Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2017 సంవత్సర బసవ జయంతి మరియు బసవ సమితి స్వర్ణోత్సవాల ప్రారంభ సూచకంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

2017 సంవత్సర బసవ జయంతి మరియు బసవ సమితి స్వర్ణోత్సవాల ప్రారంభ సూచకంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఇరవై మూడు భాషలలోకి అనువాదమైన బసవన్న పవిత్ర వచనాలను న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంకితం చేశారు. అలాగే 2017 సంవత్సర బసవ జయంతి మరియు బసవ సమితి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవం జరుపుకొంటున్న సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఉపన్యాసమిస్తూ, భారతదేశ చరిత్ర కేవలం పరాజయం, పేదరికం లేదా వలసరాజ్యం గురించే కాకుండా సుపరి పాలన, అహింస మరియు సత్యాగ్రహాలకు సంబంధించిన సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించిన చరిత్రను కలిగవుందని చెప్పారు.

భగవాన్ బసవేశ్వరునికి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని ఘటిస్తూ, పలు శతాబ్దాల క్రితమే బసవేశ్వరుడు ప్రజాస్వామిక వ్యవస్థను దర్శించారని చెప్పారు. మన సమాజాన్ని పరివర్తన చెందించిన మహనీయుల దీవెనలకు జన్మనిచ్చిన భూమి మన దేశం అని ఆయన అన్నారు. మన సమాజంలో సంస్కరణలు అవసరమైనప్పుడల్లా సమాజం లోపలి నుండే వచ్చినట్లు ఆయన తెలిపారు. ముస్లిం సమాజం లోపలి నుండి కూడా సంస్కర్తలు పుట్టుకువచ్చి, ‘మూడు సార్లు తలాక్’ ఆచరణ పర్యవసానంగా కొంత మంది ముస్లిం మహిళలు భరిస్తున్న వేదనకు స్వస్తి పలకగలరన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కటకం ద్వారా చూడకండంటూ ముస్లిం ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

భగవాన్ బసవేశ్వరుని వచనాలు సుపరిపాలనకు ఆధారం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. గృహ‌ నిర్మాణ‌ం, విద్యుత్తు మరియు రహదారులు వంటి అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ యొక్క నిజమైన సారాంశం అని ఆయన స్పష్టంచేశారు.

2015 నవంబరు లో లండన్ లో భగవాన్ బసవేశ్వరుని ఊర్ధ్వభాగ ప్రతిమను తాను ఆవిష్కరించిన సందర్భాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సభికులకు గుర్తు చేశారు.

కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాన మంత్రి సభాసదుల మధ్యకు నడచివెళ్లి కన్నడ మహా పండితుడు కీర్తిశేషుడు శ్రీ ఎమ్.ఎమ్. కల్ బుర్గి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు.