ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ అయిన శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు. సిఒవిఐడి-19 (కోవిడ్- 19) విశ్వమారి దరిమిలా ప్రపంచం లో తల ఎత్తిన స్థితి ని గురించి నేత లు ఇరువురూ చర్చించారు.
లక్షల కొద్దీ ప్రజల ఆరోగ్యాన్ని మరియు క్షేమాన్ని ప్రభావితం చేయడం ఒక్కటే కాకుండా, ప్రపంచం లోని అనేక ప్రాంతాల లో ఆర్థిక వ్యవస్థల పై ప్రతికూల ప్రభావాన్ని ప్రసరింపచేసే బెదరింపు ను కూడా రువ్వుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచ వ్యాప్త సవాలు ను ఎదుర్కోవడం కోసం ఉమ్మడి ప్రయాసల ను చేపట్టవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఇటీవలే భారతదేశం పక్షాన ఎస్ఎఎఆర్‌సి (సార్క్) సభ్యత్వ దేశాల తో ఒక వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించిన సంగతి ని కూడా ప్రస్తావించారు.
ఇటువంటి ఒక కసరత్తునే ప్రస్తుతం జి20 అధ్యక్ష స్థానం లో ఉన్న సౌదీ అరేబియా ఆధ్వర్యం లో జి20 సభ్యత్వ దేశాల తోనూ జరపాలని, ఇలా చేస్తే కోవిడ్-19 ద్వారా ఉత్పన్నం అయ్యే ప్రపంచ సవాళ్ళ ను పరిష్కరించడం కోసం అనుసరించదగ్గ విశిష్ట ఆలోచనలపై చర్చించడాని కి మరియు ప్రపంచ జనాభా లో విశ్వాసాన్ని ప్రోది చేయడానికి ప్రపంచ స్థాయి లో ఉపయోగకరం కాగలదని ఉభయ నేత లు అంగీకరించారు.
ఈ విషయం లో ఇరు వైపుల అధికార గణం సన్నిహిత సంప్రతింపులు జరుపుకొంటూ ఉండాలి అని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి నిర్ణయించారు.