హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్ స్ర్టక్షన్ లిమిటెడ్ (హెచ్ ఎస్ సిఎల్) ఆర్థిక పునర్నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి తన ఆమోదాన్ని తెలిపింది. ఆ సంస్థను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధీనంలో పనిచేస్తున్న నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ర్టక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ బి సి సి) టేకోవర్ చేయడానికి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.