Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్పెశలిటి స్టీల్ కోసం ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహ‌కం (పిఎల్ఐ) ప‌థ‌కాని కి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రిమండ‌లి;


స్పెశాలిటీ స్టీల్ కోసం ఉత్ప‌త్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహ‌క (పిఎల్ఐ) ప‌థ‌కాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న ఈ రోజు న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదాన్ని తెలిపింది. ఈ ప‌థ‌కం కాలపరిమితి 2023-24 నుంచి అయిదు సంవ‌త్స‌రాల పాటు 2027-28 వ‌ర‌కు ఉంటుంది. బడ్జెటు లో నుంచి 6322 కోట్ల రూపాయ‌ల ను ఖ‌ర్చు చేస్తూ అమలుపరచే ఈ పథకం ఇంచుమించు 40,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డిని తీసుకు వ‌స్తుంద‌ని, 25 ఎమ్‌టి స్పెశాలిటీ స్టీల్ సామ‌ర్థ్యాన్ని అద‌నం గా జతపరుస్తుందని అంచ‌నా వేయ‌డ‌మైంది. ఈ పథకం తో దాదాపు 5,25,000 మంది కి ఉపాధి దొరుకుతుంది. వీటి లో 68,000 ఉద్యోగాలు ప్రత్యక్ష ప్రాతిపదిక న ఉంటాయి.

లో 2020-21 లో ఉత్ప‌త్తి అయిన 102 మిలియ‌న్ ట‌న్నుల ఉక్కు లో విలువ‌ ను జోడించిన ఉక్కు/స్పెశలిటి ఉక్కు కేవ‌లం 18 మిలియ‌న్‌ ట‌న్నులు గా ఉన్న కార‌ణం గా స్పెశలిటి స్టీలు ను లక్ష్య సెగ్మెంట్ గా ఎంపిక చేయ‌డమైంది. దీనికి అదనం గా, అదే సంవ‌త్స‌రం లో 6.7 మిలియ‌న్ ట‌న్నుల దిగుమ‌తులు చోటు చేసుకోగా, సుమారు 4 మిలియ‌న్ ట‌న్నుల దిగుమ‌తులు ఒక్క స్పెశాలిటీ స్టీల్ వే ఉన్నాయి. ఫ‌లితం గా దాదాపు 30,000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు విదేశీ మార‌క ద్ర‌వ్యాన్ని ఖర్చు పెట్టవలసి వ‌చ్చింది. స్పెశలిటి స్టీల్ ఉత్ప‌త్తి చేయ‌డం లో ఆత్మ‌నిర్భ‌ర్ గా రూపొందితే స్టీల్ వేల్యూ చైన్ లో త‌న స్థానాన్ని మెరుగు ప‌ర‌చుకొని, కొరియా, జ‌పాన్ వంటి అధునాత‌న ఉక్కు త‌యారీ దేశాల స‌ర‌స‌ న నిలువగలుగుతుంది.

2026-27 ఆఖ‌రు క‌ల్లా స్పెశలిటి ఉక్కు ఉత్ప‌త్తి 42 మిలియ‌న్ ట‌న్నుల కు చేరుతుంద‌ని ఒక అంచ‌నా. దీనితో సుమారు 2.5 ల‌క్షల కోట్ల విలువైన స్పెశలిటి స్టీల్ ను దేశం లో ఉత్ప‌త్తి చేయడం, వినియోగించ‌డం జ‌ర‌గ‌వ‌చ్చు. అదే జ‌ర‌గ‌ని ప‌క్షం లో దిగుమ‌తి చేసుకోవ‌ల‌సి వ‌స్తుంది. అదే మాదిరి గా, వర్తమానం లో 1.7 మిలియ‌న్ ట‌న్నులు గా ఉంటున్న స్పెశలిటి స్టీల్ ఎగుమ‌తులు కాస్తా ఇంచుమించు 5.5 మిలియ‌న్ ట‌న్నులు గా న‌మోదు కావ‌చ్చు. దీనితో 33,000 కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యం చేజిక్కుతుంది.

