కేంద్ర మంత్రి మండలిలో నా సహచరులు శ్రీమాన్ రాజ్‌నాథ్ సింగ్ జీ, హిమాచల్ ప్రదేశ్ లోకప్రియ ముఖ్యమంత్రి భాయీ జైరామ్ ఠాకూర్ జీ, హిమాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్రంలో నా సహచరుడు, హిమాచల్ ప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీ అనురాగ్ ఠాకూర్ జీ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, హిమాచల్ ప్రదేశ్ మంత్రిమండలి సభ్యులైన భాయీ గోవింద్ ఠాకూర్ జీ, ఇతర మంత్రులు, సభ్యులు, సోదర, సోదరీమణులరా..
మనందరి ప్రియతమ నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి దూరదృష్టి చొరవ కారణంగా రూపుదిద్దుకున్న ఈ సొరంగం కారణంగా కుల్లూ, లాహూల్, లేహ్-లద్దాఖ్ ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే ఈ సొరంగం మీ అందరికీ కానుకగా లభించింది. ఈ సందర్భంగా మీ అందరికీ పేరుపేరునా అభినందనలు.
హిడంబా దేవి, ఎందరో రుషులు,మునుల తపోస్థలంతోపాటు 18కోట్ల గ్రామదేవతల గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్న పవిత్రమైన ఈ పావనగడ్డకు మన:పూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. కాంచన గంగ స్థలమిది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జైరామ్ జీ వర్ణించినట్లుగా.. నాకు పారాగ్లైడింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మొత్తం కిట్ తీసుకుని పై వరకు వెళ్తామో.. చాలా అలసిపోయేవాళ్లం. బహుషా ఎవరికీ తెలియదనుకుంటా.. అటల్ జీ మనాలీ వచ్చారు. అప్పుడు నేను ఇక్కడ సంఘటనకు సంబంధించిన కార్యక్రమాలు చూసేవాడిని కాబట్టి కాస్త ముందొచ్చా. అప్పుడు మేం ఓ ప్రణాళిక రూపొదించాం. మనాలీలో వాజ్ పేయి గారు దిగగానే.. వారిపై 11 మంది పారాగ్లైడర్లు, పైలట్లతో సహా పుష్పవర్షం కురిపించాం. బహుషా ప్రపంచంలో పారాగ్లైడింగ్ ను ఈ విధంగా ఉపయోగించిన ఘటనలు లేవనే అనుకుంటా. ఆరోజు సాయంత్రం అటల్ జీని కలిసేందుకు వెళ్లినపుడు.. వారు.. భాయీ చాలా సాహసం చేస్తున్నావ్. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగారు. కానీ మనాలీలో ఆరోజు జరిగిన ఘటన నా జీవితంలోనే అత్యంత ఆనందరకరమైన జీవితాల్లో ఒకటి.
హిమాచల్ ప్రదేశ్లోని నా సోదర, సోదరీమణులారా.. అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పినట్లు ఈ స్థలంలో సభ జరుగుతోంది. ప్రజలంతా సురక్షిత దూరాన్ని పాటించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు. వారందరినీ అభినందించే చక్కటి అవకాశం నాకు దక్కింది. ఈ ప్రాంతంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను సహజంగా ఒక ప్రాంతంలోనే ఎక్కువరోజులుడే వాడిని కాదు.. చాలా వేగంగా పరిగెట్టేవాడిని. కానీ అటల్ జీ వచ్చినపుడు.. వారు ఇక్కడ ఎన్నిరోజులుంటే నేను కూడా అన్ని రోజులుండేవాడిని. అందుకే తెలియకుండానే ఈ ప్రాంతంతో ఓ చక్కటి బంధం అలవడింది. వాజ్ పేయి గారితో ఉన్నపుడల్లా.. మనాలీ, హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిపై చర్చ జరుగుతూనే ఉండేది. అటల్ జీ ఇక్కడి మౌలిక వసతులు, అనుసంధానత, పర్యాటక ఉపాధికల్పన వంటి వాటిపై ఎక్కువగా చర్చించేవారు.
వారెప్పుడూ ఓ కవిత వినిపించేవారు. మనాలీ వాసులు దీన్ని వినే ఉంటారు. వాజ్ పేయి గారికి పరిణి గ్రామంలో గడపడమంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో మక్కువ. అలాంటి అటల్ వారి కవితలో..
మనాలీ మత్ జాయియో,
రాజాకే రాజ్ మే.
జాయియో తో జాయియో,
ఉడికే మత్ జాయియో,
అధర్ మే లటకీహౌ,
వాయుదూత్ కే జహాజ్ మే.
జాయియో తో జాయియో,
సందేశా న పాయియో,
టెలిఫోన్ బిగడే హై,
మిర్ధా మహారాజ్ మే.
మిత్రులారా, మనాలీని అత్యంత ఇష్టపడే అటల్ జీ కి.. ఇక్కడి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని బలమైన కోరిక ఉండేది. మిగిలిన ప్రపంచంతో అనుసంధానత బాగుండాలని భావించేవారు. అందుకే రోహ్‌తంగ్ లో సొరంగం నిర్మించాలని నిర్ణయించారు.
