Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

106వ ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభోప‌న్యాసం


పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ వి.పి. సింహ్ గారు, మంత్రివ‌ర్గం లో నా స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధ‌న్ గారు, ఇత‌ర ఉన్న‌తాధికారులు, ఇక్క‌డ‌కు విచ్చేసిన‌టువంటి ప్ర‌తినిధులు మ‌రియు విద్యార్థులారా; నూతన సంవ‌త్సర శుభాకాంక్ష‌లు.

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ నూట ఆరో స‌మావేశాల‌ ను ప్రారంభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్ర‌ముఖ శాస్త్రవేత్త‌లు, పండితులు మ‌రియు విద్యార్థుల న‌డుమ ఉండ‌టం సంతోష‌దాయ‌కం.

స‌కాలం లో ఇక్క‌డ‌ కు చేరుకోవ‌డాని కి నేను ప్ర‌య‌త్నించిన్ప‌టి కీ, ద‌ట్ట‌మైన పొగమంచు కార‌ణం గా నేను ఆల‌స్యం గా వ‌చ్చాను.

మిత్రులారా,

ఈ స‌మృద్ధ‌మైన గ‌డ్డ మీద ఈ సంవ‌త్స‌రపు స‌మావేశాల కు ‘భావి భార‌త‌దేశం, విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం’ అనే స‌ముచిత‌మైనటువంటి ఇతివృత్తాన్ని ఇండియన్ సైన్స్ అసోసియేష‌న్ ఎంచుకొన్నందుకు నేను నిజం గా ఆనందిస్తున్నాను. భార‌త‌దేశం యొక్క భవ్య‌త్వం మ‌న జ్ఞానం లో, విజ్ఞాన శాస్త్రం లో మాత్ర‌మే కాకుడా విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను స‌మాజం తో ముడిపెట్ట‌డం లో స‌హితం ఉంద‌ని నేను న‌మ్ముతున్నాను.

మిత్రులారా,

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ కు ఒక సంపన్న‌ వార‌స‌త్వం ఉంది. భార‌త‌దేశం లోని శ్రేష్ట మేధావుల లో ఆచార్య జె.సి. బోస్‌, శ్రీ సి.వి. రామ‌న్‌, మేఘ‌నాద్ సాహా మ‌రియు ఎస్‌. ఎన్‌. బోస్ లు సహా కొంత మంది కి దీని తో అనుబంధం ఉన్నది. వారు క‌నిష్ట వ‌న‌రులు మ‌రియు గ‌రిష్ట సంఘ‌ర్ష‌ణ ల యుగం లోనే వారి ఆలోచ‌న‌ల తో, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల తో ప్ర‌జ‌ల‌ కు సేవ‌ చేశారు. వారి యొక్క సృజ‌నాత్మ‌క‌త మ‌రియు నిబద్ధత ల నుండి మ‌నం ఈ రోజు కు కూడాను ఎన్నో విష‌యాల‌ ను నేర్చుకొంటున్నాం.

ఆచార్య జ‌గ‌దీశ్ చంద్ర బోస్ 1917వ సంవ‌త్స‌రం లో బోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క‌ల‌క‌త్తా ను.. స్థాపించారు. ఇది భార‌త‌దేశం లో జాతి కి అంకిత‌మైన‌ ఒక‌టో శాస్త్రీయ ప‌రిశోధ‌న కేంద్రం. ఆయన ఇచ్చిన ప్రారంభోప‌న్యాసం విజ్ఞాన శాస్త్రం పట్ల ఆయ‌న స‌మ‌గ్ర‌ అభిప్రాయాల కు అద్దం ప‌ట్టింది. ఆయ‌న ‘‘నేను ఈ సంస్థ‌ ను కేవ‌లం ఒక ప్ర‌యోగ‌శాల గా కాకుండా ఒక దేవాల‌యం లాగా దేశ ప్ర‌జ‌ల‌ కు ఈ రోజు న అంకితమిస్తున్నాను’’ అంటూ పలికారు. ప్ర‌గాఢ‌మైన‌ మౌలిక అంత‌ర్ దృష్టుల‌ ను జాతి నిర్మాణం, అభివృద్ధి మ‌రియు సాంకేతిక విజ్ఞానం ల‌తో ఏకీక‌రించ‌డం అనే ప్రక్రియ కు వంద‌లాది భార‌తీయ శాస్త్రవేత్తల కృతులు మ‌రియు వారి జీవ‌నం సాక్షీభూతం గా నిల‌చాయి. ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క ఆధునిక దేవాల‌యాల చలవ తోనే భార‌త‌దేశం వర్తమానం లో పరివ‌ర్త‌న‌ కు లోన‌వుతూ, భ‌విష్య‌త్తు ను భ‌ద్రం గా మలచుకోవడం కోసం కృషి చేస్తోంది.

మిత్రులారా,

మ‌న పూర్వ ప్ర‌ధాని లాల్ బ‌హాదుర్ శాస్త్రి గారు మ‌న‌కు ‘జ‌య్ జ‌వాన్‌, జ‌య్ కిసాన్’ నినాదాన్ని ఇచ్చారు. పోకర‌ణ్‌ లో 20 సంవ‌త్స‌రాల క్రితం మ‌న మ‌హా ప్ర‌ధాని అట‌ల్ గారు తాను చేసిన ఒక చారిత్ర‌క ప్ర‌సంగం లో భార‌త‌దేశాని కి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం అందించిన‌టువంటి తోడ్పాటుల‌ కు గుర్తింపు ను ఇచ్చారు. ఆయ‌న ‘జ‌య్ జ‌వాన్‌, జ‌య్ కిసాన్’ నినాదాని కి అద‌నం గా ‘జ‌య్ విజ్ఞాన్’ను జోడించారు.

