నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి ‘మన్ కీ బాత్’. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.
మిత్రులారా!ప్రతి ఏడాది జనవరి 25వ తేదీ కోసం వేచి చూస్తానని డెహ్రాడూన్‌కు చెందిన వత్సల్ గారు రాశారు. ఆ రోజు పద్మ అవార్డుల ప్రకటన రావడంతో పాటు 25వ తేదీ సాయంత్రమే జనవరి 26వ తేదీ ఉత్సవాల కోసం తన ఉత్సాహాన్ని పెంచుతుందని వత్సల్ తన అభిప్రాయం తెలిపారు. అట్టడుగు స్థాయిలో తమ అంకితభావం, సేవాభావంతో విజయం సాధించిన వారికి పీపుల్స్ పద్మ అవార్డుల ప్రదానంపై పలువురు తమ భావాలను పంచుకున్నారు. ఆదివాసీ సమాజంతోనూ ఆదివాసీ జీవితాల తోనూ ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈసారి పద్మ అవార్డుల్లో మంచి ప్రాతినిధ్యం లభించింది. ఆదివాసీల జీవితం నగరాల సందడికి విభిన్నంగా ఉంటుంది. వారి సవాళ్లు కూడా వేరు. అయినప్పటికీ ఆదివాసీ సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయిఆదివాసీ సముదాయాలకు సంబంధించిన విషయాలను పరిరక్షించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదేవిధంగాటోటో, హో, కుయి, కువి, మాండ మొదలైన ఆదివాసీ భాషలపై కృషి చేసిన ఎందరో మహానుభావులు పద్మ అవార్డులు అందుకున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. ధనిరామ్ టోటోగారు, జనుమ్ సింగ్ సోయ్గారు, బి. రామకృష్ణారెడ్డిగారు- ఈ పేర్లు ఇప్పుడు దేశం మొత్తం సుపరిచితమయ్యాయి. సిద్ధి, జారవా, ఒంగే వంటి ఆదివాసీ సమాజాలతో కలిసి పనిచేస్తున్న వారిని కూడా ఈసారి సత్కరించారు. వారిలో హీరాబాయి లోబీ గారు, రతన్ చంద్ర కార్ గారు, ఈశ్వర్ చంద్ర వర్మగారు ఉన్నారు. గిరిజన సమాజాలు మన భూమి, మన వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయి. దేశాభివృద్ధి, సమాజ అభివృద్ధిలో వారి సహకారం చాలా ముఖ్యమైంది. తమ కోసం పనిచేసిన వ్యక్తులను సన్మానించడం కొత్త తరానికి కూడా స్ఫూర్తినిస్తుంది.నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దారితప్పిన యువకులకు సరైన మార్గాన్ని చూపిన వారి కృషికి కూడా పద్మ అవార్డులు లభించాయి. ఇందుకు గాను కంకేర్‌లో శిల్పాలను చెక్కిన అజయ్ కుమార్ మాండవి గారు, గడ్చిరోలిలోని ప్రసిద్ధ ఝడిపట్టి రంగభూమికి సంబంధించిన పరశురామ్ కోమాజీ ఖుణే కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలో తమ సంస్కృతి పరిరక్షణలో పాలుపంచుకుంటున్న రామ్‌కుయి వాంగ్‌బే నియుమే, బిక్రమ్ బహదూర్ జమాతియా, కర్మ వాంగ్చులను కూడా సత్కరించారు.
మిత్రులారా!ఈసారి పద్మ అవార్డులతో సత్కరించిన వారిలో సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు! సంగీతంలో ప్రతి ఒక్కరి ఇష్టాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సంగీతం ఒక భాగం. ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో మన సంప్రదాయ సంగీత వాయిద్యాలైన సంతూర్, బంహుం, ద్వితారా వంటి వాటి మాధుర్యాన్ని వ్యాప్తి చేయడంలో నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు.గులామ్ మహ్మద్ జాజ్, మోవా సు-పోంగ్, రి-సింగ్‌బోర్ కుర్కా-లాంగ్, ముని-వెంకటప్ప, మంగళ్ కాంతి రాయ్ వంటి వారి పేర్లు నలుదిశలా చర్చనీయాంశాలయ్యాయి.
