకు చిత్తశుద్ధితో ఉన్నాము. జి-20 హాంగ్‌ఝోవూ సదస్సు సందర్భంగా సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండాను అమలుచేసేందుకు తీసుకున్న జి-20 కార్యాచరణను సంయుక్తంగా వ్యక్తిగతంగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా అమలుచేయటాన్ని స్వాగతిస్తున్నాము.
• ప్రపంచ ఆర్థిక పరిస్థితి కోలుకుంటున్న సమయంలో, మారుతున్న పరిస్థితులు, అభివృద్ధికి కొత్త మూలాలు పుట్టుకొస్తున్నసమయంలో మేము భేటీ అయ్యాము. ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల అభివృద్ధి కూడా ఇంకా బలహీనంగానే నడుస్తోంది. దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరల్లో అస్థిరత, బలహీన వాణిజ్యం, పెరుగుతున్న ప్రైవేటు రుణాలు, ప్రజా రుణాలు, అసమానత, ఆర్థికాభివృద్ధిలో సమగ్రత లోపించడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు, అభివృద్ధి లాభాలు సమగ్రంగా అందరికీ సమానంగా అందాలి. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ఉగ్రవాదం, పెరుగుతున్న వలసలు, అనైతిక ధన ప్రవాహం, యూకే రెఫరెండం ఫలితాల కారణంగా ప్రపంచ ఆర్థిక రంగంలో అస్థిరత నెలకొంది.
• ద్రవ్య, ఆర్థిక, నిర్మాణాత్మక, వ్యక్తిగతంగా, సమష్టిగా, బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర అభివృద్ధికి అన్ని రాజకీయ సాధనాలను వాడేందుకు చిత్తశుద్ధితో ఉన్నాము. కేంద్ర బ్యాంకు నిబంధలనకు అనుగుణంగా.. ద్రవ్య విధానంతో ఆర్థిక కార్యాచరణ కొనసాగుతుంది. దీనివల్ల ధరల్లో స్థిరత్వం వస్తుంది. ఒక్క ద్రవ్య విధానం వల్లే స్థిరమైన అభివృద్ధి సాధ్యం కాదు. ఈ విషయంలో నిర్మాణాత్మకమైన సంస్కరణలను తీసుకురావలసిన అవసరాన్ని మేము గుర్తించాము. మా ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు తెలిపేందుకు మా ఆర్థిక విధానాలు కూడా చాలా ముఖ్యమైనవి. కొన్ని వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలు.. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే క్రమంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతున్న (స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్) ప్రభావాలను కూడా పరిశీలిస్తున్నాము.
• స్థిరమైన అభివృద్ధి కోసం మధ్య, దీర్ఘ కాల అభివృద్ధి లక్ష్యాలను చేరుకొనేందుకు సృజనాత్మకత చాలా కీలకం. పారిశ్రామికీకరణ ప్రాముఖ్యతను నొక్కిచెబుతున్నాము. పారిశ్రామిక అభివృద్ధి ప్రమాణాలే నిర్మాణాత్మక పరివర్తనకు మూలస్తంభం.
• అభివృద్ధి అనుకూల విధానంలో పన్ను విధానం, ప్రజా వ్యయాన్ని వినియోగించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని మేము నొక్కిచెబుతున్నాము. ఇది సమగ్రతను ప్రోత్సహిస్తూ, ప్రతికూలతను తగ్గస్తూ, జిడిపి లో భాగంగా రుణ స్థిరత్వాన్ని కలగజేస్తుంది.
• ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గతిశీల సమైక్యత విధానం కొనసాగుతోంది. మరీముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో. సమానత్వం, నిష్కాపట్యం, అందరినీ కలుపుకుని పోవడం వంటి నియమాల ఆధారంగా ప్రాంతీయ సమైక్యత పేరుతో అభివృద్ధిని ప్రోత్సహించాలని మా నమ్మకం. దీని ద్వారా పెరిగే వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడుల అనుసంధానంతో ఆర్థిక విస్తరణ జరుగుతుందని భావిస్తున్నాము.
• మౌలిక సదుపాయాల రంగంలో ప్రజా పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులు, అనుసంధానం, దీర్ఘకాల పురోగతి ప్రాముఖ్యాన్ని ప్రధానంగా చెబుతున్నాము. బహుళపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రమేయం పెరగడం ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో ఆర్థిక దూరాలను కలిపేలా కార్యచరణ ఉండాలని పిలుపునిస్తున్నాము.
• బలమైన, కోటా ఆధారిత, తగినన్ని నిధులున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) విషయంలో మా చిత్తశుద్ధికి కట్టుబడి ఉన్నాము. ఐఎమ్ఎఫ్ ద్వారా నిధులను అరువు తెచ్చుకోవడం ఓ తాత్కాలిక చర్య మాత్రమే. కోటాల 15వ సాధారణ సమీక్షతో పాటు కొత్త కోటా సూత్రాన్ని నిర్ధారించేందుకు వర్ధమాన దేశాల సమన్వయ ప్రయత్నాలకు మా మద్దతు పైనా కట్టుబడి ఉన్నాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గతిశీల వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అందిస్తున్న సహకారానికి (వారి ప్రాంతంలోని పేద, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల వాదనలను కాపాడుకుంటూ), పెరుగుతున్న వారి వాదనలకు మా మద్దతు ఉంటుంది.
• అక్టోబర్ 10, 2016న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డిఆర్) కరెన్సీ బాస్కెట్‌లోకి ఆర్‌ఎమ్ బిని చేర్చడాన్ని స్వాగతిస్తున్నాము.
• ఐఎమ్ఎఫ్ కార్యనిర్వాహక మండలిలో యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు రెండు స్థానాల విషయంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఐఎమ్ఎఫ్ సంస్కరణలు.. ఇందులోని పేద సభ్యత్వ దేశాల గొంతుకను (సబ్ సహారాన్ ఆఫ్రికాతో పాటుగా) బలోపేతం చేయాలి.
• సార్వభౌమ రుణ పునర్‌వ్యవస్థీకరణలో ఎదురవుతున్న సవాళ్లపై ఆందోళనను మేము పంచుకొంటున్నాము. సరైన సమయంలో విజయవంతమైన పునర్‌వ్యవస్థీకరణ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి విపణులకు మార్గం సుగమం అవుతుంది. దీని ద్వారా ఎక్కువ అప్పులు ఉన్న దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుత రుణ పునర్‌వ్యవస్థీకరణ విధానాన్ని మెరుగుపరచేందుకు, మారుతున్న కలెక్టివ్ యాక్షన్ క్లాజెస్ (సిఎసిల)పై జరుగుతున్న చర్చలను స్వాగతిస్తున్నాము.
