Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్ఛత ను వృద్ధిపరచడం కోసం సీతాపుర్ ఎమ్పి శ్రీ రాజేశ్ వర్మ చేస్తున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపుర్ నుండి లోక్ సభ సభ్యుని గా ఉన్న శ్రీ రాజేష్ వర్మ స్వచ్ఛత ను గురించి న చైతన్యాన్ని వ్యాప్తి చేయడం కోసం నడుం కట్టి చేస్తున్నటువంటి ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

సీతాపుర్ ఎంపి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘ఈ కార్యక్రమం తో మన పర్యావరణాన్ని స్వచ్ఛం గా ఉంచే విషయంలో ప్రజల లో చైతన్యం పెరగగలదన్న విశ్వాసం నాలో ఉంది. దీనితో పాటుగా, స్వచ్ఛత తో ముడిపడ్డ ప్రయాసల కు పూనుకోవడానికి అవసరమైన ప్రేరణ ను కూడా వారు అందుకోగలుగుతారు.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST