Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హృదయనాథ్ మంగేష్కర్ చేసిన కృతజ్ఞతా ట్వీట్‌ ను స్వీకరించిన – ప్రధానమంత్రి


అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్‌ ను ప్రారంభించిన సందర్భంగా దివంగత లతా మంగేష్కర్ తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ చేసిన కృతజ్ఞతా ట్వీట్ ను స్వీకరించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.   లతా దీదీ భగవాన్ శ్రీరామునికి అమితమైన భక్తురాలని, అందువల్ల పవిత్ర నగరమైన అయోధ్యలో ఆమె పేరు మీద చౌక్ ఉండడం సముచితమని ప్రధానమంత్రి ఈ  సందర్భంగా వ్యాఖ్యానించారు.

హృదయనాథ్ మంగేష్కర్ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ, ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ,  లతా దీదీ,  భగవాన్ శ్రీరాముని యొక్క అమితమైన భక్తురాలు.  ఆమె పేరు మీద పవిత్ర నగరమైన అయోధ్యలో చౌక్ ఉండటం సముచితం.” అని పేర్కొన్నారు. 

*****

DS/TS