ప్రజలు అందరికీ డిజిటల్ సేవల లభ్యం అయ్యేటట్లు చూడడం మరియు సంధానాన్ని సమకూర్చడం అనేవి ప్రభుత్వం యొక్క ‘అంత్యోదయ’ దృష్టికోణం లో ఒక అంతర్భాగం గా ఉన్నాయి. అయిదు రాష్ట్రాల లో 44 ఆకాంక్షభరిత జిల్లాల లో 7,287 గ్రామాల కు- ఏయే గ్రామాలైతే 4జి మొబైల్ సర్వీసుల కు నోచుకోలేదో – అటువంటి గ్రామాల కు ఆ యొక్క సేవల ను అందించడం కోసం ఉద్దేశించిన ఒక ప్రాజెక్టు కు ప్రభుత్వం కిందటి సంవత్సరం లో ఆమోదాన్ని తెలిపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021వ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం నాడు ఇచ్చిన ప్రసంగం లో, ప్రభుత్వ పథకాలు దేశం లో అందరికీ చేరాలి అంటూ పిలుపును ఇచ్చారు. దేశవ్యాప్తం గా 4జి మొబైల్ సర్వీసులు ఇప్పటికీ చేరని అటువంటి గ్రామాల కు ఆ తరహా సేవల ను అందించడానికని మొత్తం 26,316 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే ఒక ప్రాజెక్టు ను కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న ఆమోదించింది.
ఈ ప్రాజెక్టు సుదూర ప్రాంతాల లో మరియు దుర్గమ ప్రాంతాల లో 24,680 గ్రామాల కు 4జి మొబైల్ సర్వీసుల ను- వేటికయితే ఆ ప్రాంతాలు ఇంత వరకు నోచుకోలేదో- అందుబాటు లోకి తీసుకు రానుంది. పునరావాసం, సరికొత్త ఆవాసాలు, ప్రస్తుత ఆపరేటర్ లు అందిస్తున్న సేవల ఉపసంహరణ అనే కారణాల తో 20 శాతం గ్రామాల ను అదనం గా చేర్చుకొనేందుకు ఈ ప్రాజెక్టు లో వీలు ఉంది. దీనికి అదనం గా, కేవలం 2జి/3జి సంధాన సదుపాయాన్ని కలిగివున్నటువంటి 6,279 గ్రామాల ను 4జి కనెక్టివిటీ కి ఉన్నతీకరించడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు నుఆత్మనిర్భర్ భారత్ యొక్క 4జి టెక్నాలజీ స్టాక్ ను వినియోగించుకొంటూ బిఎస్ఎన్ఎల్ అమలుపరుస్తుంది. మరి దీనికి అయ్యే డబ్బు ను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేశన్ ఫండ్ నుంచి వెచ్చించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కు అయ్యే 26,316 కోట్ల రూపాయల వ్యయం లో మూలధనం రూపేణా చేసే ఖర్చు తో పాటు గా 5 సంవత్సరాల పాటు కార్యకలాపాల నిర్వహణ సంబంధిత వ్యయం కూడా కలిసి ఉంటుంది.
బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ తాలూకు 4జి టెక్నాలజీ స్టాక్ ను రంగం లో మోహరించే ప్రక్రియ లో తలమునకలు గా ఉంది; ఈ 4జి టెక్నాలజీ స్టాక్ నే ఈ ప్రాజెక్టు లో కూడాను మోహరించడం జరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల లో మొబైల్ కనెక్టివిటీ ని సమకూర్చాలి అనే ప్రభుత్వ దార్శనికత బాట లో ఈ ప్రాజెక్టు ఒక మహత్వపూర్ణమైనటువంటి అడుగు గా ఉంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు, ఇ-గవర్నెన్స్ సర్వీసులు, టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేశన్ మొదలైన సేవల ను అందజేయడం తో పాటు ఉపాధి అవకాశాల ను సృష్టించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
***
Connectivity brings opportunities, progress and prosperity. Today’s Cabinet decision on enhancing connectivity in uncovered villages is going to transform lives of people in these areas and ensure better service delivery as well. https://t.co/zqVEI9ybFf
— Narendra Modi (@narendramodi) July 27, 2022