మిత్రులారా, మీ అందరి ని ఇక్కడ కు నేను ఆహ్వానిస్తున్నాను.
రేపటి రోజు గడచిన తరువాత మీకందరికీ ఒక పెద్ద పరీక్ష ఉంది, మరి ఆ పరీక్ష లో మీరు చక్కని మార్కుల తో ఉత్తీర్ణులు అవుతారని నేను ఎరుగుదును; మీరు సఫలత ను సాధిస్తారు.
మీకందరి కి గణతంత్ర దినం మరియు గణతంత్ర దిన ప్రదర్శన ల వేళ లో ఇవే నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఇక్కడ గుమికూడినటువంటి స్నేహితులు అందరూ, ఒక రకం గా ఓ బుల్లి భారతదేశాన్ని కళ్ల కు కడుతున్నారు. మన దేశం మరియు యావత్తు ప్రపంచం మీ నుండి నిజమైనటువంటి భారతదేశాన్ని చూసి, మరి దాని ని గురించి అర్థం చేసుకొంటుంది.
ఎన్ సిసి మరియు ఎన్ఎస్ఎస్ ల ద్వారా రాజ్ పథ్ లో క్రమశిక్షణ, ఇంకా సేవ ల తాలూకు ఒక ఉత్తమ సంప్రదాయం ఆవిష్కారం అవుతూ ఉంటే, దేశం లోని కోట్ల మంది యువతీయువకులు ప్రేరణ ను పొంది ప్రోత్సాహాన్ని అందుకొంటారు. మీరు భారతదేశం యొక్క వారసత్వం మరియు భారతదేశం యొక్క విలువైన కళలు ఇంకా సంస్కృతి కి అద్దం పట్టే ఒక శకటం తో రాజ్ పథ్ మీదకు చేరుకొన్న తరుణం లో, మొత్తం ప్రపంచం సమ్మోహితమవుతుంది. మరీ ముఖ్యం గా మన ఆదివాసీ స్నేహితులు వారి యొక్క ప్రదర్శనల ద్వారా ఒక అద్భుతమైనటువంటి మరియు అనుపమానమైనటువంటి వారసత్వాన్ని దేశం ఎదుట, ప్రపంచం సమక్షం లో దృశ్యమానం చేస్తారు.
అటువంటి శీతల వాతావరణం ఉన్నప్పటికీ, మీరు ఈ విధం గా కఠోరం గా శ్రమిస్తూ మరి నిరంతరం నిమగ్నమై ఉంటున్నారు. ఇది నిజంగా నే చాలా ప్రశంసార్హమైనటువంటిది.
ఈ పర్యాయం నేను ప్రదర్శన కు హాజరు అయ్యేటప్పుడు, ప్రతి ఒక్క శకట కళాకారుడి ని/ ప్రతి ఒక్క శకట కళాకారిణి ని కలుసుకొని వారి కి ధన్యవాదాలు పలికానన్న గొప్ప సంతృప్తి దక్కుతుంది.
మిత్రులారా,
మీరు దేశం లోని వివిధీకరణల ను ఢిల్లీ కి తీసుకు వచ్చారు; అలాగే, గణతంత్ర దినం నాడు ఢిల్లీ లో మనం గమనించే భిన్నత్వం తాలూకు సందేశాన్ని మీరు మీ మీ ప్రాంతాల కు మోసుకు పోతారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అనే భావన ను సాకారం చేసేది మీరు.
మనం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ను గురించి మాట్లాడుకొనేటప్పుడు, మనం భారతదేశం అంటే వాస్తవం లో ఏమిటన్నది కూడా జ్ఞాపకం లోకి తెచ్చుకోవాలి. భారతదేశం అంటే కేవలం సరిహద్దుల కు లోపల 130 కోట్ల మంది కి ఆవాస ప్రాంతం మాత్రమేనా? కాదు; భారతదేశం మనుగడ ను సాగిస్తున్నటువంటి ఒక ప్రజానీకం కావడం తో పాటు చైతన్యభరితం అయినటువంటి ఒక సంప్రదాయం, ఒక భావ వాహిని, ఒక ధర్మానుష్ఠానం, ఇంకా- వీటన్నిటితో పాటు ఓ విస్తృతమైన ప్రాంతం గా కూడా.
భారతదేశానికి అర్థం – వసుధైవ్ కుటుమ్బకమ్
భారతదేశానికి అర్థం – సర్వ్ పంథ్ సమభావ్
భారతదేశానికి అర్థం – సత్యమేవ్ జయతే
భారతదేశానికి అర్థం – అహింసా పరమో ధర్మ:
భారతదేశానికి అర్థం – ఏకమ్ సద్ విప్రా: బహుధా: వదన్తి; అంటే, సత్యం అనేది ఒకే విధం గా ఉంటుంది, దాని ని చూసే తీరు విభిన్నం గా ఉంటుంది అని.
