Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

11వ బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం గా ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్య‌క్షుడు శ్రీ జాయ‌ర్ మెసియాస్‌ బోల్సోనారో తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్య‌క్షుడు శ్రీ జాయ‌ర్ మెసియాస్‌ బోల్సోనారో తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ తేదీ న బ్రెసీలియా లో 11వ బ్రిక్స్ స‌మిట్ జరిగిన సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ 2020వ సంవ‌త్స‌ర గ‌ణ‌తంత్ర దినోత్సవాని కి ముఖ్య అతిథి గా హాజ‌రు కండి అంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడి ని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని బ్రెజిల్ అధ్య‌క్షుడు సంతోషం తో స్వీకరించారు.

ఈ సందర్భం లో నేత‌లు ఇరువురూ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని రెండు దేశాలు స‌మ‌గ్ర‌మైన రీతి లో పెంపొందించుకోవచ్చని స‌మ్మ‌తి ని తెలిపారు. వ్యాపారాని కి సంబంధించిన అంశాల ను చ‌ర్చించ‌డం కోసం తాను ఎదురు చూస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వివ‌రించారు. వ్య‌వ‌సాయ సామ‌గ్రి, ప‌శు పోషణ, పంట కోత‌ల అనంత‌రం వినియోగించ‌ద‌గ్గ సాంకేతిక‌త‌ లు మ‌రియు బ‌యోఫ్యూయ‌ల్స్ స‌హా బ్రెజిల్ నుండి పెట్టుబ‌డుల కు అవ‌కాశం ఉన్న రంగాల ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

బ్రెజిల్ అధ్య‌క్షుడు త‌న స‌న్న‌ద్ధ‌త ను వెల్ల‌డించి, తన వెంట భార‌త‌దేశాని కి పెద్ద సంఖ్య లో వ్యాపార ప్ర‌తినిధివ‌ర్గమొకటి విచ్చేస్తుంద‌నే సంగతి ని ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు వ‌చ్చారు. ర‌క్ష‌ణ రంగం మ‌రియు అంత‌రిక్షం రంగం స‌హా స‌హ‌కారాని కి ఆస్కారం ఉన్నటువంటి ఇత‌ర రంగాల ను గురించి కూడా వారు చర్చ జరిపారు. వీజా అక్క‌ర లేకుండా ప్ర‌యాణించేందుకు భార‌త‌దేశ పౌరుల కు అనుమతి ఇవ్వాల‌ని అధ్య‌క్షుడు తీసుకొన్నటువంటి నిర్ణ‌యాన్ని ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తించారు.