Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘స్వ‌చ్ఛ్ భార‌త్ దివ‌స్-2019’ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, కేంద్ర మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ లోని ఇత‌ర స‌హ‌చ‌రులు, నైజీరియా, ఇండోనేశియా, ఇంకా మాలీ ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు, ప్ర‌పంచం లో వివిధ దేశాల హెడ్స్ ఆఫ్ మిశ‌న్, దేశం అంత‌టి నుండి త‌ర‌లి వ‌చ్చిన వేలాది స్వచ్ఛాగ్ర‌హులు, నా స‌ర్పంచ్ మిత్రులందరు, సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ఇక్కడ సాబ‌ర్‌మ‌తీ యొక్క ఈ తీరాన ఈ రోజు న నేను నా ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టే ముందు ఈ కార్యక్రమాని కి విచ్చేసిన స‌ర్పంచులు అంద‌రి ద్వారా దేశం లోని పురపాలక సంఘాలు మరియు నగరపాలక సంస్థల పాలకవర్గ సభ్యులందరి కి న‌మ‌స్క‌రించదలచుకొన్నాను; కారణం ఏమిటంటే బాపు క‌ల‌ల ను నెర‌వేర్చడం కోసం మీరు అంద‌రూ గ‌త అయిదు సంవ‌త్స‌రాల కాలం లో అవిశ్రాంతం గా కఠోర కృషి సలిపారు మరి.

ప‌విత్ర‌మైన‌టువంటి ఈ సాబ‌ర్‌మ‌తీ తీరం నుండి జాతి పిత గాంధీ మ‌హాత్ముని కి, అలాగే సీదాసాదా త‌నానికి ఒక ప్ర‌తీక అయినటువంటి పూర్వ ప్ర‌ధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారి కి నేను శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టిస్తున్నాను.

మిత్రులారా,

పూజ్య బాపు 150వ జ‌యంతి తో పాటే స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ తాలూకు ప్ర‌ధాన కార్య‌క్ర‌మ‌ం, అలాగే శ‌క్తి యొక్క ఉత్స‌వం- అదే- న‌వ‌రాత్రి.. ప్రతి చోటా గ‌ర్బా మారుమోగుతోంది; ఈ కోవ లో అద్భుతమైనటువంటి మరియు విశిష్టమైనటువంటియాదృచ్చికత అరుదు గానే కాన‌వ‌స్తుంది. మ‌రి దేశం నలు మూలల నుండి విచ్చేసినటువంటి మ‌న స‌ర్పంచ్ సోద‌రీమ‌ణులు మ‌రియు మన సర్పంచ్ సోద‌రులు.. మీకు గ‌ర్బా ను చూసే అవ‌కాశం లభించిందా? గ‌ర్బా ను చూడ‌టానికి మీరు వెళ్ళారా?

యావ‌త్తు ప్ర‌పంచం బాపు జయంతి ని పాటిస్తున్నది. కొన్ని రోజుల కింద‌ట ఐక్య రాజ్య స‌మితి త‌పాలా బిళ్ళల‌ ను జారీ చేయ‌డం ద్వారా ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని స్మ‌ర‌ణీయం గా మార్చివేసింది. అదే విధం గా, ఈ రోజు న కూడా ఇక్క‌డ త‌పాలా బిళ్ళల ను మ‌రియు నాణేల ను విడుద‌ల చేయ‌డమైంది. నేను యావ‌త్తు ప్ర‌పంచాని కి బాపు తాలూకు సంక‌ల్పం మ‌రియు స్ఫూర్తి స్థలం నుండి అభినంద‌న‌ లు తెలియజేస్తున్నాను.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

