ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్మార్ట్ ఇండియా హాకథాన్ 2022 ముగింపు ఉత్సవాలను ఉద్దేశించి, వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారితో ముచ్చటించారు. కేరళకు చెందిన సిక్స్ పిక్సెల్స్‌ను ప్రధానమంత్రి వారి ప్రాజెక్టు గురించి అడిగారు. అది ఆలయాలలోగల ప్రాచీన సమాచారాన్ని దేవనాగరిలో కి మార్చడం గురించినది. ఈ బృందలో అందరూ మహిళలే. వారు ఈ ప్రాజెక్టు ఫలితాలు, ప్రయోజనాలు, ప్రాజెక్టు చేపట్టిన ప్రక్రియ గురించి వివరించారు. వారు తాము ప్రధానమంత్రి ఎర్రకోటనుంచి ఇచ్చిన పిలుపుకు స్పందించి దీనిని చేపట్టినట్టు చెప్పారు.
తమిళనాడుకు చెందిన ఆక్చుయేటర్స్ టీమ్ కు దివ్యాంగులకు సంబంధించిన సమస్య కు పరిష్కారం కనుగొనాల్సిందిగా కోరడం జరిగింది. వారు బౌ లెగ్ సమస్య కలిగిన వారికి సహాయపడడంపై పనిచేశారు. యాక్చుయేటర్ల ప్రేరక్ ఇలాంటి వారికి ఉపయోగపడుతుంది. వైద్య పరికరాల విషయంలో స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
మాస్టర్ విరాజ్ విశ్వనాథ్ మరాథే ఎస్.ఐ.హెచ్ జూనియర్ గా గెలుపొందిన వ్యక్తి. గుజరాత్ కు చెందిన ఇతను ఒక మొబైల్ గేమ్ అప్లికేషన్‌ను రూపొందించారు. దీనిపేరు హెచ్ కామ్. డిమెన్షియాతో బాధపడుతున్న వారి కోసం దీనిని రూపొందించారు. డిమెన్షియ అనేది అంతర్జాతీయంగా ఆరోగ్య సమస్య కావడంతో దీనిని రూపొందించారు. ఇందులో గత సంఘటనలు , ఫోటోలు, వీడియోలపై చర్చ ఉంటుంది. ఈ యాప్ లో ఆర్ట్ థెరపీ , గేమ్స్, మ్యూజిక్, వీడియో లు ఉంటాయి. ఇది డిమెన్షియా పేషెంట్లకు వారి భావాలను వ్యక్తం చేసేందుకు ఒక స్వీయ ప్రకటన సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ విరాజ్ తాను ఒక యోగా ఇన్ స్టిట్యూట్‌తో సంబంధాలు కలిగిఉన్నట్టు తెలిపారు. యోగా శిక్షకులు వయోధికుల కోసం కొన్ని ఆసనాలు సూచించినట్టు ఆయన తెలిపారు.
బిఐటి మెస్రా రాంచి నుంచి డాటాక్లాన్ కు చెందిన అనిమేష్ మిశ్రా తుఫానులను పసిగట్టడంలో అధ్యయనం గురించి ప్రస్తావించారు. వారు ఇన్‌శాట్ ఉపగ్రహం పంపే ఛాయాచిత్రాలపై పనిచేస్తారు. వీరి అధ్యయనం తుపాన్లకు సంబంధించిన వివిధ పార్శ్వాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్న డాటా గురించి ప్రధానమంత్రి వారిని అడిగారు. ఇందుకు అనిమేష్ సమాధానమిస్తూ, 2014 తర్వాత భారత కోస్తా తీరాన్ని తాకిన తుపాన్లను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి తమ అంచనాల కచ్చితత్వం 89 శాతం వరకు ఉందని అన్నారు. ఇప్పటివరకు తాము సేకరించిన సమాచారం తక్కువే అయినపపటికీ తమకు గల సాంకేతిక సామర్ధ్యంతో గరిష్ఠ కచ్చితత్వం, ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