• బహుళపాక్షిక వాణిజ్య వ్యవస్థకు మా మద్దతును పునరుద్ఘాటిస్తున్నాము. డబ్ల్యుటి ఒ కేంద్రంగా నియమాల ఆధారంగా, బహిరంగ, పారదర్శక, వివక్షరహిత, సమగ్ర అంశాలే ప్రధాన అజెండాగా బహుళపాక్షిక వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు కావాలి. పెరుగుతున్న ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుళత్వ వాణిజ్య ఒప్పందాలను గుర్తించాము. ఇవి డబ్ల్యుటి ఒ కింద బహుళపాక్షిక ఒప్పందాలకు సహకారంగా పారదర్శకత, సమగ్రత, అనుకూలత అనే డబ్ల్యుటి ఒ నియమాల ఆధారంగా పనిచేయాలి.
• బాలి, నైరోబీ మంత్రిత్వ సదస్సులలో తీసుకొన్న నిర్ణయాల అమలు ప్రాముఖ్యాన్ని మేము నొక్కిచెబుతున్నాము. దోహా డెవలప్‌మెంట్ అజెండా (డిడిఎ)లోని మిగతా విషయాలను ప్రాధాన్యంగా చర్చించే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలి. ఎంసి11, దీన్ని దాటి.. బలమైన పురోగతి ఉద్దేశ ఫలితంతో ఇద్దరు డబ్ల్యుటి ఒ సభ్యులతో కలిసి పనిచేయనున్నాము.
• బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహాల అమలుకు జరుగుతున్న పురోగతిని అభినందిస్తున్నాము. దీంతో పాటు 2020 వరకు వాణిజ్యం, ఆర్థిక, పెట్టుబడి సహకారం కోసం బ్రిక్స్ మార్గసూచీ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నాము. ప్రాంతీయ సహకార వ్యవస్థలు, ఆర్థిక, వాణిజ్య అంశాలపై బ్రిక్స్ సంప్రదింపు సమూహం, బ్రిక్స్ వ్యాపార మండలి, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు, బ్రిక్స్ అంతర్ బ్యాంకుల మధ్య సన్నిహిత సహకారం ఉంటుందని భావిస్తున్నాము. దీని ద్వారానే బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్యం బలోపేతమవుతుందని భావిస్తున్నాము. ఈ సందర్భంగా బ్రిక్స్ ఆర్థిక కార్యక్రమాలైన ఇ-కామర్స్ రంగంలో సహకారం పెంపుదల, సింగిల్ విండో, మేధోసంపత్తి హక్కు (ఐపిఆర్)లో సహకారం, సూక్ష్మ వాణిజ్యంలో ప్రోత్సాహం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ ఇలు) వంటిలో సహకారాన్ని కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నాము. నాన్ టారిఫ్ ప్రమాణాలు (ఎన్‌టిఎమ్ లు), సేవా రంగం, ప్రమాణీకరణ, అనుగుణ్యత లెక్కింపుల రంగంలో భవిష్యత్ సహకారం అవసరం ఉందని గుర్తించాము. ఈ సందర్భంగా 2016, అక్టోబర్ 13న న్యూ ఢిల్లీ లో జరిగిన బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశాన్ని, దీని ఫలితాలను స్వాగతిస్తున్నాము.
• బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహాన్ని అమలు చేసేందుకు.. అందరూ పాల్గొనేలా మద్దతు తెలపడం, విలువ జోడింపు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అవకాశాన్ని కాపాడే విధానాల ద్వారా మా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ముందడుగు పడేలా ప్రమాణాలను ప్రోత్సహిస్తాము.
• న్యూ ఢిల్లీ లో తొలి బ్రిక్స్ ట్రేడ్ ఫేర్ ఏర్పాటుకు భారతదేశం చొరవను స్వాగతిస్తున్నాము. బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం అమలులో ఇదొక ముఖ్యమైన ముందంజ. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. 2016 అక్టోబర్ 13న న్యూ ఢిల్లీ లో జరిగిన బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం ఫలితం, చర్చలను స్వాగతిస్తున్నాము.
• బ్రిక్స్ వ్యాపార మండలి ఇచ్చిన వాణిజ్య నివేదిక, దీని క్రియాశీల వర్గాల కింద తీసుకున్న కార్యక్రమాలను గమనించాము. బ్రిక్స్ ఆర్థిక లక్ష్యాలకు సహకారాన్ని అందించేలా పరస్పర లాభాలను అందించే సంయుక్త ప్రాజెక్టుల పరిపూర్ణతకు అభివృద్ధి జరిగేలా మండలికి త్వరలో ఆదేశాలిస్తాము.
• తక్కువ పెట్టుబడితో వచ్చే ఎమ్ఎస్‌ఎమ్ ఇలు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. అభివృద్ధి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో స్వతంత్రోపాధి అవకాశాలను సృష్టించాలి. జాతీయంగా, అంతర్జాతీయంగా సంపదను సమానంగా పంచడంలో ఎమ్ఎస్ఎమ్‌ఇలు ఉపయోగపడతాయి. ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతికపై భారతదేశం లో నిర్వహించిన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇపై బ్రిక్స్ సంస్థ రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రశంసిస్తున్నాము. ప్రాంతీయ, ప్రపంచ వేల్యూ చెయిన్స్‌లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇల ఏకీకరణకు మేము అంగీకారం తెలుపుతున్నాము.
• 11వ జి-20 నాయకుల సమావేశాన్ని హాంగ్‌ఝోవు లో విజయవంతంగా నిర్వహించిన చైనాకు అభినందనలు. ఈ సమావేశం సృజనాత్మకత, నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రపంచాన్ని నడిపించే అభివృద్ధి, దీర్ఘకాల ఆర్థిక ప్రగతిపైనే దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా, ఆర్థిక సహకారంలో జి-20 ఓ కీలకమైన వేదిక అని మేము గుర్తించాము. హాంగ్‌ఝోవు సదస్సు జి-20 ఫలితాలను అమలుచేయటంలో ప్రాధాన్యాన్నీ గుర్తించాము. బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర అభివృద్ధి వల్ల ప్రపంచ ఆర్థిక పాలన, పెరుగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను మేము బలంగా విశ్వసిస్తున్నాము.
• సృజనాత్మకత, ఉత్తేజం, అంతర్ అనుసంధానత, సమగ్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యాన్ని మేము నొక్కి చెబుతున్నాము. బ్రిక్స్ దేశాల పరస్పర ఆసక్తులకు అనుగుణంగా, ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ (ఇఎమ్‌డిఇ) విధానం ప్రాముఖ్యాన్ని ప్రోత్సహించేందుకు.. జి-20 అజెండాతో సమన్వయం చేసుకునేందుకు విస్తృతంగా చర్చలు జరపనున్నాము. దీంతో పాటు స్థూల అర్థ శాస్త్రం బలోపేతానికి జి-20 దేశాలతో సన్నిహితంగా పనిచేస్తాము. సృజనాత్మకతను, ప్రపంచ ఆర్థిక పురోగతికి పెట్టుబడులను, స్థిరమైన వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాం. ప్రపంచ ఆర్థిక పాలనను మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను పెంచడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఆఫ్రికాలో, అభివృద్ధికి దూరంగా ఉన్న దేశాల్లో పారిశ్రామికీకరణకు మద్దతు, ఇంధన, సామర్థ్యాన్ని అందించడంలో సహకారం పెంచడం వంటి అంశాలలో జి-20తో కలిసి సన్నిహితంగా పనిచేస్తాము. అక్రమ సీమాంతర నిధుల ప్రవాహాన్ని, పన్నుల ఎగవేతను, తప్పుడు వాణిజ్య లెక్కలను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంచేలా ఒత్తిడి తెస్తున్నాము.
