Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

75వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు స్వాగతం పలకనున్న ప్రధానమంత్రి


   భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలకనున్నారు.

ఈ మేరకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ ‘ఎక్స్’ ద్వారా పోస్ట్ చేసిన సందేశంపై స్పందిస్తూ:

‘‘నా ప్రియ మిత్రులైన అధ్యక్షులు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ గారూ… భారత 75వ గణతంత్ర దినోత్సవానికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు మేమెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. ఈ సందర్భంగా భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణతోపాటు ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని కూడా మేం పంచుకుంటాం… బైఎంటాట్!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.