ప్ర‌స్తుతం మ‌రొక్క అడుగు ను ముందుకు వేయ‌వ‌ల‌సిన త‌రుణం ఆస‌న్నం అయింద‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ నినాదాని కి ‘జ‌య్ అనుసంధాన్’ అని జ‌త చేయాల‌ని నేను కోరుకుంటున్నాను. ఈ కార‌ణం గా, ముందు చెప్పుకొన్న నినాదం ఇక‌ పై ‘జ‌య్ జ‌వాన్, జ‌య్ కిసాన్, జ‌య్ విజ్ఞాన్, జ‌య్ అనుసంధాన్’గా ఉంటుంది.

వాస్త‌వం లో విజ్ఞాన్ యొక్క అనుస‌ర‌ణ రెండు ల‌క్ష్యాల‌ ను సాధించ‌డం ద్వారా నెర‌వేరుతుంది. ఆ ల‌క్ష్యాల‌ లో ఒక‌టోది, విస్తారమైన ప్ర‌తిభావంతుల త‌రం లేదా అంత‌వ‌ర‌కు ఉన్న దాని ని మార్చివేసేట‌టువంటి జ్ఞానం. ఇక రెండోది, అటువంటి జ్ఞానాన్ని సామాజిక‌, ఆర్థిక హితం కోసం వినియోగించడం. మ‌నం ఆవిష్కారం జ‌రిగేటటువంటి విజ్ఞాన శాస్త్ర సంబంధ ప‌ర్యావ‌ర‌ణాన్ని ముందుకు తీసుకు పోయే క్ర‌మం లో, స్టార్ట్‌-అప్ లు మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ పైన కూడా శ్ర‌ద్ధ‌ ను వ‌హించ‌వ‌ల‌సి ఉంటుంది.

మా ప్ర‌భుత్వం మ‌న శాస్త్రవేత్త ల‌లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను ప్రోత్స‌హించ‌డం కోసం అట‌ల్ ఇన‌వేశ‌న్ మిశ‌న్ ను ప్రారంభించింది. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల కాలం లో, అంత‌ క‌న్నా ముందు గ‌తించిన నలభై సంవ‌త్స‌రాల కాలం క‌న్నా మ‌రిన్ని సాంకేతిక వ్యాపార సంబంధ ఇంక్యుబేట‌ర్ ల‌ను నెల‌కొల్ప‌డ‌ం జరిగింది. ప‌రిశ్ర‌మ ప్ర‌స్తుతం స్టార్ట్‌-అప్ ల‌కు సంద‌ర్భోచిత దిశానిర్దేశాన్ని, దార్శ‌నిక‌త ను, మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని మ‌రియు భాగ‌స్వామ్యాన్ని అందించ‌డం ద్వారా త‌న తోడ్పాటు ను స‌మ‌కూర్చ‌వ‌ల‌సివుంది. త‌క్కువ ఖ‌ర్చు తో ల‌భ్య‌మ‌య్యే ఆరోగ్య సంర‌క్ష‌ణ, గృహ నిర్మాణం, స్వ‌చ్ఛ‌మైన గాలి, నీరు, ఇంకా శ‌క్తి, వ్యావ‌సాయిక ఉత్ప‌త్తులు మ‌రియు ఫూడ్ ప్రాసెసింగ్ ల వంటి స‌మ‌స్య ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం మ‌న శాస్త్రవేత్త‌ లు కంకణం కట్టుకోవ‌ల‌సి ఉంది. విజ్ఞాన శాస్త్రం విశ్వ‌వ్యాప్తమైనదయితే సాంకేతిక విజ్ఞానం మాత్రం స్థానిక భూమిక ను తీసుకోవాలి. ఎందుకంటే అది స్థానిక ప‌రిస్థితులకు, స్థానిక అవ‌స‌రాల కు త‌గిన‌టువంటి ప‌రిష్కార మార్గాల‌ ను క‌నుగొనాలి కనుక.

మిత్రులారా,

సామాజిక‌మైన‌ మ‌రియు ఆర్థిక‌ప‌ర‌మైన‌ స‌వాళ్ళ‌ ను ప‌రిష్కరించ‌డం కోసం సుల‌భ‌మైన‌ మ‌రియు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన‌ పరిష్కార‌ మార్గాల‌ ను జాతీయ ప‌రిశోధ‌క ప్ర‌యోగశాల‌ లు మ‌రియు శాస్త్రీయ సంస్థ‌ లు అన్వేషించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. మీకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ను నేను ఇవ్వ‌ద‌ల‌చాను. మ‌న దేశం లో రెండు హెక్టేర్ ల క‌న్నా త‌క్కువ భూమి ని క‌లిగివున్న రైతుల సంఖ్య ఎంతో ఎక్కువ‌ గా ఉంది. క‌నీస స్థాయి శ్ర‌మ తో అధికోత్ప‌త్తి ని సాధించ‌డం కోసం వారి కి సాంకేతిక విజ్ఞానం అండ అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌నం వ్యావ‌సాయిక విజ్ఞాన శాస్త్రం లో భారీ పురోగ‌తి ని న‌మోదు చేశాము. దిగుబ‌డి పెరిగింది. మ‌రి అలాగే, ఆ ఉత్ప‌త్తులు పోష‌క విలువ‌ల తో ఉంటున్నాయి. అయితే ‘న్యూ ఇండియా’ యొక్క అవ‌స‌రాల‌ ను తీర్చ‌డం కోసం చేయ‌వ‌ల‌సింది ఇంకా ఎంతో ఉంది.

