Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా ఆయన పదవీ కాలం లో రెండు సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో  అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్ లా ను ఆయన పదవీకాలం లో రెండేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనల ను తెలియజేశారు.

వరుస ట్వీట్ లలో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:

“గడచిన రెండు సంవత్సరాల లో, శ్రీ @ombirlakota గారు తీసుకొన్న చర్యల ద్వారా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమృద్ధం చేశారు, అంతే కాదు ఉత్పాదకత కూడా వృద్ధి చెందేటట్లు చూశారు.  ఈ కారణం గా అనేక చరిత్రాత్మకమైనటువంటి మరియు ప్రజోపయోగకరమైనటువంటి చట్టాలు ఆమోదాని కి నోచుకొన్నాయి.  ఆయన కు ఇవే అభినందనలు.

శ్రీ @ombirlakota గారు పార్లమెంట్ సభ్యులు గా ప్రథమం గా ఎన్నికై వచ్చినటువంటి వారికి, యువ ఎంపీల కు, పార్లమెంట్ లో మహిళా సభ్యుల కు సభ లో మాట్లాడే  అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం అనేది గమనించదగ్గది.  ఆయన మన ప్రజాస్వామ్యం లో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వివిధ సంఘాల ను కూడా  బలపరిచారు.’’

***<br

***

DS/AK