ఈ రెండు ప్రాజెక్టులు పంజాబ్‌లోని ముక్తసర్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్‌లలో నీరు నిలిచిపోవడాన్ని అరికడుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, రాజస్థౄన్ ఫీడర్ క ఆలువ, సర్‌హింద్ ఫీడర్ కాలువల రీలైనింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర సహాయం కింద రూ 620.42 కోట్ల రూపాయలు, రూ 205.758 కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదం తెలిపింది. పంజాబ్‌లో సర్‌హింద్ ఫీడర్ కాలువకు ఆర్‌డి 119700 నుంచి 447927 వరకు రీలైనింగ్‌పనులు చేపట్టేందుకు, రాజస్థాన్ ఫీడర్ కాలువకు ఆర్‌డి 179000 నుంచి 496000 వరకు పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభావంః
1.పంజాబ్‌లోని నైరుతి ప్రాంతంలో గల ఫిరోజ్‌పూర్, ఫరీద్‌కోట్, ముక్తసర్ జిల్లాలలో 84800 హెక్టార్ల భూమిలో నీరు నిలిచిపోతున్న సమస్యలను తొలగించేందుకు ఈ రెండు ప్రాజెక్టులు ఉపయోగపడతాయి.
2. ఈ రెండు ప్రాజెక్టులు నైరుతి పంజాబ్ భూములలో నీరు నిలిచేసమస్యను పరిష్కరించడంతోపాటు రెండు కాలువలలో నీటిపారుదలను మెరుగు పరచడానికి, రెండు కాలువలలో నీటి లభ్యత పెరగడానికి దోహదపడుతుంది.
3. రాజస్థాన్ ఫీడర్ రీలైనింగ్ ద్వారా 98,739 హెక్టార్లు, సర్‌హింద్ ఫీడర్ రీలైనింగ్ ద్వారా 69,086 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం మెరుగుపడడం, ఆయకట్టు స్థిరీకరణ ద్వారా ఆ ప్రాంత రైతులు ప్రయోజనం పొందుతారు.
వ్యయంః
రాజస్థాన్ ఫీడర్, సర్ హింద్ ఫీడర్ కాలువల నిధులకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని నాబార్డ్ నిధుల ద్వారా అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుత ఎల్‌టిఐఎఫ్ కింద 99 పిఎంకెఎస్‌వై-ఎఐబిపి ప్రాజెక్టుల ఫండింగ్‌లో భాగంగా ఇది ఉంటుంది.
దీనికితోడు ప్రస్తుత ప్రాజెక్టులపై సెంట్రల్ వాటర్‌కమిషన్ యంత్రాంగం పరిశీలనతోపాటు ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన మొత్తం పనులను పర్యవేక్షించేందుకు నిపుణులతో కూడిన ప్రాజెక్టు సమీక్షా కమిటీ ఒకదానిని ఏర్పాటు చేస్తారు.
2015 నాటి ధరల అంచనాల ప్రకారం,సర్‌హింద్ ఫీడర్ కెనాల్ రీలైనింగ్‌కు అనుమతించిన వ్యయం రూ. 671.478 కోట్ల రూపాయలు. రాజస్థాన్ ఫీడర్ కెనాల్ రీలైనింగ్‌కు అనుమతించిన వ్యయం 1305.267 కోట్ల రూపాయలు. మొత్తం అంచనా వ్యయంలో 826.168 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహాయంగా ఉంటుంది. (రూ 205.758 కోట్ల రూపాయలు సర్ హింద్‌ఫీడర్‌కు, రూ 620.41 కోట్ల రూపాయలు రాజస్థాన్ ఫీడర్‌కు )
సర్ హింద్ ఫీడర్ రీలైనింగ్, రాజస్థాన్ ఫీడర్ రీలైనింగ్‌కు సంబంధించి సవరించిన వ్యయ అంచనా పెట్టుబడులు రూ 671.478 కోట్ల రూపాయలు, 1305.267 కోట్ల రూపాయలకు 2016 ఏప్రిల్ 6న అనుమతులు లభించాయి.
ఈ ప్రాజెక్టులను 2016 సంవత్సరంలో సి.డబ్ల్యు.సి ఛైర్మన్ నాయకత్వంలో ఒక బృందం సందర్శించింది. మరో బృందం 2017లో సిడబ్ల్యుసి ఛైర్మన్ ఎ.బి. పాండ్య నేతృత్వంలో సందర్శించింది. వీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టవలసిన పనులను సూచించారు. పంజాబ్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి 26.04.2018న ఆర్థికపరమైన తమ ఆమోదాన్ని తెలిపింది.
నేపథ్యంః
సర్‌హింద్, రాజస్థాన్ ఫీడర్లు హరికే హెడ్‌వర్క్ ఎగువ జలాలను తీసుకువెళుతుంటాయి. ఇవి రాజస్థాన్‌లోకి వెళ్లే ముందు పంజాబ్‌గుండా ప్రవహిస్తాయి. ఈ రెండు కాలువలకు ఉమ్మడి ఒడ్డు ఉంది. దీనిని 1960లలో నిర్మించారు. పంజాబ్, రాజస్థాన్‌లలోని కమాండ్ ఏరియాలకు నీటిని సరఫరా చేసేందుకు నీటిని ఇటుకల లైనింగ్‌తో ఏర్పాటు నిర్మించారు.
అయితే సర్‌హింద్, రాజస్థాన్ ఫీడర్‌కాలువల లైనింగ్ దెబ్బతినడం వల్ల నీటిపారుదలలో నష్టం జరుగుతున్నట్టు పంజాబ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ లైనింగ్ దెబ్బతినడం వల్ల కాలువలలో నీటి ప్రవాహం తగ్గడంతోపాటు నీరు నిలిచిపోవడం వల్ల వ్యవసాయానికి పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా, నీరు నిలిచే సమస్యను తొలగించడంతోపాటు, రెండు కాలువలలో నీటి లభ్యత, ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడడానికి వీలు కలుగుతుంది.