బిగ్ డేటా ఆనాలిసిస్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్‌, బ్లాక్ చైన్ , ఇంకా క‌మ్యూనికేశ‌న్ కు సంబంధించిటువంటి యావ‌త్తు సాంకేతిక‌ ను త‌క్కువ ఖ‌ర్చు లో వినియోగించుకోవ‌డం పై మనం శ్ర‌ద్ధ వహించవ‌ల‌సి ఉంది. ప్ర‌స్తుతం, ఈ నాటి డిమాండు ప్ర‌కారం సెన్స‌ర్ టెక్నాల‌జి, డ్రోన్స్‌, శాటిలైట్ ఇమేజింగ్ ఇంకా ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ త‌దిత‌ర సాంకేతిక ప‌రిజ్ఞానాల తో ఒక ప్యాకేజీ ని త‌యారు చేయ‌డం ద్వారా మ‌న రైతుల‌ కు మ‌నం అవ‌శ్యం తోడ్ప‌డ‌వ‌ల‌సి ఉంది. నేటి శాస్త్రీయ ప‌ద్ధ‌తుల స‌హాయం తో మ‌న రైతులు వారి యొక్క పంట‌లు, తృణ ధాన్యాలు, సాగు నీరు, ఎరువులు, ర‌వాణా, ఇంకా కీట‌క నాశ‌నుల కు సంబంధించిన అన్ని నిర్ణ‌యాల‌ ను తీసుకోగ‌లుగుతారు.

మిత్రులారా,

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మ‌నం పెద్ద పెద్ద అడుగుల‌ ను వేసిన ట్లుగానే, మనం కోట్లాది భార‌తీయుల ‘జీవ‌న సౌల‌భ్యాన్ని’ పెంపొందించ‌డం లో శ‌ర వేగం గా కృషి చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ దిశ గా ప‌య‌నించ‌డం లో ఒక నిర్ధిష్ట ప్ర‌శ్నావ‌ళి పై మ‌నం మేధోమ‌థనాన్ని సాగించ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉన్న‌ది. వ‌ర్షం త‌క్కువ‌ గా కురిసే ప్రాంతాల లో అనావృష్టి ప‌రిస్థితుల‌ ను ఒక శాస్త్రీయ‌మైన మార్గం లో ఎదుర్కోవ‌డం పై మనం కృషి చేయ‌గ‌ల‌మా ? మ‌నం వ‌ర్షపాతం, గాలివాన లు, ఇంకా ఇత‌ర ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ ను ఇప్ప‌టి క‌న్నా మెరుగ్గా ముందస్తు అంచ‌నా వేయ‌గల‌మా ? ఇది వ్య‌వ‌సాయాని కి లాభాన్ని చేకూర్చడం ఒక్క‌టే కాకుండా ఎంతో మంది ప్రాణాల‌ ను కాపాడ‌గ‌లుగుతుంది కూడాను.

పోష‌క విలువ‌లు లోపించిన ఆహారపు వినియోగం తాలూకు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఎదురవుతున్న స‌మ‌స్య ను చక్కదిద్దడం కోసం ఒక ఉత్త‌మ‌ సాంకేతిక విజ్ఞాన సంబంధ ప‌రిష్కార మార్గాన్ని మ‌నం అన్వేషించ‌గ‌ల‌మా ? మ‌న పిల్ల‌ల‌ కు మెరుగైన ఆరోగ్యాని కి పూచీ ప‌డేట‌టువంటి ప‌రిష్కార మార్గాల‌ ను మ‌నం క‌నుగొన‌గ‌ల‌మా ? మెదడువాపు వ్యాధి, ఇంకా చికన్‌గునియా ల వంటి వ్యాధుల బారి నుండి భార‌త‌దేశాన్ని ర‌క్షించ‌గ‌ల ఒక మార్గాన్ని మ‌నం వెద‌క‌గ‌ల‌మా ? వ్య‌ర్ధ ప‌దార్థాల ను శ‌క్తి గా మార్చ‌గ‌లిగే ప్ర‌భావ‌శీల‌మైన మెల‌కువ‌ల‌ ను మ‌నం అభివృద్ధి ప‌ర‌చ‌గ‌ల‌మా ? ఇది గనక చౌక‌ లో సాధ్యమైదంటే ప‌రిస‌రాల‌ ను ప‌రిశుభ్రం గా ఉంచే చిట్కా లు ఆదాయాన్ని సంపాదించిపెట్టగలవు. నీటి ఎద్ద‌డి స‌మ‌స్య ను తీర్చ‌డం కోసం రీసైక్లింగ్ ఇంకా సంర‌క్ష‌ణ ల‌తో ముడిపడిన ఒక కొత్త మెల‌కువ‌ ను మ‌నం అభివృద్ధి ప‌ర‌చ‌గ‌ల‌మా ? మ‌న అత్యంత ముఖ్య‌మైన సంస్థ‌ల లో సైబ‌ర్ సెక్యూరిటీ ని బ‌లోపేతం చేయ‌గ‌లిగేట‌టువంటి ఒక వ్య‌వ‌స్థ ను మ‌నం అభివృద్ధిప‌ర‌చ‌గ‌ల‌మా ? అది హ్యాకింగ్ కు అతీతం గానూ ఉండాలి సుమా. సౌర శ‌క్తి ని వినియోగించుకొనే మార్గాల ను మనం కనుగొనగలమా ? ఆ పరిష్కారాలు నిరుపేద ప్ర‌జ‌ల కు అతి త‌క్కువ ధ‌ర‌ల లో అందుబాటు లోకి వ‌చ్చేలా ఉండాలి మరి. ఈ ప్ర‌శ్న‌ లు అన్నింటి కి మ‌నం స‌మాధానాల‌ ను వెద‌కి తీరాల్సిందే.