• ఆర్థిక, ద్రవ్య సహకార రంగంలో బ్రిక్స్, దీని సహకార ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక స్థితిని స్థిరీకరించడంలో సహాయం చేయడంతో పాటు పురోగతిని పున:ప్రారంభించేందుకు మా సహకారం ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాలిస్తున్నాము.
• మార్కెట్ ఆధారిత నియమాలకు అనుగుణంగా ప్రత్యేకంగా స్వతంత్ర బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనే సాధ్యాసాధ్యాలపై నిపుణులను ఆహ్వానిస్తున్నాము. ఈ ఏజెన్సీ ద్వారా ప్రపంచ పాలన విధానాన్ని మరింత బలోపేతం చేయాలనేది మా భావన.
• మా మేధావులు వారి ఆలోచనలను పంచుకొనేందుకు విలువైన వేదికగా బ్రిక్స్ మేధో మండలి, బ్రిక్స్ విద్య ఫోరం నివేదికలను స్వాగతిస్తున్నాము. వీరు బ్రిక్స్, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ ప్రయోగాలు, విశ్లేషణతో పాటు ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకవెళ్లడం, సాధ్యాసాధ్యాలను కనుగొనడంపై నివేదికను అందజేశారు. న్యాయం, సమానత్వం సిద్ధాంతాల ఆధారంగా ప్రపంచ ఆర్థిక నిర్మాణంలో పరివర్తనను తీసుకువచ్చేందుకు మా సంయుక్త ఆలోచనలకు అనుగుణంగా బ్రిక్స్ సంస్థ నిర్మాణం చాలా క్లిష్టమైందిగా మేము విశ్వసిస్తున్నాము.
• బ్రిక్స్ పారిశ్రామిక మంత్రుల సమావేశాల ద్వారా బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంచవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించాము. దీని ద్వారా స్థిరమైన ఆర్థిక ప్రగతి వేగం పెంచడం, సమగ్రమైన పారిశ్రామిక బంధాలను బలోపేతం చేయడం, సృజనాత్మకత – ఉపాధి కల్పనలను ప్రోత్సహించడం, బ్రిక్స్ దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపైనా దృష్టి సారించాము.
• ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యూఎన్ఐడిఒ) స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆఫ్రికాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, సమగ్రమైన, స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో ఈ సంస్థ పాత్రను గుర్తుచేసుకున్నాము. యూఎన్ఐడిఒ- బ్రిక్స్ సాంకేతిక వేదిక ఏర్పాటు ద్వారా సాధించిన పురోగతిని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాము.
• బ్రిక్స్ పన్నుల సహకార కమిటీ ఏర్పాటు ద్వారా మా పన్నుల నిర్వహణ విధానాన్ని ప్రశంసిస్తూ.. భవిష్యత్తులో ఈ రంగంలో సహకారాన్ని, దీనికి చట్టపరమైన ఆధారాన్ని నిర్మించేందుకు, పన్నుల నియంత్రణకు ప్రోత్సహించే విధానాలను మరింత విస్తృతపరచాలని నిర్ణయించాము. బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహంలో భాగంగా పన్నుల నిర్వహణ చర్చలను బలోపేతం చేసేందుకు ‘బ్రిక్స్ పన్నుల సహకార కమిటీ నియంత్రణ’పై సంతకం చేయడాన్ని స్వాగతిస్తున్నాము.
• బ్రిక్స్ బీమా, పునఃభీమా విపణి ద్వారా సామర్థ్యాన్ని పెంచుందుకు ఫోర్టాలెజా డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకున్నాం. ఈ విషయంలో సహకారానికి మార్గం సుగమం చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించాము. ఈ పని వేగవంతం అవుతుందని భావిస్తున్నాము.
• ప్రపంచవ్యాప్తంగా న్యాయమైన, కొత్త పన్ను వ్యవస్థ దిశగా మా చిత్తశుద్ధిని మరోసారి గుర్తుచేస్తున్నాము. ఈ దిశగా అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ప్రమాణాల సమర్థమైన, విస్తృత అమలు దిశగా జరిగిన పురోగతిని స్వాగతిస్తున్నాము. వాస్తవాల ఆధారంగా దేశాల్లో ‘బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ప్రాజెక్ట్’ (బిఇపిఎస్) అమలుకు మేము మద్దతిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాలు పన్ను సామర్థ్యాన్ని నిర్మించుకొనేందుకు సహకరించేలా దేశాలను, అంతర్జాతీయ సంస్థలను ప్రోత్సహిస్తున్నాము.
• దూకుడైన పన్ను ప్రణాళికలు, పన్ను విధానాల ద్వారా సమానమైన అభివృద్ధిని ఆర్థిక ప్రగతిని ఇబ్బంది పెట్టే అంశాలనూ గమనిస్తున్నాము. ‘బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్’ను జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక కార్యాచరణ జరిగి, విలువ సృష్టించిన ప్రాంత పరిధిలోనే లాభంపై పన్ను వేయాలని నొక్కి చెబుతున్నాము. ఈ దిశగా అంతర్జాతీయ సహకారానికి, కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ ఫర్ ఆటోమేటిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ టాక్స్ ఇన్ ఫర్మేషన్ (ఎఇఒఐ)కు మద్దతు తెలిపే అంశంలో చిత్తశుద్ధితో ఉన్నాము.
• అంతర్జాతీయ పన్నుల విధానంపై జరుగుతున్న చర్చను గమనిస్తున్నాము. ఈ విషయంలో అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహకారంపై అదిస్ అబాబా కార్యాచరణ అజెండాను, సమగ్ర సహకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పన్నుపై జాతీయ పన్ను అధికారుల మధ్య చర్చ, సరైన, సమానమైన, భౌగోళిక వితరణ, భిన్నమైన పన్ను వ్యవస్థలపై చేసిన ప్రకటనలను గుర్తుచేసుకున్నాము.
• అవినీతిపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు మద్దతు ఇస్తున్నాము. బ్రిక్స్ అవినీతి వ్యతిరేక బృందాలు, ఆస్తుల స్వాధీనం, అవినీతికి పాల్పడిన వారిని పట్టుకొనేందుకు సంబంధించిన అంశాలపై ఈ మద్దతు కొనసాగుతుంది. అవినీతి, అక్రమ ధన ప్రవాహం, సవాలుగా మారిన విదేశాల పరిధిలో ఉన్న అన్యాయమైన ఆస్తుల (వీటి ద్వారా ఆర్థిక పురోగతి, సుస్థిర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది)ను గుర్తించాము. ఈ విషయంలో సహకారం పెంచుకోవడంతో పాటు అవినీతి, ఇతర అంతర్జాతీయ చట్టపరమైన అంశాలపై ఐక్యరాజ్యసమితి సదస్సు ఆధారంగా.. అవితీనిని నివారించడం, దీనిపై పోరాటానికి బలమైన అంతర్జాతీయ చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తున్నాము.
