Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్విస్ మరియు భారతదేశ జాతీయులను గుర్తించి వెనుకకు పంపించడానికి భారతదేశం- స్విట్జర్లాండ్‌ ల మధ్య ద్వైపాక్షిక సాంకేతిక ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం


స్విస్ మరియు భారతదేశ జాతీయులను గుర్తించి వెనుకకు పంపించేందుకు భారతదేశం- స్విట్జర్లాండ్‌ ల మధ్య సాంకేతిక ఒప్పందంపై సంతకాలకు మరియు ఆ ఒప్పందం అమలుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహిచారు.

భా

రతదేశం- స్విట్జర్లాండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సాంకేతిక ఏర్పాటు ( బి టి ఎ ) పర్యవసానమే ప్యాకేజ్ డీల్‌లో భాగంగా దౌత్య పరమైన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న వారి కోసం చేసుకొన్న వీసా రహిత ఒప్పందం. అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి వెనుకకు పంపేందుకు అదనపు విధులను ప్రవేశపెట్టకుండా, కచ్చితమైన కాలావధులను నిర్ణయించకుండా, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని క్రమబద్ధీకరించడం కోసం బి టి ఎ ప్రధానంగా ఉద్ధేశించబడింది. భారతదేశం నుండి స్విట్జర్లాండ్ కు వెళ్ళిన అక్రమ వలసదారుల సంఖ్య 100 కు లోపే ఉంటుందనే అంచనా గుర్తుంచుకోవాల్సిన విషయం. స్విట్జర్లాండ్‌తో ప్రతిపాదిత బి టి ఎ కు కనుక ఆమోద ముద్ర పడితే, ఇదే విషయం మీద ప్రతిసారీ మనల్ని ప్రశ్నిస్తున్న ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలతో జరిగే చర్చలలో ఈ బి టి ఎ ఒక నమూనాగా మనకు ఉపయోగపడుతుంది. చట్టబద్ధ భారత ప్రయాణికుల కోసం వీసా మరియు వర్క్ పర్మిట్‌ల విధానాలను సరళతరం చేయడం కోసం చేసుకొన్న పునఃప్రవేశ ఒప్పందాన్ని సమర్ధవంతంగా వుపయోగించుకొనేందుకు కూడా బి టి ఎ సహాయపడుతుంది. భారతదేశం- యూరోపియన్ యూనియన్‌ ల మధ్య ఇటీవలే పూర్తి అయిన కామన్ ఎజెండా ఆన్ మైగ్రేషన్ అండ్ మొబిలిటి (సి ఎ ఎమ్ ఎమ్) ఒడంబడికలో కూడా బి టి ఎ ని కీలకమైనదిగా చూస్తున్నారు.