ఇవాళ అటల్ జీ సంకల్పం సాకరమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అటల్ టన్నెల్ తనపై ఎంతో భారాన్ని మోస్తున్నది (సొరంగంపై దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తయిన కొండ ఉంది). లాహౌల్-స్పీతీ, మనాలీ ప్రజలు ఎంతోకాలంగా ఇంతకన్నా ఎక్కువ భారాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూనే ఉన్నారు. ఈ టన్నెల్ మోస్తున్న భారం ద్వారా.. ప్రజలపై ఎంతో కాలంగా ఉన్న బరువంతా తగ్గిపోయింది. సామాన్యులపై భారం తగ్గడం, లాహౌల్-స్పీతీ మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడం వారికి సంతోషకరం, వారి గౌరవదాయకం.
పర్యాటకులు కుల్లూ-మనాలీలో సిడ్డూ నేతితో చేసిన అల్పాహారం తిని బయలు దేరితే.. లాహౌల్ కు చేరుకుని దూమార్, చిల్డే తో మధ్యాహ్న భోజనం చేసేరోజులు ఎంతో దూరంలో లేవు. అంతకుముందు ఇది సాధ్యమయ్యేది కాదు.
సరే, కరోనా కారణంగా పరిస్థితులు కాస్త మారినా.. మెల్లి మెల్లిగా దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలవుతోంది. దేశంలోని వివిధ రంగాల్లాగే.. పర్యాటక రంగం కూడా మెల్లిగా వేగం పుంజుకుంటుందని నేను ఆశిస్తున్నాను. కుల్లూలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మిత్రులారా,
అటల్ టన్నెల్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. హమరీపూర్ లో 66 మెగావాట్ల ధౌలాసిద్ధ హైడ్రో ప్రాజెక్ట్ కు ఆమోదముద్ర వేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా దేశానికి విద్యుత్ లభిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.
మిత్రులారా,
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆధునిక మౌలిక వసతుల కల్పన ఉద్యమంలో హిమాచల్ ప్రదేశ్ భాగస్వామ్యం కూడా కీలకంగానే ఉంది. హిమాచల్ ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, హైవేలు, పవర్ ప్రాజెక్టులు, రైలు అనుసంధానత, విమానయాన అనుసంధానత వివిధ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కీరత్ పూర్ – కుల్లూ – మనాలీ రోడ్డు కావొచ్చు, జీరక్ పూర్ – పర్వానూ- సోలన్ – కైథ్లీ ఘాట్ కారిడార్ అయినా.. నాంగల్ డ్యామ్ – తల్వాడా రైల్ మార్గమైనా, భానుపల్లి – బిలాస్ పూర్ రైలు మార్గమైనా ప్రతి పని కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవలు అందించాలన్నదే మా తాపత్రయం.
మిత్రులారా, హిమాచల్ ప్రదేశ్ ప్రజల జీవనాన్ని మరింత సరళతరం చేసేందుకు రోడ్లు, విద్యుత్ వంటి కనస అవసరాలతోపాటు మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానత కూడా చాలా అవసరం. పర్యాటక కేంద్రాల వద్ద ఇలాంటివి అత్యంత అవసరంగా మారాయి. కొండలు, గుట్టల ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లోని చాలాప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం రాష్ట్రంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టిక్ ఫైబర్ లైన్లను వేసే కార్యక్రమం మొదలైంది. వచ్చే వెయ్యి రోజుల్లో ఈ కార్యక్రమం మరింత శీఘ్రగతిన పూర్తిచేయాలని సంకల్పించాం. దీని ద్వారా గ్రామాల్లో వైఫై హాట్ స్పాట్ లతోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందుతుంది. అంతేకాదు.. హిమాచల్ ప్రదేశ్ లోని పిల్లలకు విద్య, వ్యాధిగ్రస్తులకు మందులు, పర్యాటక రంగం ద్వారా ఆర్థిక సాధికారత పొందడం వంటి ఎన్నో లాభాలు చేకూరుతాయి.
अटल टनल के साथ-साथ हिमाचल के लोगों के लिए एक और बड़ा फैसला लिया गया है।
— PMO India (@PMOIndia) October 3, 2020
हमीरपुर में 66 मेगावॉट के धौलासिद्ध हाइड्रो प्रोजेक्ट को स्वीकृति दे दी गई है।
इस प्रोजेक्ट से देश को बिजली तो मिलेगी ही, हिमाचल के अनेकों युवाओं को रोज़गार भी मिलेगा: PM
पीएम किसान सम्मान निधि के तहत देश के लगभग सवा 10 करोड़ किसान परिवारों के खाते में अब तक करीब 1 लाख करोड़ रुपए जमा किया जा चुका है।
— PMO India (@PMOIndia) October 3, 2020
इसमें हिमाचल के सवा 9 लाख किसान परिवारों के बैंक खाते में भी लगभग 1000 करोड़ रुपए जमा किए गए हैं: PM
अभी तक स्थिति ये थी कि देश में अनेक सेक्टर ऐसे थे, जिनमें बहनों को काम करने की मनाही थी।
— PMO India (@PMOIndia) October 3, 2020
हाल में जो श्रम कानूनों में सुधार किया गया है, उनसे अब महिलाओं को भी वेतन से लेकर काम तक के वो सभी अधिकार दे दिए गए हैं, जो पुरुषों के पास पहले से हैं: PM
समाज और व्यवस्थाओं में सार्थक बदलाव के विरोधी जितनी भी अपने स्वार्थ की राजनीति कर लें,
— PMO India (@PMOIndia) October 3, 2020
ये देश रुकने वाला नहीं है: PM