నేను ఇక్క‌డ‌ కు వ‌చ్చే ముందు సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మాని కి వెళ్ళాను. అక్క‌డ కు వెళ్ళే అవ‌కాశం నా జీవ‌న కాలం లో నాకు అనేక సార్లు లభించింది. ప్ర‌తి ప‌ర్యాయం అక్క‌డ బాపు అస్తిత్వాన్ని నేను గ‌మ‌నించాను. అయితే, ఈ రోజు న సైతం అక్క‌డ ఒక కొత్త శ‌క్తి ని నేను అనుభూతి చెందాను. స‌త్యాగ్ర‌హాని కి మ‌రియు స్వ‌చ్ఛాగ్ర‌హాని కి ఒక స‌మ‌గ్ర‌మైన రూపు ను ఇచ్చిన‌ది సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మ‌మే. గాంధీ మ‌హాత్ముడు స‌త్యం తో త‌న ప్ర‌యోగాల ను నిర్వ‌హించింది కూడా ఈ సాబ‌ర్‌మ‌తీ ఒడ్డునే.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ఈ రోజు న సాబ‌ర్‌మ‌తీ లోని ఈ స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌దేశం స్వ‌చ్ఛాగ్ర‌హం తాలూకు ఒక భారీ సాఫ‌ల్యాని కి సాక్షి గా నిలచింది. ఇది మ‌న‌ం అంద‌రం గ‌ర్వించేటటువంటి మ‌రియు సంతోషించేటటువంటి సంద‌ర్భం. ఈ కార్య‌క్ర‌మాన్ని సాబ‌ర్‌మ‌తీ రివ‌ర్ ఫ్రంట్ లో నిర్వ‌హించ‌డం నాకు అంతు లేనటువంటి ఆనందాన్నిస్తోంది.

మిత్రులారా,

ప్ర‌స్తుతం గ్రామీణ భార‌త‌దేశం బ‌హిరంగ ప్ర‌దేశాల లో మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న కు తావు లేనిది గా త‌న‌ను తాను ప్ర‌క‌టించుకొంది. ఇది స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ యొక్క శ‌క్తి మాత్రమే కాదు ఆ ఉద్య‌మం యొక్క సాఫ‌ల్య‌త కు మూలం కూడాను. ఎందుకంటే, ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందం గా దీని లో పాల్గొన్నారు. వారు స్వీయ ప్రేర‌ణ ను పొంది, ఇందులో పాలు పంచుకొన్నారు. నేను ఈ రోజు న ప్ర‌తి ఒక్క దేశవాసి కి, ప్ర‌త్యేకించి గ్రామాల‌ లో నివ‌సిస్తున్న‌ వారి కి, మ‌న సర్పంచ్ ల‌కు మ‌రియు స్వ‌చ్ఛాగ్ర‌హులంద‌రి కి హృద‌య పూర్వ‌కంగా అభినంద‌న‌ లు తెలియ‌జేస్తున్నాను. ఈ రోజు న ఇక్క‌డ స్వ‌చ్ఛ్ భార‌త్ అవార్డుల ను అందుకొన్న స్వ‌చ్ఛాగ్ర‌హి ల‌ను కూడా నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

ఇవాళ చ‌రిత్ర త‌న‌ ను తాను పున‌రుచ్చరించుకొంటున్నట్టు నాకు తోస్తున్నది. దేశ స్వాతంత్య్రం కోసం బాపు ఇచ్చిన పిలుపు ను అందుకొని స‌త్యాగ్ర‌హ మార్గాన్ని అనుస‌రించ‌టాని కి ల‌క్ష‌ల మంది భార‌తీయులు ముందుకు వ‌చ్చినట్లే ప‌రిశుభ్ర‌త కు కోట్లాది దేశ పౌరులు వారి మ‌ద్ధ‌తు ను మనస్పూర్తి గా వ్య‌క్తం శారు. అయిదు సంవ‌త్స‌రాల క్రితం ఎప్పుడ‌యితే నేను స్వ‌చ్ఛ భార‌త్ కోసం ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ వాసుల‌ కు పిలుపునిచ్చానో, ఆ కాలం లో మావైపు ఉన్న‌వి కేవ‌లం ప్ర‌జ‌ల విశ్వాసమూ, బాపు యొక్క అమ‌ర సందేశ‌మూ ను. ప్ర‌పంచం లో మ‌నం చూడాల‌ని కోరుకొంటున్న మార్పుల ను మొద‌ట మ‌న‌తోనే మొదలుపెట్టి తీసుకు రావాల‌ని బాపు అనే వారు.

ఈ మంత్రాన్ని అనుస‌రిస్తూ, మ‌న‌మంతా చీపురుక‌ట్ట‌ ను ప‌ట్టుకొని బయలుదేరాము. స్వ‌చ్ఛ‌త‌ తో, గౌర‌వంతో కూడినటువంటి ఈ ‘య‌జ్ఞాని’కి వ‌య‌స్సు, సాంఘిక హోదా మ‌రియు ఆర్థిక అంత‌స్తుల‌ కు అతీతం గా ప్ర‌తి ఒక్క‌రు తోడ్పాటు ను అందించారు.

