పూర్వాపరాలు
భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కి) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో వన్ హెల్త్, అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 సదస్సు 6వ ఎడిషన్ ను భారతదేశ జి-20 అధ్యక్షతతో కో బ్రాండ్ చేసింది. 2023 ఏప్రిల్ 26, 27 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సు జరుగుతోంది.
ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్మాణానికి ప్రపంచ స్థాయి సహకారాలు, భాగస్వామ్యల ప్రాధాన్యతను అందరికీ తెలియచేయడం, విలువ ఆధారిత ఆరోగ్య సంరక్షణ ద్వారాసార్వత్రిక ఆరోగ్య సంరక్షణను సాధించడం రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లక్ష్యం. విలువ ఆధారిత వైద్య సేవలందించే శక్తిగా; ప్రపంచ శ్రేణి ఆరోగ్య సంరక్షణ, వెల్ నెస్ సేవలందించే దేశంగా వైద్య విలువ ఆధారిత ప్రయాణంలో భారతదేశం బలాలను కూడా అది ప్రపంచానికి చూపుతుంది. జి-20కి భారతదేశ అధ్యక్షత థీమ్ ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ఒకే భూమి, ఒకే ఆరోగ్యం -అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023గా పేరు పెట్టడం కూడా సందర్భానికి దీటుగా ఉంది. ఈ రంగంలో జ్ఞానాన్ని మార్పిడి చేసుకునేందుకు ప్రపంచ ఎంవిటి నిపుణులు, ప్రముఖ అధికారులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక వాటాదారులు, నిపుణులు, వృత్తి నిపుణులు పాల్గొంటున్న ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచంలో అగ్రగామి దేశాలతో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు, అభిప్రాయాల మార్పిడికి, పరస్పర అనుబంధం ఏర్పరచుకునేందుకు, బలమైన విదేశ భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.
70 దేశాలకు చెందిన 125 మంది ఎగ్జిబిటర్లు, 500 మంది విదేశీ ప్రతినిధులు ఈ సదస్సును వీక్షిస్తున్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా, కామన్వెల్త్, సార్క్, ఆసియాన్ సహా 70కి పైగా దేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ సేవలందించే సంస్థలు, విదేశీ భాగస్వాములను ఒకే వేదిక పైకి తెచ్చి వారందరి అనుసంధానానికి దోహదపడుతుంది. ఆయా దేశాల ప్రతినిధులతో కొనుగోలుదారులు, అమ్మకందారుల సమావేశాలు, బి2బి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ; పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ; వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహా పలు పారిశ్రామిక సంఘాలు, స్టార్టప్ లకు చెందిన ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భాగస్వాములందరితోనూ పరస్పర చర్చా వేదికలు నిర్వహించారు.
Addressing a programme on 'One Earth, One Health – Advantage Healthcare India 2023.' https://t.co/4puuFUcm0d
— Narendra Modi (@narendramodi) April 26, 2023
India’s vision for health has always been universal. pic.twitter.com/hvBo0gO9Lh
— PMO India (@PMOIndia) April 26, 2023
India’s view of health does not stop at lack of illness.
— PMO India (@PMOIndia) April 26, 2023
Being free of diseases is just a stage on the way to wellness. pic.twitter.com/C7276CjagU
‘One Earth, One Family, One Future’ pic.twitter.com/8FXX10tLP1
— PMO India (@PMOIndia) April 26, 2023
Indian healthcare talent has won the world’s trust. pic.twitter.com/Cl7AgcgTHC
— PMO India (@PMOIndia) April 26, 2023
True progress is people-centric. pic.twitter.com/J0iqbhNV0i
— PMO India (@PMOIndia) April 26, 2023
India is proud to have been a partner to many nations in the noble mission of saving lives through vaccines and medicines. pic.twitter.com/7GnuzpvKKS
— PMO India (@PMOIndia) April 26, 2023
For thousands of years, India’s outlook towards health has been holistic.
— PMO India (@PMOIndia) April 26, 2023
We have a great tradition of preventive health. pic.twitter.com/R0IM3ZmBy0
Reducing disparity is India’s priority.
— PMO India (@PMOIndia) April 26, 2023
Serving the unserved is an article of faith for us. pic.twitter.com/gMDDl32u5N