1. భారత గణతంత్ర గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రెండు పవిత్ర మసీదు ల సంరక్షకుడు, హిజ్ రాయల్ హైనెస్ మార్గదర్శకత్వం లో యువరాజు, ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ భారత దేశంలో 2019వ సంవత్సరం ఫిబ్రవరి 19వ, 20వ తేదీల లో తొలి ఆధికారిక పర్యటన కు వచ్చారు. ఈ సందర్భం గా గౌరవనీయ ప్రధాన మంత్రి ఆయన కు విమానాశ్రయం లో స్వాగతం పలికారు. రెండు పవిత్ర మసీదు ల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజు మాన్య శ్రీ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నుండి అందిన ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2016వ సంవత్సరం ఏప్రిల్ నెల లో సౌదీ అరేబియా ను సందర్శించిన నేపథ్యం లో యువరాజు ప్రస్తుతం భారతదేశ పర్యటన కు తరలివచ్చారు.
2. సౌదీ అరేబియా యువరాజు రాక సందర్భం గా 2019వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ న న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లో ఆయన కు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన గౌరవార్థం రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ విందు ను ఏర్పాటు చేశారు.
3. ప్రధాన మంత్రి శ్రీ మోదీ, మాననీయ సౌదీ అరేబియా యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ లు 2019వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ న ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ప్రతినిధివర్గం స్థాయి చర్చల లో పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ కూడా ఈ సందర్భం గా సౌదీ అరేబియా యువరాజు తో భేటీ అయ్యారు.
4. శతాబ్దాల నాటి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక బంధాల ను ప్రతిబింబిస్తూ భారతదేశం- సౌదీ అరేబియా లు సాదరమైన మరియు స్నేహపూర్వకమైన సంబంధాల ను కొనసాగిస్తున్నాయి. ఇందుకు భౌగోళిక సామీప్యం, నాగరకత సంబంధాలు, సాంస్కృతిక బంధం, సహజ సమష్టితత్వం, ఉత్తేజపూర్వక ప్రజా సంబంధాలు దోహదం చేస్తున్నాయి. ఈ చురుకైన సంబంధాల కు ఉమ్మడి సవాళ్లు, అవకాశాలు మరింత ఊతాన్ని ఇచ్చాయి.
5. రెండు దేశాల ను, వాటి నేతల ను ముడివేసిన బలమైన స్నేహబంధం స్ఫూర్తి తో ద్వైపాక్షిక చర్చ లు జరిగాయి. నమ్మకం, పరస్పర అవగాహన, ప్రయోజనాలు, సౌహార్దం, ఒకరిపై మ రొకరికి గల గౌరవం పునాదులు గా ద్వైపాక్షిక స్నేహ సంబంధాలు, సహకారం అద్భుత స్థాయి లో కొనసాగడంపై వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. రియాద్ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2016వ సంవత్సరం ఏప్రిల్ నాటి చరిత్రాత్మక పర్యటన నేపథ్యం లో వాణిజ్యం, ఇంధనం, భద్రత, సాంస్కృతికం సహా విభిన్న రంగాల లో సాధించిన ప్రగతి పైనా రెండు పక్షాలూ సంతృప్తి ని ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల ను, లావాదేవీల ను మరింత ఉన్నత స్థాయి కి తీసుకుపోవడాని కి ఆ పర్యటన ఎంతగానో దోహదం చేసింది.
6. సౌదీ అరేబియా లో ఆధునికత, దాపరిక రహిత విధానాల దిశ గా మాననీయ యువరాజు తీసుకున్న చర్యల ఫలితం గా ఇటీవలి కాలం లో చోటు చేసుకున్న మార్పుల పై ప్రధాన మంత్రి శ్రీ మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. కాగా, సంఘటిత తత్వం, అనేకత్వం, సహనశీలం లతో కూడిన భారతదేశ నమూనా స్వాభావిక విశిష్టత ను యువరాజు ప్రశంసించారు.
7. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశ గా 2010వ సంవత్సరం ఫిబ్రవరి నాటి ‘రియాద్ తీర్మానం’తో పాటు 2014వ సంవత్సరం ఫిబ్రవరి లో రెండు పవిత్ర మసీదు ల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజు మాన్య శ్రీ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ పర్యటన సందర్భం గానూ, 2016వ సంవత్సరం ఏప్రిల్ నెల లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ సౌదీ అరేబియా సందర్శన సమయం లోనూ చేసిన పునరుద్ఘాటనల కు అనుగుణం గా ఆ నిర్దేశాని కి తమ కట్టుబాటు ను ఉభయ పక్షాలూ పునరుద్ఘాటించాయి.
