Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్)త్యాగాల ను ఆశూరా దినం సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి 


హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) యొక్క త్యాగాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశూరా దినం సందర్భం లో గుర్తు కు తెచ్చుకొంటూ, ఆయన ను సత్యం పట్ల అచంచల నిబద్ధత, అలాగే అన్యాయానికి వ్యతిరేకంగా సలిపిన పోరాటానికి గాను స్మరించుకోవడం జరుగుతుంటుంది అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) యొక్క త్యాగాల ను స్మరించుకొనేటటువంటి రోజు ఈ రోజు. ఆయన ను సత్యం పట్ల అచంచల నిబద్ధత మరియు అన్యాయానికి వ్యతిరేకంగా సలిపిన పోరాటానికి గాను స్మరించుకోవడం జరుగుతుంటుంది. ఆయన సమానత్వాని కి మరియు సోదర భావాని కి కూడా చాలా మహత్వాన్ని ఇస్తూ ఉండే వారు.’’ అని పేర్కొన్నారు.