Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2017 జనవరి 17వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగిన ‘ద్వితీయ రైసినా సంభాషణ’ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

2017 జనవరి 17వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగిన ‘ద్వితీయ రైసినా సంభాషణ’ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

2017 జనవరి 17వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిగిన ‘ద్వితీయ రైసినా సంభాషణ’ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం


శ్రేష్ఠులు,
ప్రముఖ అతిథులు,
సోదర సోదరీమణులారా,

ఈ రోజంతా ప్రసంగాల రోజుగా కనబడుతోంది. కొంచెం సేపటి క్రితం అధ్యక్షుడు శ్రీ శి మరియు ప్రధాని మే ఇచ్చిన ప్రసంగాలను మనం విన్నాము. ఇప్పుడు నేను ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది బహుశా కొంతమందికి ఎక్కువ కావచ్చు. లేదా 24/7 వార్తా చానల్స్ కూ సమస్య కావచ్చు.

రైసినా సంభాషణ ద్వితీయ సదస్సు ప్రారంభ సందర్భంలో మీతో మాట్లాడటం నాకు దక్కిన ఒక గొప్ప అవకాశమని నేను భావిస్తున్నాను. శ్రేష్ఠులైన శ్రీ కర్జాయ్, ప్రధాని హార్పర్ గారు, ప్రధాని కెవిన్ రుడ్ గారు మిమ్మల్ని ఢిల్లీ లో చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే అతిథులందరికీ సాదర స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని పరిస్థితులపై రానున్న రోజుల్లో మీరు అనేక చర్చలు జరుపుతారు. ప్రస్తుతం నెలకొన్న అస్థిరత, దాని సంఘర్షణలు, నష్టాలు, దాని విజయాలు, అవకాశాలు, వాటి గత ప్రవర్తనలు, నివారణ మార్గాలు, అందులో బ్లాక్ స్వాన్స్ గా కనపడగలిగేవి, ఇంకా.. ద న్యూ నార్మల్స్ వంటి అనేక అంశాలపైన కూడా మీరు చర్చించనున్నారు.

స్నేహితులారా,

భారతదేశ ప్రజలు కూడా 2014 మే నెలలో న్యూ నార్మల్ ను ప్రవేశపెట్టారు. నా తోటి భారతీయులంతా ఏక తాటిపై నిలచి మార్పు కోసం నా ప్రభుత్వానికి అధికారం కల్పించారు. కేవలం వైఖరిలో మార్పు కాదు. ఆలోచనల్లో మార్పు రావాలి. ఒక విధమైన మూస విధానంలో కొనసాగుతున్న పరిస్థితి నుండి ఒక ప్రయోజనకరమైన చర్య దిశగా మార్పు రావాలి. సంస్కరణలకు మద్దతు లభిస్తే సరిపోదు. అది మన ఆర్ధిక వ్యవస్థలో, సమాజంలో పరివర్తనను తీసుకురావాలి. భారతీయ యువత ఆశలకు, ఆకాంక్షలకు, లక్షలాది ప్రజల అనంతమైన శక్తికీ అనుగుణంగా పరివర్తన ప్రతిఫలించాలి. నేను రోజూ పనిచేసేటప్పుడు ఈ పవిత్రమైన శక్తి పైనే దృష్టి పెడతాను. భారతీయులందరి శ్రేయస్సు కోసం, భద్రత కోసం భారతదేశాన్ని సంస్కరించి, పరివర్తనను తీసుకు రావడానికి చేపట్టవలసిన చర్యలకు అనుగుణంగానే నేను రోజువారీ చేయవలసిన పనుల జాబితా రూపొందుతుంది.

స్నేహితులారా,

భారతదేశ పరివర్తన, విదేశీ వ్యవహారాలు.. ఇవి రెండూ వేరు వేరు కాదని నాకు తెలుసు. మన ఆర్థికాభివృద్ధి, మన రైతుల సంక్షేమం, మన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు, పెట్టుబడులకు మనకు గల అవకాశాలు, సాంకేతిక విజ్ఞానం, విపణులు, వనరులు, ఇంకా దేశ భద్రత మొదలైనవన్నీ ప్రపంచంలో సంభవించే పరిణామాలపైన ఆధారపడి ఉంటాయి. అయితే అదే విధంగా వీటి ప్రభావం ప్రపంచ పరిస్థితులపైన సైతం ఉంటుందనేది కూడా వాస్తవమే.