మ‌నం శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్య మాన‌వుల జీవితాల తో త‌ప్ప‌క ముడిపెట్టాలి. శ‌ర వేగం గా మార్పుల‌ కు లోన‌వుతున్న ప్ర‌పంచం లో భార‌త‌దేశం ఉన్న‌ చోటే నిల‌బ‌డిపోయి ఉండ‌ జాల‌దు. ఎవ‌రైనా దాని ని వినియోగిస్తున్నా లేదా వినియోగించ‌క‌పోయినా, మ‌నం మాత్రం దాని ని వాడుకుందాము. మ‌నం నాయ‌క‌త్వాన్ని స్వీకరించాలి. అంతేకాదు ఆ సంగతి ని ప్ర‌పంచాని కి చాటాలి. మారుతున్న కాలం తో ఒక నిర్ధిష్ట అవ‌ధి లోప‌ల మనం ప‌రిష్కార మార్గాల‌ ను క‌నుగొని తీరాలి.

మిత్రులారా,

2018వ సంవ‌త్స‌రం భార‌తీయ విజ్ఞాన శాస్త్ర రంగాని కి ఒక మంచి సంవ‌త్స‌రం గా ఉండింది. ఈ సంవ‌త్స‌రం లో మ‌నం సాధించిన సాఫ‌ల్యాల లో విమాన‌యానాని కి దోహ‌ద చేసే బ‌యో- ఫ్యూయ‌ల్ ఉత్ప‌త్తి, దృష్టి బాధిత వ్య‌క్తుల‌ కు ఉద్దేశించిన ‘దివ్య న‌య‌న్’ యంత్రం, స‌ర్వైక‌ల్ కేన్స‌ర్, క్ష‌య‌, డెంగీ ల‌ రోగ నిదానాని కి ఉప‌యోగ‌ప‌డేట‌టువంటి మ‌రీ అంత ఎక్కువ వ్య‌యం ఏమీ కాని ఉప‌క‌ర‌ణం, సిక్కిమ్, దార్జిలింగ్ ప్రాంతాల లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టాన్ని గుర్తించి, వాస్త‌వ కాల ప్రాతిప‌దిక‌ న హెచ్చ‌రిక చేసే వ్య‌వ‌స్థ‌ వంటివి చేరి ఉన్నాయి. అయితే, ఇప్ప‌టి కి కూడా ఇంకా ఎంతో దూరం పాటు మ‌నం ప్ర‌యాణించ‌వ‌ల‌సి ఉంది. మ‌న శాస్త్ర ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి కార్య‌సిద్ధుల లో ల‌భ్య‌మైన ఫ‌లితాల‌ ను పారిశ్రామిక ఉత్ప‌త్తుల‌ తో ముడి వేసి వాణిజ్య స‌ర‌ళి వినియోగాని కి అనువుగా ఉండే మార్గాల ను నిర్మించుకోవ‌ల‌సి ఉంది. భ‌విష్య‌త్తు అంతా మార్పిడుల‌దీ, సంధానించిన సాంకేతిక‌త‌ల‌దీనూ. దేశం స‌మృద్ధం అయ్యేందుకు గాను మ‌నం ఉత్ప్రేర‌కాల‌ను క‌నుగొని వాటిని వాడుక‌ లోకి తెచ్చి నిల‌క‌డైన రీతి లో మార్పు ను నిర్వ‌హించుకొంటూ ఉండాలి. విజ్ఞాన‌ శాస్త్ర సంబంధ ప్ర‌చుర‌ణ‌ల సంఖ్య విష‌యానికి వ‌స్తే ప్ర‌పంచం లోని అగ్ర‌గామి అయిదు దేశాల స‌ర‌స‌న భార‌త‌దేశం కూడా స్థానాన్ని సంపాదించుకొంద‌ని స్కోప‌స్ డేటా సూచిస్తోంది. ఇది చిన్న విజ‌యం ఏమీ కాదు. ఇది హృద‌య‌పూర్వ‌క అభినందనల కు కూడా పాత్రమైనటువంటిది. ఇది ‘ఉన్న‌తమైన భార‌త్‌, ఆధునికమైన భార‌త్‌, వైజ్ఞానిక భార‌త్’ ను నిర్మించడం కోసం ఒక గ‌ట్టి పునాది.