 

PM India

 

PM India

ఈ ప‌థ‌కం తాలూకు ప్ర‌యోజ‌నం అటు పెద్ద పాత్ర‌దారుల తో పాటు అంటే ఏకీకృత ఉక్కు ప్లాంటుల‌ తో పాటు చిన్న త‌ర‌హా పాత్ర‌దారుల కు (సెకండ‌రీ స్టీల్ ప్లేయ‌ర్స్‌) కు కూడా అంద‌నుంది.

 

స్పెశాలిటీ స్టీల్ అనేది విలువ‌ ను జోడించిన ఉక్కు. దీని లో సాధార‌ణం గా తయారు చేసే ఫినిష్‌ డ్ స్టీల్ ను అధిక విలువ ను జ‌త చేసిన ఉక్కు గా మార్చ‌డం కోసం కోటింగు, ప్లేటింగు, హీట్ ట్రీట్‌మెంట్ త‌దిత‌ర ప‌ద్ధ‌తుల ద్వారా పోత పోయడం జ‌రుగుతుంది. ఈ ర‌కమైన ఉక్కు ను ఆటోమొబైల్ సెక్ట‌ర్‌, స్పెష‌లైజ్ డ్ కేపిట‌ల్ గుడ్స్ మొదలైన రంగాల తో పాటు ర‌క్ష‌ణ‌, అంత‌రిక్షం, విద్యుత్తు రంగాల లో వ్యూహాత్మ‌క వినియోగాని కి వినియోగిస్తారు.

స్పెశలిటి స్టీల్ తాలూకు అయిదు శ్రేణులను పిఎల్ఐ స్కీము ను అమ‌లు ప‌ర‌చ‌డానికి ఎంపిక చేయడమైంది. అవి:

ఎ) కోటెడ్‌/ప్లేటెడ్ ఉక్కు ఉత్ప‌త్తులు
బి) హై స్ట్రెంథ్/ వియర్ రెజిస్టెంట్ స్టీల్‌
సి) స్పెశలిటి రైల్స్‌
డి) అలాయ్ స్టీల్ ఉత్ప‌త్తులు మరియు స్టీల్ వైర్స్

ఇ) ఎల‌క్ట్రికల్ స్టీల్‌

ఈ ఉత్పత్తుల శ్రేణిలో నుంచి , ఈ స్కీము పూర్తి అయిన తరువాత భార‌త‌దేశం ఎపిఐ గ్రేడ్ పైపు లు, హెడ్ హార్డెన్డ్ రైల్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ స్టీల్ ( ట్రాన్స్ ఫార్మ‌ర్ లు మ‌రియు విద్యుత్తు ఉప‌క‌ర‌ణాల త‌యారీ లో ఇది అవ‌స‌ర‌మ‌వుతుంది) వంటి ఉత్ప‌త్తుల ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టేస్తుంది. వీటి ని ప్ర‌స్తుతం చాలా ప‌రిమిత‌మైన ప‌రిమాణం లోనే త‌యారు చేయ‌డమో/ వీటి తయారీ జోలికి అస‌లు ఎంత మాత్రం వెళ్ళ‌కపోవడమో జరుగుతున్నది.

 

  • ఐ ప్రోత్సాహ‌కాల లో మూడు శ్లాబు లు ఉన్నాయి. అతి త‌క్కువ శ్లాబు 4 శాతం కాగా, అత్య‌ధిక శ్లాబు 12 శాతం గా ఉంటుంది. దీనిని ఎలక్ట్రికల్ స్టీల్ (సిఆర్‌జిఒ) కు కేటాయించ‌డ‌మైంది. స్పెశలిటి స్టీల్ కోసం ఉద్దేశించిన ఐ పథకం మౌలిక ఉక్కు ను దేశం లోపలే ‘క‌ర‌గించి, పోత పోసేందుకుఉపయోగించేలా పూచీ పడనుందిది. అంటే దీని ద్వారా స్పెశలిటి స్టీల్ ను తయారు చేయడానికి వాడేటటువంటి ముడిపదార్థం (తుది ఉక్కు) ను భారతదేశం లోనే తయారు చేయడం జరుగుతుందన్న మాట. తద్ద్వారా ఈ స్కీము దేశం లోపల ఎండ్ టు ఎండ్ మేన్యుఫాక్చరింగు కు ఈ పథకం అండదండలను అందిస్తుందన్న మాట.

 

PM India

PM India

 

*****