Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలుపుతూ సాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభ సూచక జెండా ను చూపెట్టిన ప్రధాన మంత్రి

హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలుపుతూ సాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభ సూచక జెండా ను చూపెట్టిన ప్రధాన మంత్రి


హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు.  పర్పల్ లైన్ లో జోకా-ఎస్ ప్లేనెడ్ మెట్రో ప్రాజెక్టు అంతర్భాగం గా ఉన్నటువంటి జోకా-తారాతలా మార్గాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.  నాలుగు రైల్ వే ప్రాజెక్టుల ను సైతం ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు.  వాటిలో బోన్ చీ-శక్తిగఢ్ మూడో లైను,  డాన్ కునీ-చందన్ పుర్ నాలుగో లైన్ ప్రాజెక్టునిమితియా- న్యూ ఫరక్కా డబల్ లైన్ మరియు అంబారీ ఫరక్కా-న్యూ మాయానగరీ- గుమానీహాట్ డబ్లింగ్ ప్రాజెక్టు లు ఉన్నాయి.  న్యూ జల్ పాయిగుడి రైల్ వే స్టేశన్ పునర్ అభివృద్ధి పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూఈ రోజు న వారి మధ్య కు రాలేకపోయినందుకు క్షమాపణ లు చెప్పారు.  తనకు సంబంధించినంత వరకు ఈ రోజు పశ్చిమ బంగాల్ నేల కు ప్రణామాన్ని ఆచరించవలసినటువంటి రోజు అని స్వాతంత్య్ర పోరాట చరిత్ర బంగాల్ లో అణువణువున నిండిపోయి ఉండటమే దీనికి కారణం అని ఆయన అన్నారు.  ‘‘వందే మాతరమ్ నినాదం ప్రతిధ్వనించిన గడ్డ ఇవాళ వందే భారత్ ప్రారంభ సూచక పతాకాన్ని వీక్షిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.  1943వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అండమాన్ మరియు నికోబార్ దీవుల లో మువ్వన్నెల జెండా ను  ఎగురవేసితద్వారా భారతదేశం స్వాతంత్య్ర రథం తాలూకు చక్రాల ను నడిపించారన్నారు. ఈ చరిత్రాత్మకమైన దినం యొక్క 75వ వార్షికోత్సవం సందర్భం లో అండమాన్ ను సందర్శించే అవకాశంమరి నేతాజీ గౌరవార్థం ఒక దీవి కి ఆయన పేరు ను పెట్టే భాగ్యం తనకు దక్కాయి అని ప్రధాన మంత్రి గుర్తకు తీసుకు వచ్చారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా 475 వందే భారత్ రైళ్ళ ను ఆరంభించాలి అని భారతదేశం ఒక సంకల్పాన్ని చెప్పుకొన్నది.  ఈ రోజు న హావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి కి  ప్రయాణం మొదలుపెట్టిన రైలు ఆ వందే భారత్ రైళ్ళ లో ఒకటి అని ఆయన వివరించారు.  ఈ రోజు న ప్రారంభోత్సవం జరుపుకొంటున్నటువంటి అనేక ప్రాజెక్టు లను గురించి మరియు శంకుస్థాపన జరుపుకొంటున్నటువంటి వివిధ ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూప్రభుత్వం ఈ ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి దాదాపు గా 5,000 కోట్ల రూపాయల ను వెచ్చిస్తోందన్నారు.

 

గంగ నది ని శుభ్రపరచడాని కి మరియు పశ్చిమ బంగాల్ కు తాగునీటి ని ఇవ్వడానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు ఈ  రోజు న అంకితం చేసే అవకాశం తాను అందుకోబోతున్నట్లు కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు.  నమామి గంగే పథకం లో భాగం గా పశ్చిమ బంగాల్ లో 25 మురికినీటి సంబంధి ప్రాజెక్టుల ను ఆమోదించడమైంది అని ఆయన అన్నారు.  వాటిలో 11 ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణం ముగించుకొన్నాయిమరో ఏడు ప్రాజెక్టుల పనుల ను ఈ రోజు తో ముగించడం జరుగుతోంది అని తెలిపారు.  1500 కోట్ల రూపాయల ఖర్చు తో కొత్త పథకాల తాలూకు పనుల ను ఈ రోజు న మొదలు పెట్టడం జరుగుతోంది అని ఆయన అన్నారు.  ఆది గంగ ప్రాజెక్టు వంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్టు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూఈ ప్రాజెక్టు శుభ్రత నిమిత్తం 600 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ను సమకూర్చడం జరుగుతోంది అని వివరించారు.  నది జలాల శుద్ధి తో పాటుపెద్ద సంఖ్య లో ఆధునిక సీవేజి ట్రీట్ మెంట్ ప్లాంటుల ఏర్పాటు పై సైతం కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  రాబోయే 10-15 ఏళ్ళ అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ఈ పని ని చేపట్టడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