• వాతావరణ మార్పుపై 2015 పారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడానికి, దీర్ఘకాలంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి కొన్ని బ్రిక్స్ దేశాలలో పరమాణు ఇంధనం కీలక పాత్ర పోషిస్తుందని మేము గుర్తించాము. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలలో సుస్థిర అభివృద్ధికి దోహదం చేసే సాంకేతిక విజ్ఞానం వినియోగం మరియు పౌర పరమాణు ఇంధన సామర్థ్య విస్తృతికి కావలసిన ఆర్థిక వనరులను అంచనా వేయవలసిన ప్రాధాన్యాన్ని మేము గుర్తించాము.
• అంతరిక్ష అన్వేషణ మరియు వినియోగం అన్ని దేశాలు సమానత్వ ప్రాతిపదికన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని మేము పునరుద్ఘాటిస్తున్నాము. ఆయుధాలు మరే ఇతర బలప్రదర్శనకు అంతరిక్షం వేదిక కాకూడదని మరో సారి చెబుతున్నాము. అంతరిక్షంలో ఆయుధ పోటీని నిరోధించే అంతర్జాతీయ ఒప్పందం లేదా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి జరుగుతున్న చర్చలు ముగిసేటట్లు చూడడం ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సు యొక్క ప్రాథమ్య అంశం అవ్వాలని నొక్కిచెబుతున్నాము.
• అంతరిక్షంలో ఆయుధాల మోహరింపును నివారించే మరియు అంతరిక్ష వస్తువులకు ముప్పు కలిగించే లేదా బయపెట్టే చర్యలకు వ్యతిరేకంగా చైనా, ఇంకా రష్యన్ ఫెడరేషన్ లు ప్రతిపాదించిన నవీకరించిన లిఖితపూర్వక ఒడంబడిక ప్రకారం నిజంగా పనులు జరిగితే వాటిని మేము సమర్ధిస్తాము. ‘అంతరిక్షంలో ముందుగా ఆయుధాలు మోహరించేందుకు మేం వ్యతిరేకం’ అనేది అంతర్జాతీయంగా ఒక రాజకీయ అనివార్యతగా మారాలి.
• దీర్ఘకాలం స్థిరంగా అంతరిక్ష కార్యకలాపాలు సాగించేందుకు ప్రాధాన్య అంశాలను నిర్ధారించాలి. అదే సమయంలో భవిష్యత్ తరాల కోసం అంతరిక్షాన్ని కాపాడాలి. ఐక్యరాజ్యసమితి కమిటీ (యుఎన్ సిఒపియుఒఎస్) తాజా కార్యక్రమాల పట్టికలో అంతరిక్షాన్ని శాంతియుత సరళిలో వినియోగించడం ప్రధాన అంశమవ్వాలి.
• అంతరిక్ష అన్వేషణ మరియు వినియోగంపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు (యూనిస్పేస్ +50) 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా… 2018 కల్లా దీర్ఘకాల స్థిర శాంతియుత అంతరిక్ష కార్యకలాపాలపై చర్చలు ముగించి పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై ఏకాభిప్రాయానికి రావాలంటూ యుఎన్ సిఒపియుఒఎస్ శాస్త్ర మరియు సాంకేతిక సబ్ కమిటీ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మేము స్వాగతిస్తున్నాము.
• భారతదేశం సహా కొన్ని బ్రిక్స్ దేశాలపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, వ్యతిరేకిస్తాము. సిద్ధాంతపరమైన, మతపరమైన, రాజకీయపరమైన, వర్ణపరమైన, జాతిపరమైన లేదా ఎలాంటి కారణాల రీత్యానైనా కూడా ఇది సమర్ధనీయం కాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాము.
• జీవ మరియు రసాయన ఉగ్రవాద దాడుల ముప్పును అడ్డుకోవలసివుంది. దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ వేదికపై బహుళపాక్షిక చర్చలు సాగించవలసిన అవసరం ఉంది. దానికి మేం మద్దతు ఇస్తాము. ఈ నేపథ్యంలో, జన హనన ఆయుధాలు మరియు ఉగ్రవాద బంధంపై అంతర్జాతీయంగా పరిష్కారం కనుగొనేందుకు ఉద్దేశించిన ఒక సదస్సుకు 2018లో ఆతిథ్యం ఇస్తామంటూ భారతదేశం ఒక ప్రతిపాదనతో ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాము.
• తీవ్రవాదంపై పోరాటంలో ఓ సమగ్ర విధానాన్ని అవలంభించాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నాము. హింసాత్మక అతివాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదం, నియామకాలు, విదేశీ ఉగ్రవాదులు సహా ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడం, అక్రమ నగదు చెలామణి, మాదకద్రవ్యాల రవాణా వంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా అందే ఉగ్ర నిధుల కట్టడి, నేరపూరిత చర్యలు, తీవ్రవాద శిబిరాలను తొలగించడంతో పాటు అత్యాధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సాంఘిక ప్రసార మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్న తీవ్రవాద సంస్థలను ఎదుర్కోవడంలోనూ సమగ్ర విధానాన్ని అన్ని దేశాలు తీసుకురావాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఓ సంపూర్ణ విధానం ఉండాలి. ఉగ్రవాద నిరోధక చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. మానవ హక్కులను గౌరవించాలి.
• జాతీయ భద్రతపై ఇటీవల బ్రిక్స్ అత్యున్నత ప్రతినిధుల సమావేశం జరిగింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా 1016 సెప్టెంబర్ 14న న్యూ ఢిల్లీలో బ్రిక్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, దాని తొలి సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. ఉగ్రవాద నియంత్రణ చర్యలు, సమన్వయంపై ముందు ముందు మరిన్ని చర్చల ద్వారా ఓ అవగాహనకు వస్తాయన్న నమ్మకం బ్రిక్స్ దేశాలకు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదం ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్ (ఐఎస్ఐఎల్, ఇది డాయెష్ గా కూడా ప్రచారంలో ఉంది) మరియు దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులు ప్రపంచానికి, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు పెద్ద ముప్పులా పరిణమించారు. ఉగ్రవాదంపై బహుముఖ విధానాల సమన్వయంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్రను పోషించాలి. సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానాలను సమర్థంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతున్నాము. యుఎన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటం సమర్థంగా సాగడంపై మనకున్న నిబద్ధతను మళ్లీ చాటుదాం… ఏ మాత్రం జాప్యం లేకుండా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ( సిసిఐటి) ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఆమోదించేలా కలసి పనిచేయాలని అన్ని దేశాలను కోరుతున్నాము. తమ భూభాగంలో ఉగ్రవాద చర్యలను నియంత్రించడం ఆయా దేశాల బాధ్యత అని గుర్తుచేస్తున్నాము.
• మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు వంటి అంశాలను ఎదుర్కోవడానికి ఆర్థిక చర్యల కార్యసాధక బృందం (ఎఫ్ఎటిఎఫ్) ప్రమాణాలకు బ్రిక్స్ కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఎటిఎఫ్ సమర్థ, పటిష్ఠ అమలుకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎఫ్ఎటిఎఫ్, ఆ తరహా ప్రాంతీయ సంస్థలకు మన సహకారం మరింత పెరగాలి. 2106 ఏప్రిల్ 19-21 మధ్య న్యూ యార్క్ లో ప్రపంచ మాదకద్రవ్య సమస్యపై ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ప్రత్యేక సమావేశం తీర్మానాన్ని స్వాగతిస్తున్నాము. నల్లమందు సహా మాదకద్రవ్యాల అక్రమ ఉత్పత్తి. రవాణా వల్ల ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారం బలోపేతం కావాలని కోరుతున్నాము. మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం, అక్రమ నగదు చెలామణి, వ్యవస్థీకృత నేరాల మధ్య సంబంధాలు విస్తృతమవుతున్నాయి. బ్రిక్స్ మాదకద్రవ్య నిరోధక సంస్థల మధ్య సహకారం పెరగాలని కోరుకుంటున్నాము. న్యూ ఢిల్లీలో 2016 జూలై 8న జరిగిన రెండో మాదకద్రవ్య వ్యతిరేక నిరోధక బృందం సమావేశం చర్చలను స్వాగతిస్తున్నాము.
• నిరంతర అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి మరియు రక్షణ, మానవ హక్కులకు ఐసీటీ విస్తృతి కీలకమని మరోసారి చెబుతున్నాము. ఐసిటి ల వినియోగం, తీవ్రవాద, నేరకార్యకలాపాలకు ఐసిటి ల వినియోగాన్ని అడ్డుకోవడం మరియు మన సాంకేతిక, న్యాయ, ఐసిటి ల పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ రంగాల్లో సహకారం మరింత పెంచడం వంటి అంశాల్లో ఉమ్మడి చర్యలను బలోపేతం చేయాలని మేము అంగీకరించాము. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య డిజిటల్, సాంకేతిక తేడాను పూరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా విధానం బహుముఖమైనదిగా, అందరినీ కలుపుకుపోయేదిగా ఉండాలని మేము గుర్తించాము. అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టాలకు అనుగుణంగా, ఐక్యరాజ్యసమితి నిబంధనల మేరకు ఐసీటీల అభివృద్ధి మరియు వినియోగంలో అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారం ఉండాలని కోరుకుంటున్నాము. ఐసిటి ల శాంతియుత, భద్రత మరియు బహిరంగ వినియోగంలో ముఖ్యంగా రాజకీయ స్వేచ్ఛ, ప్రాంతీయ సమగ్రత మరియు సార్వభౌమత్వ సమత్వం, శాంతియుత విధానాలలో వివాదాల పరిష్కారం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, మానవహక్కులను గౌరవించడం, ప్రాథమిక స్వేచ్ఛలు, గోప్యత హక్కులు సర్వోచ్చ ప్రాధాన్యాన్ని కలిగివుంటాయి.
• తీవ్రవాద కార్యకలాపాలకు ఐసిటి ల దుర్వినియోగం పెరగడం ప్రపంచ శాంతిభద్రతలకు ముప్పులా పరిణమించింది. ఉగ్రవాద, నేర కార్యకలాపాలకు ఐసిటి ల వినియోగాన్ని అడ్డుకోవడంపై అంతర్జాతీయ సహకారం పెరగాలి. ఇథెక్వినీ, ఫోర్ట్ లెజా, ఉఫా ప్రకటనలను అనుసరించాలి. ఐసిటి ల వినియోగంలో భద్రతాపరమైన అంశాల పరిష్కారంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్రను పోషించాలి. బాధ్యతాయుతమైన దేశాలుగా యుఎన్ జిజిఇ విధానం ప్రకారం నియమ నిబంధనలు మరియు నియమావళి అమలుకు కలసి పనిచేయాలి. ఐసిటి ల వినియోగంలో స్థిరత్వం మరియు భద్రతలో ఆయా దేశాలదే కీలక పాత్ర. బాహాటమైన, ముక్కలు కాని మరియు సురక్షితమైన ఇంటర్ నెట్ ఉండాలన్నదే మా విధానం. ఇంటర్ నెట్ ప్రపంచ వనరు, దాని విస్తృతి మరియు కార్యకలాపాలలో అన్ని దేశాలకు సమ ప్రాధాన్యం ఉండాలి. అదే సమయంలో సంబంధింత వ్యవస్థల పాత్ర మరియు బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి.
• స్థిర ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత మరియు సమర్ధ వినియోగం యొక్క ప్రాధాన్యాలను మేము గుర్తించాము. దీనిపై అవగాహనపూర్వక ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాము. విద్యుత్తు ఉత్పత్తిని పెంచడం మరియు పంపిణీలో పెరుగుతున్న సవాళ్లను మేం గుర్తించాము. అదే సమయంలో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే ఇంధనం, మరియు ఇతర శుద్ధ ఇంధన పరిష్కారాల ఆవశ్యకతనూ గుర్తించాము. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల స్థాయిని గుర్తించాము. శుద్ధ ఇంధన సాంకేతికత మరియు వనరుల రంగంలో అంతర్జాతీయ సహకారంపై మరింత దృష్టి పెట్టాలి. స్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో శుద్ధ ఇంధన ప్రాధాన్యాన్ని గుర్తించాలి. భూ గ్రహం భవిష్యత్తు మరియు శ్రేయస్సుల కోసం స్థిర అభివృద్ధి, ఇంధన లభ్యత, ఇంధన భద్రతలు అనేవి ముఖ్యమని గుర్తించాము. అన్నిదేశాల శుద్ధ మరియు పునరుత్పాదక ఇంధన అవసరాలు తీరాలి.
• వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం ప్రకారం సుస్థిర అభివృద్ధి మరియు గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఆర్థికంగా ప్రయోజనకరమైన సహజ వాయువు విస్తృత వినియోగానికి మేం మద్దతు ఇస్తాము. ఎయిడ్స్, మరియు క్షయ వంటి వ్యాధుల విషయంలో బ్రిక్స్ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంలో, 2020 కల్లా 90-90-90 హెచ్ఐవి చికిత్స లక్ష్యాన్ని అందుకోవడం ధ్యేయంగా బ్రిక్స్ దేశాల ఆరోగ్య మంత్రులు చేసిన కృషిని మేము గమనించాము. హెచ్ఐవి, టిబి లకు నాణ్యమైన ఔషధాల తయారీ మరియు చికిత్స విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం తక్షణ అవసరం. ఎయిడ్స్ ను అంతం చేయడంపై జూన్ 2016లో ఐక్యరాజ్యసమితి అత్యున్నత స్థాయి సమావేశం మరియు టిబిపై 2017లో మాస్కోలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగే గ్లోబల్ కాన్ఫరెన్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లను గుర్తించి, అంటువ్యాధులను అంతం చేసేలా, భద్రమైన, సమర్థమైన, గుణాత్మకమైన, అందరికీ అందుబాటులో ఉండే ఔషధాలు మరియు చికిత్స విధానాల పరిశోధన- అభివృద్ధిల ప్రాధాన్యాన్ని బ్రిక్స్ దేశాలు గుర్తించాయి.