8. ఉన్నత స్థాయి పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుత ‘వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి. తదనుగుణంగా ‘వ్యూహాత్మక భాగస్వామ్య మండలి’ పేరిట రూపుదిద్దుకునే ఈ యంత్రాంగాని కి గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మాననీయ సౌదీ అరేబియా యువరాజు నేతృత్వం వహిస్తారు. వీరి కి యావత్తు వ్యూహాత్మక సంబంధాల శ్రేణి కి సంబంధించి మంత్రుల స్థాయి సభ్యులు సహకరిస్తారు.
9. రియాద్ నగరం లో నీతి ఆయోగ్, సౌదీ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కేంద్రం (ఎస్ సిఐఎస్ పి) మధ్య ఇటీవల నిర్వహించిన సమావేశం చర్చ ల ఫలితాల పై ఉభయ పక్షాలూ హర్షాన్ని వెలిబుచ్చాయి. ఈ సందర్భం గా వివిధ రంగాల లో సంయుక్త పెట్టుబడుల కు గల 40 అవకాశాల ను సమావేశం గుర్తించింది.
10. ఈ పర్యటన సందర్భం గా సంతకాలు పూర్తి అయినటువంటి అవగాహన పూర్వక ఒప్పందాలు కింది విధం గా ఉన్నాయి:-
(i) భారత జాతీయ పెట్టుబడులు-మౌలిక వసతుల నిధి (ఎన్ఐఐఎఫ్)లో పెట్టుబడుల పై అవగాహన ఒప్పందం.
(ii) పర్యాటక రంగం లో సహకారం పై అవగాహన ఒప్పందం.
(iii) గృహ నిర్మాణ రంగం లో సహకారం పై అవగాహన ఒప్పందం.
(iv) ‘ఇన్వెస్ట్ ఇండియా’, సౌదీ అరేబియా సాధారణ పెట్టుబడుల ప్రాధికార సంస్థ (ఎస్ఎజిఐఎ)ల మధ్య సహకారం పై ముసాయిదా కార్యక్రమం.
(v) దృశ్య-శ్రవణ కార్యక్రమాల ప్రసారం కోసం ఆదానప్రదాన సహకారంపై అవగాహన ఒప్పందం.
(vi) అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)లో సౌదీ అరేబియా చేరిక కు సంబంధించిన ఒప్పందాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆవిష్కరించారు.
11. ఇటీవలి సంవత్సరాల లో ద్వైపాక్షిక వాణిజ్యం లో సానుకూల ధోరణి ని గమనించిన నేపథ్యం లో- వస్తు వాణిజ్యం లో ప్రత్యేకించి, చమురేతర వాణిజ్యం లో అందిపుచ్చుకోవలసిన సామర్థ్యాన్ని ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఈ మేరకు ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి, సాంస్కృతిక, సాంకేతిక రంగాల లో సహకారం పెంపు దిశ గా 2018వ సంవత్సరం ఫిబ్రవరి లో భారత- సౌదీ సంయుక్త కమిశన్ 12వ సమావేశాన్ని రియాద్ నగరం లో నిర్వహించిన సందర్భం గా సానుకూల చర్చలు సాగడాన్ని ఉభయ పక్షాలూ ప్రశంసించాయి.
12. ఎగుమతులకు గల అవరోధాల ను తొలగించడంతో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని పెంచడానికి గల ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలూ నొక్కిపలికాయి.
13. వాణిజ్యం, పెట్టుబడుల పై సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి రెండు పక్షాలూ అంగీకరించాయి. ఈ దిశ గా సౌదీ అరేబియా ‘‘విజన్-2030, 13 దార్శనిక లక్ష్యాల సాకార కార్యక్రమం’’తో భారతదేశం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలైన ‘‘మేక్ ఇన్ ఇండియా’’, ‘స్టార్ట్- అప్ ఇండియా’, స్మార్ట్ సిటీస్, పరిశుభ్ర భారతం, డిజిటల్ భారతం’’ల వంటి వాటి ని సమన్వయం చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు సౌదీ అరేబియా లో చేపట్టబోయే భారీ ప్రాజెక్టుల లో భారత ప్రభుత్వ/ప్రైవేటు పెట్టుబడుల ను, నైపుణ్యాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రతినిధివర్గం సంసిద్ధత ను వ్యక్తం చేసింది. భారతదేశం లో, సౌదీ అరేబియా లో పరివర్తనాత్మక ఆర్థిక వ్యవస్థల ను ఉభయపక్షాలూ గుర్తించాయి.