భారతదేశానికి అర్థం – వైష్ణవ్ జన్ తో తేనే కహియే జే పీడ్ పరాయీ జాణే రే
భారతదేశానికి అర్థం – మొక్కల తోను, వృక్షాల తోను నిండివున్నటువంటి దైవం యొక్క నివాసం అని.
భారతదేశానికి అర్థం – అప్ప్ దీపో భవ: అంటే, ఇతరుల నుండి ఆశించడాని కి బదులు గా స్వీయ ప్రేరణ దిశ గా సాగాలి అని.
భారతదేశానికి అర్థం – తేన్ త్యక్తేన భున్జిథా; ఈ మాటల కు, త్యాగం చేసిన వారు మాత్రమే ఆనందం గా ఉంటారు అని భావం.
భారతదేశానికి అర్థం – సర్వే భవన్తు సుఖిన: సర్వే సన్తు నిరామయా:
భారతదేశానికి అర్థం – ప్రజల కు సేవ చేయడం అంటే అది దైవాని కి చేసే సేవ అని.
భారతదేశానికి అర్థం – నర్ కర్ నీ కరే తో నారాయణ్ హో జాయే ; అంటే, మనిషి తన కర్తవ్యాన్ని పాలించడం ద్వారా నారాయణుడు గా మారుతాడు అని.
భారతదేశానికి అర్థం – నారీ తూ నారాయణీ; అంటే, మహిళ లు దేవతల తో సమానం అని.
భారతదేశం అంటే – జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ; ఈ మాటల కు, జనని యొక్కయు, జన్మభూమి యొక్కయు స్థాయి స్వర్గం కంటే మిన్న అయినటువంటిది అని.
భారతదేశం ఆ తరహా అభిప్రాయాలు మరియు ఆదర్శాలు ఎన్నింటితోనో రూపుదాల్చినటువంటి ఒక ప్రాణ శక్తి గా ఉన్నది. భారతదేశం ఆ కోవ కు చెందిన ఒక శక్తి స్రవంతి గా ఉన్నది.
అందువల్ల, మనం భారతదేశం యొక్క ఏకత ను గురించి ఆధిక్యం గురించి మాట్లాడుకొన్నప్పుడల్లా, మనం భౌగోళిక ఆధిక్యం, ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఆధిక్యాన్ని గురించే కాకుండా ఈ యొక్క ఆదర్శాలు మరియు విలువల యొక్క ఆధిక్యాన్ని గురించి కూడా తప్పక ప్రస్తావించాలి.
మిత్రులారా,
భారతదేశం యొక్క ఆధిక్యం ఆ దేశం యొక్క భౌగోళిక వివిధత్వం లో మరియు సామాజిక వైవిధ్యం లో ఇమిడి ఉన్నది. మన దేశం ఒక విధమైన పూల హారం వంటిది; దీని లో రంగు రంగు ల పుష్పాలు భారతీయత అనేటటువంటి దారం తో మాలిక గా అల్లబడినాయి.
మనం ఉన్నది ఏకత్వం కోసం తప్ప ఏకరూపత కోసం కాదు. మనం ఏకత సూత్రాన్ని సజీవం గా, బలం గా ఉంచేందుకు కృషి చేస్తున్నాము. మరి ఇదే ఏకత్వం యొక్క సందేశం గా ఉన్నది.
రాష్ట్రాలు అనేకం కానీ దేశం ఒకటి ; సమాజాలు అనేకం కానీ ఒకే భారతదేశం; పలు మత విశ్వాసాలు ఉన్నప్పటికీ ఒకే లక్ష్యం; మాండలికాలు అనేకం కానీ ఒకే స్వరం; భాషలు అనేకం కానీ ఒకే భావం; వర్ణాలు అనేకం కానీ ఒకే త్రివర్ణ (పతాకం); పలు ఆచారాలు కానీ ఒకే విధమైనటువంటి విలువ లు; విధులు అనేకం కానీ ఒకే సంకల్పం; అనేకమైనటువంటి మార్గాలు కానీ ఒకే గమ్యం; వదనాలు అనేకం కానీ ఒకటే చిరునవ్వు. మనం దేశాన్ని ఈ యొక్క ఏకత మంత్రం తో ముందుకు తీసుకుపోయేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి.
