Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైద‌రాబాద్ లోని జ‌నోమ్ వ్యాలీలో జీవ వైద్య ప‌రిశోధ‌న‌ల‌కు జాతీయ వ‌న‌రుల వేదిక


హైద‌రాబాద్ లోని జ‌నోమ్ వ్యాలీలో జీవ వైద్య ప‌రిశోధ‌న‌ల‌కు జాతీయ వ‌న‌రుల వేదిక (నేష‌న‌ల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫ‌ర్ బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్‌… ఎన్.ఏ.ఆర్‌.ఎఫ్‌) ను ఏర్పాటుచేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదించింది. ఈ ఎన్‌.ఏ.ఆర్‌.ఎఫ్ ను వైద్య ప‌రిశోధ‌న‌ల భార‌తీయ మండ‌లి (ఐ.సి.ఎం.ఆర్‌) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేయాల‌ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖలోని ఆరోగ్య ప‌రిశోధ‌న‌ల విభాగం ప్ర‌తిపాదించింది. ఎన్‌.ఏ.ఆర్‌.ఎఫ్ ఏర్పాటుకు 338.58 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. ఈ వ‌న‌రుల కేంద్రం 2018-19 క‌ల్లా ప‌నిచేయ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. దేశంలో ప్ర‌యోగ‌శాల వాతావ‌ర‌ణంలో దృఢ‌మైన జంతువుల సృష్టికి ఉప‌యోగ‌ప‌డే బేసిక్‌, అప్ల‌యిడ్ బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్ కోసం ఉద్దేశించిన మొట్ట‌మొద‌టి ప‌రిశోధ‌నా వేదిక ఈ ఎన్‌.ఏ.ఆర్‌.ఎఫ్‌. యే కానుంది. అంతేకాకుండా దీనిని వేరువేరు ప‌రిశోధ‌న‌, అభివృద్ధి (ఆర్ & డి) ఉత్ప‌త్తులను ప‌రీక్షించ‌డం కోసం అవ‌స‌ర‌మ‌య్యే మూషికాలు, వాన‌రాలు త‌దిత‌ర జంతువుల‌ను ఉంచ‌డానికి పెంచ‌డానికి అనువైన ఒక ప్ర‌పంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. ఈ కేంద్రం దేశంలో ప్ర‌ధానంగా వైద్య క‌ళాశాల‌లు, ప‌రిశోధ‌నా సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాలు, బ‌యోటెక్ / బ‌యో ఫార్మా కంపెనీల‌లో ప‌రిశోధ‌న‌లకు దోహ‌ద‌ప‌డేలా లేబ‌రేట‌రీ యానిమ‌ల్స్‌ను త‌యారుచేసి అందిస్తుంది. బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్ రంగంలో కొన్ని ఎంపిక‌చేసిన ప‌రిశోధ‌న‌ల్లో పాలుపంచుకొనే సిబ్బందికి కావ‌ల‌సిన ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఈ కేంద్రం రూపొందిస్తుంది. ఈ కేంద్రం కోస‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ లోని జ‌నోమ్ వ్యాలీలో 102.69 ఎక‌రాల భూమిని కేటాయించింది.

******