• ప్రజారోగ్యం మరియు ప్రపంచ ఆర్ధిక స్థిరత్వం, అభివృద్ధి లకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ( ఎఎమ్ఆర్) కలిగిస్తున్న ముప్పుపై యుఎన్ జిఎ-71 అత్యున్నత స్థాయి సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. సమర్థ విధానాల మార్పిడి మరియు సవాళ్లపై చర్చతో పాటు సంభావ్య ఏకీకృత రంగాల గుర్తింపు విషయంలో ఆరోగ్య మరియు నియంత్రణ సంస్థల మధ్య సహకారానికి అవకాశాలను పరిశీలిస్తున్నాము. 2015-2020 బ్రిక్స్ సహకార విధానం ప్రకారం జనాభా సంబంధిత అంశాల్లో దీర్ఘకాల మరియు నియంత్రణ ప్రజావృద్ధి మరియు పరస్పర సహకారం కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాము.
• 2016 జూన్ 9 న జెనీవా లోను మరియు సెప్టెంబర్ 27వ ,28వ తేదీల్లో న్యూ ఢిల్లీ లోనూ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖల సమావేశం యొక్క ఫలితాలను స్వాగతిస్తున్నాము. బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సాంఘిక భద్రత ఒప్పందాల అవకాశాలను పరిశీలిస్తున్నాము. బ్రిక్స్ దేశాల మద్య కార్మిక పరిశోధన, శిక్షణ సంస్థల నెట్ వర్క ఏర్పాటుకు చర్యలు తీసుకోవడాని కట్టుబడి ఉన్నాం. దీనివల్ల సామర్ధ్య వృద్ధి, సమాచార మార్పిడి మరియు ఉత్తమ విధానాల అమలుకు అవకాశం లభిస్తుంది. నాణ్యమైన ఉపాధి మరియు మర్యాదకరమైన పని పట్టిక, సాంఘిక రక్షణ మరియు హక్కుల మెరుగుదల సుస్థిర అబివృద్ధికి కారణాలు అని గుర్తించాము.
• 2016సెప్టెంబర్ 30 న న్యూ ఢిల్లీలో జరిగిన నాలుగో బ్రిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశం చర్చల ఫలితాలను మరియు విద్యపై న్యూ ఢిల్లీ ప్రకటన ను స్వాగతిస్తున్నాం. ఆర్థిక అభివృద్ధికి నాణ్యమైన విద్య మరియు నైపుణ్యం అవసరం. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నాము. బ్రిక్స్ నెట్ వర్క్ యూనివర్శిటీ ( బిఆర్ ఐ సి ఎస్ ఎన్ యు) తో పాటు బ్రిక్స్ యూనివర్శిటీ లీగ్ ( బిఆర్ ఐ సి ఎస్ యు ఎల్) పురోగతిపై సంతృప్తిగా ఉంది. 2017 నాటికి ఇవి తమ కార్యకలాపాలను మొదలుపెడతాయి. బ్రిక్స్ దేశాల మధ్య ఉన్నత విద్యలో సహకారం, భాగస్వామ్యానికి ఈ రెండు కార్యక్రమాలు సేతువుగా నిలుస్తాయి.
• సెప్టెంబర్ 3-6 మధ్య కోల్ కతాలో యంగ్ డిప్లమేటిక్ ఫోరమ్ సంస్థ సమావేశాన్ని ప్రశంసిస్తున్నాము. విజ్ఞానం మరియు అనుభవ మార్పిడిని పెంచడానికి బ్రిక్స్ డిప్లమేటిక్ అకాడమీస్ మధ్య అవగాహనపూర్వక ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాము. 2016 అక్టోబర్ 8న జైపూర్ లో నాలుగో బ్రిక్స్ ఎస్ టిఐ మంత్రుల సమావేశం చర్చల ఫలితాలను జైపూర్ ప్రకటన ను స్వాగతిస్తున్నాం. శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగాలు ముఖ్యంగా , సామాజిక సవాళ్లను ఎదుర్కోవడంలో యువ సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడం, బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల మధ్య ఓ నెట్ వర్కింగ్ వేదికను సృష్టించడం, కొత్త విజ్ఞాన సృష్టి మరియు నూతన ఆవిష్కరణలు, సేవలు మరియు ప్రపంచ, ప్రాంతీయ సామాజిక ఆర్థిక సవాళ్ల పరిష్కారం అంశాల అమలుకు 2015-2018 వర్క్ ప్లాన్ ఆమోదాన్ని ప్రశంసిస్తున్నాము.
• బ్రిక్స్ పరిశోధన మరియు ఆవిష్కరణ కార్యక్రమాన్ని అవలంబించవలసిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నాము. మొదటి బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడం, యువ శాస్త్రవేత్తలకు బ్రిక్స్ ఇన్నోవేటివ్ ఐడియా బహుమతిని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. బ్రిక్స్ ఎస్ టిఐ కార్యక్రమంలో భాగంగా పది అంశాల్లో ప్రతిపాదనల దిశగా ఒకటో అడుగు పడింది. నిధుల కేటాయింపునకు ఐదు బ్రిక్స్ దేశాల ఎస్ టిఐ మంత్రిత్వ శాఖలు మరియు అనుబంధ సంస్థలు హామీ ఇచ్చాయి. మౌలిక సదుపాయాల పరిశోధన మరియు బ్రిక్స్ ప్రపంచ పరిశోధన మరియు అత్యాధునిక మౌలిక సదుపాయాల నెట్ వర్క్ పై బ్రిక్స్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటును స్వాగతిస్తున్నాం.
• 2016 సెప్టెంబర్ 23న వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. సంయుక్త ఒప్పందాన్ని ఆమోదించారు. ఆహార భద్రత ప్రాధాన్యం, పోషకాహార సమస్యను ఎదుర్కోవడం, ఆకలిని తరిమికొట్టడం, వ్యవసాయ
ఉత్పత్తిని పెంచడం ద్వారా పేదరికాన్ని, అసమానతలను నివారించడం, సహజవనరుల వినియోగంలో సమర్థమైన విధానాలను అమలుచేయడం, బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ వ్యాపారం యొక్క ప్రాధాన్యాన్ని మేము గుర్తించాము. వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రగాములుగా, అధిక జనాభా కల దేశాలుగా బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ సహకారమనేది చాలా అవసరం. విజ్ఞాన సహిత వ్యవసాయం మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అవసరం ఉంది. వ్యవసాయ పరిశోధర విధానం, శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణ, సామర్ధ్య వృద్ధి, చిన్న కమతాల వ్యవసాయంలోనూ సాంకేతిక వినియోగం రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదిక ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తున్నాము. వ్యవసాయంలో నీటిపై ఆధారపడడాన్ని దృష్టిలో ఉంచుకొని, కరవు సమయంలోనూ రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, అనుభవం, నైపుణ్యత మార్పిడి జరగాలి.