దేశం యొక్క అభివృద్ధి తో భారతీయ రైల్ వే ల సంస్కరణల కు మరియు భారతీయ రైల్ వే ల అభివృద్ధి పనుల కు లంకె ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ కారణం గానేకేంద్ర ప్రభుత్వం ఆధునిక రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాల కల్పన కై భారీ ఎత్తున పెట్టుబడుల ను పెడుతున్నది అని ఆయన వివరించారు.  వందే భారత్తేజస్ హమ్ సఫర్ఇంకా విస్టాడోమ్ రైలు పెట్టె  లున్యూ జల్ పాయిగుడి సహా పలు రైల్ వే స్టేశన్ ల ఆధునికీకరణరైల్ వే మార్గాల డబ్లింగ్ఇంకా విద్యుతీకరణ లు ఈ ఆధునికీకరణ తాలూకు ఉదాహరణలు గా ఉన్నాయి ఆయన వివరించారు.  ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ మరియు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లు లాజిస్టిక్స్ రంగం లో విప్లవాత్మకమైన మార్పుల ను తీసుకు రాబోతున్నాయి అని కూడా ఆయన చెప్పారు.  రైల్ వే భద్రతపరిశుభ్రతసమన్వయంసామర్థ్యంసమయ పాలనఇంకా సౌకర్యాల కల్పన ల వంటి రంగాల లో చోటు చేసుకొన్న పెను మార్పుల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు.  గడచిన సంవత్సరాల లో భారతీయ రైల్ వే లు ఆధునికత్వం తాలూకు పునాది విషయం లో శ్రమించాయిమరి రాబోయే సంవత్సరాల లో భారతీయ రైల్ వే నవీనీకరణ తాలూకు ఒక కొత్త యాత్ర ను మొదలు పెట్టబోతోంది అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.  స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి 70 సంవత్సరాల కాలం లో 20 వేల రూట్ కిలో మీటర్ రైలు మార్గాల ను విద్యుతీకరించడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలియజేశారు.   2014వ సంవత్సరం నాటి నుండి చూస్తే 32 వేల రూట్ కి. మీ. కి పైగా రైలు మార్గాల ను విద్యుతీకరించడమైంది అని ఆయన  అన్నారు.  మెట్రో రైల్ సిస్టమ్ అనేది ప్రస్తుతం భారతదేశం యొక్క వేగాని కి మరియు స్థాయి కి ఒక ఉదాహరణ గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘2014 వ సంవత్సరానికి పూర్వం 250 కి.మీ. కన్నా తక్కువ స్థాయి లోనే ఉన్నటువంటి మెట్రో నెట్ వర్క్ లో ఎక్కువ భాగం దిల్లీ-ఎన్ సిఆర్ పరిధి లో అమరింది.  గత ఏడెనిమిది ఏళ్ళ లో మెట్రో రెండు డజన్ ల కు పైగా నగరాల కు విస్తరించింది.  ప్రస్తుతం మెట్రో దాదాపు గా దేశం లో వేరు వేరు నగరాల లో 800 కి. మీ.  మేరకు పరుగులు తీస్తోంది.  మరో 1000 కి. మీ. కి పైచిలుకు మెట్రో మార్గాల లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.’’ అని ఆయన వెల్లడించారు.

 

