కేంద్ర ప్రాయోజిత పథకం ‘వరద నిర్వహణ & సరిహద్దు ప్రాంతాల కార్యక్రమాన్ని’ (ఎఫ్‌ఎంబీఏపీ) కొనసాగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 వరకు (15వ ఆర్థిక సంఘం కాలం), 5 సంవత్సరాల కాలానికి రూ.4,100 కోట్ల కేటాయింపునకు అంగీకారం తెలిపింది.
పథకంలో రెండు విభాగాలు ఉన్నాయి:
వరద నిర్వహణ బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వాలదే అయినప్పటికీ, వరద నిర్వహణ, ఆధునిక సాంకేతికతల అమలు, వినూత్న విధానాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు మద్దతునివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా అనూహ్య సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సందర్భోచితంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎంబీఏ విభాగం కింద అమలు చేసే పనులు వరద, కోతల నుంచి రక్షణతో పాటు సరిహద్దు నదుల వెంబడి మోహరించిన భద్రత సంస్థలు, సరిహద్దు ఔట్‌పోస్టులు మొదలైన వాటికి మద్దతుగా నిలుస్తాయి.
***