పెళ్లి కి ముందు ఒక కుమార్తె టాయిలెట్ ఉండాలి అంటూ ష‌ర‌తు ను విధిస్తే గనక ఆ టాయిలెట్ ‘ఇజ్జ‌త్ ఘ‌ర్‌’ ప్ర‌తిప‌త్తి ని ద‌క్కించుకొంటుంది. ఒక‌ప్పుడు గుస‌ గుస‌ గా మాత్ర‌మే చ‌ర్చ‌ కు వ‌చ్చిన టాయిలెట్‌ దేశ ఆలోచ‌న స‌ర‌ళి లో ఒక ముఖ్య‌మైన భాగం గా మారిపోయింది. ప‌రిశుభ్ర‌త కు సంబంధించిన‌టువంటి ఈ భారీ ప్ర‌చార ఉద్య‌మం బాలీవుడ్ మొద‌లుకొని ఆట‌స్థ‌లం వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి ని సంధానించి, వారి లో ప్రేర‌ణ ను నింపడం తో పాటు వారి ని ఉత్సాహ‌ప‌రుస్తోంది.

మిత్రులారా,

మ‌నం సాధించిన సాఫ‌ల్యాన్ని చూసి ప్ర‌పంచం ఆశ్చర్యపోతోంది. ప్ర‌స్తుతం యావ‌త్తు ప్ర‌పంచం దీనికి గాను మ‌న‌కు బ‌హుమ‌తి ని ఇస్తోంది; మ‌న‌ను గౌర‌విస్తోంది కూడా. 60 కోట్ల కు పైగా జ‌నాభా కు 60 మాసాల వ్య‌వ‌ధి లో టాయిలెట్ సౌక‌ర్యాన్ని స‌మ‌కూర్చిన‌ట్లు, 11 కోట్ల‌ కు పైగా టాయిలెట్ లను నిర్మించినట్లు తెలుసుకొంటే, అది విస్మయకారి అంశం అవుతుంది. అయితే ఎటువంటి గ‌ణాంకాల కన్నా, ఎటువంటి పొగడ్త కన్నా, లేదా ఎటువంటి సమ్మానం కన్నా ఒక గొప్ప సంతృప్తి నాకు దక్కింది; అది ఎప్పుడు దక్కిందంటే- బాలిక లు ఏ విధమైన బెంగ‌ల ను పెట్టుకోకుండా, బ‌డి కి వెళ్తూ ఉన్నప్పుడు.

కోట్ల సంఖ్య‌ లో త‌ల్లులు, సోదరీమణులు ప్ర‌స్తుతం ఎప్పుడు చీక‌టి ప‌డుతుందా అని వేచి ఉంటూ భ‌రించ‌లేనంతటి ఇబ్బంది ని ఎదుర్కోవ‌డాన్ని త‌ప్పించుకోగలిగినందుకు నాకు సంతృప్తి గా ఉంది. తీవ్ర వ్యాధుల ఫ‌లితం గా ప్రాణాలు వ‌ద‌లుతున్న ల‌క్ష‌లాది అమాయ‌క ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ర‌క్షింప‌బ‌డుతున్నందుకు నాకు సంతృప్తి గా ఉంది. ప‌రిశుభ్ర‌త కార‌ణం గా వ్యాధుల చికిత్స కు అవుతున్న వ్య‌యం ఏద‌యితే ప్ర‌జ‌ల ను అవ‌స్థ‌లు పాలు చేసేదో అది ఇప్పుడు త‌గ్గిపోవ‌డం నాకు సంతృప్తినిస్తోంది. ఈ ప్ర‌చార ఉద్య‌మం ఆదివాసీ ప్రాంతాల లోను, గ్రామీణ ప్రాంతాల లోను ప్ర‌జ‌ల కు నూత‌న ఉపాధి అవ‌కాశాల ను ఇచ్చింద‌ని నేను సంతృప్తి చెందుతున్నాను. ఇదివ‌ర‌కు ప్ర‌ధాన తాపీపని వారు గా కేవలం పురుషులు ఉండే వారు; కానీ ఇప్పుడు సోద‌రీమ‌ణుల కు కూడా ఆ ప‌ని ని చేసే అవ‌కాశాన్ని ఇవ్వడం జరుగుతున్నది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ ప్రాణ ర‌క్ష‌ణ ను స‌మ‌కూర్చ‌డం తో పాటు, జీవ‌న ప్ర‌మాణాన్ని పెంచేందుకు కూడా అండ‌ గా నిల‌బ‌డుతోంది. యూనిసెఫ్ తాలూకు ఒక అంచ‌నా ప్ర‌కారం, గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో స్వ‌చ్ఛ్ భార‌త్ వ‌ల్ల భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పై 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయల స‌కారాత్మ‌క ప్ర‌భావం ప్ర‌స‌రించింది. ఇది భార‌త‌దేశం లో 75 ల‌క్ష‌ల కు పైబ‌డి ఉపాధి అవ‌కాశాల ను ఏర్ప‌ర‌చింది. మ‌రి ఈ అవ‌కాశాల లో ఎక్కువ అవ‌కాశాల ను అందుకొన్నది గ్రామాల‌ లోని సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులే.