గత కాలం లో భారతదేశం ఎదుర్కొన్న సవాళ్ళ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూఆ పరిణామం భారతదేశం యొక్క అభివృద్ధి మీద చాలా  వరకు ప్రతికూల ప్రభావాన్ని కలగజేసింది అని పేర్కొన్నారు.  ఒక ముఖ్య సవాలు ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూదేశం లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రక్రియ లో భాగం పంచుకొన్న వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం లోపించిందని పేర్కొన్నారు.  వివిధ రవాణా ఏజెన్సీల నడుమ సహకారం కొరవడడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  తత్ఫలితం గా ఇతర ఏజెన్సీ లు ఏమేమి పనులు చేస్తున్నదీ ప్రభుత్వ ఏజెన్సీ కి ఒక అవగాహన లేకుండా పోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘ఇది దేశం లోని నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల పైన ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింప చేసింది’’ అని ఆయన అన్నారు.  వారు కష్టపడి సంపాదించిన డబ్బు ను పేద ప్రజల కు ఉపయోగించడానికి బదులు గా అవినీతిపరుల జేబుల ను నింపడానికి ఉపయోగించడం జరిగింది.   దీనితో సహజం గానే అసంతృప్తి తల ఎత్తింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ‘‘ఏజెన్సీ ల సమన్వయం లో అంతరాల ను భర్తీ చేయడం కోసం పిఎమ్ గతి శక్తి ప్లాను ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.  ‘‘వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చునిర్మాణ సంస్థలు కావచ్చులేదా పరిశ్రమ నిపుణులు కావచ్చు.. ప్రతి ఒక్కరు గతి శక్తి ప్లాట్ ఫార్మ్ పైకి వచ్చి నిలబడుతున్నారు’’ అని ఆయన అన్నారు.  పిఎమ్ గతి శక్తి అనేది దేశం లోని వేరు వేరు రవాణా మాధ్యాల కలబోత కు మాత్రమే పరిమితం కాదు.  అది బహుళ విధ ప్రాజెక్టుల కు జోరు ను  సైతం సంతరిస్తుంది అని ఆయన తెలిపారు.  పౌరుల కు అంతరాయం ఉండనటువంటి విధం గా కనెక్టివిటీ ని అందించడం కోసమని కొత్త విమానాశ్రయాల నుజలమార్గాల నునౌకాశ్రయాల ను మరియు రహదారుల ను నిర్మించడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి వివరించారు.

 

‘‘21వ శతాబ్దం లోకి అడుగు పెట్టడాని కి దేశ ప్రజల శక్తియుక్తుల ను మనం సరిగ్గా ఉపయోగించుకొని తీరవలసిందే’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  దేశం లో జల మార్గాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూపనులు జరుపుకోవడానికివ్యాపారాని కిపర్యటన కు దేశం లోని జలమార్గాల ను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్న కాలం అంటూ ఒకటి ఉండిందనిఅయితే ఆ తరువాత బానిసత్వం లో దేశం మగ్గిపోయిన కాలం లో ఆ మార్గాల ను ధ్వంసం చేయడం జరిగిందన్నారు.  దేశం లో జల మార్గాల ను పునరుద్ధరించడం లో మునుపటి ప్రభుత్వాలు ప్రయత్న లోపాని కి ఒడిగట్టాయని కూడా ఆయన అన్నారు.  ‘‘భారతదేశం ప్రస్తుతం తన జల శక్తి ని వృద్ధి చెందింప చేసుకొనే దిశ లో పాటుపడుతున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ప్రస్తుతం  100 కు పైగా జలమార్గాల ను అభివృద్ధి పరచడం జరుగుతోంది.  వ్యాపారాని కిపర్యటన కు ప్రోత్సాహాన్ని అందిస్తూనదుల లో అధునాతనమైన క్రూజ్ శిప్స్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు సాగుతున్నాయి అని ఆయన తెలిపారు.  భారతదేశాని కిబాంగ్లాదేశ్ కు మధ్య గంగ నది మరియు బ్రహ్మపుత్ర నదుల లో జల మార్గ సంబంధాల ను ఏర్పాటు చేయడం కోసం గంగ-బ్రహ్మపుత్ర ప్రాజెక్టు ను అభివృద్ధి చేయడం జరుగుతోంది అంటూ ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  2023వ సంవత్సరం జనవరి 13వ తేదీ నాడు కాశీ నుండి బాంగ్లాదేశ్ మీదుగా డిబ్రూగఢ్ వరకు ఒక నౌక ప్రయాణం మొదలు పెట్టబోతోందని ఆయన చెప్తూ, 3200 కిమీ పొడవైన జలమార్గం లో సాగే ఈ తరహా యాత్ర యావత్తు ప్రపంచం లోనే మొట్టమొదటి సారి గా చోటు చేసుకొంటోంది.  అంతేకాదుఇది దేశం లో క్రూజ్ టూరిజమ్ వృద్ధి చెందుతున్నది అనే అంశాన్ని చాటి చెప్పనుంది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు.

 