పశ్చిమబెంగాల్ కు చెందిన టీమమమ్ సర్వగ్య బృందానికి చెందిన ప్రియాన్ష్ దివాన్ మాట్లాడుతూ, తమ బృందం మల్టీమీడియా డాటాను భద్రంగా ఇంటర్నెట్ సహాయం లేకుండా రేడియో తరంగాల ద్వారా రేడియోలో ప్రసారం చేయగలుగుతున్నట్టు చెప్పారు. ఈ వ్యవస్థతో ప్రైవసీకి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని, ఈ యాప్ దేశీయంగా రూపొందినదని, సర్వర్లుకూడ భారత్ లోనే ఉంటాయని చెప్పారు. ఈ వ్యవస్థను సైన్యం సరిహద్దు ప్రాంతాలలో వినియోగించడానికి వీలుగా ఉంటుందా అని ప్రధానమంత్రి అడిగినపుడు, ప్రియాన్ష్ అందుకు బదులిస్తూ, సందేశాలను అడ్డుకునే ముప్పుఉన్న చోట వాడవచ్చని తెలిపారు. ట్రాన్స్ మిషన్ ఎన్ క్రిప్ట్ అవుతుందన్నారు. ఈ వ్యవస్థద్వారా వీడియో ఫైల్స్ ను కూడా ట్రాన్స్‌మిట్ చేసే అంశంపై పనిచేస్తున్నారా అని ప్రధానమంత్రి అడుగగా, ట్రాన్స్ మిషన్ మీడియం ఒకటే అయినందున, వీడియోలను పంపడం సాధ్యమేనని, రేపటి హాకథాన్‌లో వీడియోలను ట్రాన్స్ మిట్ చేయడంపై పనిచేయనున్నట్టు తెలిపారు.
ఐడియల్ -బిట్స్ అస్సాం టీమ్ కు చెందిన నితీశ్ పాడే , క్షేత్రస్థాయి ఆవిష్కర్తలు ఐపిఆర్ అప్లికేషన్లను తమ యాప్ ద్వారా దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ యాప్ పేటెంట్ దరఖాస్తుల దాఖలను సులభతరం చేసేందుకు కృత్రిమ మేథ,ఇతర సాంకేతికతలనను ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఈ యాప్ ఆవిష్కర్తలకు ఎలా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి వారిని అడిగినపుడు, ఈ యాప్ ఆవిష్కర్తలకు పేటెంట్ గురించి అవగాహన కల్పిస్తుందని చెప్పారు. పేటెంట్ కు దరఖాస్తు దాఖలు చేయాలనుకునే వారికి తగిన పరిష్కారాలను చూపుతుందన్నారు. అలాగే ఆవిష్కర్తలు ఈ రంగానికి సంబంధించిన వారితో సంబంధాలు కలిగిఉండేలా చేయడం ద్వారా వారు తమకు ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోగలగుతారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ టీమ్ ఐరిస్ కు చెందిన అన్షిత్ బన్సాల్ క్రైమ్ హాట్‌స్పాట్ రూపకల్పన, మాపింగ్ కు సంబంధించి తాము ఎదుర్కొన్న సమస్యలు తెలిపారు. క్రైమ్ క్లస్టర్లను గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ తయారు చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి ఈ నమూనా కు కొలమానం, ఉపయోగితా సౌలభ్యం గురించి అడిగారు. ఈ నమూనా ద్వారా మాదకద్రవ్యాల బెడదను అరికట్టవచ్చా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ అన్షిత్, ఇది భౌగోళిక ప్రాంతంపై ఆధారపడదని, ఈ నమూనాకు అందించిన క్రిమినల్ డేటా ప్రకారం ఇది పనిచేస్తుందని చెప్పారు.
ఎస్ ఐహెచ్ జూనియర్ గా గెలుపొందిన పంజాబ్ కు చెందిన మాస్టర్ హర్‌మన్‌జోత్ సింగ్ తాను రూపకల్పన చేసిన స్మార్ట్ గ్లోవ్స్ ప్రదర్శించారు. ఇది ఆరోగ్య ప్రమాణాలను గమనిస్తుంటుంది. ఈ స్మార్ట్ గ్లోవ్‌లు ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంంది. ఇది మానసిక ఆరోగ్య పరిస్థితి, గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, ఆక్సిజన్ శాచురేషన్ స్థాయి, మనిషి మూడ్ ను గుర్తించడం, చేతిలో ఒణుకు, శరీర ఉష్ణోగ్రత వంటి వాటిని కనిపెట్టి చెబుతుంది. ప్రధానమంత్రి ఇతనికి వారి తల్లిదండ్రులు ఇచ్చిన మద్ధతు కు అభినందనలు తెలిపారు.