14. వాణిజ్య సౌలభ్యం మెరుగుదల కు, ప్రస్తుత నిబంధనల సరళీకరణ కు, హేతుబద్ధీకరణ కు, కీలక రంగాల లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు నిబంధనల ను సడలించడాని కి రెండు ప్రభుత్వాలు చూపిన చొరవ ను ఇరు పక్షాలూ ప్రశంసించాయి.
15. ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2016వ సంవత్సరం లో రియాద్ ను సందర్శించిన సందర్భం గా సౌదీ అరేబియా సాధారణ పెట్టుబడుల ప్రాధికార సంస్థ (ఎస్ఎజిఐఎ), ‘ఇన్ వెస్ట్ ఇండియా’ల మధ్య సహకారం తాలూకు ముసాయిదా ఒప్పందం పై సంతకాల అనంతరం పెట్టబడుల వాతావరణం లో సానుకూల మార్పు లు చోటుచేసుకోవడం పై ఉభయ పక్షాలూ హర్షం ప్రకటించాయి. ఈ మేరకు రెండు దేశాల లో పెట్టుబడుల కు గల అవకాశాల ను సద్వినియోగం చేసుకోవలసింది గా పారిశ్రామికవేత్తల కు ఉభయ పక్షాలూ పిలుపునిచ్చాయి. ముఖ్యంగా మౌలిక వసతులు, గనులు, నవీకరణ యోగ్య శక్తి సహా ఇంధన రంగం, ఆహార భద్రత, సాంకేతికత బదిలీ వంటి రంగాల ను ఎంచుకోవాల్సిందిగా సూచించాయి. అలాగే సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేశన్ ల రంగాల లో నైపుణ్య మానవ వనరుల స్థిరీకరణ కు సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని కోరాయి.
16. సౌదీ అరేబియా లోని పారిశ్రామిక నగరాల లో, నౌకాశ్రయాల లో అందుబాటు లో గల అత్యాధునిక మౌలిక సదుపాయాల ను, రవాణా సేవల ను వివరిస్తూ- దేశీయ, ప్రాంతీయ విపణుల కు అందుబాటు లోకి వచ్చేలా పెట్టుబడులు పెట్టాల్సింది గా భారతదేశ కంపెనీల ను మాననీయ సౌదీ యువరాజు ఆహ్వానించారు.
17. శక్తి, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఖనిజాలు మరియు గనుల తవ్వకం, తయారీ, విద్య మరియుయ ఆరోగ్యం రంగాల లో 100 బిలియన్ డాలర్ల కు పైగా పెట్టుబడులు పెడతామని మాననీయ సౌదీ యువరాజు ప్రకటించడం పై ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
18. రెండు దేశాల తొలి సంయుక్త పథకం గా పశ్చిమ కోస్తా చమురుశుద్ధి-పెట్రో రసాయనాల సంస్థ ఏర్పాటు పై ఉభయ పక్షాలూ సంతృప్తి ని వ్యక్తం చేశాయి. మొత్తం 44 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయం తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు అమలు ను వేగిరపరచడంపై అంగీకారాని కి వచ్చాయి. ప్రపంచం లోకెల్లా అతిపెద్దదైన ఈ హరిత క్షేత్ర చమురు శుద్ధి ప్రాజెక్టు ను ఒకే దశ లో పూర్తి చేయనుండడం విశేషం. దీనితో పాటు ప్రభుత్వ పెట్టుబడుల నిధి, దాని సాంకేతిక భాగస్వాముల ద్వారా మరో 10 బిలియన్ డాలర్లు సహా ఇతర పెట్టుబడి అవకాశాల ద్వారా మరో 26 బిలియన్ డాలర్ల మేర సమీకరణ కు ప్రయత్నాలు సాగుతాయి.
19. భారతదేశం లో జాతీయ పెట్టుబడులు-మౌలిక వసతుల నిధి తో పాటు ఇతర కీలక రంగాల లో సౌదీ అరేబియా నుంచి పెట్టుబడుల ను భారతదేశ ప్రధాన మంత్రి స్వాగతించారు. ఆ మేరకు ద్వైపాక్షిక ఆర్థిక సహకారం విస్తరణ కు తోడ్పడే రీతి లో జాతీయ పెట్టుబడులు-మౌలిక వసతుల నిధి లో పెట్టుబడుల పై అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేయడం పై రెండు పక్షాలూ హర్షం ప్రకటించాయి.
20. భారతదేశం లో- ప్రత్యేకించి శక్తి, రిఫైనింగ్, పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఖనిజాలు మరియు గనుల తవ్వకం, తయారీ, విద్య మరియు ఆరోగ్యం రంగాల లో పెట్టుబడులు పెట్టడంపై సౌదీ ప్రతినిధి వర్గం ఆసక్తి ని కనబరచడంపై ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు.