దీనికి తోడు, ఇది బాల‌ల విద్య స్థాయి పైన సైతం ఒక స‌కారాత్మ‌కమైనటువంటి ప్ర‌భావాన్ని చూపింది. ఇది దేశం లో సోద‌రీమ‌ణుల మ‌రియు పుత్రిక‌ల ప‌రిర‌క్ష‌ణ‌, ఇంకా సాధికారిత ల ప‌రం గా ఒక గొప్ప ప‌రివ‌ర్తన ను కూడా తీసుకువ‌చ్చింది. అటువంటి ఒక న‌మూనా మ‌హిళ‌ ల, పేద‌ ల మ‌రియు ప‌ల్లె ల సాధికారిత ను, స్వావ‌లంబ‌న ను ప్రోత్స‌హించాల‌ని పూజ్య మ‌హాత్మ గాంధీ ఆకాంక్షించారు. ఇది గాంధీ మహాత్ముడు క‌ల‌ గ‌న్న స్వ‌రాజ్యం యొక్క కేంద్ర బిందువు గా ఉండింది. దీని కోస‌మే ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశారు.

మిత్రులారా,

అయితే, ప్ర‌స్తుతం అస‌లు ప్ర‌శ్న ఏది అంటే మ‌నం దేనినయితే సాధించామో అది స‌రిపోతుందా ? అనేదే. స‌మాధానం స‌ర‌ళం గా, స్ప‌ష్టం గా ఉంది. ప్ర‌స్తుతం మ‌నం సాధించింది కేవ‌లం ఒక ద‌శే. స్వ‌చ్ఛ్ భార‌త్ దేశం దిశ గా మ‌న ప్ర‌యాణం నిరంత‌ర‌ం సాగుతూ ఉంటుంది.

ప్ర‌స్తుతం మ‌నం టాయిలెట్ ల‌ను నిర్మించుకొన్నాం. ప్ర‌జ‌ల ను టాయిలెట్ వినియోగించేందుకు ప్రోత్స‌హిస్తున్నాము. మ‌రి మ‌నం ఇప్పుడు ఈ మార్పు ను దేశం లోని ఒక పెద్ద వ‌ర్గాని కి శాశ్వ‌త అభ్యాసం గా మార్చ‌వ‌ల‌సి ఉన్నది. అవి ప్ర‌భుత్వాలు, స్థానిక పాల‌నా యంత్రాంగాలు లేదా గ్రామ పంచాయ‌తులు కావ‌చ్చు.. టాయిలెట్ ను స‌క్ర‌మం గా వినియోగించే విధం గా మ‌నం శ్ర‌ద్ధ తీసుకోవాలి. ఇప్ప‌టి కి కూడా దీని ప‌రిధి లోకి రానటువంటి వారి ని దీని ప‌రిధి లోకి తీసుకురావాలి.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య మొద‌లు పెట్టిన జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ ఈ అంశం లో స‌హాయ‌కారి అవుతుంది. మ‌నం మ‌న ఇళ్ళ లో, కాల‌నీల లో, ప‌ల్లెల లో వాట‌ర్ రీచార్జ్ కోసం, వాట‌ర్ రీసైక్లింగ్ నిమిత్తం చేయ‌గ‌లిగిందంతా చేయాలి. మ‌నం ఈ ప‌ని ని చేసిన‌ప్పుడు ఇది ప్ర‌జ‌లు టాయిలెట్ ను క్ర‌మం త‌ప్ప‌కుండా శాశ్వ‌తం గా వినియోగించేట‌ట్లు ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ప్ర‌భుత్వం మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయల‌ ను జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ కోసం ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ బృహ‌త్కార్యాన్ని దేశ పౌరుల క్రియాశీల భాగ‌స్వామ్యం లేనిదే సాధించ‌డం క‌ష్టం.