భారతదేశానికి ప్రపంచంతో ఎంత అవసరం ఉందో – భారతదేశ సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి కూడా అంత అవసరం. మన దేశంలో మార్పు కావాలన్న ఆశకు బయటి ప్రపంచంతో అనంతమైన సంబంధం ఉంది. అందువల్ల, స్వదేశంలో భారతదేశ అవసరాలు, మన అంతర్జాతీయ ప్రాధాన్యాలు ఒకదానితో ఒకటి నిరంతరం ముడిపడి ఉంటాయన్నది సహజం. భారతదేశ పరివర్తన లక్ష్యాలలో ఇవి గట్టిగా పెనవేసుకొని ఉన్నాయి.

స్నేహితులారా,

చాలా కాలంగా భారతదేశం పరివర్తన దిశగా అడుగులు వేస్తోంది. అయితే అదే సమయంలో మానవ పురోగతి తో పాటు హింసాత్మక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక కారణాల వల్ల అనేక స్థాయిలలో ప్రపంచం అనేక మార్పులను చూస్తోంది. అంతర్జాతీయంగా కలిసిన సమాజాలు, డిజిటల్ అవకాశాలు, సాంకేతిక విజ్ఞానం బదలాయింపు, పరిజ్ఞానం విజృంభణ, కొత్త ఆవిష్కరణలు వంటివి – మానవత్వం కంటే ముందు నడుస్తున్నాయి. అయితే మందగమనంలో ఉన్న వృద్ధి, ఆర్ధిక అస్థిరతలు కూడా ఒక కారణంగా ఉన్నాయి. ఈ బిట్స్ మరియు బైట్స్ యుగంలో భౌతిక సరిహద్దులు పెద్ద సమస్య కాదు. అయితే, దేశాలలో అంతర్గతంగా ఉండే అవరోధాలు, వాణిజ్యం, వలసలకు వ్యతిరేకంగా ఉండే మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాంతీయవాద, రక్షణవాద వైఖరులు కూడా బలమైన సాక్ష్యంగా ఉన్నాయి. ఫలితంగా ప్రపంచీకరణ ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్ధిక ప్రయోజనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అస్థిరత్వం, హింస, తీవ్రవాదం, మినహాయింపులు, బహుళజాతి బెదిరింపులు ప్రమాదకర దిశగా విస్తరిస్తున్నాయి. దీనికి తోడు, వీటితో సంబంధం లేని వర్గాలు ఇటువంటి సవాళ్లు కొనసాగడానికి గణనీయంగా కృషి చేస్తున్నాయి. వేరే ప్రపంచం కోసం అన్య ప్రపంచం నిర్మించిన సంస్థలు, స్వరూపాలు కాలం చెల్లినవైపోయాయి. ఇది సమర్ధవంతమైన బహుళ జాతి విధానానికి అవరోధాన్ని కల్పిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధానంతరం వ్యూహాత్మక స్పష్టత లభించిన 25 ఏళ్లకు ప్రపంచం తనంతట తాను మళ్లీ ఒక క్రమ పద్దతిని అనుసరించడం మొదలుపెడుతున్నప్పటికీ కూడా, కొత్తగా చోటు చేసుకొంటున్న క్రమ వ్యవస్థ దిగువన ఉండిపోయినదానికి సంబంధించిన దుమ్ము మాత్రం ఇంకా శుభ్రమవనే లేదు. అయితే, కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి. రాజకీయ శక్తి, సైనిక శక్తి తగ్గింది; ప్రపంచం యొక్క మల్టి- పోలారిటీ విస్తరించింది. మరింతగా విస్తరిస్తున్న మల్టి- పోలార్ ఆసియా ఇప్పుడు ప్రధాన వాస్తవంగా నిలుస్తోంది. దీనిని మనం స్వాగతిస్తున్నాము.