21. గృహ నిర్మాణ రంగంలో సహకారాని కి అవగాహన ఒప్పందం కుదరడంతో పాటు సౌదీ అరేబియా లో గృహ నిర్మాణ పథకాల లో భారతదేశ కంపెనీల భాగస్వామ్యాని కి ప్రోత్సాహం పై రెండు పక్షాలూ హర్షాన్ని వ్యక్తం చేశాయి.
22. విపత్తు నష్ట నివారణ మౌలిక సదుపాయాల కల్పన సంకీర్ణం ఏర్పాటు పై ప్రధాన మంత్రి చొరవ ను ప్రశంసిస్తూ, విపత్తుల నిర్వహణ లో ఇది ఒక ముఖ్యమైన ముందంజ అని పేర్కొని మాననీయ సౌదీ యువరాజు అభినందనలు తెలియజేశారు.
23. వ్యూహాత్మక భాగస్వామ్యాని కి శక్తి భద్రత ఎంత కీలకమో ఉభయ పక్షాలూ గుర్తించాయి. ఈ నేపథ్యం లో భారతదేశాని కి చమురు, గ్యాస్ సరఫరా లో సౌదీ అరేబియా విశ్వసనీయ దేశం కావడాన్ని దృష్టి లో పెట్టుకొని ఇంధన రంగం లో ద్వైపాక్షిక వాణిజ్యం పెరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయి. అలాగే భారత-సౌదీ అరేబియా శక్తి సంప్రతింపుల ను కొనసాగించవలసిన అవసరాన్ని రెండు పక్షాలూ గుర్తించాయి. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లకు సంబంధించి పెట్టబడులు, సంయుక్త వ్యవస్థ ల రూపకల్పన పై దృష్టి సారిస్తూ శక్తి రంగం లో రెండు దేశాల మధ్య గల కొనుగోలుదారు- అమ్మకందారు సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం గా మార్చుకోవడానికి రెండు పక్షాలూ అంగీకరించాయి.
24. ముడి చమురు, పెట్రో ఉత్పత్తుల కు సంబంధించి పెరుగుతున్న భారతదేశం అవసరాల ను తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని మాననీయులైన సౌదీ యువరాజు పునరుద్ఘాటించారు. అలాగే ఇతర వనరుల ద్వారా సరఫరా లో అంతరాయం ఏర్పడినప్పుడు కలిగే లోటు ను తీర్చేందుకు అంగీకరించారు.
25. భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియమ్ నిల్వ ల కార్యక్రమం లో భాగస్వామ్యాని కి సౌదీ అరేబియా అంగీకరించడం పైన కూడా ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు.
26. అంతర్జాతీయ సౌర కూటమి లో చేరాలన్న సౌదీ అరేబియా నిర్ణయాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. ఈ సందర్భం గా నవీకరణ యోగ్య శక్తి రంగం లో పెట్టుబడుల తో పాటు పరిశోధన-అభివృద్ధి పై పరస్పర సహకార సామర్థ్యాన్ని రెండు పక్షాలూ గుర్తించాయి.
27. అంతరిక్షం, రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ సమాచారం, ఉపగ్రహ ఆధారిత మార్గదర్శక వ్యవస్థ లు సహా శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞాన రంగాల లో సహకారానికి కూడా రెండు పక్షాలూ అంగీకరించాయి.
28. తయారీ, సమాచార సాంకేతికత, కమ్యూనికేశన్స్ , ప్రోగ్రామింగ్ ల వంటి ప్రధాన రంగాల లో రెండు దేశాల కు గల కీలక సామర్థ్యాల ద్వారా పరస్పర లబ్ధి దిశ గా సహకారాని కి అవకాశం ఉన్న అంశాల ను గుర్తించేందుకు సంయుక్త నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ బృందం ఏర్పాటు కు రెండు పక్షాలూ అంగీకరించాయి.
29. రక్షణ రంగం లో- ప్రత్యేకించి నైపుణ్యం, శిక్షణ రంగాల లో ఇటీవల భారత- సౌదీ సహకార పురోగతి పై రెండు పక్షాలూ హర్షాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యం గా సౌదీ రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ భారతదేశ పర్యటన సందర్భం గా 2014వ సంవత్సరం ఫిబ్రవరి లో రక్షణ సహకారం పై అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యం లో రక్షణ సహకారం పై 2019వ సంవత్సరం జనవరి 2వ, 3వ తేదీల లో నిర్వహించిన సంయుక్త సంఘం సమావేశం నిర్ణయాల పైన రెండు పక్షాలూ హర్షం ప్రకటించాయి.