మిత్రులారా,

పారిశుధ్యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, ఇంకా మాన‌వుల సంర‌క్ష‌ణ‌.. ఈ మూడు అంశాలు గాంధీ మ‌హాత్ముని కి అభిమాన‌పాత్ర‌మైన అంశాలు. ప్లాస్టిక్ అనేది ఈ మూడింటి కి ఒక పెద్ద అపాయ‌కారి గా నిల‌బడుతోంది. అందుక‌ని మ‌నం 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ బారి నుండి దేశాన్ని విముక్తం చేయాలన్న ల‌క్ష్యాన్ని సాధించే తీరాలి. గ‌డ‌చిన మూడు వారాల కాలం లో స్వ‌చ్ఛ‌త ఉద్య‌మం ద్వారా యావ‌త్తు దేశం ఈ ప్ర‌చార ఉద్య‌మాని కి బోలెడంత వేగ గ‌తి ని జతచేసింది. ఈ కాలం లో దాదాపుగా 20 వేల ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ ను స‌మీక‌రించినట్లు నా దృష్టి కి వ‌చ్చింది. అదే కాలం లో, ప్లాస్టిక్ చేతి సంచి వాడ‌కం కూడా చాలా వేగం గా క్షీణిస్తున్నట్లు గ‌మ‌నించ‌డమైంది.

ప్ర‌స్తుతం దేశం లో కోట్లాది ప్ర‌జానీకం ఒక‌ సారి వాడే ప్లాస్టిక్ జోలి కి పోకూడ‌ద‌ని సంక‌ల్పించుకొన్న విషయం కూడా నాకు తెలుసు. ఇది ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చుతుంది. మ‌న న‌గ‌రాల లో మురుగు కాల్వ‌ల‌ కు మ‌రియు ర‌హ‌దారుల కు అడ్డం ప‌డే పెద్ద స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రిస్తుంది. ఇది మ‌న ప‌శుగ‌ణాన్ని మ‌రియు స‌ముద్ర సంబంధ ప్రాణుల ను కూడా ర‌క్షిస్తుంది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

మ‌న ఉద్య‌మాని కి కేంద్ర స్థానం లో ఉన్న అత్యంత ముఖ్య‌మైన అంశాన్ని గురించి నేను మరొక్క మారు స్పష్టీకరించదలచుకొన్నాను. అదే ప్ర‌వ‌ర్త‌న ప‌ర‌మైన‌టువంటి మార్పు. ఈ పరివర్తన మొద‌ట వ్యక్తిగత స్థాయి నుండి ఆరంభ‌ం అవుతుంది. ఈ పాఠం మ‌నకు మ‌హాత్మా గాంధీ మ‌రియు లాల్ బ‌హాదుర్ శాస్త్రి గారు ల జీవితం నుండి దొరుకుతుంది.

దేశం గంభీర‌మైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం లో శాస్త్రి గారు దేశ ప్ర‌జ‌ల ను వారి యొక్క తిండి అల‌వాటుల‌ ను మార్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మార్పు ను ఆయ‌న త‌న కుటుంబం నుండే మొద‌లుపెట్టారు. ప‌రిశుభ్ర‌త తాలూకు ఈ ప్ర‌స్థానం లో మ‌న ముందు ఉన్న‌ది కూడా ఒకే దారి. ఆ బాట లో న‌డ‌చి మ‌నం గ‌మ్య స్థానాన్ని చేరుకోవ‌ల‌సివుంది.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

ప్ర‌స్తుతం ఈ స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం తాలూకు న‌మూనా ను గురించి తెలుసుకోవాల‌ని, దీని ని ఆచ‌రించాల‌ని యావ‌త్తు ప్ర‌పంచం కోరుకుంటోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా లో భార‌త‌దేశాని కి గ్లోబ‌ల్ గోల్ కీప‌ర్ అవార్డు ను ప్ర‌దానం చేయ‌డ‌మైంది. దాని ద్వారా భార‌త‌దేశం యొక్క స‌ఫ‌ల‌త యావ‌త్తు ప్ర‌పంచాని కి వెల్ల‌డి అయింది.

భార‌త‌దేశం త‌న అనుభ‌వాల ను ఇత‌ర దేశాల తో పంచుకొనేందుకు స‌దా సిద్ధం గా ఉంద‌ని నేను కూడా ఐక్య రాజ్య స‌మితి లో చెప్పాను. ఈ రోజు న నైజీరియా, ఇండోనేశియా, ఇంకా మాలీ ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు మ‌న‌తో ఉన్నారు. వీరు అంద‌రి తో ఆయా దేశాల లో పారిశుధ్యం కోసం, ప‌రిశుభ్ర‌త కోసం స‌హ‌కారాన్ని అంద‌జేసేందుకు భార‌త‌దేశం స‌హ‌ర్షం గా ముందంజ వేస్తుంది.

