Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సమావేశం

స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సమావేశం


       ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘దుబాయ్’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లోని వివిధ కోణాలుసహా రక్షణ, పరిశోధన-ఆవిష్కరణ, వాణిజ్యం-పెట్టుబడులు, వాతావరణ సహకారం వంటి అంశాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే ఐరోపా సమాఖ్య (ఇయు), నార్డిక్ కౌన్సిల్, నార్డిక్ బాల్టిక్-8 కూటమి సహా వివిధ ప్రాంతీయ,  బహుపాక్షిక అంశాలపైనా వారు చర్చించారు.

   ఐరోపా  మండలి అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడంపై ఉల్ఫ్ క్రిస్టర్సన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

****