మిత్రులారా,

ఒక ‘ఉన్న‌త భార‌తాన్ని’ సృష్టించాలి అంటే మ‌నం విజ్ఞాన శాస్త్రాన్ని భార‌త‌దేశం లో ఆకాంక్ష‌భ‌రిత‌మైంది గా తీర్చిదిద్ద‌వ‌ల‌సి ఉంటుంది. మ‌నం పోటీ ప‌డ‌టం ఒక్క‌టే కాకుండా ఆధిప‌త్యాన్ని నిరూపించుకోవాలి. ప‌రిశోధ‌న కోస‌మే ప‌రిశోధ‌న అనేది చెల్లుబాటు కాదు. మ‌నం ప‌రిశోధన సంబంధ కృషి ని ప్రపంచం అంతా అనుస‌రించ‌డం మొదలుపెట్టే స్థాయిల‌ కు తీసుకుపోవాలి.

దీని ని సాధించ‌డం కోసం మ‌నం ప‌రిశోధ‌న‌ల కై ఒక లోతైన ఇకో- సిస్టమ్ ను ఏర్ప‌ర‌చ‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం అటువంటి ఒక యంత్రాంగం ఏర్ప‌డ‌వ‌ల‌సిన అత్యావ‌శ్య‌క‌త మ‌న‌కు ఉంది. అది జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న కావ‌చ్చు, లేదా ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ కావ‌చ్చు, జ‌నాభా కు సంబంధించిన‌టువంటి మార్పులు కావ‌చ్చు, లేదా బ‌యోటెక్నాల‌జీ మ‌రియు డిజిట‌ల్ మార్కెట్ ప్లేస్ కావ‌చ్చు.. ప్ర‌స్తుతం ఈ ఇకో- సిస్టమ్ ద్వారా మ‌నం మ‌న దేశం లోని ప్ర‌తిభావంత‌మైన వ‌యో వ‌ర్గం వారి లో ఉన్న శ‌క్తియుక్తుల నుండి లాభ‌ప‌డేందుకు అవ‌కాశం ఉంది.

మ‌నం ప్ర‌పంచం లో రానున్న కాలం లో జ్ఞానాధిక్య స‌మాజాల లో ఒక‌టి గా ఆవిర్భ‌వించాల‌నుకొంటే అటువంట‌ప్పుడు దేశం దాని యొక్క ప‌రిశోధ‌న సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవ‌డానికి చేత‌నైన ప్ర‌తి ఒక్క‌టీ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. మ‌నం ల‌క్ష్యాల‌ ను నిర్దేశించుకొని అంత‌ర్ విభాగ ఆధారిత ప‌రిశోధ‌న ను చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

మిత్రులారా,

ఒక దేశం యొక్క మేధా సంబంధి గుర్తింపు ను మ‌రియు సృజ‌న శీల‌త ను ఆ దేశ చ‌రిత్ర‌, క‌ళ‌, భాష‌, మ‌రియు సంస్కృతులు తీర్చి దిద్దుతాయి. అటువంటి ప‌రిస్థితుల లో మ‌నం ప్ర‌క్రియ‌ల బంధ‌నాల లో చిక్కుకొని పోకూడ‌దు. ప్ర‌స్తుత కాలం లో క‌ళ‌ల లోను, సామాజిక శాస్త్రం లోను, విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం లోను నూత‌న ఆవిష్కారాల మిశ్ర‌ణం తో కూడిన ప‌రిశోధ‌న ఎంత‌యినా అవ‌స‌రం. ఇది మ‌న దేశం యొక్క గుర్తింపు ను ప‌టిష్టం గా, ప్రఖ్యాతం గా ఉంచ‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

మ‌న ప్రాచీన జ్ఞానం ప‌రిశోధ‌న పై ఆధార‌ప‌డింద‌ని మ‌నం ఎల్ల‌ప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. భార‌తీయ పండితులు గ‌ణిత శాస్త్రం మొద‌లుకొని విజ్ఞాన శాస్త్రం వ‌ర‌కు, క‌ళ మొద‌లుకొని సాహిత్యం వ‌ర‌కు, భాషా శాస్త్రం మొద‌లుకొని త‌ర్కం వ‌ర‌కు, మ‌రియు వైద్యం మొద‌లుకొని త‌త్త్వ శాస్త్రం వ‌ర‌కు ప్రపంచాన్ని ఉద్ధరించారు. ఇప్పుడు ఇక ప్రపంచం లో అదే స్థానాన్ని భార‌త‌దేశం పొంద‌వ‌ల‌సిన కాలం వ‌చ్చింది. ఇది ప్ర‌పంచం లోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల లో ఒక ఆర్థిక వ్య‌వ‌స్థ గా మ‌నం ఆవిర్భ‌వించిన‌ప్పుడు మాత్ర‌మే సాధ్య‌ప‌డుతుంది. అలాగే మ‌న నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌రియు ప‌రిశోధ‌న ద్వారా ప్ర‌పంచాని కి మ‌నం ఒక దిశ‌ ను చూపిన‌ప్పుడు మాత్ర‌మే సాధ్య‌ప‌డుతుంది.