మిత్రులారా!చాలా మంది పద్మ అవార్డు గ్రహీతలు మన మధ్య ఉన్న స్నేహితులు. వారు ఎల్లప్పుడూ దేశాన్ని సర్వోత్తమంగా ఉంచారు. దేశానికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాలను అంకితం చేశారు. వారుసేవాభావంతో తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతిఫలం ఆశించలేదు. తమ పనికి లక్ష్యంగా ఉన్నవారి ముఖాల్లో సంతృప్తి వారికి అతిపెద్ద అవార్డు.అటువంటి అంకితభావం ఉన్న వ్యక్తులను సత్కరించడం ద్వారా మన దేశ ప్రజల గౌరవం పెరిగింది. నేను ఇక్కడ పద్మ అవార్డు గ్రహీతలందరి పేర్లను చెప్పలేకపోవచ్చు. అయితే ఈ పద్మ అవార్డు గ్రహీతల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాల గురించి వివరంగా తెలుసుకోవాలని, ఇతరులకు కూడా తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి చర్చిస్తున్నప్పుడునేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ప్రస్తావిస్తాను. కొన్ని వారాల క్రితం నాకు లభించిన ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ పుస్తకం పేరు ‘ఇండియా- ద మదర్ ఆఫ్ డెమొక్రసీ’. ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా భావించడం భారతీయులమైన మనం గర్వించే విషయం. ప్రజాస్వామ్యం మన నరనరాల్లో ఉంది. మన సంస్కృతిలో ఉంది. శతాబ్దాలుగా మన కార్యకలాపాల్లో అంతర్భాగంగా ఉంది. స్వభావరీత్యా మనది ప్రజాస్వామిక సమాజం. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ భిక్షువుల సంఘాన్ని భారత పార్లమెంటుతో పోల్చారు. ప్రతిపాదనలు, నిర్ణయాలు, సమావేశ నిర్వహణకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య, ఓటింగ్, ఓట్ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థగా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థల నుండి ప్రేరణ పొందాడని బాబాసాహెబ్ అభిప్రాయం.
చిన్నదైనా ప్రసిద్ధి చెందిన ఉతిర్మేరూర్ అనే ఒక ఊరు తమిళనాడులోఉంది. అక్కడ 1100-1200 సంవత్సరాల క్రితం నాటి శాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ శాసనం మినీ రాజ్యాంగం లాంటిది. గ్రామసభను ఎలా నిర్వహించాలి, సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణ 12వ శతాబ్దపు బసవేశ్వర స్వామి అనుభవ మండపం. ఇక్కడ స్వేచ్చాయుత వాదోపవాదాలను, చర్చలను ప్రోత్సహించారు. ఇది మాగ్నా కార్టా కంటే పూర్వమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరంగల్‌లోని కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి ఉద్యమం పశ్చిమ భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచింది.సిక్కు మతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఒక వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో చేర్చారు. గురునానక్ దేవ్ జీ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. మధ్య భారతదేశంలోని ఒరాన్, ముండా తెగలలో సమాజ నిర్వహణపై, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ పుస్తకంలో చక్కటి సమాచారం ఉంది.శతాబ్దాలుగా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలా ప్రవహిస్తోందో ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొనే భారతదేశ వాసులుగా మనం నిరంతరం ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి. చర్చించాలి. ప్రపంచానికి తెలియజేయాలి. ఇది దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!యోగా దినోత్సవానికి, వివిధ రకాల చిరు ముతక ధాన్యాలకు మధ్య పోలిక ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే, ఈ పోలిక ఏమిటి అని మీరు ఆలోచిస్తారు? ఈ రెండింటికీ చాలా పోలికలు ఉన్నాయని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి… భారతదేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటినీఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.