Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 జూన్ 17వ తేదీన నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి


జూన్ 17వ తేదీ ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. రోజంతా సాగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్ లు, ఇంకా భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు అవుతారు.

నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి దేశ అభివృద్ధి ప్రాథమ్యాలు, రంగాలు మరియు వ్యూహాల ఉమ్మడి దార్శనికత ను రూపొందించే బాధ్యత అప్పగించబడినటువంటి ముఖ్య సంస్థ. రాష్ట్రాల యొక్క క్రియాశీల ప్రమేయంతో అభివృద్ధి కి అనుసరించవలసిన మార్గాన్ని సూచించవలసిన సంస్థ కూడా.

క్రితం సంవత్సరంలో చేసిన పనులను పాలక మండలి సమీక్షిస్తుంది; అలాగే, భవిష్యత్తులో సాధించవలసిన అభివృద్ధి కి ప్రాధాన్యాలపై చర్చను చేపడుతుంది.

వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తీసుకున్న చర్యలు; ఆయుష్మాన్ భారత్, జాతీయ పోషణ్ మిశన్, ఇంకా మిశన్ ఇంద్రధనుష్ ల వంటి ప్రతిష్టాత్మక పథకాల యొక్క పురోగతి; మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లాల అభివృద్ధి; మరియు మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుక సహా ముఖ్యమైన అంశాలను గురించి పాలక మండలి చర్చించే అవకాశం ఉంది.

***