పంజాబ్ లోని సమిధకు చెందిన భాగ్యశ్రీ సన్‌పాల నౌకలలో ఇంధనానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం పై తెలిపారు. మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ టెక్నాలజీ ని ఇందుకు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. మనుషులతో ప్రమేయం లేకుండా నౌకాయన పర్యవేక్షక వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఇతర రంగాలకు కూడా విస్తరింప చేయవచ్చా అని ప్రధానమంత్రి అడగగా అది సాధ్యమేనని ఆమె తెలిపారు.
రోసారి ప్రస్తావిస్తూ, ఆ ఆకాంక్ష భరిత సమాజం రానున్న 25 ఏళ్ళ లో ఒక చోదక శక్తి మాదిరి గా పని చేస్తుంది అన్నారు. ఈ సమాజం యొక్క ఆకాంక్ష లు, కల లు, మరియు సవాళ్ళు నూతన ఆవిష్కర్తల కు అనేక అవకాశాల ను అందిస్తాయి అని ఆయన అన్నారు.
గడచిన 7-8 సంవత్సరాల లో దేశం ఒక విప్లవం తరువాత మరొక విప్లవం వైపునకు శర వేగం గా పురోగమిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం లో మౌలిక సదుపాయాల రంగ సంబంధి విప్లవం చోటు చేసుకొంటున్నది. అలాగే, ఆరోగ్య రంగ సంబంధి విప్లవం ప్రస్తుతం భారతదేశం లోపురి విప్పుతున్నది. డిజిటల్ క్రాంతి నేడు భారతదేశం లో ఆవిష్కారం అవుతున్నది. సాంకేతిక విజ్ఞాన పరమైన క్రాంతి భారతదేశం లో ప్రస్తుతం రూపుదాల్చుతున్నది. ప్రతిభ పరమైన క్రాంతి ఇవాళ భారతదేశం లో సంభవిస్తున్నది.’’ అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్క రంగాన్ని ఆధునికం గా తీర్చిదిద్దడం పైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది అని ఆయన అన్నారు.
ప్రతి రోజు కొత్త కొత్త రంగాలు మరియు సవాళ్ళు నూతనమైనటువంటి పరిష్కార మార్గాలు కావాలి అని కోరుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయాని కి సంబంధించిన అంశాల కు పరిష్కారాల ను కొనుగొనవలసింది గా నూతన ఆవిష్కర్తల కు ఆయన సూచన చేశారు. ప్రతి పల్లె ప్రాంతం లో ఆప్టికల్ ఫైబర్, ఇంకా 5జి ని ప్రారంభించడం, దశాబ్ది చివరి కల్లా 6జి కోసం సన్నాహాలు, గేమింగ్ ఇకోసిస్టమ్ ను వ్యాప్తి చేయడం వంటి కార్యక్రమాల తాలూకు పూర్తి ప్రయోజనాన్ని స్వీకరించడం పైన దృష్టి ని సారించండి అని యువ నూతన ఆవిష్కర్తల కు ఆయన సూచించారు. భారతదేశం లో నూతన ఆవిష్కరణ లు ఎల్లవేళలా మరింత స్పర్థాత్మకమైనటువంటి, తక్కువ ఖర్చు లో సమకూరేటటువంటి, మన్నిక కలిగినటువంటి, భద్రమైనటువంటి మరియు ఆచరణీయమైనటువంటి పరిష్కారాల ను అందిస్తూ వస్తున్నాయి అని ఆయన అన్నారు. ఈ కారణం గానే ప్రపంచం భారతదేశానికేసి ఆశ గా చూస్తున్నది అని ఆయన అన్నారు.