రెండవది- యోగా ఆరోగ్యానికి సంబంధించింది. చిరుధాన్యాలు కూడా ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక మూడో విషయం ఏమిటంటే – రెండు ప్రచారాలలో ప్రజల భాగస్వామ్యం కారణంగా విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొనడం ద్వారా యోగా, ఫిట్‌నెస్‌లను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టే పెద్ద ఎత్తున చిరుధాన్యాలను కూడా దైనందిన జీవితంలో చేర్చుకుంటున్నారు.ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ మార్పు ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఒకవైపు సంప్రదాయబద్ధంగా చిరుధాన్యాలనుపండించే చిన్నకారు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు రైతు ఉత్పత్తి సంఘాలతో పాటు పారిశ్రామికవేత్తలు చిరుధాన్యాలను మార్కెట్ చేయడానికి, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన కె.వి. రామ సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల విషయంలో కృషి చేసేందుకు మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అమ్మ చేతితో చేసిన చిరుధాన్యాల రుచి చూసి ఆయన తన గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు వాటిని సులభంగా అందుబాటులో ఉంచుతారు. మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని కెనాడ్ గ్రామానికి చెందిన షర్మిలా ఓస్వాల్ గత 20 ఏళ్లుగా చిరుధాన్యాల ఉత్పత్తిలో తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. ఆమె రైతులకు నేర్పుగా వ్యవసాయం చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె కృషి వల్ల చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ని సందర్శించే అవకాశం మీకు లభిస్తేమీరు అక్కడి మిల్లెట్స్ కేఫ్‌ను తప్పక సందర్శించాలి. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ మిల్లెట్స్ కేఫ్‌లో చీలా, దోశ, మోమోస్, పిజ్జా, మంచూరియా వంటివి బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి.
నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగవచ్చా? మీరు ఎంటర్ ప్రెన్యూర్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ మీరు Milletpreneursఅనే పదం విన్నారా? ఈ రోజుల్లో ఒడిశాకు చెందిన మిల్లెట్‌ప్రెన్యూర్లు వెలుగులోకి వస్తున్నారు. ఆదివాసీ జిల్లా సుందర్‌గఢ్ కు చెందిన సుమారు 1500 మంది మహిళల స్వయం సహాయక బృందానికి ఒడిశా మిల్లెట్స్ మిషన్‌తో అనుబంధం ఉంది.ఇక్కడ మహిళలు చిరుధాన్యాల నుండి కుకీలు, రసగుల్లా, గులాబ్ జామూన్, కేక్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో వీరికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా మహిళల ఆదాయం కూడా పెరుగుతోంది.
కర్నాటకలోని కలబుర్గిలో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ పర్యవేక్షణలో అలంద్ భూతాయి మిల్లెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గత సంవత్సరం పని ప్రారంభించింది. ఇక్కడి ఖాక్రా, బిస్కెట్లు, లడ్డూలను ప్రజలు ఇష్టపడుతున్నారు. కర్నాటకలోని బీదర్ జిల్లాలో హుల్సూర్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన మహిళలు చిరుధాన్యాలను పండించడంతోపాటు వాటి పిండిని కూడా తయారు చేసుకుంటున్నారు.దీంతో వారి సంపాదన కూడా బాగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సందీప్ శర్మ గారికి ప్రాకృతిక వ్యవసాయంతో అనుబంధం ఉంది. ఆయనకు చెందిన రైతు ఉత్పత్తి సంస్థలో 12 రాష్ట్రాలకు చెందిన రైతులు చేరారు. బిలాస్‌పూర్‌కి చెందిన ఈ ఎఫ్‌పిఓ 8 రకాల చిరుధాన్యాల పిండిని, వాటితో వంటలను తయారు చేస్తోంది.
