Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ ముగింపు కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లోగల వివిధ సంస్థల నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులతో ముచ్చటించారు.

వ్యవసాయం, ఆర్థికం, పౌష్టికాహారలోపం, విద్య తదితరాలపై వారితో కాసేపు చర్చించారు. ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ను జాతీయ స్థాయిలో ఒక అతిపెద్ద ‘సార్వత్రిక ఆవిష్కరణ నమూనా’గా ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకుపోతున్నదని, ఆవిష్కరణలలో దేశం కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నదని పేర్కొన్నారు. అందువల్లనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల దేశంగా అవతరించిందని గుర్తుచేశారు.
*****