మిత్రులారా,
రాజ్ పథ్ లో మీ యొక్క విన్యాసాల ద్వారా భారతదేశం యొక్క శక్తి ని యావత్తు ప్రపంచం కూడా తిలకిస్తుంది. అది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ కు సైతం ప్రచారాన్ని ప్రాప్తింపచేస్తుంది; అలాగే, భారతదేశం యొక్క పర్యటక రంగాని కి ఊతాన్ని కూడా అందిస్తుంది. ఈ భావన మన యువత ఆదాన ప్రదాన కార్యక్రమం ద్వారా మరింత బలోపేతం అవుతోంది.
మిత్రులారా,
ఈ సంవత్సరం లో ఎన్ సిసి మరియు ఎన్ఎస్ఎస్ ల నుండి వచ్చినటువంటి యువ స్నేహితులు క్రీడల లోనే కాకుండా విపత్తుల వేళల్లో రక్షణ కార్యకలాపాల ను మరియు సహాయక కార్యకలాపాల ను చేపట్టడం లో కూడా ప్రభావశీలమైనటువంటి పాత్ర ను పోషించారని నా దృష్టి కి తీసుకురావడమైంది. ఎన్ఎస్ఎస్ దేశం లో అతి పెద్ద రక్త దాత సంస్థ గా ఉంటున్నది. ఫిట్ ఇండియా అభియాన్ లో భాగం గా జరిగిన సైక్లథన్ లో 8 లక్షల మంది యువత కూడా పాలుపంచుకొంది.
అదే విధం గా, ఎన్ సిసి సైనిక విద్యార్థులు గాంధీజీ యొక్క 150వ జయంతి నాడు దేశవ్యాప్తం గా 8,000 కిలోమీటర్ ల మేర శుభ్రత ప్రయాణాన్ని చేపట్టి, కొనియాడదగినటువంటి ఒక పని ని పూర్తి చేశారు. దీనికి తోడు, ఒక లక్ష కు పైగా ఎన్ సిసి సైనిక విద్యార్థులు బిహార్, కేరళ, కర్నాటక, ఒడిశా మరియు మహారాష్ట్ర లలో వరదలు, ఇంకా ఇతర విపత్తు ల వేళల్లో రక్షణ కార్యకలాపాల లో, సహాయక కార్యకలాపాల లో చేదోడు గా నిలచారు.
దేశం లోని ఈ విధమైనటువంటి కొనియాడదగిన కార్యాలను గురించి పెద్ద గా చర్చ జరుగని కారణం గా ఈ సంఖ్యల ను గురించి మీతో నేను ప్రస్తావిస్తున్నాను. కానీ మీ యొక్క కఠోర శ్రమ, ఇంకా దేశ ప్రజల కోసం మీరు చేసినటువంటి కార్యాలు కూడాను నాకు ఒక పెద్ద ప్రేరణ గా మారింది.
మిత్రులారా,
ఇది మనకు 71వ గణతంత్ర దినం. గడచిన 70 సంవత్సరాలు గా, ఒక గణతంత్ర దేశం గా, మనం ఒక పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ ను యావత్తు ప్రపంచం ఎదుట నిలిపాము.
Iఅటువంటి పరిస్థితి లో, మనం దేశ రాజ్యాంగానికి సంబంధించిన ఒక దృష్టికోణం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఆ దృష్టికోణాన్ని గత ఏడు దశాబ్దాల లో కూలంకషం గా చర్చించలేకపోవడం జరిగింది. మనం పౌరులము గా మన విధుల కు ప్రాముఖ్యాన్ని మరియు ప్రాథమ్యాన్ని ఇచ్చే తీరాలి. మనం గనక మన విధుల ను సక్రమం గా నిర్వర్తించామా అంటే, అటువంటప్పుడు మనం మన హక్కు కోసం పోరాడవలసిన పని ఉండదు.
యువ మిత్రులు అందరు ఇక్కడ కు విచ్చేశారు; దేశ ప్రజల పట్ల మీ యొక్క విధుల ను గురించి సాధ్యపడినంత వరకు మీరు చర్చించుకోండి అని మిమ్ములను నేను కోరుతున్నాను. మరి మీరు కేవలం చర్చలు జరపడమే కాక ఒక ఉదాహరణ ను కూడా అందించండి. ఈ కోవ కు చెందిన ప్రయత్నాలే ఒక న్యూ ఇండియా ను ఆవిష్కరించగలుగుతాయి.
మిత్రులారా,
జాతి పిత గాంధీ మహాత్ముడు ‘నేను కలలు కనే భారతదేశం’ అనే పేరు తో ఒక వ్యాసాన్ని వ్రాశారు. అందులో, ఆయన అత్యున్నతమైన ఆకాంక్ష లు కలిగివుండేటటువంటి ఒక వ్యక్తి భారతదేశాన్ని అభివృద్ధిపరచడం కోసం తనకు అవసరమైన ప్రతిదీ సాధించగలడు అంటూ వ్రాశారు.
