Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


స్వామి వివేకానంద జయంతి ఈ రోజు. ఈ సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు శ్రద్ధాంజలి సమర్పించారు. యువతకు స్వామి వివేకానంద నిరంతరం ప్రేరణనిస్తున్నారనీ, యువజనుల మనస్సులలో ఆయన ఎప్పటికీ గాఢ ఉద్వేగాన్ని కలగజేయడంతోపాటు లక్ష్యాన్ని ఏర్పరుస్తూ ఉంటారని ప్రధాని అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘స్వామి వివేకానందకు ఆయన జయంతి సందర్భంగా నేను శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. యువతకు శాశ్వత ప్రేరణమూర్తిగా ఉన్న స్వామి వివేకానంద, యువజనుల మదిలో గాఢ ఉద్వేగాన్ని కలగజేయడంతోపాటు లక్ష్యాన్ని కూడా ఏర్పరుస్తూ ఉంటారు. దృఢమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ఆయన దార్శనికతను సాకారం చేసితీరాలని మేం కంకణం కట్టుకున్నాం.’’