ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 17వ లోక్‌సభలోని ఆఖరి సభను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత ప్రజాస్వామ్యానికి నేటి సందర్భం ముఖ్యమైనదని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో, దేశానికి దిశానిర్దేశం చేయడంలో 17వ లోక్‌సభ సభ్యులందరి కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. సైద్ధాంతిక ప్రయాణాన్ని జాతికి అంకితం చేయడానికి ఈ రోజు ఒక ప్రత్యేక సందర్భం అని ఆయన అన్నారు. “సంస్కరణ, పనితీరు, పరివర్తన అనేది గత 5 సంవత్సరాలుగా మంత్రం”, ఈ రోజు మొత్తం దేశం ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తోందని ఆయన తెలిపారు. 17వ లోక్‌సభ ప్రయత్నాలకు భారత ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సభలోని సభ్యులందరి సహకారాన్ని నొక్కి చెబుతూ, వారికి ముఖ్యంగా సభ స్పీకర్‌కి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సభను ఎప్పుడూ నవ్వుతూ, సమతుల్యంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నందుకు స్పీకర్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా మహమ్మారి కాలంలో మానవాళికి సంభవించిన శతాబ్దపు అతిపెద్ద విపత్తును ప్రధాని ప్రస్తావించారు. పార్లమెంట్లో ఏర్పాట్లు చేశామని, జాతికి అవసరమైన పనిని సభలో ఆపే అవకాశం లేదని అన్నారు. మహమ్మారి సమయంలో సభ్యులు సన్సద్ నిధిని వదులుకున్నందుకు, సభ్యులు వారి జీతంలో 30 శాతం కోత విధించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రతికూల వ్యాఖ్యలకు కారణమైన సబ్సిడీ క్యాంటీన్ సౌకర్యాలను తొలగించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం, దాని నిర్మాణానికి దారితీసిన ప్రస్తుత సమావేశాల గురించి సభ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చినందుకు స్పీకర్‌ను ప్రధాని ప్రశంసించారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన సెంగోల్ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది భారతదేశ వారసత్వ పునరుద్ధరణకు చిహ్నమని, స్వాతంత్య్రం పొందిన మొదటి ఘటన స్మనపరణకు చిహ్నమని నొక్కి చెప్పారు. వార్షిక వేడుకలో సెంగోల్‌ను ఒక భాగంగా చేయాలనే స్పీకర్ నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇది భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన క్షణంతో భావి తరాలకు స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.
జి20 సమ్మిట్ ప్రెసిడెన్సీ తీసుకువచ్చిన ప్రపంచ గుర్తింపును, ప్రతి రాష్ట్రం దాని జాతీయ సామర్థ్యాలను ప్రదర్శించడాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా, పి20 సమ్మిట్ ప్రజాస్వామ్యానికి తల్లిగా భారతదేశం మూలలను బలపరిచింది.
ప్రసంగం, మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించడం ద్వారా వివిధ వార్షికోత్సవాలలో పుష్ప నివాళిని దేశవ్యాప్త కార్యక్రమాలకు విస్తరించడాన్ని కూడా ప్రధాన మంత్రి సూచించారు. ప్రతి రాష్ట్రం నుండి టాప్ 2 పోటీదారులు ఢిల్లీకి వచ్చి ప్రముఖుల గురించి మాట్లాడతారు. ఇది లక్షలాది మంది విద్యార్థులను దేశ పార్లమెంటరీ సంప్రదాయంతో అనుసంధానం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు లైబ్రరీని సామాన్య పౌరుల కోసం తెరవాలనే కీలక నిర్ణయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.
కాగిత రహిత పార్లమెంట్ భావనను, స్పీకర్ ప్రవేశపెట్టిన డిజిటల్ టెక్నాలజీ అమలును ప్రధాని మోదీ ప్రస్తావించారు, చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
17వ లోక్‌సభ ఉపయోగం దాదాపు 97 శాతానికి తీసుకువెళ్లడంలో సభ్యులకు, స్పీకర్ నైపుణ్యాలు, సభ్యుల అవగాహన యొక్క సంయుక్త కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఇది చెప్పుకోదగ్గ సంఖ్య అయినప్పటికీ, 18వ లోక్‌సభ ప్రారంభం నాటికి 100 శాతం ఉత్పాదకతను పెంచాలని, సంకల్పం తీసుకోవాలని సభ్యులను ప్రధాని కోరారు. అర్ధరాత్రి వరకు సభకు అధ్యక్షత వహించినప్పుడు 7 సెషన్లు 100 శాతం కంటే ఎక్కువ ఉత్పాదకతను సాధించాయని, సభ్యులందరూ తమ అభిప్రాయాలను చెప్పుకోవడానికి అనుమతించారని ఆయన సభకు తెలియజేశారు. 17వ లోక్‌సభ తొలి సెషన్లో 30 బిల్లులు ఆమోదం పొందడం ఒక రికార్డు అని ప్రధాని తెలియజేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నందుకు ఆనందాన్ని తెలిపిన ప్రధాని, సభ్యులు తమ నియోజకవర్గాల్లో మహోత్సవ్‌ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చినందుకు సభ్యులను ప్రశంసించారు. అదేవిధంగా 75వ రాజ్యాంగం కూడా అందరికీ స్ఫూర్తినిచ్చింది.
