Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హొయసలుల పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడంపై ప్రధానమంత్రి హర్షం


   హొయసలుల పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా యునెస్కో పోస్ట్‌ చేసిన సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:

“భారతదేశానికి ఇదెంతో గర్వకారణం! హొయసలుల అద్భుత పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. హొయసల రాజులు నిర్మించిన ఆలయాల సౌందర్యం వాటిపై చెక్కిన సున్నిత శిల్పరూపాలు భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలు. అంతేకాదు.. మన పూర్వికుల అత్యద్భుత కళా నైపుణ్యానికి ప్రతీకలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.