ఎందుకంటే- ఇది అనేక దేశాలు వృద్ధి చెందడానికి దోహదపడుతోంది. అనేక మంది అభిప్రాయాలని ఇది అంగీకరిస్తోంది. అంతేగాని, కొంతమంది ప్రభావం- ప్రపంచ కార్యక్రమపట్టికపైన ఉండకూడదు. అందువల్ల మినహాయింపులను ప్రోత్సహించే ఎటువంటి స్వభావానికైనా, ఇష్టానికైనా వ్యతిరేకంగా ముఖ్యంగా ఆసియాలో మనం పోరాడాలి. ఆ విధంగా మల్టీలేటరిజం, మల్టి- పొలారిటీ లపై ఈ సదస్సు సరైన సమయంలో జరుగుతోంది.

స్నేహితులారా,

మనం వ్యూహాత్మకమైన సంక్లిష్ట వాతావరణంలో నివసిస్తున్నాము. మన గత చరిత్రను నిశితంగా పరిశీలించినట్లయితే మారుతున్న ప్రపంచం అంటే తప్పకుండా అది ఒక కొత్త పరిస్థితి కానవసరం లేదు. ఇంతవరకు మనం చెప్పుకొన్న విషయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మన ఎంపికలు, చర్యలు మన జాతీయ శక్తి యొక్క బలం మీదనే ఆధారపడి ఉంటాయి.

మన వ్యూహాత్మక అంగీకారం అంతా మన నాగరికత సంస్కృతి లక్షణాల ద్వారా రూపుదిద్దుకొంది. ఆ లక్షణాలు ఏవేవి అంటే.. :

· यथार्थवाद (వాస్తవికత)
· सह-अस्तित्व (సహ జీవనం)
· सहयोग (సహకారం); ఇంకా
· सहभागिता (భాగస్వామ్యం).

స్పష్టంగా, బాధ్యతాయుతంగా భావప్రకటన చేయడం మన జాతీయ ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తుంది. దేశ విదేశాలలో భారతీయుల శ్రేయస్సు, పౌరుల భద్రత, అత్యంత ముఖ్యమైనవి. అయితే స్వప్రయోజనం మాత్రమే అనేది మా సంస్కృతిలో లేదు. అది మా ప్రవర్తన లోనూ లేదు. మా చర్యలు, ఆశలు, సామర్ధ్యాలు, మానవ మేధస్సు, ప్రజాస్వామ్యం, జనాభా మొదలైనవే మా బలం, మా విజయం. ప్రాంతీయ, అంతర్జాతీయ సర్వతోముఖాభివృద్ధికి చుక్కానిగా ఉంటాము. మా ఆర్ధిక రాజకీయ పురోగతి గొప్ప ప్రాముఖ్యం కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ అవకాశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది శాంతికి ఒక శక్తిగా, స్థిరత్వానికి ఒక అంశంగా, ప్రాంతీయ, అంతర్జాతీయ శ్రేయస్సుకు ఒక చోదక శక్తిగా నిలుస్తుంది.

క్రింది అంశాలపై దృష్టి పెడుతూ – నా ప్రభుత్వానికి ఇది ఒక అంతర్జాతీయ అనుబంధ పథాన్ని సూచిస్తుంది.

– కనెక్టివిటీని పునర్నిర్మించడం, వంతెనలను పునరుద్ధరించి, భౌగోళికంగా పొరుగున ఉన్న, దూరంగా ఉన్న ప్రాంతాలను భారతదేశంతో మళ్ళీ కలపడం.

– భారతదేశ ఆర్ధిక ప్రాధాన్యాలతో సంబంధాలను రూపొందించడం.

– అంతర్జాతీయ అవసరాలకు, అవకాశాలకు అనుగుణంగా ప్రతిభ కలిగిన యువతను అనుసంధానం చేయడం ద్వారా భారతదేశాన్ని మానవ వనరుల శక్తిగా విశ్వసించేవిధంగా తయారుచేయడం.

– హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం లలో దీవుల నుండి కరీబియన్ దీవుల వరకూ- అలాగే గొప్ప ఆఫ్రికా ఖండం నుండి అమెరికాల వరకూ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం.

– అంతర్జాతీయ సవాళ్లకు ధీటుగా భారతీయులను తయారుచేయడం.

– అంతర్జాతీయ సంస్థలను, సంఘాలను తిరిగి ఆకృతీకరించడం, తిరిగి శక్తిని అందించడం, తిరిగి నిర్మించడం. అంతర్జాతీయ శ్రేయస్సు కోసం యోగా, ఆయుర్వేదంతో సహా, భారతీయ నాగరిక వారసత్వ ప్రయోజనాలను వ్యాప్తి చేయడం. ఆ రకంగా పరివర్తనపై దృష్టి కేవలం స్వదేశంలోనే కాదు. ఇది మన అంతర్జాతీయ అజెండాను కలుపుకొని ఉంది.

“అందరితో కలిసి, అందరి వికాసం” (సబ్ కా సాత్ – సబ్ కా వికాస్) అనేది నా మటుకు నాకు కేవలం భారతదేశం కోసమే కాదు. ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఒక విశ్వాసం. దీనిలో అనేక స్థాయిలు ఉన్నాయి. అనేక ఇతివృత్తాలు ఉన్నాయి. వివిధ భౌగోళిక అంశాలను ఇది విశదపరుస్తుంది. మనతో భౌగోళికంగా, భాగస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా దగ్గరగా ఉన్న వారి గురించి నేను తెలియజేస్తాను. “పొరుగున ఉన్న వారికి తొలి ప్రాధాన్యం” అనే విధానం లో మన పొరుగున ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా మనం దృష్టి పెడుతున్నాము. దక్షిణ ఆసియా ప్రజలు రక్త సంబంధంతో, ఒకే రకమైన చరిత్ర, సంస్కృతి, ఆకాంక్షలతో కలిశారు. వారిలో ఎక్కువ మంది యువత మార్పును, అవకాశాలను, ప్రగతిని, శ్రేయస్సును కోరుకొంటున్నారు. ఒక అభివృద్ధి చెందుతున్న, బాగా కలిసిపోయే సమీకృత పొరుగు ప్రాంతం ఉండాలనేది నా స్వప్నం. గత రెండున్నర సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతో దాదాపు అన్ని పొరుగు ప్రాంతాలతో భాగస్వామ్యం కలుపుకొన్నాము. ఎక్కడైతే అవసరం ఉందో, అక్కడ ఆయా ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి బరువు బాధ్యతలను భరించాము. మా కృషి ఫలితాన్ని అక్కడ చూడవచ్చు.
అఫ్గానిస్తాన్ లో దూరప్రయాణంలో కష్టాలు ఉన్నప్పటికీ, మా భాగస్వామ్యం పునర్నిర్మాణంలో సహాయపడింది. సంస్థలను నిర్మించాము. సామర్ధ్యాలను పెంపొందించాము. ఈ నేపథ్యంలో మా భద్రత చర్యలు పటిష్టమయ్యాయి. అఫ్గానిస్తాన్ పార్లమెంటు భవనం, భారతదేశం- అఫ్గానిస్తాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి కావడం అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మా చిత్తశుద్ధికి రెండు మెరుగైన ఉదాహరణలు.

కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు ముఖ్యంగా భూ, సముద్ర జలాల సరిహద్దుల ఒప్పందం ద్వారా- బంగ్లాదేశ్ తో మేము గొప్ప ఏకాభిప్రాయాన్ని, రాజకీయ అవగాహనను సాధించాము.

నేపాల్, శ్రీ లంక, భూటాన్, మాల్దీవ్స్ లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, విద్యుత్తు, అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తిగా నిర్మించాము, ఇవి ఆ ప్రాంతంలో అభివృద్ధికి, స్థిరత్వానికీ మూలంగా నిలచాయి.

పొరుగు ప్రాంతాలపై నేను అనుసరించిన వ్యూహం వల్ల మొత్తం దక్షిణ ఆసియా తో శాంతియుత సామరస్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగానే నా పదవీ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ తో సహా ఎస్ఎఎఆర్ సి సభ్యత్వ దేశాల నాయకులందరినీ నేను ఆహ్వానించగలిగాను. ఆ కారణంగానే నేను లాహోర్ కు కూడా వెళ్లాను. అయితే భారతదేశం ఒక్కటే శాంతి బాట పట్టజాలదు. ఈ బాటలో పాకిస్తాన్ కూడా పయనించవలసి ఉంటుంది. భారతదేశంతో చర్చల బాట పట్టాలంటే పాకిస్తాన్ ముందుగా తీవ్రవాదం నుండి తప్పక బయటకు రావాలి.

