ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టక్సాస్ లోని హ్యూస్టన్ లో శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని, హ్యూస్టన్ ఈవెంట్ సెంటర్ లో గుజరాతీ సమాజ్ ను ప్రారంభించారు. ‘హౌడీ మోదీ’ కార్యక్రమం ముగిసిన అనంతరం టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ఏర్పాటు చేసిన భారతీయ సముదాయం స్వాగత సమారోహం లోనూ ఆయన పాలుపంచుకొన్నారు.
హ్యూస్టన్ లో ఇటర్నల్ గాంధీ మ్యూజియమ్ యొక్క భూమి పూజ కార్యక్రమాని కి గుర్తు గా ఒక ఫలకాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
ప్రారంభ కార్యక్రమం సందర్భం గా సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారతదేశం– యుఎస్ఎ సంబంధాల విషయానికి వస్తే, మీరంతా ఒక భవ్య చరిత కు రంగాన్ని సిద్ధం చేశారు. మీకు అందరికీ ధన్యవాదాలు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇటర్నల్ గాంధీ మ్యూజియమ్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ మ్యూజియమ్ హ్యూస్టన్ లో ఒక ప్రసిద్ధ సాంస్కృతిక చిహ్నం గా నిలచిపోతుంది అన్నారు. ‘‘ఈ ప్రయత్నం లో నా వంతు పాత్ర కూడా కొంత ఉంది. ఇది యువతీ యువకుల లో మహాత్మ గాంధీ ఆలోచనల కు తప్పక ఆదరణ పొందేటట్లు చేస్తుందన్న నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రతి సంవత్సరం కనీసం అయిదు కుటుంబాలు యాత్రికుల వలే భారతదేశాన్ని సందర్శించేటట్లు చూడవలసింది గా భారతీయ సముదాయాని కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ లు ఎక్కడ కు వెళ్ళినప్పటికీ వారి మాతృ భాష తో అనుబంధాన్ని కలిగివుండాలని ఆయన కోరారు.
**