మిత్రులారా! ఈ రోజు జి-20 శిఖరాగ్ర సమావేశాలు భారతదేశంలోని ప్రతి మూలలో నిరంతరం జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి మూలలో జి-20శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగినా చిరుధాన్యాలతో చేసిన పుష్టికరమైన, రుచికరమైన వంటకాలు చేరుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.మార్కెట్‌లో తయారు చేసిన ఖిచ్డీ, పోహా, ఖీర్, రోటీ, రాగులతో చేసిన పాయసం, పూరీ , దోస వంటి వంటకాలు కూడా ఈ సమావేశాలు జరిగేచోట లభిస్తున్నాయి. ఆరోగ్య పానీయాలు, తృణధాన్యాలు,చిరుధాన్యాలతో తయారు చేసిన నూడుల్స్ అన్ని జి20 వేదికలలోని చిరుధాన్యాల ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లు కూడా వీటి ప్రజాదరణను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.దేశం చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచంలో చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ మన చిన్న రైతులకు బలం చేకూర్చబోతున్నాయని మీరు ఊహించవచ్చు. ఈ రోజు చిరుధాన్యాలతో తయారు చేయడం ప్రారంభించిన వివిధ రకాల కొత్త తినుబండారాలను యువతరం ఇష్టపడటం కూడా నాకు ఆనందంగా ఉంది.అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని ఇంత అద్భుతంగా ప్రారంభించినందుకు, దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నందుకు ‘మన్ కీ బాత్’ శ్రోతలను కూడా నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎవరైనా టూరిస్ట్ హబ్ గోవా గురించి మాట్లాడితే మీ మనసులో ఏం గుర్తొస్తుంది? గోవా పేరు వినగానే ముందుగా అందమైన తీరప్రాంతం, బీచులు, ఇష్టమైన ఆహార పదార్థాలు గుర్తుకు రావడం సహజం. అయితే ఈ నెలలో గోవాలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు ‘మన్ కీ బాత్’లో నేను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.గోవాలో జరిగిన ఈ కార్యక్రమం పర్పుల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పనాజీలో జరిగింది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇదొక ప్రత్యేక ప్రయత్నం. పర్పుల్ ఫెస్ట్ ఎంత గొప్ప సందర్భమనే విషయాన్ని అందులో 50 వేల మందికి పైగా సోదర సోదరీమణులు పాల్గొన్నారనే వాస్తవాన్ని బట్టి మీరందరూ ఊహించవచ్చు.ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇప్పుడు ‘మీరామార్ బీచ్’లో తిరగడాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలిగినందుకు పులకించిపోయారు. నిజానికి ‘మీరామార్ బీచ్’ దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు గోవాలో అందుబాటులో ఉండే బీచ్‌లలో ఒకటిగా మారింది. క్రికెట్ టోర్నమెంట్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, మారథాన్ పోటీలతో పాటుబధిర-అంధుల సమ్మేళనం కూడా ఇక్కడ జరిగింది. ప్రత్యేకమైన బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్‌తో పాటుఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దివ్యాంగ సోదర సోదరీమణులు, పిల్లలు పూర్తిస్థాయిలో ఆనందించేలా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. దేశంలోని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా ఉండడం పర్పుల్ ఫెస్ట్ లోని ఒక ప్రత్యేక విషయం. దివ్యాంగులు ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులను ప్రదర్శించారు. దివ్యాంగుల సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.పర్పుల్ ఫెస్ట్‌ని విజయవంతం చేసినందుకుఅందులో పాల్గొన్నవారందరికీ నా అభినందనలు. దీన్ని నిర్వహిచేందుకు పగలూ రాత్రీ ఏకం చేసిన వాలంటీర్లను కూడా నేను అభినందిస్తున్నాను. యాక్సెసబుల్ ఇండియా దృక్కోణాన్ని సాకారం చేయడంలో ఇటువంటి ప్రచారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!