30. సంయుక్త నావికాదళ విన్యాసాల నిర్వహణ ను వీలైనంత త్వరగా చేపట్టేందుకు, ఇతర సైనిక విభాగాల లోనూ ద్వైపాక్షిక కసరత్తుల విస్తరణ కు రెండు పక్షాలూ అంగీకరించాయి.
31. నావికా, భూతల సైనిక వ్యవస్థ ల కోసం రక్షణ విడిభాగాల ఉత్పత్తి లో పరస్పర ప్రయోజనాల ను, సామర్థ్యాన్ని రెండు దేశాలూ గుర్తించాయి. ఈ మేరకు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘విజన్-2030’ల కు అనుగుణం గా సరఫరా శృంఖలాన్ని అభివృద్ధిపరచే దిశ గా సంయుక్తంగా కృషి చేసేందుకు, సంయుక్తంగా సహకరించుకొనేందుకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
32. అంతర్జాతీయ వాణిజ్యాని కి, రెండు దేశాల సౌభాగ్యాని కి ఎంతో కీలకమైన భద్రత విషయం లో సముద్ర భద్రత ను పెంపొందించే దిశ గా హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు సంయుక్తం గా కృషి చేసేలా రెండు పక్షాలూ అంగీకారాని కి వచ్చాయి.
33. ప్రాంతీయ అనుసంధానం పథకాలు అంతర్జాతీయ చట్టాల కు లోబడటంతో పాటు ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రత ను, సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని రెండు దేశాలూ అంగీకారాని కి వచ్చాయి.
34. ప్రాంతీయ సుస్థిరత, ఇరుగుపొరుగు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాముఖ్యాన్ని రెండు పక్షాలూ నొక్కిపలికాయి. ఈ సందర్భం గా పాకిస్థాన్ తో స్నేహపూర్వక సంబంధాలు సహా ఇరుగు పొరుగు దేశాల తో సత్సంబంధాల బలోపేతాని కి 2014వ సంవత్సరం మే నెల నుండి ప్రధాన మంత్రి శ్రీ మోదీ చేస్తున్ననిరంతర కృషి ని సౌదీ అరేబియా యువరాజు శ్లాఘించారు. భారత- పాకిస్తాన్ సమగ్ర చర్చల కు తగిన వాతావరణాన్ని సృష్టించే అవసరం పైన రెండు పక్షాలూ ఈ సందర్భం గా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
35. తీవ్రవాదం, ఉగ్రవాదం దాదాపుగా అన్ని దేశాలను, సమాజాలను పట్టి పీడిస్తున్నాయని పేర్కొంటూ, ఈ సార్వత్రిక జాడ్యాన్ని ప్రత్యేకించి ఏదైనా జాతి, మతం లేదా సంస్కృతి తో ముడిపెట్టే ప్రయత్నాలను తిరస్కరించాలని రెండు పక్షాలూ స్పష్టం చేశాయి. ఇతర దేశాల కు వ్యతిరేకం గా ఉగ్రవాద ప్రయోగాన్ని ఖండించాలని; ఉగ్రవాద స్థావరాలు గా మారిన దేశాల లో సంబంధిత మౌలిక వసతుల ను ధ్వంసం చేయాలని; పొరుగు దేశాల లో ఉగ్రవాదుల ప్రయోగాని కి, ఉగ్రవాద చర్యలను ప్రేరేపించడానికి ఎలాంటి మద్దతు, ఆర్థిక తోడ్పాటు అందకుండా చూడాలని; ఉగ్రదాడుల కు కారకులైన వారిని తక్షణం శిక్షించాలని ప్రపంచ దేశాలకు రెండు పక్షాలూ విజ్ఞప్తి చేశాయి. ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా అంతర్జాతీయ సమాజం సామూహిక కార్యాచరణ కు ఉపక్రమించవలసిన అవసరాన్ని నొక్కిపలికాయి. ఇందులో భాగం గా అంతర్జాతీయ ఉగ్రవాదం పై ఐక్య రాజ్య సమితి సమగ్ర తీర్మానాన్ని వీలైనంత త్వరగా అన్ని దేశాలూ ఆమోదించాలని సూచించాయి. అలాగే ఉగ్రవాదుల తో పాటు, వారి సంస్థల పై ఐక్య రాజ్య సమితి ద్వారా సమగ్ర ఆంక్షల విధింపు ప్రాముఖ్యాన్ని గుర్తించాలని వివరించాయి.
36. జాతీయ విధానం లో భాగంగా ఉగ్రవాద వినియోగాన్ని అన్ని దేశాలూ తీవ్రం గా ఖండించాలని రెండు పక్షాలూ విజ్ఞప్తి చేశాయి. అలాగే ఇతర దేశాల పై విధ్వంసక ఉగ్రవాద దాడుల కు వీలు లేకుండా చూడాలని, క్షిపణులు, డ్రోన్ ల వంటి ఆయుధాలు ముష్కరుల కు అందుబాటు లో లేకుండా జాగ్రత్తపడాలని సూచించాయి.