మిత్రులారా,

గాంధీ మ‌హాత్ముడు దేశాని కి స‌త్యం, అహింస‌, స‌త్యాగ్ర‌హం, ఇంకా స్వావ‌లంబ‌న మార్గాన్ని చూపెట్టారు. ప్ర‌స్తుతం మ‌నం అదే ప‌థం లో సాగుతూ ఒక నిర్మ‌ల‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన, స‌మృద్ధ‌మైన మ‌రియు బ‌ల‌మైన ‘న్యూ ఇండియా’ నిర్మాణం లో నిమ‌గ్నం అయ్యాము. పారిశుధ్యాన్ని పూజ్య బాపు స‌ర్వోన్న‌త‌మైంది గా ఎంచారు. ఒక సిస‌లైన శిష్యుని గా గ్రామీణ భారతావని ప్రస్తుతం ప‌రిశుభ్ర భార‌త‌దేశం కోసం కృషి చేయ‌డం ద్వారా ఆయ‌న కు ప్ర‌ణ‌మిల్లుతున్నది. గాంధీ గారు ఆరోగ్యాన్ని నిజ‌మైన సంప‌ద గా ప‌రిగ‌ణించారు. దేశం లోని ప్ర‌తి ఒక్క వ్య‌క్తి స్వ‌స్థుని గా ఉండాల‌ని ఆయ‌న అభిల‌షించారు. మేము ఈ ఆలోచ‌న‌నే యోగా దివస్, ఆయుష్మాన్ భార‌త్ మ‌రియు ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ల ద్వారా ఆచ‌ర‌ణ లో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాము. గాంధీ గారు ‘వ‌సుధైవ కుటుంబ‌క‌మ్’ను న‌మ్మారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశం త‌న నూత‌న ప్ర‌ణాళిక‌ల కు మ‌రియు ప‌ర్యావ‌ర‌ణాని కి క‌ట్టుబ‌డి ఉండ‌టం వంటి వాటి ద్వారా అనేక స‌వాళ్ళ పై పోరాడ‌టం లో ప్ర‌పంచాని కి స‌హాయాన్ని అందిస్తున్నది. ఒక స్వ‌తంత్ర‌మైన మ‌రియు ఆత్మవిశ్వాసం తో కూడిన భార‌త‌దేశం అనేది బాపు యొక్క స్వ‌ప్నం గా ఉండింది. ప్ర‌స్తుతం మ‌న‌ము మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్‌-అప్ ఇండియా, ఇంకా స్టాండ్-అప్ ఇండియా ప‌థ‌కాల ద్వారా ఈ క‌ల‌ల‌ ను పండించ‌డం లో త‌ల‌మున‌క‌లు అయ్యాము.

ఏ భార‌త‌దేశం లో అయితే ప్ర‌తి ప‌ల్లె త‌న కాళ్ళ మీద తాను నిల‌బ‌డుతుందో, అటువంటి భార‌త‌దేశాన్ని ఆవిష్క‌రించాలి అనేది గాంధీ గారి సంక‌ల్పం గా ఉండేది. ఈ సంక‌ల్పాన్ని రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ ద్వారా ఆచ‌ర‌ణ లోకి తీసుకొని వ‌స్తున్నాము.

గాంధీ గారు స‌మాజం లోని అట్ట‌డుగు వ‌ర్గాల వారి కి, వరుస లో ఆఖరు న నిలబడిన వ్యక్తి కి మేలు చేసేందుకే ప్ర‌తి ఒక్క నిర్ణ‌యాన్ని తీసుకోవాలని చెప్పే వారు. మేము ఈ రోజు న ఉజ్జ్వల‌, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, జ‌న్ ధ‌న్ యోజ‌న‌, సౌభాగ్య యోజ‌న, ఇంకా స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ ల వంటి ప‌థ‌కాల ను తెచ్చాము. ఈ ప‌థ‌కాలు అన్నిటి ద్వారా మేము ఆయ‌న చెప్పిన మంత్రాన్ని వ్య‌వ‌స్థ లో ఒక భాగం గా చేశాము.

సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగం లోకి తీసుకు రావ‌డం ద్వారా ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళం గా మార్చాలని పూజ్య బాపు అన్నారు. మేము ఆధార్‌, ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజన బ‌దిలీ, డిజిట‌ల్ ఇండియా, భీమ్ యాప్, ఇంకా డిజి లాక‌ర్ ల ద్వారా దేశ ప్ర‌జ‌ల జీవితాల లో సౌల‌భ్యాన్ని తీసుకు వ‌చ్చేందుకు య‌త్నిస్తున్నాము.

మిత్రులారా,

భార‌త‌దేశం అభివృద్ధి చెందాల‌ని, త‌ద్వారా దాని తాలూకు ప్ర‌యోజ‌నాన్ని యావ‌త్తు ప్ర‌పంచం పొందాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు గాంధీ మ‌హాత్ముడు చెప్తూ ఉండే వారు. ఒక వ్య‌క్తి జాతీయవాది కాకుండా ఒక ప్ర‌పంచ ప్ర‌సిద్ధ వ్య‌క్తి కాజాల‌రని గాంధీజీ లో ఒక స్ప‌ష్ట‌మైన అభిప్రాయం ఉండేది. అంటే మ‌నం మ‌న స‌మ‌స్య‌ ల‌కు మొద‌ట ప‌రిష్కార మార్గాల ను అన్వేషించాలి. అలా చేసిన‌ప్పుడే మ‌నం ప్ర‌పంచం అంత‌టి కి స‌హాయ ప‌డ‌గ‌లుగుతాము. ప్ర‌స్తుతం, భార‌త‌దేశం ఈ జాతీయవాద స్ఫూర్తి తో ముందుకు పోతున్నది.

బాపు క‌ల‌లు గ‌న్న భార‌త‌దేశం.. ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించ‌డం జ‌రుగుతోంది. బాపు క‌ల‌గ‌న్న భార‌త‌దేశం.. దానిని స్వ‌చ్ఛ దేశం గా, ఆ దేశం లోని ప‌ర్యావ‌ర‌ణాన్ని సుర‌క్షితం గా ఉంచ‌డం జ‌రుగుతుంది.

బాపు క‌ల‌గ‌న్న భార‌త‌దేశం.. అందులో ప్ర‌తి ఒక్క‌రు స్వ‌స్థులు గా మ‌రియు దృఢం గా ఉంటారు. బాపు క‌ల‌గ‌న్న భార‌త‌దేశం.. అందులో ప్ర‌తి ఒక్క త‌ల్లి కి, ప్ర‌తి ఒక్క శిశువు కు పోష‌కాహారం అందుతుంది.

బాపు క‌ల‌గ‌న్న భార‌త‌దేశం.. అందులో ప్ర‌తి ఒక్క పౌరుడు/ పౌరురాలు భ‌ద్రం గా ఉంటారు. బాపు క‌ల‌గ‌న్న భార‌త‌దేశం.. అందులో వివ‌క్ష కు తావు ఉండ‌దు. ఆ దేశం సద్భావన తో తొణికిస‌లాడుతుంది.

బాపు క‌ల‌లు గ‌న్న భార‌త‌దేశం.. అది ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్‌, స‌బ్‌కా విశ్వాస్’ అనే ఆద‌ర్శాన్ని అనుస‌రిస్తుంది. ఈ బాపు జాతీయవాద అంశాలన్నీ యావ‌త్తు ప్ర‌పంచాని కి ఆద‌ర్శ‌ప్రాయం. అలాగే, యావ‌త్తు ప్ర‌పంచాని కి స్ఫూర్తి ని అందుకొనేందుకు ఒక వ‌న‌రు కూడా అవుతాయి.

రండి- భార‌తదేశం లో ప్ర‌తి ఒక్క‌రం మాన‌వాళి కోసం జాతి పిత విలువ‌ల పునః స్థాప‌నకై ఒక సంక‌ల్పాన్ని చెప్పుకొందాం. మ‌రి అలాగే దేశం కోసం ప్ర‌తి ఒక్క సంక‌ల్పాన్ని నెర‌వేర్చుదాము.

ఈ రోజు న ఒక వ్య‌క్తి, ఒక సంక‌ల్పం తీసుకోవాలంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం కోసం ఏ సంక‌ల్పాన్న‌యినా స్వీక‌రించండి. అది దేశాని కి ఉప‌యోగ‌ప‌డేది గా ఉండాలి. అది స‌మాజాని కి, దేశాని కి మేలు చేసే సంక‌ల్పం గా ఉండాలి. మిమ్మ‌ల్ని క‌నీసం ఒక సంక‌ల్పం తీసుకోండి అని, అలాగే దేశం ప‌ట్ల మీ యొక్క క‌ర్త‌వ్యాల ను గురించి ఆలోచించ‌ండి అని నేను కోరుతున్నాను.