మీకు ఆనందం, గర్వం కలిగించడంతో పాటు మనసుకు సంతోషం కలిగించే విషయంపై ఇప్పుడు ‘మన్ కీ బాత్’లోనేను మాట్లాడతాను. దాంతో మీ హృదయం ఆనందభరితం అవుతుంది. దేశంలోని పురాతన వైజ్ఞానిక సంస్థల్లో ఒకటైన బెంగుళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISc-అద్భుతమైన ఉదాహరణను అందిస్తోంది.ఈ సంస్థ స్థాపన వెనుకఇద్దరు గొప్ప వ్యక్తులు- జంషెడ్జీ టాటా, స్వామి వివేకానందల ప్రేరణను ‘మన్ కీ బాత్’లోనేను ఇంతకుముందు చర్చించాను. గత ఏడాది 2022లో ఈ సంస్థ పేరు మీద మొత్తం 145 పేటెంట్‌లు ఉండడం మీకు, నాకు ఆనందం, గర్వం కలిగించే విషయం. అంటే దీని అర్థం – ప్రతి ఐదు రోజులకు రెండు పేటెంట్లు. ఈ రికార్డు అద్భుతమైంది.ఈ విజయం సాధించిన IISc బృందాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. మిత్రులారా!ఈరోజు భారతదేశం ర్యాంకింగ్ పేటెంట్ ఫైలింగ్‌లో 7వ స్థానంలో, ట్రేడ్‌మార్క్‌లలో 5వ స్థానంలో ఉంది. పేటెంట్ల గురించి మాత్రమే మాట్లాడితేగత ఐదేళ్లలో సుమారు 50 శాతం పెరుగుదల ఉంది.గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కూడాభారతదేశం ర్యాంకింగ్ అద్భుతంగా మెరుగుపడింది. ఇప్పుడు అది 40వ స్థానానికి చేరుకుంది. 2015 లోగ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.భారతదేశంలో గత 11 సంవత్సరాలలో మొదటిసారిగాదేశీయ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ కంటే ఎక్కువగా కనిపించింది. ఇది భారతదేశంలో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.
మిత్రులారా! 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విజ్ఞానం అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. మన ఆవిష్కర్తలు, వారి పేటెంట్ల బలంతో భారతదేశం టెకేడ్ కల ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. దీంతోమనందరం ప్రపంచ స్థాయి సాంకేతికతను, మన దేశంలో తయారైన ఉత్పత్తుల నుండి పూర్తిగా లాభం పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! తెలంగాణకు చెందిన ఇంజనీరు విజయ్ గారి పోస్టునునేను నమో యాప్ లో చూశాను. ఇందులో విజయ్ గారు ఈ-వేస్ట్ గురించి రాశారు. దీని గురించి ‘మన్ కీ బాత్’లో చర్చించమని విజయ్ గారు అభ్యర్థించారు. ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమంలో ‘వేస్ట్ టు వెల్త్’ అంటే ‘చెత్త నుండి బంగారం’ గురించి మాట్లాడుకున్నాం. రండి- ఈ రోజుదీనికి సంబంధించిన ఈ-వేస్ట్ గురించి చర్చిద్దాం.
మిత్రులారా!ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలు సర్వసాధారణమైపోయాయి. దేశవ్యాప్తంగా వారి సంఖ్య బిలియన్లలో ఉంటుంది. నేటి ఆధునిక ఉపకరణాలు కూడా భవిష్యత్తులో ఇ-వేస్ట్‌గా మారుతాయి. ఎవరైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పాత పరికరాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని సరైన రీతిలో విసర్జించామా లేదా అనేది గుర్తుంచుకోవడం అవసరం. ఇ-వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతేఅది మన పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది.కానీజాగ్రత్తగా చేస్తే పునరుపయోగం- రీసైకిల్, రీయూజ్ -వర్తుల ఆర్థిక వ్యవస్థలో గొప్ప శక్తిగా మారుతుంది. ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను పారేస్తున్నామని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ వ్యర్థాల పరిమాణం ఎంత ఉంటుందో ఊహించగలరా? మానవజాతి చరిత్రలో నిర్మించిన అన్ని వాణిజ్య విమానాల బరువును కలిపినా, విడుదలవుతున్న ఈ-వ్యర్థాల పరిమాణానికి సమానం కాదు. ప్రతి సెకనుకు 800 ల్యాప్‌టాప్‌లను వదిలివేయడం జరుగుతోంది. ఈ-వ్యర్థాల నుండి వివిధ ప్రక్రియల ద్వారా సుమారు 17 రకాల విలువైన లోహాలు వెలికితీయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో బంగారం, వెండి, రాగి, నికెల్ ఉన్నాయి. కాబట్టి ఈ-వ్యర్థాలను ఉపయోగించడం చెత్త నుండి బంగారం’ కంటే తక్కువేమీ కాదు.నేడు ఈ దిశగా వినూత్నమైన పనులు చేస్తున్న స్టార్టప్‌లకు కొదవలేదు. దాదాపు 500 ఈ-వేస్ట్ రీసైక్లర్లు ఈ రంగానికి అనుబంధంగా ఉన్నారు. అనేక మంది కొత్త వ్యవస్థాపకులు కూడా దీనితో అనుసంధానమయ్యారు. ఈ రంగం వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కూడా కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఈ-పరిసర అటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుండి విలువైన లోహాలను వేరు చేయడానికి ఇది స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అదేవిధంగాముంబాయిలో పనిచేస్తున్న ఇకోరీకో- మొబైల్ యాప్ ద్వారా ఈ-వ్యర్థాలను సేకరించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన అటెరో రీసైక్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అనేక పేటెంట్లను పొందింది. ఇది తన సొంత ఇ-వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీని సిద్ధం చేయడం ద్వారా చాలా పేరు సంపాదించింది.భోపాల్‌లో మొబైల్ యాప్, వెబ్‌సైట్ ‘కబాడీవాలా’ ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతున్నాయి. అయితేఅటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన షరతు కూడా ఉంది. అది E-వేస్ట్‌ను పారవేసే సురక్షితమైన ఉపయోగకరమైన పద్ధతుల గురించి ప్రజలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఏటా 15-17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ఈ-వేస్ట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా!నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు , జీవవైవిధ్య పరిరక్షణ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ దిశలో భారతదేశం చేస్తున్న నిర్దిష్ట ప్రయత్నాల గురించి మనం నిరంతరం మాట్లాడుతున్నాం. భారతదేశం చిత్తడి నేలల కోసం చేసిన కృషిని తెలుసుకుంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు. చిత్తడి నేలలు అంటే ఏమిటని కొంతమంది శ్రోతలు ఆలోచిస్తుండవచ్చు. చిత్తడి నేలలు భూమిలో ఏడాది పొడవునా నీరు పేరుకుపోయే ప్రదేశాలు. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మన భూమి ఉనికికి చిత్తడి నేలలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అనేక పక్షులు, జంతువులు వాటిపై ఆధారపడి ఉంటాయి.జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఈ నేలలు వరద నియంత్రణకు, భూగర్భ జలాల రీఛార్జ్‌కు కూడా ఉపయోగపడతాయి. రామ్‌సర్ సైట్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రాంతమని మీలో చాలా మందికి తెలిసి ఉండాలి. చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నా అవి అనేక ప్రమాణాలను నెరవేర్చినప్పుడు మాత్రమే వాటిని రామ్‌సర్ సైట్‌లుగా ప్రకటిస్తారు.రామ్‌సర్ సైట్‌లలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ నీటి పక్షులు ఉండాలి. స్థానిక చేప జాతులు పెద్ద సంఖ్యలో ఉండటం ముఖ్యం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యవేడుకల అమృత మహోత్సవాల సందర్భంగా రామ్‌సర్ సైట్‌లకు సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో మొత్తం రామ్‌సర్ సైట్‌ల సంఖ్య 75కి పెరిగింది. 2014 కి ముందు దేశంలో 26 రామ్‌సర్ సైట్‌లు మాత్రమే ఉండేవి. ఇందుకుగానుఈ జీవవైవిధ్యాన్ని కాపాడిన స్థానిక సమాజం అభినందనలకు పాత్రమైంది.ఇది మన ప్రాచీన సంస్కృతికి, ప్రకృతికి అనుగుణంగా జీవించే సంప్రదాయానికి కూడా గౌరవమే. భారతదేశంలోని ఈ చిత్తడి నేలలు మన సహజ సామర్థ్యానికి ఉదాహరణ. ఒడిశాలోని చిల్కా సరస్సు 40 కంటే ఎక్కువ నీటి పక్షుల జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది. కైబుల్-లమ్జా, లోక్‌టాక్ చిత్తడి జింకలకు ఒకవిధంగా సహజ నివాసంగా పరిగణిస్తారు.