Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్కిల్ ఇండియా కార్యక్రమం కొనసాగింపు, పునఃవ్యవస్థీకరణకు మంత్రిమండలి ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2022-23 నుంచి 2025-26 వరకు రూ.8,800 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకం– స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ (సిప్)ను కొనసాగించడానికిపునర్వ్యవస్థీకరించడానికి ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా డిమాండ్ ఆధారితసాంకేతిక ఆధారితపరిశ్రమఆధారిత శిక్షణను ఏకీకృతం చేయడం ద్వారా నైపుణ్యం కలిగినభవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడానికి ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తుంది.

 

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (పిఎంకెవివై 4.0), ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (పిఎంఎన్ఏపిఎస్), జన్ శిక్షన్ సంస్థాన్ (జెఎస్ఎస్పథకం– ఈ మూడు ప్రధాన భాగాలను ఇప్పుడు సమగ్ర కేంద్ర ప్రభుత్వ పథకం అయిన “స్కిల్ ఇండియా ప్రోగ్రామ్” కింద కలిపారుఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్యాభివృద్ధిఉద్యోగ శిక్షణసామాజిక ఆధారిత విద్యను అందించడం లక్ష్యంగా కలిగి ఉన్నాయిదీని ద్వారా పట్టణగ్రామీణ ప్రజలుఅలాగే అణగారిన వర్గాలు కూడా మెరుగైన వృత్తి విద్యను పొందేలా చేయడమే ఉద్దేశంస్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ మూడు అత్యంత ప్రాధాన్య పథకాల కిందఇప్పటి వరకు 2.27 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0:

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (పి ఎమ్ కె వి వై 4.0) పథకం, 15 నుండి 59 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకునినేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ ఎస్ క్యు ఎఫ్ కు అనుగుణంగాషార్ట్టర్మ్ ట్రైనింగ్ (ఎస్ ఐ టి ), స్పెషల్ ప్రాజెక్ట్స్ (ఎస్ పి ), ముందస్తు అభ్యాస గుర్తింపు (ఆర్ పి ఎల్ ద్వారా నైపుణ్యాల పెంపును అందిస్తుందిప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగాపెరిగిన డిమాండ్ తో జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించే విధంగా రూపాంతరం చెందిందిఈ పథకంలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటేస్వల్ప వ్యవధి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో అనుభవాధారిత శిక్షణ (ఒజెటి)ను ఏకీకృతం చేయడంఇందువల్ల శిక్షణార్థులు వాస్తవ ప్రపంచ అనుభవంపరిశ్రమ అనుభవాన్ని పొందగలుగుతారుపెరుగుతున్న పరిశ్రమ డిమాండ్లుకొత్త తరం టెక్నాలజీకి అనుగుణంగాకృత్రిమ మేధ, 5 జి టెక్నాలజీసైబర్ సెక్యూరిటీగ్రీన్ హైడ్రోజన్డ్రోన్ టెక్నాలజీపై 400 పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టారుఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుభవిష్యత్తు నైపుణ్యాలపై దృష్టి సారించారు.

మిశ్రమసౌలభ్యవంతమైన విద్యా నమూనా ఇప్పుడు డిజిటల్ డెలివరీని సమీకరించిశిక్షణను మరింత సౌలభ్యవంతంగావిస్తరించగలిగే విధంగా మారుస్తుందిపరిశ్రమకు అనుగుణమైన లక్ష్యబద్ధమైన నైపుణ్యాలను అందించేందుకుశిక్షణార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికిపునర్నైపుణ్యాన్ని పొందడానికిఅధిక డిమాండ్ ఉన్న ఉద్యోగి పాత్రలలో ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం 7.5 గంటల నుండి 30 గంటల వరకు వ్యవధి కలిగిన మైక్రోక్రెడెన్షియల్నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (ఎన్ఓఎస్ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతుంది.

 

ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికినాణ్యమైన శిక్షణను విస్తరించడానికిఐఐటీలుఎన్ఐటీలుజవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్వి), కేంద్రీయ విద్యాలయాలుసైనిక్ పాఠశాలలుఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్), పిఎం శ్రీ స్కూల్స్టూల్రూమ్స్నైలెట్సిపెట్ వంటి ప్రముఖ విద్యా సంస్థలలో స్కిల్ హబ్ లను ఏర్పాటు చేశారు.