క‌ర్త‌వ్య ప‌థం లో సాగుతూన్న 130 కోట్ల ప్ర‌య‌త్నాల మ‌రియు 130 కోట్ల సంక‌ల్పాల బ‌లం దేశాని కి చేసేది ఎంతో ఉంటుంది. నేటి నుండి మొద‌లుపెట్టి మ‌నం రాబోయే ఒక సంవ‌త్స‌రం పాటు ఈ మార్గం లో నిరంత‌రాయం గా పాటు ప‌డ‌వ‌ల‌సివుంది. ఒక సంవ‌త్స‌రం పాటు శ్ర‌మించాక‌ ఇది మ‌న జీవ‌నం యొక్క దిశ గా రూపుదిద్దుకొన్న‌ప్పుడు బాపు జీ కి కృత‌జ్ఞ‌తాబ‌ద్ధురాలైన ఒక దేశం అందించే సిస‌లైన నివాళి ఇదే అవుతుంది.

ఈ మ‌న‌వి తో- మ‌రొక్క విష‌యాన్ని కూడాను మీకు నేను చెప్ప‌ద‌లుస్తున్నాను. సాధించిన విజ‌యం ఏ ప్ర‌భుత్వ విజ‌య‌మో కాదు.

సాధించిన‌ స‌ఫ‌ల‌త ఏ ప్ర‌ధాన మంత్రి సాఫ‌ల్య‌మో కాదు. ఈ సిద్ధి ఏ ముఖ్య‌మంత్రి కార్య‌సాధ‌న‌యో కాదు.

ఈ విజ‌యం 130 కోట్ల మంది పౌరుల ప్ర‌య‌త్నాల వ‌ల్ల స‌మ‌కూరింది. స‌మాజం లోని చిర‌కాలానుభ‌వం క‌లిగిన వ్య‌క్తులు ఎప్ప‌టిక‌ప్పుడు అందించిన‌టువంటి మార్గ‌నిర్దేశం మ‌రియు నాయ‌త్వాల వ‌ల్ల ఇది సాధ్య‌ప‌డింది. వరుస‌గా అయిదు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌సార మాధ్య‌మ సంస్థ‌లన్నీ దీని ని అదే ప‌ని గా ముందుకు తీసుకుపోతూ, స‌కారాత్మ‌క‌మైన తోడ్పాటు ను అందించడాన్ని నేను చూశాను. దేశం లో ఈ విధ‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌ర‌చ‌డం లో ప్ర‌సార మాధ్య‌మాలు ఒక ముఖ్య‌ పాత్ర ను పోషించాయి.

దీని కోసం కృషి చేసిన వారు అంద‌రి కి.. 130 కోట్ల మంది దేశ‌వాసుల కు.. ఈ రోజు న నేను న‌మ‌స్క‌రిస్తున్నాను. వారికి ఇవే నా ధ‌న్య‌వాదాలు. నేను వారికి కృత‌జ్ఞుడినై ఉంటాను.

ఈ మాట‌ల‌ తో నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను. మీరు అంద‌రూ నాతో పాటు పల‌కండి –

నేను అంటాను – ‘మ‌హాత్మ గాంధీ’ అని, మీరు మీ రెండు చేతుల‌ ను పైకెత్తి ప‌ట్టుకొని బిగ్గ‌ర‌గా ప‌ల‌కాలి. ‘అమ‌ర్ ర‌హే’ అని.

మ‌హాత్మ గాంధీ – అమ‌ర్ ర‌హే,

మ‌హాత్మ గాంధీ – అమ‌ర్ ర‌హే,

మ‌హాత్మ గాంధీ – అమ‌ర్ ర‌హే.

మ‌రొక్క మారు ఒక పెద్ద సంక‌ల్పాన్ని ఆచ‌ర‌ణ‌ లో పెట్టినందుకు దేశ ప్ర‌జ‌ల ను నేను అభినందిస్తున్నాను.

నాతో క‌ల‌సి ఇలా ప‌ల‌కండి –

భార‌త్ మాతా కీ జ‌య్‌;

భార‌త్ మాతా కీ జ‌య్‌;

భార‌త్ మాతా కీ జ‌య్‌.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**