తమిళనాడులోని వేడంథాంగల్‌ను 2022లో రామ్‌సర్‌గా ప్రకటించారు. ఇక్కడ పక్షి జనాభాను సంరక్షించిన ఘనత మొత్తం సమీపంలోని రైతులకే చెందుతుంది. కాశ్మీర్‌లోని పంజాథ నాగ్ సమాజం వార్షిక ఫల వికాస ఉత్సవం సందర్భంగా ఒక రోజు ప్రత్యేకంగా గ్రామంలోని నీటి వనరులను శుభ్రపరుస్తుంది. ప్రపంచంలోని చాలా రామ్‌సర్ సైట్‌లకు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది.మణిపూర్ కు చెందిన లోక్‌టాక్, పవిత్ర సరస్సు రేణుకతో అక్కడి సంస్కృతికి గాఢమైన సంబంధం ఉంది. అదేవిధంగాసాంభార్ కూడా దుర్గామాత అవతారమైన శాకంభరి దేవికి సంబంధించింది. భారతదేశంలోని ఈ చిత్తడి నేలల విస్తరణ రామ్‌సర్ సైట్‌ల చుట్టూ నివసించే ప్రజల వల్ల సాధ్యమైంది. అలాంటి వారందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. ‘మన్ కీ బాత్’ శ్రోతల తరపునవారికి శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి మన దేశంలో- ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో – తీవ్రమైన చలికాలం ఉంది. ఈ చలికాలంలోపర్వతాల మీద మంచు కురుస్తుంది. అలాంటి కొన్ని చిత్రాలు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాయి. అవి యావత్ దేశ హృదయాలను దోచుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో ఇష్టపడుతున్నారు.హిమపాతం కారణంగామన కాశ్మీర్ లోయ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా అందంగా మారింది. బనిహాల్ నుండి బడ్గామ్ వరకు రైలు వెళ్తున్న వీడియోను కూడా ప్రజలు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. అందమైన హిమపాతం. నలువైపులా తెల్లటి దుప్పటి లాంటి మంచు. ఈ దృశ్యం అద్భుత కథలా ఉందని అంటున్నారు జనం. ఇవి ఏదో ఒక విదేశానికి చెందిన చిత్రాలు కావని, మన దేశంలోనే కాశ్మీర్‌కు సంబంధించినవని చాలామంది అంటున్నారు.
‘స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?’అని సామాజిక మాధ్యమంలో ఒకరు రాశారు. ఇది ఖచ్చితంగా సరైంది. అందుకే కాశ్మీర్‌ను భూతల స్వర్గమని పిలుస్తారు. ఈ చిత్రాలను చూస్తుంటే మీకు కూడా కాశ్మీర్ పర్యటనకు వెళ్లాలని అనిపిస్తుంది. మీరు స్వయంగా వెళ్ళాలని, మీ సహచరులను కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలతో పాటుచూడవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకుకశ్మీర్‌లోని సయ్యదాబాద్‌లో శీతాకాల క్రీడోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల అంశం మంచు క్రికెట్! స్నో క్రికెట్ మరింత ఉత్తేజకరమైన క్రీడ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ భావన పూర్తిగా వాస్తవం. కాశ్మీరీ యువత మంచు మధ్య క్రికెట్‌ను మరింత అద్భుతంగా ఆడుతుంది. భారత క్రికెట్ బృందంలో ఆడే యువ క్రీడాకారుల కోసం కాశ్మీర్‌లో అన్వేషణ కూడా జరుగుతోంది. ఇది కూడా ఒక విధంగా ఖేలో ఇండియా ఉద్యమానికి పొడిగింపు. కాశ్మీర్‌లో క్రీడల పట్ల యువతలో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే కాలంలో ఇలాంటి యువకులు ఎందరో దేశానికి పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.మీరు వచ్చేసారి కాశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసినప్పుడుఇలాంటి ఉత్సవాలను సందర్శించడానికి సమయం కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ఈ అనుభవాలు మీ యాత్రను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కరి కృషితో, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారాగణతంత్రం పటిష్టంగా తయారవుతుంది. అలాంటి కర్తవ్య నిష్ఠా సేనానుల గంభీర స్వరమే మన ‘మన్ కీ బాత్’ కావడం నాకు సంతోషాన్నిస్తోంది. అలాంటి కర్తవ్య నిష్ఠా పరాయణత్వం ఉన్న వ్యక్తుల ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథలతో వచ్చేసారి మళ్ళీ కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు…
*****
Sharing the first #MannKiBaat of 2023. Do tune in! https://t.co/Bhoc7DDTsT
— Narendra Modi (@narendramodi) January 29, 2023
