2025 ఖరీఫ్ సీజన్లో (01.04.25-30.09.25) ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్లను అందించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2025 ఖరీఫ్ సీజన్ కి సుమారు రూ. 37,216.15 కోట్ల బడ్జెట్ కేటాయింపులు అవసరం అవుతాయి. ఇది 2024-25 రబీ సీజన్ కేటాయింపులకంటే సుమారు రూ. 13,000 కోట్లు అధికం.
ప్రయోజనాలు:
· రైతులకు సబ్సిడీతో, సహేతుకమైన ధరల్లో చౌకగా ఎరువులు అందుబాటులో ఉంటాయి.
· అంతర్జాతీయ ఎరువుల, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరల సరళిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మార్పులను బట్టి పీ అండ్ కే ఎరువుల పై సబ్సిడీ హేతుబద్ధీకరణ.
అమలు వ్యూహం, లక్ష్యాలు :
ఎన్పీకేఎస్ గ్రేడ్లు సహా పీ అండ్ కే ఎరువుల పై సబ్సిడీని 2025 ఖరీఫ్ సీజన్(01.04.25 -30.09.25)కు ఆమోదించిన రేట్ల ఆధారంగా అందిస్తారు. తద్వారా రైతులకు ఈ ఎరువులు సులభంగా అందుబాటు ధరల్లో లభిస్తాయి.
నేపథ్యం:
ఎరువుల తయారీదార్లు, దిగుమతిదార్ల ద్వారా ప్రభుత్వం 28 గ్రేడ్ల పీ అండ్ కే ఎరువులను, రైతులకు సబ్సిడీ ధరల్లో అందిస్తోంది. ఎన్బీఎస్ పథకం ద్వారా అందించే పీ అండ్ కే ఎరువుల సబ్సిడీ 01.04.25 నుంచి అమలవుతుంది. రైతు అనుకూల విధానంలో భాగంగా పీ అండ్ కే ఎరువులును రైతులకు అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ, సల్ఫర్ వంటి ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల దృష్ట్యా, 01.04.25 నుంచీ 30.09.25 వరకూ కొనసాగే 2025 ఖరీఫ్ సీజన్ లో ఎన్పీకేఎస్ గ్రేడ్లు సహా ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులను ఎన్బీఎస్ రేట్లకు అందించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు లభ్యతను నిర్ధారించేందుకు, ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు ఆమోదించిన, నోటిఫై చేసిన ధరలకు సబ్సిడీని అందిస్తుంది.
देशभर के किसान भाई-बहनों के हित में आज हमारी सरकार ने खरीफ सीजन-2025 के लिए फॉस्फेटिक और पोटाशिक फर्टिलाइजर पर पोषक तत्व आधारित सब्सिडी को मंजूरी दी है। इससे ना सिर्फ अन्नदाताओं को सस्ती दरों पर उर्वरक उपलब्ध होंगे, बल्कि खाद्य सुरक्षा भी सुनिश्चित होगी।https://t.co/7r1Bg8bxis
— Narendra Modi (@narendramodi) March 28, 2025