21వ శతాబ్దపు భారతదేశం బలమైన పునాది ఆ కాలంలోని గేమ్-ఛేంజర్ సంస్కరణలలో కనిపిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. “తరాల కోసం ఎదురుచూసిన అనేక విషయాలు 17వ లోక్‌సభ ద్వారా సాధించబడ్డాయని మేము చాలా సంతృప్తితో చెప్పగలం” అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తి వైభవం వెల్లివిరిసిందన్నారు. ఇది రాజ్యాంగ నిర్మాతలను సంతోషపెట్టి ఉంటుందని ఆయన అన్నారు. “ఈ రోజు సామాజిక న్యాయం పట్ల మా నిబద్ధత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చేరుతోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
ఉగ్రవాద ప్రమాదం గురించి ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, ఉగ్రవాదంపై పోరును పటిష్టం చేయడానికి సభ చేసిన పటిష్ట చట్టాలు కారణమని అన్నారు. దీంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో విశ్వాసం మెరుగైందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం కచ్చితంగా నెరవేరుతుందని ఆయన అన్నారు.
“ఈ దేశం 75 సంవత్సరాలు శిక్షాస్మృతి క్రింద జీవించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మనం న్యాయ సంహిత క్రింద జీవిస్తున్నామని మేము గర్వంగా చెప్పగలము”, కొత్త చట్టాల నియమావళిని ఆమోదించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి అన్నారు.
నారీ శక్తి వందన్ అధినియం ఆమోదంతో కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలను ప్రారంభించినందుకు స్పీకర్‌కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మొదటి సెషన్ మిగిలిన వాటి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో సభ మహిళా సభ్యులతో నిండిపోవడం నారీ శక్తి వందన్ అధినియం ఫలితమేనని ప్రధాని అన్నారు. మహిళల హక్కులను కాపాడేందుకు 17వ లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంపై కూడా ఆయన మాట్లాడారు.
దేశానికి రాబోయే 25 సంవత్సరాల ప్రాముఖ్యతపై వెలుగునిచ్చిన ప్రధాన మంత్రి, దేశం తన కలలను సాకారం చేసుకునేందుకు సంకల్పం తీసుకుందని అన్నారు. 1930లో మహాత్మాగాంధీ మరియు స్వదేశీ ఆందోళన్‌లచే ప్రారంభించబడిన ఉప్పు సత్యాగ్రహం గురించి ప్రస్తావిస్తూ, ఈ సంఘటనలు ప్రారంభమైన సమయంలో ఈ సంఘటనలు చాలా తక్కువగా ఉండవచ్చని, అయితే అవి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యానికి దారితీసే తదుపరి 25 సంవత్సరాలకు పునాదులు ఏర్పరిచాయని ప్రధాని ఎత్తిచూపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం ప్రతి వ్యక్తి తీసుకున్న దేశంలో కూడా ఇలాంటి అనుభూతినే కలుగుతుందని ఆయన అన్నారు.
యువత కోసం చొరవ, చట్టాలను ఎత్తి చూపుతూ, పేపర్ లీక్ సమస్యకు వ్యతిరేకంగా బలమైన చట్టం గురించి ప్రధాని ప్రస్తావించారు. ప్రధాన మంత్రి పరిశోధన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్టం విస్తృత ప్రాముఖ్యతను గుర్తించారు. భారతదేశాన్ని పరిశోధన, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు ఈ చట్టం దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
21వ శతాబ్దంలో ప్రపంచంలో ప్రాథమిక అవసరాలు మారాయని పేర్కొన్న ప్రధాని, డేటా విలువను ప్రస్తావించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆమోదం పొందడం వల్ల ప్రస్తుత తరం డేటాకు భద్రత దొరుకుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కూడా పెంచిందని ఆయన అన్నారు. భారతదేశంలో దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, దేశం వైవిధ్యాన్ని, దేశంలో అది సృష్టించిన విభిన్న డేటాను హైలైట్ చేశారు.
భద్రత కొత్త కోణాలను ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి సముద్ర, అంతరిక్ష, సైబర్ భద్రత ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. “మనం ఈ రంగాలలో సానుకూల సామర్థ్యాలను సృష్టించుకోవాలి మరియు ప్రతికూల శక్తులను ఎదుర్కోవటానికి అవసరమైన శక్తిని అభివృద్ధి చేయాలి”, అంతరిక్ష సంస్కరణలు దీర్ఘకాలిక ప్రభావాలతో ముందుకు సాగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
17వ లోక్‌సభ అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను స్పృశిస్తూ, సామాన్య పౌరుల జీవితాలను సులభతరం చేసేందుకు వేలకొద్దీ అనుమతులను తొలగించినట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు. ‘కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన’పై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, పౌరుల జీవితాల్లో కనీస ప్రభుత్వ జోక్యాన్ని నిర్ధారించడం ద్వారా ఏదైనా ప్రజాస్వామ్యం సామర్థ్యాలను గరిష్టంగా పెంచుకోవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.
