Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో భార‌త దేశ క్రీడాకారుల బృందానికి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో పాలుపంచుకొన్న భార‌తదేశ బృందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

“2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న భార‌త‌దేశ బృందం ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఎంతో గ‌ర్వ‌ప‌డే ప‌ని ని చేసిపెట్టింది. మ‌న క్రీడాకారులంతా వారి లోని ఉత్త‌మ‌ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చారు; చాలా చ‌క్క‌గా ఆడారు. ప‌త‌కాల‌ను తీసుకు వ‌స్తున్న క్రీడాకారుల‌ందరికీ ఇవే నా అభినంద‌న‌లు.

2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ప్ర‌తి ఒక్క క్రీడాకారుడు/క‌్రీడాకారిణి మ‌న‌కు ప్రేర‌ణ‌ను అందిస్తున్నారు. వారి యొక్క జీవిత గాథ‌లు అంకిత భావం యొక్క శ‌క్తి ని మ‌రియు ఎన్న‌టికీ త‌ల‌ వంచ‌ని వైఖ‌రి ని చాటి చెప్తున్నాయి. ఈ గుణ‌గ‌ణాలే కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో వారు విజయ శిఖ‌రాల‌ను అధిరోహించ‌డంలో లెక్క‌ లేన‌న్ని అవ‌రోధాలను అధిగ‌మించేట‌ట్లు చేశాయి.

2018 కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో భార‌తదేశం సాధించిన విజయం క్రీడ‌ల‌ను అనుస‌రించేందుకుగాను మ‌రింత మంది యువ‌తీయువకులకు స్ఫూర్తిగా నిల‌ుస్తుంది; అంతే కాక, ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ దేహ‌దారుఢ్య‌ానికి ఇవ్వ‌వ‌ల‌సినటువంటి ప్రాముఖ్యం ఎంత‌టిదో కూడా ఈ సాఫల్యం తెలియ‌జేస్తుంది.

మా వంతుగా మేము, ప్ర‌భుత్వ ప‌క్షాన ఫిట్ ఇండియా ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేయ‌డం కోసం చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తున్నాం” అని ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో వ‌రుస‌గా రాసిన వాక్యాల‌లో త‌న సందేశాన్ని పొందుపరచారు.

****