37. జమ్ము & కశ్మీర్ లోని పుల్ వామా లో 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ న భారతదేశ భద్రత దళాల పై ఉగ్రవాదుల దాడి ని ప్రధాన మంత్రి, సౌదీ అరేబియా యువరాజు బలమైన పదజాలం తో తీవ్ర స్థాయి లో ఖండించారు.
38. అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరత లకు సంబంధించి ఉమ్మడి ప్రయోజనాల నేపథ్యం లో పశ్చిమాసియా, మధ్యప్రాచ్య ప్రాంత దేశాల లో భద్రత పరిస్థితులు సహా పరస్పర ప్రయోజన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల పై రెండు పక్షాలూ చర్చించాయి. సిరియా సమస్య కు పరిష్కారం దిశ గా భద్రత మండలి తీర్మానాలు (2254, 2216)తో పాటు యెమన్ లో సంక్షోభ పరిష్కారం పై జిసిసి చర్య లు, యెమన్ జాతీయ చర్చల నిర్ణయాల అమలు అవసరాన్ని రెండు పక్షాలూ నొక్కిపలికాయి.
39. అరబ్ శాంతి చర్చలు, ఐక్య రాజ్య సమితి తీర్మానాల ఆధారం గా మధ్యప్రాచ్యం లో సముచిత, సమగ్ర, శాశ్వత శాంతి సాధన తో పాటు పాలస్తీనా ప్రజల చట్టబద్ధ హక్కుల కు హామీ ని ఇవ్వడంపై రెండు పక్షాలూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.
40. ఉగ్రవాద నిరోధాని కి కృషి, వాస్తవ నిఘా సమాచార తక్షణ ఆదానప్రదానం దిశ గా సహకారాన్ని మరింత విస్తరించేందుకు రెండు పక్షాలూ అంగీకరించాయి. ఈ మేరకు జాతీయ భద్రత సలహాదారుల స్థాయి సంభాషణల కోసం ‘‘సమగ్ర భద్రత చర్చావేదిక’’తో పాటు ఉగ్రవాద నిరోధం పై సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు కు నిర్ణయించాయి.
41. భద్రత సంబంధాంశాలు- ప్రత్యేకించి సముద్ర భద్రత, చట్టాల అమలు, అక్రమార్జన చెలామణి నిరోధం, మాదకద్రవ్యాల రవాణా, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు సహా బహుళజాతి వ్యవస్థీకృత నేరాల పై తమ మధ్య గల ప్రస్తుత సహకారాన్ని కొనసాగిస్తామని ప్రధాన మంత్రి, సౌదీ యువరాజు లు పునరుద్ఘాటించారు.
42. విధ్వంసక, ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారం కోసం సైబర్ ప్రపంచ దుర్వినియోగం పై రెండు పక్షాలూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సైబర్ ప్రపంచ వ్యవహారాలతో పాటు సైబర్ నేరాల ను ఎదుర్కోవడం పై సాంకేతిక సహకారం దిశ గా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పై హర్షాన్ని వ్యక్తం చేశాయి. సామాజిక సామరస్య భంగాని కి ప్రేరేపించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం సైబర్ ప్రపంచ వినియోగాన్ని నిరోధించడం పై సహకారాన్ని ప్రోత్సహించాలని కూడా అంగీకరించాయి.
43. సౌదీ అరేబియా లో అధిక సంఖ్య లో భారతీయుల కు ఆతిథ్యం ఇవ్వడం తో పాటు వారి సంక్షేమాని కి, శ్రేయస్సు కు ఊతాన్ని ఇస్తున్నందుకుగాను సౌదీ నాయకత్వానికి భారతదేశ నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేసింది.
44. సౌదీ అరేబియా 32వ జాతీయ సంస్కృతి-వారసత్వ వేడుక ‘‘జనాద్రియాహ్-2018’’కుగాను భారతదేశాని కి ‘గౌరవ అతిథి’ హోదా కల్పించడం పై సౌదీ నాయకత్వానికి ప్రధాన మంత్రి కృతజ్ఞత లను వ్యక్తం చేశారు. దీనితో పాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, సాంస్కృతిక సహకార విస్తృతి దిశ గా ‘‘సౌదీ అరేబియా లో భారత వారోత్సవాలు, భారతదేశం లో సౌదీ వారోత్సవాల’’ పేరిట క్రమబద్ధం గా సాంస్కృతిక వారోత్సవాల ను నిర్వహించవలసిన అవసరాన్ని రెండు దేశాలూ నొక్కిపలికాయి.