 

శిక్షణలో నాణ్యతమూల్యాంకనలను బలోపేతం చేయడానికిశిక్షణ కేంద్రాల మధ్య ప్రమాణీకరణనైపుణ్యాన్ని పెంపొందించేందుకు లక్ష మంది మూల్యాంకనకర్తలుశిక్షకులతో కూడిన– నేషనల్ పూల్ ను అభివృద్ధి చేస్తున్నారుపరిశ్రమ భాగస్వామ్యాలు రిక్రూట్ట్రెయిన్డిప్లాయ్ (ఆర్ టి డిశిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలకు ప్రవేశాన్ని సులభతరం చేస్తాయి.

ఇంకా ఈ పథకం అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ ప్రయాణాలకు ప్రాముఖ్యతను పెంచుతుందిదీని ద్వారా భారతీయ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉంటారుమంత్రిత్వ శాఖ వివిధ దేశాలతో మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలు (ఎంఎంపిఎ), అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుందిఅవసరమైన రంగాలలో నైపుణ్య లోపాలపై అధ్యయనాలు కూడా నిర్వహించిందిఈ పథకం కిందమన శ్రామిక శక్తికి అంతర్జాతీయ చలనశీలత అవకాశాలను పెంచడానికి డొమైన్ స్కిల్స్జాయింట్ సర్టిఫికేషన్లుభాషా ప్రావీణ్యంసాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణను ప్రారంభించారు.

 

పిఎంకెవివై 4.0 కిందఅన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని ప్రేరేపించేందుకు ‘మొత్తం ప్రభుత్వం’ అనే దృక్కోణాన్ని అవలంబించారుతద్వారా ఆయా రంగాలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిరవధికంగా అమలు అవుతాయిఈ పథకం వివిధ నైపుణ్యాభివృద్ధిఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకాల లో నైపుణ్య భాగాలను అందిస్తూదాని ప్రభావాన్నివనరుల సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచుతుందిప్రధాన భాగస్వామ్యాల్లోసూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పీఎం విశ్వకర్మపీఎం సూర్య ఘర్ముఫ్త్ బిజ్లీ యోజననూతనపునరుత్పాదక ఇంధన చెందిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్నల్ జల్ మిత్ర మొదలైనవి ఉన్నాయి.

 

సామర్థ్యాన్ని పెంపొందించడానికిరంగాల వారీగా నైపుణ్య అంతరాలుపరిశ్రమ అవసరాలను సమర్థంగా గుర్తించడానికి డిమాండు మదింపు వ్యూహాన్ని పునర్వ్యవస్థీకరించడంతో సహా విధానపరమైన మార్పులు ప్రవేశపెట్టారుపిఎంకెవివై 4.0 లో ఒక కీలక సంస్కరణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంఇది షరతుల భారాన్ని గణనీయంగా తగ్గించిందిఈ పథకంలో భాగస్వామ్యాన్ని మరింత క్రమబద్ధీకరించిసమర్థవంతంగా మార్చింది.

పీఎం నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (పీఎంఎన్ఏపీఎస్):

నేషనల్ పాలసీ ఆన్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్-2015 భారతదేశంలో నైపుణ్య కార్మిక శక్తిని సృష్టించేందుకు అప్రెంటీషిప్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిందివాస్తవ ఉద్యోగ ప్రదేశంలో పనిచేసే యువతకు నైపుణ్యాలను అందించేందుకుకొంత వేతనం సంపాదిస్తూ ఆర్థిక సహాయం పొందేందుకు అప్రెంటీషిప్ శిక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుందిఅంతర్జాతీయంగా కూడాశిక్షణతో నేర్చుకుంటూ సంపాదించే అత్యుత్తమ నమూనాగా అప్రెంటీషిప్‌ను పరిగణిస్తారు.

 

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీషిప్ ప్రమోషన్ స్కీమ్ (పిఎం– ఎన్ఎపిఎస్విద్య నుండి ఉద్యోగంలోకి నిరవధిక మార్పిడికి మద్దతు ఇస్తుందిదీని ద్వారా అప్రెంటీస్‌లు వాస్తవ ప్రపంచ అనుభవం ద్వారా పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాలను సంపాదించగలుగుతారుభారతదేశంలోని అప్రెంటిస్‌లుసంస్థలు రెండింటికీ మద్దతు ఇవ్వడానికికేంద్ర ప్రభుత్వం శిక్షణ కాలంలో స్టైపెండ్ లో 25 శాతం అంటే ప్రతి అప్రెంటిస్‌కు నెలకు రూ.1,500 వరకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అందిస్తుందిఈ పథకాన్ని 14 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల కోసం రూపొందించారుఇది వివిధ తరగతుల జనాభాలో నైపుణ్య అభివృద్ధి అవకాశాలను సమగ్రంగా పెంపొందిస్తుంది.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్రోబోటిక్స్బ్లాక్ చెయిన్గ్రీన్ ఎనర్జీఇండస్ట్రీ 4.0 టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా ప్రస్తుత తయారీ రంగంలో అప్రెంటిషిప్ అవకాశాలను ఎన్ఎపిఎస్ ప్రోత్సహిస్తుందిఇది భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్లుపరిశ్రమ ధోరణులతో నైపుణ్య కార్యక్రమాలను సమీకృతం చేస్తుందిచిన్న సంస్థల్లో ముఖ్యంగా సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), ఆకాంక్షాత్మక జిల్లాలుఈశాన్య ప్రాంతం వంటి నిరుపేద ప్రాంతాల్లో ఉన్న అప్రెంటిస్ల నమోదును ఈ పథకం ప్రోత్సహిస్తుంది.