• ఇ-గవర్నెన్స్ , ఆర్థిక వృద్ధి, లాభాలు నిర్దేశిత సమూహానికి అందించడం, ఇ-కామర్స్, సాంకేతిక అంశాలు మరియు సేవలు మరియు సాంకేతిక ఖాళీలు పూరించడంలో వారధి వంటి అంశాల్లో సమాచార, సాంకేతిక పరిజ్ఞానం ( ఐ సిటి) వినియోగం, నైపుణ్య మార్పిడిలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెరగాలి. ఇ-కామర్స్ లో సమర్థంగా పాల్గొనడం ద్వారా ఉమ్మడి ప్రయోజనాలు అందించేందుకు ఉపకరించే నైపుణ్య వృద్ధిని పెంచే ప్రయత్నాలకు మేము మద్దతిస్తాము.
• త్వరలో బ్రిక్స్ టెలికమ్యూనికేషన్ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సాంకేతిక మార్పులు, ప్రామాణిక అభివృద్ధి, నైపుణ్య వృద్ధి మరియు విధాన రూపకల్పనకు అవకాశం కలుగుతుంది. సాఫ్ట్ వేర్ మరియు ఐటి పరికరాల రంగంలో అంతర్జాతీయ విపణిలో వైవిధ్యం దిశగా ఉమ్మడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐసిటి సహకారంపై బ్రిక్స్ కార్యవర్గం విధాన పరిధిలో సహకారం బలోపేతం చేసుకోవాలని పిలుపునిస్తున్నాము.
• విపత్తు నిర్వహణపై 2016 ఏప్రిల్ 19వ, 20వ తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో, ఆగస్టు 22న ఉదయపూర్ లో జరిగిన బ్రిక్స్ మంత్రుల సమావేశం తీర్మానాలపై సంతృప్తిగా ఉంది. రెండో సమావేశంలో ఉదయ్‌పూర్ తీర్మానాన్ని ఆమోదించడాన్ని, విపత్తు నిర్వహణపై బ్రిక్స్ సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాము. మాథ్యూ తుపాను కారణంగా హైతీ, కరేబీయన్ దీవులలో ప్రాణనష్టం జరగడంపై సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఈ విషాదంపై ఐక్యరాజ్యసమితి, మానవతా ధృక్పథంతో స్పందించిన వారికి మా మద్దతు ఉంటుంది.
• పర్యావరణ పరిరక్షణపై 2016 సెప్టెంబర్ 15వ,16వ తేదీలలో గోవాలో బ్రిక్స్ మంత్రుల సమావేశం జరిగింది. పర్యావరణంపై గోవా ప్రకటనను స్వాగతిస్తున్నాము. వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని ఎదుర్కోవడం, చెత్త సమర్థ నిర్వహణ మరియు జీవ వైవిధ్యం స్థిర నిర్వహణపై సాంకేతిక సహకారం అందించుకోవాలన్ని నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాము. పర్యావరణ సమర్థ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం సహా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాము.
• దక్షిణ ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో 2016 సెప్టెంబరు 24 నుండి అక్టోబరు 4 వరకు జరిగిన పార్టీస్ టు ది కన్ వెన్షన్ ఆన్ ఇంటర్ నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేన్ జర్ డ్ స్పీషీజ్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా (సిఐటిఇఎస్) 17వ సమావేశ తీర్మానాన్ని -అంతరించిపోతున్న జంతుజాలం, పూల జాతుల తాలూకు అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేసే దిశలో నమోదైన ఒక మేలుమలుపుగా- పేర్కొంటూ స్వాగతిస్తున్నాము.
• యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యుఎన్ఎఫ్‌సిసిసి) ప్రకారం మెజారిటీ దేశాలు 2016 ఏప్రిల్ 22న పారిస్ ఒప్పందాన్ని ఆమోదించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. సమగ్రమైన, సమతుల్యమైన, ప్రతిష్టాత్మక పారిస్ ఒప్పందం.. యుఎన్ఎఫ్‌సిసిసి నియమాలను, సమానత్వం, సమష్టితత్వం నియమాలను పునరుద్ఘాటిస్తూనే వివిధ దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన బాధ్యతలను, సంబంధిత సామర్థ్యాలను (సిబిడిఆర్ & ఆర్‌సి) గుర్తుచేసిందని భావిస్తున్నాము.
• పారిస్ ఒప్పందాన్ని, 2016 నవంబర్ 4 నుండి ఇది అమల్లోకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు సరైన ఆర్థిక వనరులను, సాంకేతిక విజ్ఞానాన్ని, సామర్థ్య నిర్మాణంలో సహకారాన్ని అందించడంతో పాటు ఒప్పందం అమలులో తలెత్తే సమస్యల పరిష్కారంలో వాటి బాధ్యతను నెరవేర్చాలని మేము కోరుతున్నాము.
• 2030 అజెండాలో ప్రస్తావించిన ప్రకారం లింగ సమానత్వం, మహిళలు, బాలికల సాధికారితకు మేము చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. మహిళలు అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తారని.. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగా సమానమైన, సమగ్రమైన పురోగతిలో వారి భాగస్వామ్యాన్ని తెలుసుకుని ముందంజ వేస్తారని మేము గుర్తించాము. ఈ వచనబద్ధతను ఆచరణలోకి తీసుకురావడంలో వారి జవాబుదారీతనం ప్రాముఖ్యాన్ని మరింతగా పెంచాలని నిర్ణయించాము.
• మా దేశాల్లో ఉన్న యువత జనసంఖ్యను, వారి శక్తిని, అవసరాలు, ఆశలను మదిలో ఉంచుకొని.. గువాహాటిలో ఏర్పాటు చేసిన బ్రిక్స్ యువ సదస్సు ఫలితాలను స్వాగతిస్తున్నాము. ‘గువాహాటి బ్రిక్స్ యూత్ సమ్మిట్ కాల్ టు యాక్షన్’ లో విద్య యొక్క ప్రాముఖ్యత, ఉపాధి, వ్యాపారం, యువత సాంఘికంగా ఆర్థికంగా సాధికారితను సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంపై చర్చించడాన్ని సైతం స్వాగతిస్తున్నాము.
• బ్రిక్స్ దేశాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు సహకారం అందించుకునే లక్ష్యాలతో మధ్య ప్రదేశ్‌లోని ఖజురహో లో 2016 సెప్టెంబర్ 1వ, 2వ తేదీలలో నిర్వహించిన బ్రిక్స్ పర్యాటక సదస్సును కూడా స్వాగతిస్తున్నాము.