సోదర సోదరీమణులారా,

ఆ తరువాత పశ్చిమం, అతి తక్కువ సమయంలో అనిశ్చితీ, సంఘర్షణ ఉన్నప్పటికీ- సౌదీ అరేబియా, యుఎఇ, కతర్, ఇరాన్ తో సహా – గల్ఫ్, పశ్చిమ ఆసియా దేశాలతో భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించాము. వచ్చే వారం, భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిధిగా గౌరవనీయులు అబు ధాబీ యువరాజుకు నేను ఆతిథ్యం ఇవ్వనున్నాను. మేము కేవలం అవగాహనలో మార్పు తీసుకురావడంపైనే దృష్టి పెట్టలేదు. మన వాస్తవ సంబంధాలలో కూడా మార్పును తీసుకువచ్చాము.

ఇది మన భద్రత ప్రయోజనాలు పరిరక్షించి, పెంపొందించడానికీ, పటిష్టమైన ఆర్ధిక బంధాలను, విద్యుత్ బంధాన్ని పెంచడానికి, దాదాపు 8 మిలియన్ భారతీయులకు సామగ్రి, సామాజిక సంక్షేమం అందించడానికీ సహాయపడింది. అలాగే మధ్య ఆసియాలో కూడా చరిత్ర, సంస్కృతి నేపథ్యంలో కొత్త అభిప్రాయాలతో సంపన్న భాగస్వామ్యం కోసం సంబంధాలను బలోపేతం చేసుకున్నాము. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మా సభ్యత్వం మధ్య ఆసియా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పటిష్టమైన సంస్థాగత సంబంధాలను కలుగజేసింది. మధ్య ఆసియాలోని సోదర, సోదరీమణుల సర్వతోముఖాభివృద్ధికి మేము పెట్టుబడి పెట్టాము.

దీనితో పాటు, ఆప్రాంతంలో దీర్ఘకాల సంబంధాల కోసం ఒక విజయవంతమైన రీసెట్ ను తీసుకువచ్చాము. మాకు తూర్పు దిక్కున, ఆగ్నేయాసియాతో మా కార్యకలాపాలు మా “యాక్ట్ ఈస్ట్” విధానానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. ఈ ప్రాంతంలో ఆగ్నేయాసియా సదస్సు వంటి సంస్ధాగతమైన నిర్మాణాలతో మేము ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకొన్నాము. ఆసియాన్ తో దాని సభ్యత్వ దేశాలతో మా భాగస్వామ్యం ఆ ప్రాంతంలో వాణిజ్యం, సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడులు, అభివృద్ధి, భద్రత భాగస్వామ్యం పెంపొందించడానికి పని చేసింది. ఈ ప్రాంతంలో విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను, స్థిరత్వాన్నీ కూడా ఇది ఆధునీకరించింది. చైనా తో మా ఒప్పందంలో విస్తృతమైన వాణిజ్య, వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని అధ్యక్షుడు శ్రీ శి, నేను అంగీకరించాము. భారతదేశం, చైనా ల అభివృద్ధి మన రెండు దేశాలకూ, మొత్తం ప్రపంచానికీ ఒక అపూర్వమైన అవకాశంగా నేను భావించాను. ఇదే సమయంలో రెండు అతి పెద్ద పొరుగు శక్తులకు కొన్ని బేధాలు, ఇబ్బందులూ ఎదురవడం కూడా అసహజమేమీ కాదు. మన సంబంధాల నిర్వహణ లో ఈ ప్రాంతంలో శాంతి, పురోగతి కోసం మన రెండు దేశాలు పరస్పర కీలక ఆందోళనలు, ప్రయోజనాల కోసం సున్నితత్వాన్నీ, గౌరవాన్నీ ప్రదర్శించుకోవలసిన అవసరం ఉంది.