60కి పైగా కాలం చెల్లిన చట్టాలను తొలగించినట్లు ప్రధాని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని మెరుగుపరచడానికి ఇది అవసరమని ఆయన అన్నారు. పౌరులను విశ్వసించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. జన్ విశ్వాస్ చట్టం ద్వారా 180 కార్యకలాపాలను నేరం కాదని నిర్ధారించినట్టు ఆయన తెలియజేశారు. మధ్యవర్తిత్వ చట్టం అనవసరమైన వ్యాజ్యం-సంబంధిత సమస్యలను ఛేదించడంలో సహాయపడింది.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ యొక్క దుస్థితిని ప్రస్తావిస్తూ, కమ్యూనిటీ కోసం చట్టం తీసుకొచ్చినందుకు సభ్యులను ప్రధాని మోదీ అభినందించారు. బలహీన వర్గాలకు సంబంధించిన సున్నితమైన నిబంధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించాల్సిన విషయమని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ట్రాన్స్జెండర్లు గుర్తింపు పొంది పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారని అన్నారు. పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు.
దాదాపు 2 సంవత్సరాల పాటు సభా కార్యకలాపాలను ప్రభావితం చేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన సభ్యులకు ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
“భారత ప్రజాస్వామ్య ప్రయాణం శాశ్వతమైనది, దేశం మొత్తం మానవాళికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు మరియు భారతదేశ జీవన విధానాన్ని ప్రపంచం అంగీకరిస్తున్నట్లు ప్రస్తావించారు మరియు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సభ్యులను కోరారు.
రాబోయే ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి సహజమైన, అవసరమైన కోణమని ప్రధాని అన్నారు. “మన ప్రజాస్వామ్యం కీర్తికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
17వ లోక్‌సభ నిర్వహణకు సహకరించినందుకు సభలోని సభ్యులందరికీ ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం గురించి ఈరోజు ఆమోదించిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, దేశంలోని భావి తరాలకు దాని వారసత్వం గురించి గర్వించేలా రాజ్యాంగపరమైన అధికారాలను ఇస్తుందని ప్రధాని అన్నారు. తీర్మానంలో ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అనే మంత్రంతో పాటు ‘సంవేద’, ‘సంకల్ప్’ మరియు ‘సహానుభూతి’ ఉన్నాయని ఆయన చెప్పారు.
ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, భవిష్యత్ తరాలకు వారసత్వాన్నిఅందించేందుకు పార్లమెంటు తన సభ్యులను ప్రేరేపించడం కొనసాగిస్తుందని, దాని సభ్యులందరి సమిష్టి కృషితో భవిష్యత్ తరాల కలలు మరియు ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని అన్నారు.
Speaking in the Lok Sabha. Watch. https://t.co/VNg1wg6oQa
— Narendra Modi (@narendramodi) February 10, 2024
17th Lok Sabha has been witness to numerous important decisions. These five years have been about 'Reform, Perform and Transform.' pic.twitter.com/jAF34BW0u4
— PMO India (@PMOIndia) February 10, 2024
भारत को इस कालखंड में G-20 की अध्यक्षता मिली और देश के हर राज्य ने विश्व के सामने देश का सामर्थ्य और अपनी पहचान बखूबी प्रस्तुत की। pic.twitter.com/2UeLa3UMYj
— PMO India (@PMOIndia) February 10, 2024
हम संतोष से कह सकते हैं कि हमारी कई पीढ़ियां जिनका सदियों से इंतजार करती आ रही थीं, वे काम 17वीं लोकसभा में हुए। pic.twitter.com/sJnHdyCw91
— PMO India (@PMOIndia) February 10, 2024
The next 25 years are crucial for India. pic.twitter.com/WElzMDttkv
— PMO India (@PMOIndia) February 10, 2024
बीते पांच वर्ष ऐतिहासिक रूप से Reform, Perform और Transform के रहे हैं। pic.twitter.com/PaAHL4wFwE
— Narendra Modi (@narendramodi) February 10, 2024
‘विकसित भारत’ बनाने के लिए आज बच्चे-बच्चे में भी अद्भुत जज्बा देखने को मिल रहा है। pic.twitter.com/o3PYH5M6y5
— Narendra Modi (@narendramodi) February 10, 2024
हमने अपनी युवा शक्ति के लिए कई ऐतिहासिक कानून बनाए हैं, जिनसे नई व्यवस्था के प्रति उनकी आस्था बढ़ेगी। pic.twitter.com/3llH03OxR1
— Narendra Modi (@narendramodi) February 10, 2024
17वीं लोकसभा ने देश के नागरिकों पर भरोसा बढ़ाने का काम किया है। pic.twitter.com/T0AUrgIVyX
— Narendra Modi (@narendramodi) February 10, 2024