మిత్రులారా,

ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి.. ఈ రెండిటి లో మ‌న బలాలు మ‌న యొక్క జాతీయ ప్ర‌యోగ‌శాల‌ లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటి లు, ఐఐఎస్ లు, టిఐఎఫ్ఆర్ లు, ఇంకా ఐఎస్‌ఇఆర్ వెన్నెముక గా రూపుదాల్చాయి. ఏమైనా, మ‌న విద్యార్థి లోకం లో 95 శాతాని కి పైగా ప‌రిశోధ‌న కు ప‌రిమిత అవ‌కాశాలు మాత్ర‌మే ఉన్న క‌ళాశాల ల‌కు, రాష్ట్ర విశ్వ‌విద్యాల‌యాల కు వెళుతున్నారు. ఈ క‌ళాశాల‌ల్లో మ‌రియు విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌రిశోధ‌న‌ల‌ కు సంబంధించి ఒక బ‌ల‌మైన వ్య‌వ‌స్థ ను రూపొందించుకోవ‌ల‌సి ఉంది. ఈ అంశాల‌ ను స‌మ‌గ్రం గా చ‌ర్చించి, మ‌న క‌ళాశాల ల్లో, రాష్ట్ర విశ్వవిద్యాల‌యాల్లో ప‌రిశోధ‌న‌ కు ద‌న్ను గా నిల‌వ‌డం కోసం మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తో సంప్ర‌దింపులు జ‌రిపి ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ ను రూపొందించ‌వ‌ల‌సింద‌ని ప్రైమ్ మినిస్ట‌ర్స్ సైన్స్ టెక్నాల‌జీ ఎండ్ ఇన‌వేశ‌న్ కౌన్సిల్ కు నేను పిలుపునిస్తున్నాను.

మిత్రులారా,

తిరుప‌తి లో జ‌రిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాల‌ లో నేను పాల్గొని సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ ప్ర‌పంచ వ్యాప్తం గా ఉన్న‌తి ని సాధించ‌డం గురించి చెప్పి ఉన్నాను. ఇది జ‌నాభా ప‌రం గా మ‌న‌కు ఉన్న సానుకూల అంశాని కి ఇది వ‌ర‌కు ఎరుగ‌నంత‌టి ఒక స‌వాలు ను రువ్వే స‌త్తా ను క‌లిగివున్నది. దీని ని మ‌నం ప‌రిశోధ‌న‌, రోబోటిక్స్ లో నైపుణ్య సాధ‌న‌ మ‌రియు శిక్ష‌ణ‌నివ్వడం, ఆర్టిఫిశ‌ల్ ఇంటెలిజెన్స్, ఇంకా బిగ్ డేటా, ఆనాలిటిక్స్ ల వైపు మొగ్గు చూప‌డం ద్వారా ఒక భారీ అవ‌కాశం గా మ‌లచుకోవ‌చ్చును. ప్ర‌భుత్వం 3,600 కోట్ల రూపాయ‌ల‌ కు పైగా పెట్టుబ‌డి తో అంత‌ర్ విభాగ సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ సంబంధిత జాతీయ ఉద్య‌మాని కి ఆమోదాన్ని తెలిపింది. ఈ ఉద్య‌మం ఒక నిరంత‌రాయ‌ ప‌ద్ధ‌తి లో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి, సాంకేతిక‌త‌ అభివృద్ధి, మాన‌వ వ‌న‌రులు మ‌రియు ప్రావీణ్యాలు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట్‌-అప్ ఇకో సిస్ట‌మ్ బ‌ల‌మైన ప‌రిశ్ర‌మ తో పాటు అంత‌ర్జాతీయ స‌హ‌కారాల ను త‌న ప‌రిధి లోకి తీసుకొంటుంది.

డేటా అనేది ఆర్టిఫిశ‌ల్ ఇంటెలిజెన్స్ ను ముందుకు న‌డిపించే ఒక చోదక శక్తి. ఆయా మంత్రిత్వ శాఖ ల‌తో క‌ల‌సి ప‌ని చేస్తున్న మ‌న శాస్త్రవేత్త‌లు ఒక ప్ర‌భావ‌వంత‌మైన డేటా పాలిసి ని మ‌రియు అభ్యాసాల‌ ను రూపొందించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. ఇది డేటా సేక‌ర‌ణ మొద‌లుకొని, డేటా ప్ర‌వాహం నుండి డేటా ప‌రిర‌క్ష‌ణ వ‌ర‌కు, అలాగే డేటా ను వెల్ల‌డించుకోవ‌డం మొద‌లుకొని, డేటా ను వినియోగించ‌డం వ‌ర‌కు అనేక పార్శ్వాల‌ ను స్పృశిస్తుంది.

మిత్రులారా,

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం రంగం లో మ‌న నైపుణ్యాలు, మ‌న సామ‌ర్ధ్యాలు ఇటీవ‌లే స్పేస్ మిశ‌న్ యొక్క సాఫ‌ల్యాల తో రుజువు అయ్యాయి. ఈ మ‌ధ్య మనం సిఎఆర్ టిఒఎస్ఎటి 2 శ్రేణి ఉపగ్రహం సహా మార్గ‌ద‌ర్శ‌నం, క‌మ్యూనికేశ‌న్‌, ఇంకా హైప‌ర్ స్పెక్ట్ర‌ల్ ఇమేజింగ్ ల‌తో సాన్నిహిత్యం ఉన్నటువంటి 30 ఉప‌గ్ర‌హాల‌ ను ప్ర‌యోగించాం. మ‌న గ‌గ‌న్‌యాన్ లో భాగం గా 2020-22 క‌ల్లా భార‌తీయులు ముగ్గురి ని అంత‌రిక్షం లోకి పంపించే దిశ‌ గా స‌న్నాహాలు పూర్తి స్థాయి లో కొన‌సాగుతూ ఉన్నాయి.