స్నేహితులారా,

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ శతాబ్దం ఆసియాకు చెందినదిగా తెలియజేస్తున్నాయి. ఆసియాలో చాలా చురుకుగా మార్పు జరుగుతోంది. ఈ ప్రాంతంలో ప్రగతి, శ్రేయస్సు చాలా ఉజ్జ్వలంగా వ్యాపించి ఉన్నాయి. అయితే పెరుగుతున్న లక్ష్యాలు, శతృత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో సైనిక శక్తి, వనరులు, సంపద స్థిరంగా పెరగడంతో వాటి భద్రతకు ఖర్చు పెరిగింది. అందువల్ల ఈ ప్రాంతంలో భద్రత నిర్మాణాలు సార్వత్రికంగా, పారదర్శకంగా సమతుల్యంగా ఉండాలి. అలాగే సార్వభౌమత్వానికి అంతర్జాతీయ నిబంధనలు, గౌరవానికి తగ్గట్టుగా చర్చలు, ఊహాజనిత ప్రవర్తన పెంపొందించుకోవాలి.

స్నేహితులారా,

గత రెండున్నర సంవత్సరాలుగా యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్, ఇంకా ఇతర పెద్ద ప్రపంచ శక్తులకు మన చర్యల ద్వారా ఒక గట్టి సందేశాన్ని ఇచ్చాము. వారితో సహకరించాలన్న కోరికను తెలియజేయడం మాత్రమే కాదు- మనం ఎదుర్కొంటున్న అవకాశాలు, సవాళ్లపై మార్పు కోసం మన అభిప్రాయలు కూడా వెల్లడించాము. ఈ భాగస్వామ్యాలు భారతదేశ ఆర్ధిక ప్రాధాన్యాలు, రక్షణ, భద్రతకు సరితూగుతాయి. యునైటెడ్ స్టేట్స్ తో మన చర్యలు మొత్తం ఒప్పందాలకు వేగాన్ని, విలువను, బలాన్ని ఇచ్చాయి. కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ డోనాల్డ్ ట్రంప్ తో నా చర్చల సందర్భంగా మా వ్యూహాత్మక భాగస్వామ్యం లో భాగంగా ఈ ప్రయోజనాలపై ముందుకు వెళ్లాలని మేము అంగీకరించాము. రష్యా ఒక నిబద్ధత గల మిత్ర దేశం. ఈ రోజు ప్రపంచాన్ని ప్రతిఘటిస్తున్న సవాళ్లపై – అధ్యక్షుడు శ్రీ పుతిన్, నేను – సుదీర్ఘంగా చర్చలు జరిపాము. మా విశ్వసనీయమైన, వ్యూహాత్మక భాగస్వామ్యం – ముఖ్యంగా రక్షణ రంగం లో భాగస్వామ్యం బలపడింది.

మా సంబంధాల కొత్త పంధాలో మా పెట్టుబడులు, విద్యుత్తు, వాణిజ్యం, ఎస్ & టి లింకేజీలపై ప్రాధాన్యం చూపడం విజయవంతమైన ఫలితాలను ఇస్తున్నాయి. జపాన్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా మేము ఆనందిస్తున్నాము. ఆర్థిక పరమైన అన్ని రంగాల్లోనూ ఇది ఇప్పుడు విస్తరించింది. మా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ప్రధాని శ్రీ అబే, నేను గట్టిగా నిర్ణయించుకున్నాము. యూరోప్ తో భారతదేశ అభివృద్ధి లో ముఖ్యంగా పరిజ్ఞానం మార్పిడి, స్మార్ట్ పట్టణీకరణ లో పటిష్టమైన భాగస్వామ్యంతో మాకు ఒక ప్రణాళిక ఉంది.

స్నేహితులారా,

అభివృద్ధి చెందుతున్న తోటి దేశాలతో మా సామర్ధ్యాలను, బలాలను పంచుకోవడంలో భారతదేశం దశాబ్దాలుగా ముందంజలో ఉంది. ఆఫ్రికా లోని మా సోదర, సోదరీమణులతో గత కొన్ని సంవత్సరాలుగా మా సంబంధాలను మరింత పటిష్ఠపరచుకున్నాము. దశాబ్దాలతరబడి ఉన్న సాంప్రదాయ, చారిత్రిక సంబంధాలతో కూడిన పటిష్టమైన పునాదిపై అర్ధవంతమైన అభివృద్ధి భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నాము. ఈ రోజు మా అభివృద్ధి భాగస్వామ్యం అడుగు జాడలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

