Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హర్యానా ముఖ్యమంత్రిగా శ్రీ నాయబ్ సైనీ ప్రమాణంపై ప్రధాని అభినందన


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నాయబ్ సైనీకి అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర కొత్త మంత్రిమండలి సభ్యులకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీ నాయబ్ సైనీ @Nayab SainiBJPకి అభినందనలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో చేస్తున్న కృషికి ఆయనతోపాటు మంత్రిమండలి సభ్యులందరికీ నా శుభాకాంక్షలు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.