Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైడ్రోకార్బన్ రంగంలో సహకారంపై భారత్, గయానా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


హైడ్రోకార్బన్ రంగంలో సహకారంపై భారత్, గయానా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. హైడ్రోకార్బన్ రంగంలో సహకారానికి సంబంధించి కుదిరిన   అవగాహన ఒప్పందం (ఎంఒయు) పై కేంద్ర  పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, గయానా సహజ వనరుల మంత్రిత్వ శాఖ  సంతకాలు చేయడానికి ఆమోదం తెలిపింది.

అవగాహన ఒప్పందం వివరాలు:

అవగాహన ఒప్పందం ప్రకారం హైడ్రోకార్బన్ రంగం విలువ ఆధారిత కార్యక్రమాల్లో భాగంగా గయానా నుంచి భారతదేశం  ముడి చమురు తీసుకుంటుంది. గయానాలో చమురు అన్వేషణ, ఉత్పత్తి  విభాగంలో భారతదేశానికి చెందిన సంస్తలు పాల్గొంటాయి. హైడ్రోకార్బన్ రంగం సహా ముడి చమురు శుద్ధి, సామర్థ్య పెంపుదల, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి కార్యక్రమాలు అమలు చేస్తాయి.  సహజ వాయువు రంగంలో సహకారం, గయానాలో చమురు, గ్యాస్ రంగంలో నియంత్రణ విధాన వ్యవస్థ  అభివృద్ధి చేయడానికి భారతదేశం  సహకారం అందిస్తుంది.  జీవ ఇంధనంతో సహా క్లీన్ ఎనర్జీ రంగం, పునరుత్పాదక రంగం.,సౌరశక్తి మొదలైన రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. 

ప్రభావం:
గయానా తో హైడ్రోకార్బన్ రంగంలో కుదిరిన  అవగాహన ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది, ఒకదానికొకటి దేశాల్లో పెట్టుబడులను పెంపొందిస్తుంది.  ముడి చమురు వనరులను వైవిధ్య పరచడానికి సహాయపడుతుంది. దీనివల్ల  దేశం ఇంధన  సరఫరా భద్రత మరింత మెరుగు పడుతుంది.  గయానాలో చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగంలో ప్రవేశించడానికి భారతదేశానికి చెందిన సంస్థలకు  అవకాశం కలుగుతుంది.అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలతో కలిసి పని చేయడం భారతదేశానికి చెందిన సంస్థలు అనుభవం పొంది ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందించ గలుగుతాయి. 

అమలు వ్యూహం, లక్ష్యాలు:

 సంతకం చేసిన తేదీ నుంచి ఈ అవగాహన ఒప్పందం అమల్లోకి వస్తుంది మరియు ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది . ఒప్పందం రద్దు చేయడానికి  మూడు నెలల ముందు ఏదైనా పక్షం మరొక పక్షానికి లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది..కాని పక్షంలో క్విన్క్వేనియం ప్రాతిపదికన ఒప్పందం పునరుద్ధరణ జరుగుతుంది. 

నేపథ్యం:

ఇటీవలి కాలంలో గయానా చమురు, గ్యాస్ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచంలో సరికొత్త చమురు ఉత్పత్తిదారుగా  గయానా   అవతరించింది. 11.2 బిలియన్ బ్యారెళ్ల చమురుకు సమానమైన నిక్షేపాలను గయానా గుర్తించింది. ఇవి మొత్తం ప్రపంచ చమురు గ్యాస్ ఆవిష్కరణలలో 18%  కనుగొన్న చమురులో 32% వరకు ఉంటాయని అంచనా. , గయానా ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాదిస్తుందని  ఒపెక్ వరల్డ్ ఆయిల్ అవుట్ లుక్ 2022 పేర్కొంది.  ద్రవాల సరఫరా 2021 లో 0.1 ఎంబి / డి నుంచి  2027 నాటికి  0.9 ఎంబి / డి కి పెరుగుతుందని ఒపెక్ అంచనా వేసింది. 

బిపి స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2022 ప్రకారం భారతదేశం ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా , 3 వ అతిపెద్ద చమురు వినియోగదారుగా, 4 వ అతిపెద్ద రిఫైనరీ సామర్థ్యం గల దేశంగా గుర్తింపు పొందింది.   పెరుగుతున్న ఇంధన అవసరాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉందని బిపి స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2022 పేర్కొంది. . బిపి ఎనర్జీ అవుట్ లుక్ మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2040 వరకు భారతదేశ ఇంధన డిమాండ్ సంవత్సరానికి 3% పెరుగుతుంది. 2020-2040 మధ్య ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ వాటా 25-28 శాతం గా ఉంటుందని అంచనా. ఇంధన భద్రత ద్వారా ప్రజలకు అందుబాటు ధరలో ఇంధన సరఫరా చేయడానికి భారతదేశం హైడ్రోకార్బన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ  ముడి చమురు వనరుల వైవిధ్య వినియోగం కోసం చర్యలు అమలు చేస్తోంది. విదేశాల్లో లభిస్తున్న ఇంధన వనరులను సాధించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనివల్ల ఇంధనం కోసం ఒకే భౌగోళిక/ఆర్థిక యూనిట్‌పై ఆధారపడటాన్ని తగ్గించి,  భారతదేశం వ్యూహాత్మక యుక్తిని బలపరుస్తుంది. 

గయానా  ప్రాముఖ్యతను  గుర్తించిన భారతదేశం  హైడ్రోకార్బన్ రంగంలో గయానా తో సహకారం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. హైడ్రోకార్బన్ రంగంలో సహకారానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గుర్తించి    గయానాతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రతిపాదించబడింది 

 దుర్చుకోవాలని ప్రతిపాదించబడింది

 

***