సోదర, సోదరీమణులారా,

భారతదేశానికి సముద్రయాన దేశంగా సుదీర్ఘ చరిత్ర ఉంది. మా సముద్రయాన ప్రయోజనాలు అన్ని దిశలలో వ్యూహాత్మకంగా చెప్పుకోదగినవిగా ఉన్నాయి. హిందూ మహాసముద్రయానం ప్రభావం సముద్ర తీరాన్ని దాటి విస్తరించింది. ఈ ప్రాంతంలో మొత్తం భద్రత సంబంధి అభివృద్ధి కోసం మేము ” సాగర్ ” (SAGAR – Security And Growth for All) పేరుతో చేపట్టిన చర్య మా ప్రధాన భూభాగం, దీవుల సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. మన సముద్ర సంబంధాలలో ఆర్ధిక, భద్రతాపరమైన సహకారాన్ని పెంపొందించుకోడానికి మేము చేసిన కృషి ని ఇది నిర్వచిస్తుంది. మన సముద్ర ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు, శాంతిని – ఏకాభిప్రాయం, సహకారం, సమష్టి కృషి పెంపొందిస్తాయని మాకు తెలుసు. హిందూ మహాసముద్రంలో శాంతి, శ్రేయస్సు, భద్రత అనే ప్రాధమిక బాధ్యత – ఈ ప్రాంతంలో నివసించే వారిపై ఉంటుందని మేము కూడా విశ్వసిస్తాము. మాది ప్రత్యేకమైన విధానం కాదు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలనే విధానానికి లోబడి దేశాలను సమీకరించాలన్నదే మా ఉద్దేశం. ఇండో- పసిఫిక్ సముద్రాల మధ్య భౌగోళిక ప్రాంతంలో శాంతి, ఆర్థికాభివృద్ధికి – అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సముద్రయానానికి స్వేచ్ఛ నివ్వాలని మేము విశ్వసిస్తాము.

స్నేహితులారా,

శాంతి, ప్రగతి, శ్రేయస్సు కోసం ప్రాంతీయ కనెక్టివిటీ ఉండాలని పట్టు పట్టడాన్ని మేము అభినందిస్తాము. మా పరిధిలోని పశ్చిమ, మధ్య ఆసియా, ఆసియా-పసిఫిక్ తూర్పు వైపు భాగం లో అవరోధాలను అధిగమించేందుకు మా అవసరాలు, మా చర్యల ద్వారా మేము కృషి చేస్తాము. చాబహార్ పై ఇరాన్, అఫ్గానిస్తాన్ లతో త్రైపాక్షిక ఒప్పందం, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ మార్గాన్ని తీసుకురావడానికి మా నిబద్ధతలను – రెండు విజయవంతమైన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే కేవలం కనెక్టివిటీ వల్ల ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని అధిగమించడం గాని, తగ్గించడం గాని జరగదు.

ఇందులో పాల్గొన్న దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం ద్వారా మాత్రమే- రీజనల్ కారిడర్ కనెక్టివిటీ వాగ్దానాన్ని నెరవేర్చి, విబేధాలను నివారించవచ్చు.

