సమీకరించుకునేందుకు కేబినెట్ అనుమతి, అలాగే, ఒకప్పటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ పనిని విస్తరించడం, దానిని నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, క్వాలిటీ (ఎన్‌సిడబ్ల్యుఎస్ అండ్ క్యు)గా పేరు మార్చడం, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)కు ఇబిఆర్ నిధుల సమీకరణ భాండాగారంగా దీనిని అధీకృతం చేసేందుకు అనుమతి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కింది అంశానికి ఆమోదం తెలిపారు.
ఎ. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) పథకానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయి సర్వీస్ బాండ్ల రూపంలో అదనపు బడ్జెటరీ వనరులు సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.
బి.ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ సొసైటీ పని పరిధిని మరింత విస్తరించి , స్వచ్ఛ భారత్ (గ్రామీణ్) కు ఇబిఆర్ నిధులు అందుకునేందుకు, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేసే ఏజెన్సీలకు అందించేందుకు వాటిని తిరిగి చెల్లించేందుకు వీలు కల్పించారు.
సి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ పేరుతో ఇప్పటికే ఉన్న సొసైటీ పేరు మార్చి, నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ , క్వాలిటీగా పేరు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభావంః
ఈ నిర్ణయం వల్ల స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద ప్రోత్సాహకానికి అర్హులైన 1.5 కోట్ల గ్రామీణ కుటుంబాల వారికి, అలాగే ఘన వ్యర్థౄల నిర్వహణ కార్యకలాపాలు చేపడుతున్న (ఎస్.ఎల్.డబ్ల్యు ఎం.) గ్రామ పంచాయితీలకు మేలు జరుగుతుంది.
దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన రహిత లక్ష్యాన్ని గ్రామాలలో సాధించేందుకు ఈ నిధులను వినియోగిస్తారు.
ఖర్చు వివరంః
రుణ ఒప్పందం షరతులకు అనుగుణంగా రూ 15,000 కోట్ల రూపాయల రుణ మొత్తాన్ని పదో సంవత్సరం ముగిసిన తర్వాత ఒకే ఒక మొత్తంగా తిరిగి చెల్లిస్తారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాస్తవంగా అవసరమైన మొత్తం, ఖర్చు, అలాగే ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన మొత్తం, వడ్డీతో సహా రుణం తిరిగి చెల్లింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇబిఆర్ ఫండ్స్‌ను నాబార్డ్ ద్వారా సేకరించడం జరుగుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ , క్వాలిటీ సంస్థ రుణ సమీకరణ సంస్థగా వ్యవహరిస్తుంది.
స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) లక్ష్యాన్ని నిర్ణీత లక్షితసమయంలో చేరుకునేందుకు సకాలంలో తగినంతగా నిధులు అందించడానికి ఇది ఉపకరిస్తుంది.
నేపథ్యం…
స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2 న ప్రారంభించారు. 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా గల గ్రామీణ ప్రాంతాలలో సార్వత్రిక పారిశుధ్య కార్యక్రమ లక్ష్యాలను సాధించేందుకు దీనిని చేపట్టారు. ఇందుకు ఐ.హెచ్.హెచ్.ఎల్ కిందికి వచ్చే అర్హులైన లబ్ధిదారులకు , వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ వంతుగా నిర్ణీత వాటాలో రూ 12,000ల ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
ఇక, ఎస్.ఎల్.డబ్ల్యు ఎం కార్యకలాపాల కింద 150,200,500 అంతకంటె ఎక్కువ కుటుంబాలు గల గ్రామపంచాయితీలకు వరుసగా 7,12,15, 20 లక్షల్ల రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.ఐ.ఇ.సిలకు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 5 శాతం వరకు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో ఖర్చు చేయడానికి కేంద్ర స్థాయిలో 3 శాతం ఖర్చుచేయడానికి వీలు ఉంటుంది. నిర్వహణా ఖర్చుల కింద మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 2 శాతం వెచ్చించవచ్చు. ఈ కార్యకలాపాలకు కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ తీరు ( ఈశాన్యరాష్ట్రాలు, జమ్ము కాశ్మీర్, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు మినహా) 60: 40 నిష్ఫత్తిలో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కాశ్మీర్, ఇతర ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఫండింగ్ తీరు 90:10 నిష్పత్తిలో ఉంటుంది.
స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం విషయంలో గట్టి పురోగతి సాధించింది.
31.07.2018 నాటికి దేశంలో శానిటేషన్ కవరేజ్ 88.9 శాతంగా ఉంది.2014 అక్టోబర్ 2 నుంచి 7.94 కోట్ల టాయిలెట్లను 4.06 లక్షల గ్రామాలు, 419 జిల్లాలలో నిర్మించడం జరిగింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా(ఒడిఎఫ్) ప్రకటించడం జరిగింది. 2019 అక్టోబర్ నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ కార్యక్రమాలు శరవేగంతో అమలు జరుగుతున్నాయి.
కేంద్ర కేబినెట్, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)ను 2014 అక్టోబర్‌లో ఆమోదించింది.2014 అక్టోబర్ 2 నుంచి , ప్రారంభించి 2019 అక్టోబర్ 2 నాటికి గ్రామీణ ప్రాంతాలలో సార్వత్రిక పారిశుధ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్ణయించారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కింద ఇప్పటికే చెప్పుకోదగిన పురోగతి సాధించారు.ఈ పథకం గడువు దగ్గర పడుతుందడడంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం కింద పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన నిధులకోసం , స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కింద 30,343 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక మంత్రి 2018-19 బడ్జెట్‌లో ప్రకటించడం జరిగింది. ఇందులో 15,343 కోట్ల రూపాయలు జనరల్ బడ్జెట్ సపోర్టగా, రూ
15,000 కోట్ల రూపాయలు అదనపు బడ్జెటరీ వనరులు(ఇబిఆర్)లుగా ప్రతిపాదించారు. ఆ తర్వాత, సెక్రటరీ, డిపార్టమెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ అధ్యక్షతన ఏర్పాటైన ఇబిఆర్ స్టీరింగ్ గ్రూప్ 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఇబిఆర్‌ను15,000 కోట్ల రూపాయల వరకు నాబార్డ్ ద్వారా స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) కోసం సేకరించేందుకు సిఫార్సు చేసింది.