• ప్రపంచంలో 43 శాతం జనాభా ఉన్న దేశాలుగా, పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న సమాజాలుగా.. పట్టణీకరణ ద్వారా ఎదురవుతున్న భిన్న కోణాల్లోని సవాళ్లు, అవకాశాలను మేము గుర్తించాము. అందుకే ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన గృహ నిర్మాణం, స్థిరమైన పట్టణాభివృద్ధి – నివాస స్థలం III (క్విటోలో 2016 అక్టోబరు 17వ తేదీ నుండి 20వ తేదీల మధ్య) సదస్సులో తీసుకున్న కొత్త పట్టణీకరణ అజెండాను స్వీకరించేందుకు అవసరమైన చర్చలు జరుపుతున్నాము. 2016 సెప్టెంబరు 14 నుండి 16 వరకు విశాఖపట్టణంలో జరిగిన బ్రిక్స్ పట్టణీకరణ ఫోరమ్, 2016 ఏప్రిల్ 14 నుండి 16 వరకు ముంబయ్ లో జరిగిన బ్రిక్స్ మైత్రీ నగరాల సదస్సులలో మా నగరాలు, వాటాదారుల మధ్య చర్చలను పెంచేందుకు తీసుకొన్న చర్యలను మేము స్వాగతిస్తున్నాము. పట్టణ పాలనను బలోపేతం చేసుకొనేందుకు సహకారాన్నిపెంచడం, నగరాలను సంఘటితంగా, భద్రంగా మార్చుకొనేందుకు, నగర రవాణాను మెరుగుపచుకొనేందుకు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేసుకోవాలని, సుస్థిరమైన నగరాల నిర్మాణం విషయంలో పరస్పర సహకరించుకోవాలని నిర్ణయించాము.
• బ్రిక్స్ స్థానిక సంస్థల సదస్సు నిర్వహణ ద్వారా.. స్థానిక బడ్జెటింగ్‌తో పాటు వివిధ దేశాల్లో అమలవుతున్న మంచి విధానాలను పరస్పరం అందిపుచ్చుకొనేందుకు వేదికను ఏర్పాటు చేయలన్న భారతదేవం చొరవను ప్రశంసిస్తున్నాము.
• క్రమబద్ధమైన, భద్రమైన, నిరంతర, బాధ్యతాయుత వలస విధానం ప్రాముఖ్యతను గుర్తిస్తూ రష్యన్ ఫెడరేషన్ లోని సోచి లో 2015 అక్టోబర్ 8 నాడు జరిగిన బ్రిక్స్ మైగ్రేషన్ మంత్రుల తొలి సమావేశం ఫలితాలను స్వాగతిస్తున్నాము.
• స్థిరమైన అభివృద్ధి, పరస్పర అవగాహన, మా దేశాల ప్రజల మధ్య సన్నిహిత సహకారం పెంచడంలో సంస్కృతి పోషించే పాత్ర ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాము. ఇందుకోసం బ్రిక్స్ దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే 2016 సెప్టెంబర్ 2 వ తేదీ నుండి 6వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని సిఫారసు చేశాము.
• 2016 అక్టోబర్ 23వ తేదీ నాడు జెనీవాలో నిర్వహించనున్న రెండో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ సమావేశం.. ‘ఎస్‌డీజీల అమలుపై బ్రిక్స్ పార్లమెంటరీ సహకారం’ ఇతివృత్తంతో జరగనుంది.
• 2016 ఆగస్టు 20వ, 21వ తేదీలలో జైపూర్‌లో జరిగిన బ్రిక్స్ మహిళా పార్లమెంటేరియన్ ల ఫోరమ్ చర్చోపచర్చలను, జైపూర్ ప్రకటనను మేము అభినందిస్తున్నాము. ఎస్‌డీజీలు, సుస్థిర అభివృద్ధి, లింగ సమానత్వాన్ని పెంచడం, మహిళా సాధికారిత అనే మూడు అంశాలపై పార్లమెంటరీ వ్యూహాత్మక భాగస్వామ్యాల బలోపేతానికి వచనబద్ధత స్ఫూర్తి ఈ ప్రకటనలో వ్యక్తం అయింది.
• స్థిరమైన, తక్కువ ఖర్చుతో మా ఆర్థిక వ్యవస్థలో పురోగతి కోసం పరిశోధనను మరియు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బ్రిక్స్ రైల్వే పరిశోధన నెట్‌వర్క్ చర్చలను మేము గమనిస్తున్నాము.
• 2016 అక్టోబర్ 5-15 మధ్య గోవాలో బ్రిక్స్ అండర్-17 ఫుట్‌బాల్ టోర్నమెంటును నిర్వహించిన భారతదేశానికి అభినందనలు. ఈ సందర్భంలో బ్రిక్స్ క్రీడా మండలి ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ద్వారా.. బ్రిక్స్ దేశాలలో క్రీడారంగంలో మార్పులను ప్రోత్సహించాలని భావిస్తున్నాము.
• బ్రిక్స్ దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులు.. బ్రిక్స్ అంతర్‌బ్యాంకుల సహకార వ్యవస్థ ప్రాముఖ్యాన్ని గుర్తించడం ద్వారా బ్రిక్స్ దేశాల జాతీయాభివృద్ధి బ్యాంకులు, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డిబి) ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందంపై సంతకాలు జరగడాన్ని స్వాగతిస్తున్నాము. ‘వార్షిక బ్రిక్స్ ఎకనమిక్స్ రీసెర్చ్ అవార్డు’ను నెలకొల్పేందుకు ఎక్స్ పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చొరవను స్వాగతిస్తున్నాము. ఈ అవార్డు బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పరిశోధనను ప్రోత్సహిస్తుంది.
• ఉమ్మడి అభివృద్ధి కోసం మా భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకొనేందుకు చిత్తశుద్ధిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము. ఈ దిశగా గోవా కార్యాచరణ ప్రణాళికను బలపరుస్తున్నాము.
• బ్రిక్స్ కు భారతదేశ సారథ్యాన్ని, బ్రిక్స్ సహకార కార్యక్రమాల పట్టిక పురోగతి వేగవంతం కావడంలో భారతదేశం తీసుకొన్న చొరవను చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా లు అభినందించాయి.
• బ్రిక్స్ సదస్సుల్లో నిర్ణయాలు, ఫలితాన్ని ఇచ్చే పత్రాల అమలు, అనుసరణలతో పాటు ఎప్పటికప్పుడు సమీక్ష చేపట్టడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే పనిని మా షెర్పాలకు అప్పగించాము.
• గోవాలో 8వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశ ప్రజలు, ప్రభుత్వానికి.. చైనా, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాయి.
• 2017లో 9వ బ్రిక్స్ సదస్సును నిర్వహించనున్న చైనాను అభినందించిన భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా లు ఈ దిశగా వాటి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపాయి.