కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు కరవు భత్యం (డిఎ) మరియు పింఛనుదారుల కు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) లకు సంబంధించిన అదనపు కిస్తీ ని 2019వ సంవత్సరం జులై 1వ తేదీ నాటి నుండి వర్తించే విధం గా విడుదల చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ధర ల పెరుగుదల తో ఏర్పడ్డ లోటు ను భర్తీ చేయడం కోసం మూల వేతనం లో/ పెన్షన్ లో ప్రస్తుత రేటు అయిన 12 శాతాని కి తోడు 5 శాతం పెరుగుదల ను ఇది సూచిస్తున్నది. ఈ పెరుగుదల 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసు ల ఆధారం గా ఆమోదించిన సూత్రాల కు అనుగుణం గా చోటు చేసుకొన్నది.
డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ లు రెండింటి వల్ల ఖజానా పై పడే ప్రభావం 2019-20 ఆర్థిక సంవత్సరం లో (2019వ సంవత్సరం లో జులై మొదలుకొని 2020వ సంవత్సరం లో ఫిబ్రవరి వరకు అంటే 8 నెలల కాలాని కి) క్రమం గా 15909.35 కోట్ల రూపాయలు మరియు 10606.20 కోట్ల రూపాయలు గా ఉండబోతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం లో సుమారు 49.93 లక్షల మంది ఉద్యోగుల కు మరియు 65.26 లక్షల మంది పింఛనుదారుల కు లబ్ధి చేకూరనుంది.
డియర్‌నెస్ అలవెన్స్ లో ఈ పెరుగుదల కారణం గా ప్రతి ఒక్క సంవత్సరం లో పడే అదనపు ఆర్థిక భారం 8590.20 కోట్ల రూపాయలు గా ఉండవచ్చని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2019-20 లో (2019వ సంవత్సరం లో జులై మొదలుకొని 2020వ సంవత్సరం లో ఫిబ్రవరి వరకు అంటే 8 నెలల కాలాని కి) 5726.80 కోట్ల రూపాయలు గా ఉంటుందని భావిస్తున్నారు.
పింఛనుదారుల కు డియర్‌నెస్ రిలీఫ్ కారణం గా ప్రతి ఒక్క సంవత్సరం లో 7319.15 కోట్ల రూపాయలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 4870 కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేయడమైంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు/ పింఛనుదారుల కు జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడం కోసం, అలాగే సిసలు విలువ లో కోత బారి నుండి వారి మూల వేతనం/పెన్షన్ ను పరిరక్షించడం కోసం కరవు భత్యం/డియర్‌నెస్ రిలీఫ్ చెల్లిస్తూ వస్తున్నారు. డియర్‌నెస్ అలవెన్స్/డియర్‌నెస్ రిలీఫ్ ను ఒక సంవత్సరం లో రెండు సార్లు క్రమం గా జనవరి 1వ తేదీ నుండి మరియు జులై 1వ తేదీ నుండి సవరించడం జరుగుతోంది.
**