భారతదేశం లో నూతన ఆవిష్కరణ ల సంస్కృతి ని వృద్ధిచెందింప చేయడం కోసం మనం రెండు విషయాల పైన తదేకం గా ధ్యాస పెట్టాలి, వాటి లో ఒకటోది సామాజిక సమర్ధన, రెండోది సంస్థాగతమైనటువంటి సమర్ధన అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. నూతన ఆవిష్కరణ ను ఒక వృత్తి గా స్వీకరించడం అనేది సమాజం లో ముమ్మరం అయింది, మరి అటువంటి స్థితి లో మనం కొత్త కొత్త ఉపాయాల ను మరియు సిసలయిన ఆలోచన ల ను ఆమోదించితీరాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ.. వీటి ని పని విధానం స్థాయి నుంచి జీవన విధానం స్థాయి కి పరివర్తన చెందింప చేయవలసిందే’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
నూతన ఆవిష్కరణ ల కోసమని ఒక బలమైన పునాది ని ఏర్పరచేందుకు ఓ మార్గ సూచీ జాతీయ విద్య విధానం లో అందుబాటు లో ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అటల్ థింకరింగ్ లేబ్స్ మరియు ఐ-క్రియేట్ అనేవి ప్రతి ఒక్క స్థాయి లోనూ నూతన ఆవిష్కరణ లకు దన్ను గా నిలబడుతున్నాయి అని ఆయన అన్నారు. 21వ శతాబ్ది కి చెందినటువంటి భారతదేశం ప్రస్తుత యువతరం పట్ల పూర్తి నమ్మకం తో ముందుకు పయనిస్తున్నది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. దీని కి ఫలితం గా, ఇనొవేశన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ప్రస్తుతం ఎగబాకింది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. పేటెంట్ ల సంఖ్య గత 8 సంవత్సరాల లో 7 రెట్లు పెరిగింది. యూనికార్న్ ల లెక్క కూడాను 100 ను మించిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.
నేటి కాలానికి చెందిన యువ తరాలు సమస్య కు వేగవంతమైనటువంటి మరియు వివేకవంతమైనటువంటి పరిష్కారాల తో ముందుకు వస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ తరహా హాకథన్ ల నిర్వహణ కు వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అంటే అది యువతరం సమస్యల కు పరిష్కారాల ను అందించాలి అనేదే. అలాగే యువతరం, ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల మధ్య ఈ కోవ కు చెందినటువంటి సహకార భావన ‘సబ్ కా ప్రయాస్’ కు ఒక ఘనమైనటువంటి నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.
పూర్వరంగం
దేశం లో, ప్రత్యేకించి యువతీయువకుల లో, నూతన ఆవిష్కరణల కు సంబంధించినటువంటి భావన ను పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నిరంతరం ప్రయాస లు చేస్తూ వస్తున్నారు. ఇదే దార్శనికత ను అనుసరిస్తూ, స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్) ను 2017 వ సంవత్సరం లో మొదలు పెట్టడమైంది. ఎస్ఐహెచ్ అనేది సమాజం యొక్క, సంస్థ ల యొక్క మరియు ప్రభుత్వం యొక్క అనేక చిక్కు సమస్యల ను పరిష్కరించడాని కి విద్యార్థుల కు ఒక వేదిక ను సమకూర్చేటటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమం గా ఉన్నది. ఇది విద్యార్థుల లో ఉత్పత్తిపరమైన నూతన ఆవిష్కరణ, సమస్య ను పరిష్కరించడం లతో పాటు గా అంతవరకు అవలంబిస్తున్న ఆలోచన విధానాని కి భిన్నం గా సరికొత్త ఆలోచన లను చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాలని ధ్యేయం గా పెట్టుకొంది.