 

జన్ శిక్షన్ సంస్థాన్ (జేఎస్ఎస్పథకం:

జన్ శిక్షన్ సంస్థన్ (జెఎస్ఎస్పథకం అనేది వృత్తి శిక్షణను అందుబాటులోసరళమైనసమ్మిళితంగా చేయడానికి రూపొందించిన సమాజ కేంద్రీకృత నైపుణ్య చొరవముఖ్యంగా మహిళలుగ్రామీణ యువతఆర్థికంగా వెనుకబడిన సమూహాలకు ఇంకా 15 – 45 సంవత్సరాల వయస్సు గల వారికి సేవలు అందిస్తుందితక్కువ ఖర్చుతోఇళ్ల వద్దనే శిక్షణను సౌలభ్యవంతమైన సమయావళితో అందించడం ద్వారాజెఎస్ఎస్ అవసరమైన వారికి నైపుణ్య అభివృద్ధి అవకాశాలను చేరవేసిస్వయం ఉపాధివేతన ఆధారిత జీవనోపాధులను ప్రేరేపిస్తుందినైపుణ్య అభివృద్ధి మించిఈ కార్యక్రమం సామాజిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తుందిఇది సమాజంలో ఆరోగ్యంశుభ్రతఆర్థిక సాక్షరతలింగ సమానత్వంవిద్యపై అవగాహన కల్పిస్తుందిజె ఎస్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఎం జన్ మన్అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్వంటి కీలక ఉద్యమాలతో అనుసంధానమైసమగ్ర నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

 

జాతీయ ప్రణాళికలకు అనుగుణంగాస్కిల్ ఇండియా కార్యక్రమం కింద ఉన్న అన్ని సర్టిఫికేషన్ లను నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ ఎస్ క్యూఎఫ్)కు అనుసంధానం చేశారుడిజిలాకర్నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ సీఆర్ ఎఫ్)లతో అనుసంధానం చేయడం ద్వారా నైపుణ్యాలకు అధికారిక గుర్తింపు లభించిఉద్యోగం,ఉన్నత విద్యలో సజావుగా మార్పిడి సాధ్యమవుతుంది.

 

స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కొనసాగింపుతోప్రభుత్వం వేగంగా మారుతున్న ఉపాధి రంగంలో నిరంతర నైపుణ్యాల అభివృద్ధిపునర్నైపుణ్యాలను పొందడం ప్రాముఖ్యతను గుర్తిస్తూజీవితకాల అభ్యాసానికి తన నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్డేటాకు ఈ చొరవ నేరుగా దోహదం చేస్తుందిశ్రామిక అభివృద్ధి విధానాలు ఆర్థికపారిశ్రామిక ధోరణులకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది.

 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో భారత శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడంలో స్కిల్ ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందిపరిశ్రమసంబంధిత శిక్షణఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఅంతర్జాతీయ మొబిలిటీ చొరవలను ఏకీకృతం చేయడం ద్వారాఈ కార్యక్రమం అధిక నైపుణ్యంతో పోటీకి దీటైన శ్రామిక శక్తిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందిఆర్థిక సాధికారతకు కీలక చోదకశక్తిగా స్కిల్ ఇండియా అన్ని రంగాల్లో ఉపాధి కల్పనవ్యవస్థాపకతఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందివృత్తి విద్యను బలోపేతం చేయడానికిఅప్రెంటిషిప్ అవకాశాలను విస్తరించడానికిజీవితకాల విద్యను ప్రోత్సహించడానికి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ (ఎం ఎస్ డి ఇకట్టుబడి ఉందిభారతదేశ కార్మిక శక్తి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండినైపుణ్య ఆధారిత ఉద్యోగాల్లో అంతర్జాతీయ నాయకత్వ స్థానంలో నిలబడుతుంది.

 

(For more details, visit: https://www.skillindiadigital.gov.in/home)

 

***