జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు సంబంధించి గవర్నర్ తన నివేదికలో పేర్కన్నదాని ఆధారంగా 2019 జూలై 3 నుంచి మరో ఆరు నెలలపాటు జమ్ము కాశ్మీర్లో రాష్ట్రపతిపాలన పొడిగింపునకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (4) ప్రకారం ఆమోదం తెలిపింది.
పర్యవసానాలు :
ఈ నిర్ణయం వల్ల జమ్ముకాశ్మీర్‌లో 2019,జూలై 3 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం జమ్ము కాశ్మీర్‌లోరాష్ట్రపతి పాలన 2019 జూలై 2 వ తేదీతో ముగియనుంది. 2019 జూలై 3 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు గవర్నర్ సిఫార్సు చేశారు.
అమలు :
ఇందుకు సంబంధించి పార్లమెంటు అనుమతి కోరుతూ ఒక తీర్మానాన్ని రానున్న పార్లమెంటు ఉభయసభలలో ప్రవేశపెట్టనున్నారు.
నేపథ్యం :
జమ్ము& కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం , భారత రాష్ట్రపతి ఆమోదంతో 20-6-2018న జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఒక ఆదేశాన్నిజారీ చేస్తూ , దాని ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వ ,శానస విధులను తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. తొలుత సుప్త చేతనావస్థలో ఉంచిన రాష్ట్ర శాసనసభను 21-11-2018న గవర్నర్ రద్దు చేశారు.
గవర్నర్ 20.06.2018న జారీ చేసిన ఆదేశం గడువు 19.12.2018న ఆరు నెలల గడువు ముగియడంతో పూర్తి అయింది. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం, ఆరు నెలల తర్వాత ఆ ఆదేశాన్ని తిరిగిపొడిగించడానికి ఎలాంటి ప్రొవిజన్ లేదు. అందువల్ల ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర గవర్నర్ సిఫార్సు మేరకు ,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆదేశాలను ఆమోదిస్తూ లోక్‌సభ 28-12-2018న, 03-01-2019న రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గడువు 2019 జూలై 2 వ తేదీతో ముగియనుంది. మరోవైపు జమ్ము కాశ్మీర్ గవర్నర్ 2019 జూలై 3 నుంచి
ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగించ వచ్చని సిఫార్సు చేశారు.