People from across the country have shared their thoughts with PM @narendramodi about Republic Day celebrations held at Kartavya Path. #MannKiBaat pic.twitter.com/k6gwaLgaqg
— PMO India (@PMOIndia) January 29, 2023
Request everyone to know in detail about the inspirational life of the Padma awardees and share with others as well: PM @narendramodi during #MannKiBaat pic.twitter.com/6LOtr0QbBi
— PMO India (@PMOIndia) January 29, 2023
India is the Mother of Democracy. #MannKiBaat pic.twitter.com/S0hGQAOT7i
— PMO India (@PMOIndia) January 29, 2023
Just as people have made yoga and fitness a part of their lives, they are increasingly making millets a part of their diet. #MannKiBaat pic.twitter.com/tD71i5Q4Nz
— PMO India (@PMOIndia) January 29, 2023
A unique 'Purple Fest' was organised in Goa recently for the divyangjan. #MannKiBaat pic.twitter.com/7GqEaCzQMz
— PMO India (@PMOIndia) January 29, 2023
Proper disposal of e-waste can become a great force to build a circular economy. #MannKiBaat pic.twitter.com/2xUfo3TySg
— PMO India (@PMOIndia) January 29, 2023
India has been taking concrete efforts towards conservation of biodiversity. #MannKiBaat pic.twitter.com/l9cxoxZxqH
— PMO India (@PMOIndia) January 29, 2023
There is a lot of enthusiasm among the youth of Jammu and Kashmir regarding sports. This was seen during the recently organised Winter Games. #MannKiBaat pic.twitter.com/VZCzh4JCkB
— PMO India (@PMOIndia) January 29, 2023
Began today's #MannKiBaat with a topic that has caught the imagination of lakhs of Indians - the #PeoplesPadma and the inspiring life journeys of the awardees. pic.twitter.com/dBwSnwUVDe
— Narendra Modi (@narendramodi) January 29, 2023
Talked about an interesting book I received, which highlighted why India is truly the Mother of Democracy. #MannKiBaat pic.twitter.com/0qUuw8Q26e
— Narendra Modi (@narendramodi) January 29, 2023
2023 has begun on a ‘Millet-full’ note and I hope this trend continues as the year progresses. #MannKiBaat pic.twitter.com/U0lNQ9CbBa
— Narendra Modi (@narendramodi) January 29, 2023
You will be happy to know about Purple Fest- an interesting effort in Goa aimed at furthering accessibility and inclusivity for persons with disabilities. #MannKiBaat pic.twitter.com/ESwnMk32UY
— Narendra Modi (@narendramodi) January 29, 2023
Referring to a recent accomplishment of @iiscbangalore, highlighted how India’s innovation eco-system is rapidly growing and how filing of patents is a lot easier now. #MannKiBaat pic.twitter.com/faIhRRlJRN
— Narendra Modi (@narendramodi) January 29, 2023
Talked about the emerging sector of electronic waste during #MannKiBaat. pic.twitter.com/7LybKNN5mn
— Narendra Modi (@narendramodi) January 29, 2023
Home to 75 Ramsar sites, India’s wetlands are testimony to our ethos of living in harmony with nature and also give an important message of sustainable development. #MannKiBaat pic.twitter.com/CT9EcMD8Mg
— Narendra Modi (@narendramodi) January 29, 2023
Snow sports and more…news from Jammu and Kashmir which will bring a smile on your face. #MannKiBaat pic.twitter.com/1K8dPbT7lK
— Narendra Modi (@narendramodi) January 29, 2023