పశ్చిమ బంగాల్ లో ప్రజల కు మాతృభూమి పట్ల గల ప్రేమ ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూభారతదేశం లో సాంస్కృతిక వారసత్వాని కి ప్రతీకలు గా ఉన్న వివిధ ప్రదేశాల ను సందర్శించడం అంటే వారు ఎక్కడలేని ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారుమరి అటువంటి యాత్ర ల ద్వారా వారు అనేక విషయాలను తెలుసుకొంటూ ఉంటారు అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘బంగాల్ ప్రజలు ‘దేశాని కే అగ్రతాంబూలం’ అనేటటువంటి భావన కు పెద్ద పీట ను వేస్తారుపర్యటన విషయం లో అయినా సరే వారు ఇదే విధమైన ప్రాధాన్యాన్ని కట్టబెడతారు’’ అని ఆయన వివరించారు.  ‘‘దేశం లో కనెక్టివిటీ కి అండదండలు లభించాయి అంటే కనుక దేశం లో రైలు మార్గాలుజల మార్గాలురాజ మార్గాలు మరింత ఆధునికం గా మారుతున్నాయంటే కనుక అటువంటి సందర్భాల లో ఒనగూరే ఫలితం ఏమిటి అంటే అది ప్రయాణించడం లో సౌలభ్యం లభించడమే కాక దాని ద్వారా బంగాల్ ప్రజానీకం సైతం లాభపడుతుంది మరి’’ అని శ్రీ నరేంద్ర  మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి  తన ప్రసంగాన్ని ముగించే ముందు గురు శ్రీ రవీంద్రనాథ్ టాగోర్ పలుకుల ను కొన్నిటి ని ఉచ్చరించారు.  ఆ మాటల కు  ‘‘ఓ నా దేశ మృత్తికానీకు నేను శిరస్సు ను వంచి ప్రణామాన్ని ఆచరిస్తున్నాను’’ అనే అర్థం వస్తుంది.  స్వాతంత్య్రం తాలూకు ఈ అమృత కాలం లో ప్రతి ఒక్క వ్యక్తి మన మాతృభూమి కి అత్యంత ప్రాధాన్యాన్ని కట్టబెట్టే దిశ లో తప్పక పాటుపడాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘యావత్తు ప్రపంచం భారతదేశానికేసి ఎంతో ఆశ తోఎన్నో ఆకాంక్షల తో చూస్తున్నది.  దేశం లో ప్రతి ఒక్క పౌరుడుప్రతి ఒక్క పౌరురాలు వారి ని వారు దేశ సేవ కోసం సమర్పణం చేసుకు తీరాలి’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ కార్యక్రమం లో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బనర్జీ గారుపశ్చిమ బంగాల్ గవర్నరు డాక్టర్ సి.వి. ఆనంద బోస్,  రైల్ వే ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్కేంద్ర సహాయ మంత్రులు శ్రీ జాన్ బార్ లాడాక్టర్ సుభాష్ సర్ కార్ మరియు శ్రీ నిశీథ్ ప్రమాణిక్ఇంకా  పార్లమెంటు సభ్యుడు శ్రీ ప్రసూన్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.       

 

పూర్వరంగం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హావ్ డా రైల్ వే స్టేశన్ లో హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు  ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. ఈ అత్యధునాతనమైనటువంటి సెమీ హై స్పీడ్ రైలుబండి లో ప్రయాణికుల కు అత్యాధునిక సదుపాయాల ను సమకూర్చడం జరిగింది. ఈ రైలుబండి రాకపోక లు జరిపేటప్పడు మార్గమధ్యం లో మాల్ దా టౌన్బార్ సోయి మరియు కిశన్ గంజ్ స్టేశన్ లలో ఆగుతుంది.

 

జోకా-ఎస్ ప్లేనెడ్ మెట్రో ప్రాజెక్టు (పర్పల్ లైన్) లో భాగం గా ఉన్న జోకా-తారాతలా మార్గాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.  6.5 కిలో మీటర్ ల మేరకు ఏర్పాటు చేసిన ఈ మార్గం లో మొత్తం ఆరు స్టేశన్ లను 2475 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరిగింది. ఆ ఆరు స్టేశన్ ల పేరు లు ఏవేవి అంటే అవి జోకాఠాకుర్ పుకుర్సఖర్ బాజార్బేహలా చౌరస్తాబేహలా బాజార్ మరియు తారాతలా లు. ఈ ప్రాజెక్టు ప్రారంభం అయితే కోల్ కాతా నగరం లో దక్షిణ దిక్కున గల సర్ సునాడాక్ ఘర్ముచీపాడా లతో పాటుగా దక్షిణ 24 పరగణా ల ప్రయాణికుల కు చాలా మేలు కలుగుతుంది.

 

ప్రధాన మంత్రి నాలుగు రైల్ వే ప్రాజెక్టుల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు.  వీటిలో బోన్ చీ-శక్తిగఢ్ మూడో మార్గాన్ని 405 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైందిడాన్ కునీ-చందన్ పుర్ నాలుగో లైన్ ప్రాజెక్టు ను 565 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైందినిమితియా- న్యూ ఫరక్కా డబల్ లైన్ ను 254 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైందిఅలాగే అంబారీ ఫరక్కా-న్యూ మాయానగరీ- గుమానీహాట్ డబ్లింగ్ ప్రాజెక్టు ను 1080 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. 335 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేయనున్న న్యూ జల్ పాయిగుడీ రైల్ వే స్టేశన్ పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

 

*****

DS/TS