Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2017-18 సంవ‌త్స‌రంలో దీర్ఘ‌కాలిక సేద్య‌పు నీటి నిధి (ఎల్‌టి ఐఎఫ్‌)కు 9020 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఎక్స్‌ట్రా బ‌డ్జెట‌రీ రిసోర్సెస్ స‌మీక‌రించుకొనేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం br


2017-18 సంవ‌త్స‌రంలో అవ‌స‌ర‌మైన మేర‌కు 9020 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఎక్స్‌ట్రా బ‌డ్జెట‌రీ రిసోర్సెస్ (ఇబిఆర్‌)ను స‌మీక‌రించుకొనేందుకు ఎన్ఎబిఎఆర్‌డి (‘నాబార్డ్’)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బాండ్లను జారీ చేయ‌డం ద్వారా ఈ నిధుల‌ను స‌మీక‌రిస్తారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న 99 ప్రాధాన్య‌తాపూర్వ‌క సేద్య‌పు నీటి ప‌థ‌కాల‌లో భాగంగా ఉన్న యాక్సిలరేటెడ్‌ ఇరిగేష‌న్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఎఐబిపి) ప‌నుల‌తో పాటు పిఎఎమ్ కెఎస్‌వై లో భాగంగా చేప‌ట్టే క‌మాండ్ ఏరియా డెవ‌ల‌ప్ మెంట్ (సిఎడి) ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి ఉద్దేశించిన అప్పుల‌కు 6 % వార్షిక రుణ రేటు వ‌ర్తించేట‌ట్లు చూస్తారు.br>

యాక్సిలరేటెడ్‌ ఇరిగేష‌న్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఎఐబిపి) లో భాగంగా అమ‌లు చేయ త‌ల‌పెట్టిన భారీ మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా సేద్య‌పు నీటిపారుద‌ల ప‌థ‌కాల‌లో చాలా వ‌ర‌కు ప‌థ‌కాలు చాలినంత నిధులు అంద‌క‌పోవ‌డంతో ముందుకు సాగ‌డం లేదు. 2016-17 సంవ‌త్స‌రంలో పిఎమ్‌కెఎస్‌వై- ఎఐబిపి లో భాగంగా నిర్మాణంలో ఉన్న 99 ప్రాజెక్టుల‌ను గుర్తించి వాటిని 2019 డిసెంబ‌ర్ క‌ల్లా ద‌శ‌ల‌ వారీగా పూర్తి చేయాల‌ని సంక‌ల్పించారు. ఈ ప‌థ‌కాలకు పెద్ద మొత్తం కావ‌ల‌సిన నిధుల‌ను స‌మ‌కూర్చేందుకు మ‌రియు ఈ ప‌థ‌కాలు పూర్తి అయ్యేలా చూసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 2016-17 బ‌డ్జెట్ ప్ర‌సంగంలో నాబార్డ్ లో ఒక ప్ర‌త్యేక లాంగ్ ట‌ర్మ్ ఇరిగేష‌న్ ఫండ్ (ఎల్‌టిఐఎఫ్) ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పిఎమ్‌కెఎస్‌వై (ఎఐబిపి మ‌రియు సిఎడి)లో భాగంగా ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల‌లో ప్రాథ‌మ్యం ప్రాతిప‌దిక‌న గుర్తించిన ప్రాజెక్టుల‌కు కేంద్ర మ‌రియు రాష్ట్ర వాటాల‌తో నిధుల‌ను స‌మ‌కూర్చ‌డం కోసం 20,000 కోట్ల రూపాయ‌ల ప్రారంభిత మూల నిధితో ఎల్‌టిఐఎఫ్ ఏర్పాటు అవుతుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి వివ‌రించారు.br>

నాబార్డ్ నుండి ల‌భించే రుణం రాష్ట్రాల‌కు ఆక‌ర్ష‌ణీయంగా ఉండేట‌ట్లుగా చూడటానికి వ‌డ్డీ రేటును సుమారు 6 శాతంగా ఉంచాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం 2016-17 నుండి 2019-20 మ‌ధ్య కాలంలో ప్ర‌తి సంవ‌త్స‌రం నాబార్డుకు అవ‌స‌ర‌మైన వ్య‌య‌ ర‌హిత నిధుల‌ను స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది. ఈ నిధుల‌పై వ‌డ్డీ భారాన్ని భార‌త ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.br>

2016-17 సంవ‌త్స‌రంలో, నాబార్డు మొత్తంమీద 9086.02 కోట్ల‌ను ఎల్‌టిఐఎఫ్ లో భాగంగా విత‌ర‌ణ చేసింది. ఇందులో 2414.16 కోట్ల రూపాయ‌ల‌ను పోల‌వ‌రం ప్రాజెక్టుకు (ఇబిఆర్ భాగాన్ని క‌ల‌ప‌కుండా) మ‌రియు మిగతా 6671.86 కోట్ల‌ రూపాయలను గుర్తించిన ప‌థ‌కాల‌కు ఇబిఆర్‌ సాయంతో విడుద‌ల చేయ‌డమైంది. అంతేకాక 924.9 కోట్ల రూపాయ‌లను బ‌డ్జెట‌రీ ప్రొవిజ‌న్ ద్వారా కేంద్ర స‌హాయం (సిఎ) రూపంలో ఇచ్చారు. 2016-17లో భార‌త ప్ర‌భుత్వ పూర్తి మ‌ద్ద‌తుతో మొత్తం మీద 2187 కోట్ల రూపాయ‌ల‌ను ఇబిఆర్ రూపంలో నాబార్డ్ స‌మీక‌రించింది.
br>
2017-18 లో ఎల్‌టిఐఎఫ్ ద్వారా 29,000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అవ‌స‌రమ‌వుతాయ‌ని అంచ‌నా. ఇందులో ఇబిఆర్ వంతు 9020 కోట్ల రూపాయ‌లుగా ఉంటుంది.br>

రాష్ట్రాలు మ‌రియు కేంద్ర జ‌ల సంఘం వేరు వేరు స‌మీక్షా స‌మావేశాల‌లో అందించిన స‌మాచారం మేర‌కు, 18 ప్రాజెక్టులు పూర్తి కావ‌డం గాని లేదా దాదాపుగా పూర్తి అయ్యే స్థితికి చేరుకోవ‌డం గాని జ‌రిగింది. మొత్తం 99 ప్రాజెక్టుల ద్వారా 2016-17 లో సేద్య‌పు నీటి వినియోగం 14 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు మించ‌వ‌చ్చ‌ని ఆశిస్తున్నారు. 2017-18లో మ‌రో 33 ప్రాజెక్టులు పూర్తి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. గుర్తించిన సేద్య‌పు నీటిపారుద‌ల ప‌థ‌కాలు పూర్తి అయితే నిర్మాణ ద‌శ‌లో ఉద్యోగ అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. అంత‌క‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన త‌రువాత సేద్య‌పు నీటిపారుద‌ల వ‌న‌రుల వినియోగం దాదాపు 76 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు చేరుతుంది. ఇది దేశ వ్య‌వ‌సాయ రంగ ముఖచిత్రాన్ని గ‌ణ‌నీయంగా మార్చ‌గ‌లుగుతుంది. పంట‌లు పండించే విస్తీర్ణం పెర‌గడం, పంట‌ల ప‌ద్ధ‌తిలో మార్పు, అగ్రో ప్రాసెసింగ్, ఇంకా త‌దిత‌ర అనుబంధ కార్య‌క‌లాపాల రీత్యా అధిక ఉద్యోగ అవ‌కాశాలు అంది రాగ‌ల‌వు.br>

*****