దీనికి గాను క్రూ ఎస్కేప్ సిస్టమ్ పేరు తో ఒక ప్ర‌త్యేక సాంకేతిక విజ్ఞానాన్ని ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) కూడా ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించింది. గ‌గ‌న్‌యాన్ తాలూకు మ‌నం కంటున్న క‌ల నిర్దిష్ట కాల‌ం లో నెర‌వేరుతుంద‌ని ఆశిస్తూ ఈ విష‌యం లో మ‌న శాస్త్రవేత్త‌ల ప‌ట్ల నేను సంపూర్ణ విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తున్నాను.

మిత్రులారా,

సామాన్య మాన‌వుల జీవితాల లో మార్పుల‌ను తీసుకు రాగ‌ల విజ్ఞాన శాస్త్ర ప‌ర‌మైన మ‌రియు సాంకేతిక విజ్ఞాన ప‌ర‌మైన ప్ర‌మేయం గ‌ల రంగాలు అనేకం ఉన్నాయి. మ‌నం సాంకేతిక విజ్ఞానం యొక్క శ‌క్తి ని వినియోగించుకొని, నిరంత‌రాయం గా ప‌ని చేసే రిఫ‌రెన్స్ స్టేశ‌న్స్ నెట్‌వ‌ర్క్ ఒక‌దాని ని త‌యారుచేసి, అది అధిక స్పష్టత కలిగివుండే జియో స్పేశ‌ల్ డిజిట‌ల్ డేటా ను చాలా వేగ‌వంత‌మైన ప‌ద్ధ‌తి లో సంపాదించుకోగ‌ల‌మా ? ఇదే జ‌రిగితే, మ‌న నావికులు, శాస్త్రవేత్త‌లు, ప్ర‌ణాళిక ర‌చ‌న లో ఉన్న వారు మ‌రింత మెరుగైన డేటా ను అందుకోగ‌లుగుతారు. వారు ప్ర‌ణాళిక ర‌చ‌న ను, ప‌ర్య‌వేక్ష‌ణ ను, నిర్వ‌హ‌ణ ను, మ‌రి అలాగే అభివృద్ధి ప్ర‌ణాళిక అమ‌లు ను ఇప్ప‌టి క‌న్నా స‌మ‌ర్ధం గా నెర‌వేర్చ‌గ‌లుగుతారు.

మిత్రులారా,

ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం క్రితం సారి ఇంఫాల్ లో జ‌రిగిన‌ప్పుడు అప్ప‌ట్లో నేను సికిల్ సెల్ అనీమియ స‌మ‌స్య ను దృష్టి లో పెట్టుకొని ఒక చౌకైన, సులువైన మ‌రియు ప్ర‌భావ‌శీల‌త్వం క‌లిగిన చికిత్స ను క‌నుగొన‌ండంటూ శాస్త్రవేత్త‌లంద‌రి కి విజ్ఞ‌ప్తి చేశాను. మ‌న ఆదివాసి స‌ముదాయం ఈ వ్యాధి బారిన ప‌డ‌టం అనేది పరిపాటి గా ఉంది. దీని విష‌యం లో డిబిటి మ‌రియు సిఎస్ఐఆర్ ఒక ప్ర‌చార ఉద్య‌మాన్ని ఆరంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రెండు సంస్థ‌ ల శాస్త్రవేత్తలు ప్ర‌స్తుతం జీన్ థెర‌పీ ని అభివృద్ధిప‌ర‌చ‌డం లో తలమునకలు అయ్యారు. దీని ధ్యేయ‌మ‌ల్లా ఈ వ్యాధి కి చికిత్స‌ ను క‌నుగొన‌డం మ‌రియు ఈ వ్యాధి ని నివారించ‌డ‌మే. ఇదే జ‌రిగిన నాడు హీమోగ్లోబిన్ అవ్యవస్థల ను న‌యం చేయ‌డానికి దోహదం లభిస్తుంది.

