Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి

19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి


 లావో పిడిఆర్ లోని వియాంటియన్ లో  నేడు జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఇండోపసిఫిక్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణంలోనూభారతదేశపు ఇండోపసిఫిక్ దార్శనికతక్వాడ్ సహకారంలో– ఆసియాన్ పాత్ర చాలా కీలకమని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారుతూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారతదేశం పాల్గొనడం తన తూర్పు దేశాల ప్రాధాన్యత (యాక్ట్ ఈస్ట్)లో ముఖ్యమైన విధానమని ఆయన స్పష్టం చేశారుఈ ప్రాంతంలో శాంతికీఅభివృద్ధికీ– స్వేచ్చసమ్మిళితసుసంపన్నమైననియమాల ఆధారిత ఇండోపసిఫిక్ ముఖ్యమని చెబుతూ భారతదేశ ఇండోపసిఫిక్ మహాసముద్ర కార్యక్రమంఇండోపసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య సారూప్యతసాధారణ విధానం గురించీ మాట్లాడారుఈ ప్రాంతం విస్తరణ వాదంపై దృష్టి సారించడం కంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈఏఎస్ యంత్రాంగం ప్రాముఖ్యతనుదానిని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం అందిస్తున్న మద్దతును పునరుద్ఘాటిస్తూనలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణపై ఈఏఎస్ భాగస్వామ్య దేశాల నుండి లభించిన మద్దతును ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారునలంద విశ్వవిద్యాలయంలో జరిగే ఉన్నత విద్యాధిపతుల సదస్సు కోసం ఈఏఎస్ దేశాలను ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
ఇండోపసిఫిక్‌లో శాంతిసుస్థిరతశ్రేయస్సును ప్రభావితం చేసే ప్రాంతీయఅంతర్జాతీయ సమస్యలపై కూడా నేతలు అభిప్రాయాలను పంచుకున్నారుదక్షిణార్థ గోళంలోని దేశాలపై ప్రపంచ సంఘర్షణల తీవ్ర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ… ప్రపంచంలోని సంఘర్షణల శాంతియుత పరిష్కారం కోసం మానవతా దృక్పథం ఆధారంగా సంభాషణదౌత్య మార్గాలను అవలంబించాలని ప్రధాని అభిప్రాయపడ్డారుయుద్ధభూమిలో వాటికి పరిష్కారం దొరకదని పునరుద్ఘాటించారుసైబర్సముద్ర సవాళ్లతో పాటు తీవ్రవాదం– ప్రపంచ శాంతిభద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోందనివాటికి వ్యతిరేకంగా దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుని విజయవంతంగా నిర్వహించినందుకు లావోస్ ప్రధానమంత్రికి… శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారుఆసియాన్ కొత్త అధ్యక్ష స్థానాన్ని తీసుకోబోతున్న మలేషియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకు భారతదేశం పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

 

***