Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

1వ బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం గా పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ తేదీ న 11వ బ్రెసీలియా లో బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

అధ్య‌క్షుడు శ్రీ శీ జిన్ పింగ్ చెన్నై లో లాంఛనాల కు అతీతం గా జరిగినటువంటి రెండో శిఖర సమ్మేళనం సంద‌ర్భం గా త‌నకు ఆతిథేయి గా వ్యవహరించినందుకు ప్ర‌ధాన మంత్రి కి త‌న అభినంద‌న‌ల ను వ్య‌క్తం చేశారు. భార‌త‌దేశపు ప్ర‌జ‌లు మ‌రియు భారతదేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ త‌న‌ కు అందజేసిన స్వాగ‌తాన్ని తాను మ‌రువ‌బోన‌ని ఆయ‌న అన్నారు. 2020వ సంవ‌త్స‌రం లో చైనా లో జ‌రిగే ఇదే తరహా మూడో శిఖర సమ్మేళనాని కి రావలసిందంటూ ప్ర‌ధాన మంత్రి ని ఆయ‌న ఆహ్వానించారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నాని కి వేదిక ను మరియు తేదీ ని దౌత్య వర్గాల ద్వారా ఖ‌రారు చేయ‌నున్నారు.

పెట్టుబ‌డి కి మ‌రియు వ్యాపారాని కి సంబంధించిన సంభాష‌ణ‌ల ను కొన‌సాగించ‌డం ఎంతైనా ముఖ్యం అని వారు ఇరువురూ అంగీక‌రించారు. శంఘాయి లో ఇటీవ‌ల ముగిసిన చైనా ఇంపోర్ట్ ఎండ్ ఎక్స్ పోర్ట్ ఎక్స్ పో లో భార‌త‌దేశం గ‌ణ‌నీయ స్థాయి లో పాలు పంచుకొన్నందుకు ప్ర‌ధాన మంత్రి కి అధ్య‌క్షుడు శ్రీ శీ జిన్ పింగ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. నూత‌నం గా ఏర్పాటైన హై లెవ‌ల్ మెకానిజ‌మ్ ఆన్ ట్రేడ్ ఎండ్ ఎకాన‌మీ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మావేశ‌మ‌వ్వాల‌ని ఉభయ నేత‌ లు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇరు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన మీదట తత్సంబంధిత 70వ వార్షికోత్స‌వాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం లో నిర్వహించేటందుకు చేప‌డుతున్న స‌న్నాహ‌క చ‌ర్య‌ల ను నేత‌ లు స‌మీక్షించారు. ఇది ప్ర‌జ‌ల కు ప్ర‌జ‌ల కు మ‌ధ్య సంబంధాల ను పెంపొందింప చేయగలద‌ని వారు అంగీక‌రించారు.

స‌రిహ‌ద్దు ప్ర‌శ్న కు సంబంధించిన వ్య‌వ‌హారాల పై ప్ర‌త్యేక ప్ర‌తినిధులు మ‌రొక మారు స‌మావేశమవుతార‌ని నేత‌ లు తెలియజేసుకొన్నారు. స‌రిహ‌ద్దు ప్రాంతాల లో శాంతి ని మ‌రియు భ‌ద్ర‌త ను ప‌రిర‌క్షించ‌డం ముఖ్యం అని వారు పున‌రుద్ఘాటించారు.

ఆర్‌సిఇపి, డ‌బ్ల్యుటిఒ, ఇంకా బిఆర్ఐసిఎస్ స‌హా బ‌హుళపక్ష సంబంధి అంశాల పై సైతం నేత‌ లు తమ అభిప్రాయాల ను వెల్ల‌డి చేసుకొన్నారు.