ఈ స్వప్నం లో మరియు గాంధీజీ యొక్క భావన లో మీరంతా భాగస్తులు. మనం ఒక న్యూ ఇండియా దిశ గా కదులుతున్న వేళ మనం అదే విధమైన ఆకాంక్షల ను మరియు కలల ను తప్పక నెరవేర్చవలసివుంది. భారతదేశం లోని ఏ ప్రాంతం గాని లేదా ఏ వ్యక్తి గాని నిరాదరణ కు గురి కాకుండా మనం పూచీ పడవలసివుంది. గణతంత్ర దిన ప్రదర్శన వెనుక గల కారణాల లో ఇది కూడా ఒక కారణం.
మిత్రులారా,
దేశ ప్రజల యొక్క సామూహిక సంకల్పాల తో మనమంతా సహసంబంధాన్ని కలిగివుండాలి. దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవనాన్ని సరళతరం గా మలచడం కోసం కలసికట్టు గా ప్రయత్నాలు చేసే తీరాలి. మీలో చాలా మంది కొంత కాలం అయిన తరువాత పరీక్ష లు వ్రాయబోతున్నారు. ఇది మీకు సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి తరుణం.
త్వరలో రాబోయే పరీక్షల లో మీరు చక్కగా రాణించాలి అని నేను మీకు అందరి కి శుభాకాంక్షలు పలుకుతున్నాను. అంతేకాక, గణతంత్ర దిన కవాతు లో మీరు చక్కనైన ప్రదర్శన ను ఇవ్వాలి అని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను.
మీరు నాతో భేటీ అయ్యేందుకు ఇక్కడ కు తరలి వచ్చారు, అందులకు గాను మీకు అనేకానేక ధన్యవాదాలు.
మీకు ఇవే ధన్యవాదాలు.
**
यहां आप जितने भी साथी एकत्र हुए हैं, आप एक प्रकार से Mini India- New India को showcase करने वाले लोग हैं। भारत असल में क्या है, ये हमारा देश और पूरी दुनिया आपके माध्यम से समझती है: PM @narendramodi pic.twitter.com/SAIzXmDvKT
— PMO India (@PMOIndia) January 24, 2020
NCC और NSS के माध्यम से अनुशासन और सेवा की एक समृद्ध परंपरा जब राजपथ पर दिखती है, तो देश के करोड़ों युवा प्रेरित और प्रोत्साहित होते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
जब हम एक भारत, श्रेष्ठ भारत की बात करते हैं, तो हमें ये भी याद रखना है कि भारत असल में है क्या। भारत क्या सिर्फ सरहदों के भीतर 130 करोड़ लोगों का घर भर ही है? नहीं, भारत एक राष्ट्र के साथ-साथ एक जीवंत परंपरा है, एक विचार है, एक संस्कार है, एक विस्तार है: PM @narendramodi pic.twitter.com/bEZeiIZrsH
— PMO India (@PMOIndia) January 24, 2020
भारत की श्रेष्ठता की एक और शक्ति इसकी भौगोलिक और सामाजिक विविधता में ही है। हमारा ये देश एक प्रकार से फूलों की माला है, जहां रंग-बिरंगे फूल भारतीयता के धागे से पिरोए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
राजपथ पर आपके प्रदर्शन से पूरी दुनिया भारत की इस शक्ति के भी दर्शन करती है। इसका असर भारत की ‘सॉफ्ट पावर’ के प्रचार-प्रसार में भी होता है और भारत के टूरिज्म सेक्टर को भी इससे मजबूती मिलती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
यहां जितने भी युवा साथी आए हैं, मेरा आपसे आग्रह रहेगा कि राष्ट्र के प्रति अपने कर्तव्यों की ज्यादा से ज्यादा चर्चा करें। चर्चा ही नहीं, बल्कि खुद अमल करके, उदाहरण पेश करें। हमारे ऐसे ही प्रयास न्यू इंडिया का निर्माण करेंगे: PM @narendramodi pic.twitter.com/rvxAfggq1W
— PMO India (@PMOIndia) January 24, 2020
हम जिस न्यू इंडिया की तरफ आगे बढ़ रहे हैं, वहां यही आकांक्षाएं, यही सपने हमें पूरे करने हैं। भारत का कोई भी व्यक्ति, कोई भी क्षेत्र पीछे ना रह जाए, ये हमें सुनिश्चित करना है। गणतंत्र दिवस की परेड के पीछे भी यही ध्येय है: PM @narendramodi pic.twitter.com/lmzBmOJoVT
— PMO India (@PMOIndia) January 24, 2020