45. భారతదేశ తాజా జనగణన కు అనుగుణంగా భారత్ నుండి హజ్ యాత్రికుల సంఖ్య ను 2 లక్షల కు పెంచినందుకుగాను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని కి మరియు సౌదీ యువరాజు కు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
46. సౌదీ అరేబియా జైళ్ల లో మగ్గుతున్న 850 మంది భారతీయ ఖైదీ ల విడుదల కు ఆదేశాలు ఇచ్చినందుకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకునికి, మరియు సౌదీ యువరాజు కు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
47. ప్రజల మధ్య సంబంధాలతో పాటు దౌత్య, వలస సంబంధిత సవాళ్ల పరిష్కారం ద్వారా రెండు వైపులా పర్యాటకం విస్తృతి ని ఆకాంక్షిస్తున్నట్లు రెండు పక్షాలూ అంగీకరించాయి.
48. సౌదీ అరేబియా విమాన సర్వీసుల లో సీట్ల సంఖ్య ను నెలకు 80,000 నుండి 1,12,000 కు పెంచేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ సంఖ్య ను గణనీయం గా పెంచడం పై అధ్యయనం ఇప్పటికే మొదలైంది.
49. వలస కు సంబంధించి ఉత్తేజకర వాతావరణాన్ని సృష్టించే దిశ గా రెండు దేశాల లో అనుసరిస్తున్న ఇ-మైగ్రేట్, ఇ-తౌతీఖ్ ల వంటి విధానాల ను ఏకీకృతం చేయడం పై పరిశీలన జరపడానికి రెండు పక్షాలూ సమ్మతించాయి.
50. భారతీయుల కు- ప్రత్యేకించి హజ్/ఉమ్రా యాత్రికుల కు ప్రయోజనం దిశ గా రూపే తదితర చెల్లింపు విధానాల లో సహకారానికి గల అవకాశాల అన్వేషణ కు రెండు పక్షాలూ అంగీకరించాయి. సౌదీ అరేబియా లో అనుమతించిన కాలాని కి మించి (ఇకామా) నివసించడం లో తమ తప్పు లేకపోయినా దండన కు గురి అయ్యే స్థితి లో గల భారత కార్మికుల సమస్య ను పరిష్కరించినందుకు, ఈ మానవతావాద అంశం పై సహృదయం తో వ్యవహరించినందుకుగాను సౌదీ అరేబియా యువరాజు కు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
51. విస్తృత సహకారం ద్వారా ఐక్య రాజ్యస మితి, జి-20, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టిఒ) సహా అంతర్జాతీయ సంస్థ లు, బహుపాక్షిక వేదికల పై సంస్కరించబడిన బహుపాక్షిక విధానాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు రెండు పక్షాలు అంగీకరించాయి. ఈ సందర్భం గా ఐక్య రాజ్య సమితి భద్రత మండలి, డబ్ల్యు టిఒ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల వంటి వాటిలో ప్రపంచ పాలన విధాన సంస్కరణ అవసరాన్ని రెండు పక్షాలూ నొక్కిపలికాయి.
52. అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడం లో సమకాలీన వాస్తవికతల ను ఐక్య రాజ్య సమితి లో ప్రతిబింబించే ప్రాతిపదిక న సంస్కరించబడిన, సమర్థ బహుపాక్షిక వ్యవస్థ ఆవశ్యకత ను రెండు పక్షాలూ నొక్కిపలికాయి. భద్రత మండలి సహా ఐక్య రాజ్య సమితి లో తక్షణ సంస్కరణల అవసరాన్ని స్పష్టం చేశాయి.
53. పరారీలో గల ఆర్థిక నేరగాళ్ల కు సంబంధించి అంతర్జాతీయ సంస్థ లు, వ్యవస్థ ల ద్వారా చర్య ల విషయం లో సంయుక్తం గా వ్యవహరించడం పై తమ కట్టుబాటు ను రెండు దేశాలూ పునరుద్ఘాటించాయి.
54. భారతదేశం లో తనకు, తనతో పాటు వచ్చిన ప్రతినిధివర్గాని కి సాదర స్వాగతం పలికినందుకు మరియు చక్కని ఆతిథ్య సత్కారాల ను కల్పించినందుకుగాను భారతదేశ ప్రభుత్వాని కి, ప్రజల కు సౌదీ అరేబియా యువరాజు, ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి శ్రీ మొహమ్మద్ బిన్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు.
