Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

17 భాషల్లో.. 10 లక్షల దఫాలకుపైగా నిర్వహించిన ప్రపంచంలోనే భారీ ప్రశ్న-జవాబుల కార్యక్రమం ‘జిజ్ఞాస’ విజేతలకు ప్రధాని అభినందనలు


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జిజ్ఞాస’ క్విజ్‌ విజేతలకు అభినందనలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే భారీ ‘ప్రశ్న-జవాబు’ల కార్యక్రమం. సుసంపన్న-ఉజ్వల నైతిక విలువల సంగమమైన ప్రాచీన భారత నాగరిక విలువలు, సంస్కృతి పరిణామం ప్రధానాంశాలుగా ఈ కార్యక్రమం ఇప్పటిదాకా 17 భాషలలో 10లక్షల దఫాలకుపైగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“జిజ్ఞాస విజేతలందరికీ అభినందనలు. మన చరిత్ర, ప్రాచీన సంస్కృతిపై విజ్ఞానం ప్రోది చేసేదిశగా ఇదొక విస్తృత కృషి. ఈ కార్యక్రమానికి ఇంతటి అద్భుత స్పందన రావడం ఎంతో హర్షదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.