స్నేహితులారా,

మన సంప్రదాయం ప్రకారం మన నిబద్దతతో కూడిన అంతర్జాతీయ భారాన్ని మనం భరించాము. విపత్తు సమయంలో సహాయ, పునరావాస చర్యలను చేపట్టాము. నేపాల్ లో భూకంపం వచ్చినప్పుడు వెంటనే స్పందించాము. మాల్దీవ్స్ , ఫిజీ లలో మానవత్వ సంక్షోభం ఏర్పడినప్పుడు యమన్ నుండి తరలించాము. అంతర్జాతీయ శాంతి, భద్రతలను కాపాడటానికి మన బాధ్యతను చేపట్టడానికి కూడా మనం సంకోచించలేదు. కోస్తా నిఘా, వైట్ షిప్పింగ్ సమాచారం, పైరసీ, అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల వంటి సాంప్రదాయేతర బెదిరింపులపై సహకారాన్ని పెంపొందించాము. సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న అంతర్జాతీయ సవాళ్ళను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయాలను కూడా మనం రూపొందించాము. మతం నుండి తీవ్రవాదాన్ని తొలగించడానికి – మంచి తీవ్రవాదం, చెడ్డ తీవ్రవాదం అనే కృత్రిమ తేడాలను తిరస్కరించాలన్న మన విశ్వాసం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అదే విధంగా హింస, ద్వేషం, తీవ్రవాద ఎగుమతి వంటి వాటికి మద్దతు పలికే మన పొరుగు వారిని ఏకాకిని చేసి, వారిని నిర్లక్ష్యం చేశాము. గ్లోబల్ వార్మింగ్ సవాలుకు ప్రాధాన్యమిచ్చి ప్రముఖంగా మనం ముందుకు తీసుకువెళ్ళాము. పునరుత్పాదక శక్తి నుండి 175 గీగా వాట్లను
ఉత్పత్తి చేయాలని ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొన్నాము. ఈ దిశగా మనం ఇప్పటికే శుభారంభం కూడా చేశాము. ప్రకృతితో సామరస్య జీవనం పెంపొందించుకోవడానికి వీలుగా నాగరిక సంప్రదాయాలను మనం పంచుకొన్నాము. మానవ పెరుగుదలకు అవసరమైన సౌర శక్తి ఉత్పత్తి కోసం అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని ఏక తాటిపైకి తెచ్చాము. భారతీయ నాగరికత విధానంలో – సాంస్కృతిక, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ఇనుమడింపచేయడానికి అంతర్జాతీయ ప్రయోజనాలను పునరుజ్జీవింప చేయడానికి మనం చేసిన కృషి చాలా ఉన్నతమైనది. ఈ రోజున బౌద్ధమతం, యోగా, ఆయుర్వేదం- మొత్తం మానవజాతి- అమూల్యమైన వారసత్వంగా గుర్తింపు పొందాయి. ఈ బాటలో ప్రతి అడుగును ఉమ్మడి వారసత్వంగా భారతదేశం ఆదరిస్తూ వస్తోంది. అన్ని దేశాలు, ప్రాంతాల మధ్య ఇది సేతువుగా నిలచి అందరి సంక్షేమాన్ని పెంపొందిస్తోంది.

సోదర, సోదరీమణులారా,

చివరగా నన్ను మరొక్క మాటను చెప్పనివ్వండి. ప్రపంచాన్ని అనుసంధానం చేసే క్రమంలో, మన ప్రాచీన గ్రంథాలు మనకు మార్గ దర్శకత్వం వహించాయి.

రుగ్వేదం ” ఆ నో భద్రో : క్రత్వో యన్తు విశ్చితి: అని చెబుతోంది.

దీని అర్థం ” అన్ని వైపుల నుండి గొప్ప ఆలోచనలు నా వద్దకు చేరాలి ” అని.

సమాజంలో ఒకరిగా మనకు ఒకటి అవసరమైతే- ఎప్పుడూ మనకు నచ్చిన అనేక అవసరాలను మనకు అందుబాటులో ఉంచుకొంటాము. అలాగే కేంద్రీకృతమై ఉన్న దాంట్లో మనకు నచ్చిన భాగస్వామ్యాన్ని ఎంచుకొంటాము. ఒకరి విజయం ఎంతో మంది ఎదుగుదలను వెనుకకు నెట్టివేస్తుందన్న నమ్మకం మనకు ఉంది. మనం దీనిని ఖండించాలి. మన వ్యూహం స్పష్టంగా ఉంది. మన పరివర్తన మన ఇంట్లో నుండే ప్రారంభం కావాలి. అంతర్జాతీయ పరిధిలో మన నిర్మాణాత్మక భాగస్వామ్యం ద్వారా దీనిని సాధించాలి. మన ఇంటి నుండే నిశ్చయంగా అడుగు పడాలి. విదేశాలలో నమ్మకమైన స్నేహితులను పెంచుకోవాలి. కోట్లాది భారతీయుల భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాన్ని మనం నెరవేర్చాలి. స్నేహితులారా, ఈ ప్రయత్నంలో మీరు భారతదేశాన్ని శాంతి, ప్రగతి, స్థిరత్వం, విజయం, లభ్యత, వసతి లకు ఒక దారి చూపే దీపంలా చూడగలుగుతారు.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

మీకు అనేకానేక ధన్యవాదాలు.

***