**
भारत और सऊदी अरब के आर्थिक, सामाजिक और सांस्कृतिक सम्बन्ध सदियों पुराने हैं। और यह सदैव सौहार्द्रपूर्ण और मैत्रीपूर्ण रहे हैं। हमारे लोगों के बीच के घनिष्ठ और निकट संपर्क हमारे देशों के लिए एक सजीव सेतु यानि living bridge है: PM @narendramodi pic.twitter.com/eTdPnOXEKE
— PMO India (@PMOIndia) February 20, 2019
हिज मेजेस्टी की, और रॉयल हाईनेस आपकी, व्यक्तिगत रुचि और मार्गदर्शन से हमारे द्विपक्षीय सबंधों में और भी प्रगाढ़ता, मधुरता और शक्ति आई हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
आज, 21वीं सदी में, सऊदी अरब, भारत के सबसे मूल्यवान strategic partners में है।
— PMO India (@PMOIndia) February 20, 2019
यह हमारे विस्तृत पड़ोस में है, एक करीबी दोस्त है और भारत की ऊर्जा सुरक्षा का महत्वपूर्ण स्रोत भी है: PM @narendramodi
आज हमने द्विपक्षीय संबंधों के सभी विषयों पर व्यापक और सार्थक चर्चा की है। हमने अपने आर्थिक सहयोग को नई ऊंचाइयों पर ले जाने का निश्चय किया है: PM @narendramodi pic.twitter.com/YobAUzKQup
— PMO India (@PMOIndia) February 20, 2019
हमारे ऊर्जा संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप में तब्दील करने का समय आ गया है। दुनिया की सबसे बड़ी रिफाइनरी और स्ट्रेटेजिक पेट्रोलियम रिज़र्व में सऊदी अरब की भागीदारी, हमारे ऊर्जा संबंधों को buyer-seller relation से बहुत आगे ले जाती है: PM @narendramodi pic.twitter.com/h2zYnL9lNN
— PMO India (@PMOIndia) February 20, 2019
हम अक्षय ऊर्जा के क्षेत्रों में अपने सहयोग को मज़बूत करने पर सहमत हुए हैं। हम इंटरनेशनल सोलर अलायंस में सऊदी अरब का स्वागत करते हैं। परमाणु ऊर्जा के शांतिपूर्ण उपयोग, विशेषरूप से water desalination और स्वास्थ्य के लिए, हमारे सहयोग का एक और आयाम होंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
विशेषकर अपने strategic वातावरण के संदर्भ में, हमने आपसी रक्षा सहयोग को मज़बूत करने और उसका विस्तार करने पर भी सफल चर्चा की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
पिछले हफ्ते पुलवामा में हुआ बर्बर आतंकवादी हमला, इस मानवता विरोधी खतरे से दुनिया पर छाए कहर की एक और क्रूर निशानी है।
— PMO India (@PMOIndia) February 20, 2019
इस खतरे से प्रभावशाली ढंग से निपटने के लिए हम इस बात पर सहमत हैं कि आतंकवाद को किसी भी प्रकार का समर्थन दे रहे देशों पर सभी संभव दबाव बढ़ाने की आवश्यकता है: PM
आतंकवाद का इंफ्रास्ट्रक्चर नष्ट करना और इसको समर्थन समाप्त करना और आतंकवादियों और उनके समर्थकों को सजा दिलाना बहुत जरूरी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
साथ ही अतिवाद के खिलाफ सहयोग और इसके लिए एक मज़बूत कार्ययोजना की भी ज़रूरत है, ताकि हिंसा और आतंक की ताकतें हमारे युवाओं को गुमराह न कर सकें। मुझे खुशी है कि सऊदी अरब और भारत इस बारे में साझा विचार रखते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
पश्चिम एशिया और खाड़ी में शांति और स्थिरता सुनिचित करने में हमारे दोनों देशों के साझा हित हैं। आज हमारी बातचीत में, इस क्षेत्र में हमारे कार्यों में तालमेल लाने और हमारी भागीदारी को तेजी से आगे बढ़ाने पर सहमति हुई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
हम इस बात पर भी सहमत हुए हैं कि counter terrorism, समुद्री सुरक्षा और साइबर सुरक्षा जैसे क्षेत्रों में और मजबूत द्विपक्षीय सहयोग दोनों देशों के लिए लाभप्रद रहेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
Your Royal Highness, आपकी यात्रा ने हमारे रिश्तों के तेज विकास को एक नया आयाम दिया।
— PMO India (@PMOIndia) February 20, 2019
मैं एक बार फिर, हमारे निमंत्रण को स्वीकार करने के लिए रॉयल हाईनेस का शुक्रिया अदा करता हूँ। मैं उनके और प्रतिनिधिमंडल के सभी सदस्यों की भारत में सुखद प्रवास की कामना भी करता हूँ: PM @narendramodi pic.twitter.com/VOVz3zOORr