మిత్రులారా,

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం తో పాటు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల కు ఒక వినూత్నమైన మార్గ‌సూచీ కోసం భార‌త‌దేశం ఎదురుచూస్తోంది. ఈ ల‌క్ష్యాల తోనే మ‌నం ఇటీవ‌ల ప్రైమ్ మినిస్ట‌ర్స్ సైన్స్, టెక్నాల‌జీ ఎండ్ ఇన‌వేశ‌న్ అడ్వయిజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకున్నాము. ఈ కౌన్సిల్ యుక్త‌మైన‌టువంటి విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన సంబంధ విధానాల‌ ను, సంబంధిత వ‌ర్గాలు, మంత్రిత్వ శాఖ‌ల మధ్య స‌హ‌కారాల‌ ను పెంపొందించ‌డం తో పాటు ప‌లు వ‌ర్గాల‌ కు భాగ‌స్వామ్యం ఉండేట‌టువంటి విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ ను రూపొందించడం లో తోడ్ప‌డుతుంది. ప్ర‌భుత్వం విద్య నాణ్య‌త‌ ను మెరుగు ప‌ర‌చే ప్ర‌క్రియ‌ లో మ‌రీ ముఖ్యం గా ఉన్న‌త విద్య రంగం పై శ్ర‌ద్ధ తీసుకొంటూ ఈ ప‌ని ని పూర్తి చేసే దిశ‌ లో ముందుకు పోతోంది. మేము ఉన్న‌త విద్య రంగాన్ని స‌ర‌ళ‌తరం చేశాము. క‌ళాశాలలు మ‌రియు విశ్వ‌విద్యాల‌యాల‌ కు విధి నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన మ‌రియు ఆర్థిక ప‌ర‌మైన స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తిని ఇవ్వ‌డం కోసం ద‌శల వారీ స్వ‌తంత్ర ప‌తిప‌త్తి నియ‌మాల‌ ను యుజిసి రూపొందించింది. మ‌నం ప్ర‌పంచం లో ఉత్త‌మ‌మైన సంస్థ‌ల తో పోటీ ప‌డ‌గ‌లిగిన ఇన్‌స్టిట్యూశన్స్ ఆఫ్ ఎమినెన్స్ ను ఏర్పాటు చేసే మార్గం లో ప‌య‌నిస్తున్నాము. ఈ ప్ర‌య‌త్నాలు స్ప‌ర్ధ ను ర‌గిలించి, ప్రైవేటు పెట్టుబ‌డుల‌ ను తీసుకు రాగ‌లుగుతాయి. అంతేకాదు, ఉన్న‌త విద్య సంస్థ‌ల బోధ‌న నాణ్య‌త ను మెరుగు ప‌ర‌చగ‌లుగుతాయి. మేము ప్రైమ్ మినిస్ట‌ర్ రిస‌ర్చ్ ఫెలోస్ ప‌థ‌కాన్ని ప్రారంభించాం. ఈ ప‌థ‌కం లో భాగం గా దేశం లోని ఉత్త‌మ సంస్థ ల‌కు చెందిన ఒక వేయి మంది మేధా సంప‌న్నుల‌ ను గుర్తించి, వారికి ఐఐటి లు, ఇంకా ఐఐఎస్‌సి ల‌లో పి.హెచ్‌డి. ప్రోగ్రాముల ను అభ్యసించేందుకు నేరు ప్ర‌వేశాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఈ ప‌థ‌కం నాణ్య‌మైన ప‌రిశోధ‌న కు ఒక ఉత్ప్రేర‌కం గా ప‌ని చేస్తుంది. అదే మాదిరి గా ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ‌ల లో బోధ‌న సిబ్బంది ప‌రం గా ఉన్న‌ లోటు ను తీర్చ‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

మ‌న పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇచ్చిన ఒక ఉదాహ‌ర‌ణ‌ ను నేను ఇక్క‌డ మీకు గుర్తు చేయ‌ద‌ల‌చుకొన్నాను. ఆయ‌న ఇలా ప‌లికారు .. ‘‘ఒక ప్రేర‌ణ పొందిన‌టువంటి మేధ‌స్సు కోసం ప‌ని చేసేట‌ట్లు గా విశ్వం లోని శ‌క్తుల‌ ను స్ప‌ష్ట‌మైన‌టువంటి ఊహ కు తోడు నిరంతర య‌త్నాల తో పురికొల్ప వ‌చ్చును. భార‌తీయ విజ్ఞాన శాస్త్రం లో పున‌రుజ్జీవ‌నానికి శ్రీ‌కారం చుట్టడం కోసం మ‌రియు అత్య‌ధునాత‌న ప‌రిశోధ‌న‌ కు పునాది రాయిని వేయ‌డం కోసం త‌గిన భార‌తీయ యువ మ‌స్తిష్కాల లో నిప్పు కణికల‌ ను రాజేయడం ఎలాగ ?’’

భార‌త‌దేశం సృజ‌న‌శీల‌మైన, శ‌క్తియుత‌మైన మ‌రియు విశ్వాసం ఉట్టిప‌డేట‌టువంటి మేధాశ‌క్తి ని క‌లిగివున్న ఒక కొత్త త‌రం ప్ర‌తినిధుల తో పొంగి పొర‌లుతోంది. వారి కి విజ్ఞాన శాస్త్రం స‌హాయం తో ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించ‌డం కోసం త‌గిన వేదిక ను స‌మ‌కూర్చ‌డానికి ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొంది. ఆ ఇండియా వ‌ర్త‌మానం తో పాటు భ‌విష్య‌త్తు లో ఎదుర‌య్యే స‌వాళ్ళ ను మరియు అవకాశాల ను స్వీక‌రించ‌డాని కి సర్వ స‌న్న‌ద్ధురాలై ఉంటుంది; ఆ ‘న్యూ ఇండియా’ ఆలోచ‌న‌లు, జ్ఞానం, విజ్ఞానం మ‌రియు కార్యాచ‌ర‌ణ‌.. వీట‌న్నింటి తో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది; ఆ ఇండియా ప‌టిష్టం గా, విశ్వాస‌యుక్తం గా, స‌మృద్ధం గా మ‌రియు స్వ‌స్థం గా ఉంటుంది; ఆ ఇండియా క‌రుణామ‌య‌మైంది గా, అన్ని వ‌ర్గాల‌ ను క‌లుపుకొని పోయేది గా ఉంటుంది.

మీ అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం సృజ‌నాత్మ‌కం గా, బ‌హుమాన పూర్వ‌కం గా ఉండాల‌ని నేను అభిల‌షిస్తున్నాను.

మీకు నా ధ‌న్య‌వాదాలు. మీకంద‌రికీ బ‌హుధా ధ‌న్య‌వాదాలు.

**