Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

16వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి సమావేశం

16వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా, చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి సమావేశం


రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో 2020లో తలెత్తిన ఉద్రిక్తలకు పూర్తిగా ముగింపు పలకడం, సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన కీలక ఒప్పందాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. విభేదాలు, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, శాంతి, ప్రశాంతతకు భంగం కలగకుండా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నిర్వహణను పర్యవేక్షించేందుకు, సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించడానికి భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం త్వరలో నిర్వహించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాల సుస్థిరత, పునర్నిర్మాణం కోసం విదేశాంగ మంత్రులు, ఇతర అధికారుల స్థాయిలో చర్చలు నిర్వహిస్తామన్నారు.

రెండు పొరుగు దేశాలుగా, అతిపెద్ద దేశాలుగా భారత్, చైనాల మధ్య సుస్థిరమైన, విశ్వసనీయమైన, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇది బహుళ-ధ్రువ ఆసియా, బహుళ-ధ్రువ ప్రపంచానికి కూడా సహాయకరంగా ఉంటుందన్నారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడం, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం అలాగే అభివృద్ధి విషయంలో సవాళ్లను పరిష్కరించుకోవడానికి పరస్పర సహకారం అవసరాన్ని ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.

 

 

****