ఎస్ఐహెచ్ లో నమోదు అయిన బృందాల సంఖ్య తొలి సంచిక లో సుమారు 7500 గా ఉన్నది కాస్తా తాజా అయిదో సంచిక కు వచ్చే సరికి నాలుగింతల వృద్ధి తో ఇంచుమించు 29,600 కు చేరుకోవడాన్నిబట్టి ఈ కార్యక్రమాని కి పెరుగుతున్న లోకప్రియత్వాన్ని గమనించవచ్చును. ఈ సంవత్సరం లో 15,000 మంది కి పైగా విద్యార్థులు మరియు మార్గదర్శకులు ఎస్ఐహెచ్ 2022 గ్రాండ్ ఫినాలే లో భాగం పంచుకోవడం కోసం 75 నోడల్ కేంద్రాల కు చేరుకొంటున్నారు. 2900 కు పైగా పాఠశాలల కు మరియు 2200 ఉన్నత విద్య సంస్థల కు చెందిన విద్యార్థులు ఫినాలే లో పాల్గొని, 53 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందే 476 సమస్యల కు (వీటి లో ఆలయాల కు చెందిన శిలా శాసనాల కు సంబంధించిన ఆప్టికల్ కేరిక్టర్ రెకగ్ నిశన్ (ఒసిఆర్) దేవనాగరి లిపి లోని అనువాదాలు, త్వరగా పాడయిపోయే ఆహార పదార్థాల కోసం ఉద్దేశించినటువంటి కోల్డ్ సప్లయ్ చైన్ లో ఐఒటి ఆధారిత రిస్క్ మానిటరింగ్ సిస్టమ్, విపత్తు విరుచుకుపడ్డ ప్రాంతాల లో భూమి, మౌలిక సదుపాయాలు మరియు రహదారుల స్థితుల పై అధిక స్పష్టత తో కూడినటువంటి 3డి నమూనా మొదలైనవి కూడా కలసి ఉంటాయి) పరిష్కారాల ను కనుగొనేందుకు కృషి చేయనున్నారు.
పాఠశాల విద్యార్థుల లో నూతన ఆవిష్కరణల సంస్కృతి ని అలవరచడం కోసం, మరియు పాఠశాల స్థాయి లో సమస్య ను పరిష్కరించే దృష్టికోణాన్ని వికసింపచేయాలనే ఉద్దేశ్యం తో ఒక ప్రయోగాత్మక కార్యక్రమమా అన్నట్లుగా స్మార్ట్ ఇండియా హాకథన్-జూనియర్ ను కూడా ఈ సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది.
***
Addressing the Grand Finale of Smart India Hackathon 2022. It offers a glimpse of India's Yuva Shakti. https://t.co/7TcixPgoqD
— Narendra Modi (@narendramodi) August 25, 2022
अब से कुछ दिन पहले ही हमने आजादी के 75 वर्ष पूरे किए हैं।
— PMO India (@PMOIndia) August 25, 2022
आजादी के 100 वर्ष होने पर हमारा देश कैसा होगा, इसे लेकर देश बड़े संकल्पों पर काम कर रहा है।
इन संकल्पों की पूर्ति के लिए ‘जय अनुसंधान’ के उद्घोष के ध्वजा वाहक आप innovators हैं: PM @narendramodi
पिछले 7-8 वर्षों में देश एक के बाद एक Revolution करते हुए तेजी से आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) August 25, 2022
भारत में आज Infrastructure Revolution हो रहा है।
भारत में आज Health Sector Revolution हो रहा है: PM @narendramodi
भारत में आज Digital Revolution हो रहा है।
— PMO India (@PMOIndia) August 25, 2022
भारत में आज Technology Revolution हो रहा है।
भारत में आज Talent Revolution हो रहा है: PM @narendramodi
भारत में इनोवेशन का कल्चर बढ़ाने के लिए हमें दो बातों पर निरंतर ध्यान देना होगा।
— PMO India (@PMOIndia) August 25, 2022
Social support और institutional support: PM @narendramodi
समाज में innovation as a profession की स्वीकार्यता बढ़ी है।
— PMO India (@PMOIndia) August 25, 2022
ऐसे में हमें नए ideas और original thinking को भी स्वीकार करना होगा।
रिसर्च और इनोवेशन को way of working से way of living बनाना होगा: PM @narendramodi
21वीं सदी का आज का भारत, अपने युवाओं पर भरपूर भरोसा करते हुए आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) August 25, 2022
इसी का नतीजा है कि आज innovation index में भारत की रैकिंग बढ़ गई है।
पिछले 8 वर्षों में पेटेंट की संख्या 7 गुना बढ़ गई है।
यूनिकॉर्न की गिनती भी 100 के पार चली गई है: PM @narendramodi