Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హ్యూస్ట‌న్ లో సెప్టెంబ‌ర్ 22 వ తేదీ నాడు జ‌రుగ‌నున్న భార‌తీయ స‌ముదాయం కార్య‌క్ర‌మం లో అధ్య‌క్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ పాలు పంచుకొంటున్నందుకు హ‌ర్షాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


సెప్టెంబ‌ర్ 22 వ తేదీన టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో ‘హౌడీ మోదీ’ పేరిట జ‌రుగనున్న ఒక ప్ర‌త్యేక సాముదాయక కార్య‌క్ర‌మాని కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్షుడు మాన్య శ్రీ డోనాల్డ్ జె. ట్రంప్ హాజ‌రు అవుతారన్న వార్త ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హ‌ర్షాన్ని వెలిబుచ్చారు.  యుఎస్ అధ్య‌క్షుడు ఈ కార్య‌క్ర‌మాని కి రానుండ‌టం యుఎస్ఎ కు మ‌రియు భార‌తదేశాని కి మ‌ధ్య గ‌ల ప్ర‌త్యేక మైత్రి యొక్క ప్రాముఖ్యాన్ని చాటి చెప్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

మాన్య శ్రీ ట్రంప్ ఈ కార్య‌క్ర‌మాని కి త‌ర‌లి రానుండ‌టం ఒక ప్ర‌త్యేక‌మైన చొర‌వ ను తీసుకోవడమే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇది భార‌త‌దేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధం యొక్క శ‌క్తి ని సూచిస్తోంది. అంతే కాక అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కు మరియు అమెరికా స‌మాజాని కి భార‌తీయ స‌ముదాయం అందిస్తున్న‌ తోడ్పాటు కు గుర్తింపు గా కూడా నిల‌వ‌బోతోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Prime Minister tweeted this morning,

 

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

A special gesture by @POTUS, signifying the special friendship between India and USA!

 

Delighted that President @realDonaldTrump will join the community programme in Houston on the 22nd.

 

Looking forward to joining the Indian origin community in welcoming him at the programme.

 

25.7K

9:42 AM – Sep 16, 2019

Twitter Ads info and privacy

 

6,264 people are talking about this

 

 

 

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

The special gesture of President @realDonaldTrump to join us in Houston highlights the strength of the relationship and recognition of the contribution of the Indian community to American society and economy. #HowdyModi

 

19.6K

9:45 AM – Sep 16, 2019

Twitter Ads info and privacy

 

4,783 people are talking about this

 

 

అంతకు ముందు, శ్రీ డోనాల్డ్ ట్రంప్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నార‌ని ధ్రువీక‌రిస్తూ వైట్ హౌస్ ఈ రోజు న ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న ను విడుదల చేసింది.  ఈ కార్య‌క్ర‌మాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని ఆ ప‌త్రికా ప్ర‌క‌ట‌న వివ‌రిస్తూ, ‘‘ఇది యునైటెడ్ స్టేట్స్ ప్రజల కు, మరియు భార‌త‌దేశం ప్ర‌జ‌ల కు మ‌ధ్య నెల‌కొన్న దృఢ‌మైన బంధాన్ని స్ప‌ష్టం చేసే ఒక మ‌హ‌త్త‌ర‌మైన అవ‌కాశం అవుతుంది.  అంతేకాకుండా ప్ర‌పంచం లో అతిపెద్ద‌వైన మ‌రియు అత్యంత ప్రాచీన‌మైన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ల న‌డుమ నెల‌కొన్న‌ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తుంది;  ఉభ‌య ప‌క్షాల శ‌క్తి ని, వ్యాపార సంబంధాన్ని గాఢ‌త‌రం చేసుకోగ‌లిగే మార్గాల ను గురించి ఈ కార్య‌క్ర‌మం చ‌ర్చిస్తుంది కూడాను’’ అని పేర్కొంది.

 

 టెక్స‌ాస్ ఇండియా ఫోర‌మ్‌ వ‌చ్చే ఆదివారం- సెప్టెంబ‌ర్ 22వ తేదీ నాడు- యుఎస్ఎ లోని టెక్సాస్ లో గల హ్యూస్ట‌న్ ఎన్ఆర్‌జి స్టేడియ‌మ్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోసం ‘‘హౌడీ మోదీ – శేర్‌ డ్ డ్రీమ్స్‌,  బ్రైట్ ఫ్యూచర్స్’’ పేరు తో ఒక సాముదాయిక శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని నిర్వహించనుంది.  ఈ కార్య‌క్ర‌మాని కి యాభై వేల మంది కి పైగా హాజ‌ర‌య్యే ఆస్కారం ఉంది.