Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి దయానంద సరస్వతి నిర్యాణంపై ప్రధాని సంతాపం


స్వామి దయానంద సరస్వతి నిర్యాణంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ” స్వామి దయానంద సరస్వతి నిర్యాణం వ్యక్తిగతంగా తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. దయానంద సరస్వతి నుంచి ప్రేరణ పొందిన అసంఖ్యాక ప్రజలందరి దుఃఖంలో పాలుపంచుకుంటున్నాను. సేవాభావం, ఆధ్యాత్మికతకు, విజ్ఞానానికి ఆయన కేంద్ర బిందువు వంటి వారు ” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.